నేర్చుకోవడంలో వేగం.. లక్ష్యం ఫలవంతం
- పరీక్షల ప్రత్యేకం
తల్లి గర్భం నుంచి మొదలుకొని.. భూ గర్భంలో చేరేవరకు నేర్చుకోవడం అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇది వేగంగా జరిగినప్పుడు విలువైన కాలాన్ని ఆదా చేయగలుగుతాం. పైగా మనకున్న జ్ఞానంతో ప్రత్యేకతను నిలుపుకోగలుగుతాం. వేగంగా నేర్చుకునేందుకు కొన్ని శాస్త్రీయ మార్గాలను అనుసరించాలి. అవేంటో తెలుసుకుందాం.
స్పీడ్ లెర్నింగ్ టెక్నిక్స్
1) ఒకే సమాచారాన్ని వివిధ రకాలుగా నేర్చుకోవాలి
- వివిధ మాధ్యమాలు మెదడులోని వివిధ భాగాలను ఉద్దీపనం చెందిస్తాయి. మెదడు ఎక్కువ ప్రాంతాలు క్రియాశీలం అవుతాయి. తద్వారా సమాచారాన్ని సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు. అందువల్ల ఒక నిర్దిష్ట టాపిక్ నేర్చుకోవడం కోసం, కింది మాధ్యమాలను అనుసరించాలి.
- ఆ టాపిక్కు సంబంధించిన క్లాస్రూమ్ నోట్స్‌ను చదవాలి.
- ఆ టాపిక్కు సంబంధించిన ప్రామాణిక పాఠ్యపుస్తకం చదవాలి.
ఆ టాపిక్కు సంబంధించిన వీడియోలను యూట్యూబ్ లో చూడాలి.
- ఆ టాపిక్కు సంబంధించిన ఇతర ఆన్లైన్ వనరులను (వివిధ బ్లాగ్స్, వెబ్సైట్లు) చూడండి.
- ఆ టాపిక్కు సంబంధించిన మైండ్ మ్యాప్‌ను సృష్టించాలి.
- ఆ టాపిక్కు సంబంధించి సొంతంగా నోట్స్‌ను తయారు చేసుకోవాలి.
- ఇక్కడ ఒకే విషయాన్ని నేర్చుకోవడానికి, అన్ని రకాల మాధ్యమాలను ఒకేసారి ఉపయోగించలేరు. అవకాశాన్నిబట్టి వినియోగించాలి. ఈ పద్ధతిలోని ఆంతర్యం ఏమిటంటే.. నేర్చుకోవడానికి చూడటం, వినడం, బోధించడం, రాయడం ఇలా పలు రకాల పద్ధతుల వల్ల వివిధ జ్ఞానేంద్రియాల ద్వారా మెదడు ఉద్దీపనతో క్రియాశీలం అవుతుంది. దాంతో ఆ టాపిక్‌పై పట్టు సంపాదించగలుగుతారు.
2) అన్ని సబ్జెక్టులపై దృష్టిని కేంద్రీకరించడి. అందుకు అనుగుణంగా ప్రణాళికను రూపొందించుకోవాలి
- ఉదాహరణకు సోమవారం కేవలం గణితం, మంగళవారం చరిత్ర, బుధవారం భౌతిక శాస్త్రం, గురువారం రసాయన శాస్త్రం ఇలా ఒక్కో సబ్జెక్ట్‌కు ఒక్కో రోజు చొప్పున వారంలో ఒక ప్రత్యేక సమయం కేటాయించుకోవాలి. ఒకవేళ రోజూ సాయంత్రం, ఆ రోజు క్లాస్‌లో జరిగిన అన్ని పాఠాలను ఒకసారి రివిజన్ చేసుకుంటే.. రోజూ ఉదయం ఒక్కో రోజు ఒక్కో సబ్జెక్ట్ చొప్పున చదవాలి. అధ్యయన సమయాన్ని విస్తరించడం వల్ల ఆ విషయం వేగంగా నేర్చుకోగలుగుతారు, మెదడులో స్థిరీకరించడం సులభమవుతుంది.
3) సమయానుసారంగా రివిజన్ చేయాలి
- కేవలం పరీక్షల ముందు మాత్రమే చదవకుండా, సమయానుసారంగా రివిజన్ చేయాలి. అప్పుడు సమాచార స్థిరత్వం జరిగి, ఎక్కువ కాలం గుర్తుంటుంది.
