Groups / DSC Special – Social Studies | స్వయం మట్టి మార్పిడి విధానాన్నిఅనుసరించే నేలలు?
1. పటాల తయారీకి ప్రక్షేపణం విధానాన్ని కనుగొన్నది?
1. జేమ్స్ రన్నల్ 2. మెర్కేటర్
3. విలిమ్ లాంబ్టన్ 4. టాలమీ
2. చిత్తుపటం ప్రధాన లోపం?
1. ఆకారం స్పష్టంగా ఉండదు
2. వాస్తవ దూరం తెలియదు