4) తరగతి గదిలో సాధ్యమైనంతగా ముందు వరుసల్లోనే కూర్చోవాలి
- ముందు వరుసల్లో కూర్చుంచే బోర్డును స్పష్టంగా చూడగలుగుతాం, పాఠం మరింత స్పష్టంగా వినగలుగుతాం, ఏకాగ్రతకు భంగం కలగదు. అందువల్ల నేర్చుకునే వేగం పెరుగుతుంది.
5) మల్టీటాస్కింగ్ చేయవద్దు
- మల్టీటాస్కింగ్ వల్ల దృష్టి మళ్లి ఏకాగ్రత లోపించి నేర్చుకునే వేగం మందగిస్తుంది. ఏకాగ్రతను మెరుగుపరచడానికి కొన్ని సూచనలు.
- ఫోన్ నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి లేదా ఏరోప్లేన్ మోడ్‌లో ఉంచాలి.
- ఫోన్‌కు ఇంటర్నెట్ కనెక్షన్ ఆఫ్ చేయాలి.
- సోషల్ మీడియా వినియోగం చాలావరకు తగ్గించాలి.
- నేర్చుకునే ప్రదేశాన్ని శుభ్రంగా, అందంగా ఉంచాలి.
- ఇలా చేయడం వల్ల ఏకాగ్రత పెరిగి వేగంగా, మెరుగ్గా నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
6) సమాచారాన్ని సరళీకరించాలి (Simplify), సంక్షిప్తీకరించాలి (summarize), కుదించాలి (compress)
- సమాచారాన్ని సంక్షిప్త నామం (acronym), కంపారిజన్ టేబుల్, డయాగ్రమ్ లేదా మైండ్ మ్యాప్‌ల ద్వారా చేయవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల అభ్యాసన సామర్థ్యం మెరుగుపడి, వేగంగా నేర్చుకోగలుగుతాం.
7) ఆడియో, వీడియో పరికరాలకు బదులుగా చేతితో నోట్స్ రాసుకోవాలి
- ఆడియో, వీడియో పరికరాలు ఉపయోగించేటప్పుడు, దృష్టి మళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చేతితో నోట్స్ రాసుకుంటున్నప్పుడు జాగ్రత్తగా వినడం మాత్రమే కాకుండా విషయాన్ని అవగాహన చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. దాంతో వేగంగా నేర్చుకోగలుగుతాం.
8) మిమ్మల్ని మీరు తరచుగా పరీక్షించుకోవాలి
- చిన్న చిన్న క్విజ్లు, ప్రాక్టీస్ టెస్ట్‌లు, సెమినార్లు, ఆడియో, వీడియో రికార్డుల ద్వారా విషయ అవగాహనను తరచుగా పరీక్షించుకోవాలి. వీటివల్ల విషయ స్పష్టత ఏర్పడి వేగంగా నేర్చుకుంటాం.
9) నేర్చుకుంటున్న దాన్ని, ఇప్పటికే తెలిసిన దానితో అనుసంధానం చేయాలి
ఈ అనుసంధాన ప్రక్రియలో భాగంగా విషయాలను లోతుగా అధ్యయనం చేయడం వల్ల క్రమక్రమంగా వేగంగా నేర్చుకునే సామర్థ్యం మెరుగవుతుంది.
రివిజన్ షెడ్యూల్
1వ రివిజన్: నూతన విషయం నేర్చుకున్న ఒక రోజు తర్వాత
2వ రివిజన్: 1వ రివిజన్ తర్వాత 3 రోజులకు
3వ రివిజన్: 2వ రివిజన్ తర్వాత 7 రోజులకు
4వ రివిజన్: 3వ రివిజన్ తర్వాత 21 రోజులకు
5వ రివిజన్: 4వ రివిజన్ తర్వాత 30 రోజులకు
- ఈ విధంగా రివిజన్ చేయడం వల్ల విషయం షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీగా మారుతుంది. దీంతో వివిధ విషయాలపై అవగాహన పెరిగి నేర్చుకునే వేగం మరింతగా పెరుగుతుంది.
కె.భాస్కర్ గుప్తా
బీసీ స్టడీసర్కిల్
Previous article
నవోదయలో 1377 నాన్ టీచింగ్ స్టాఫ్
Next article
డైలీ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?






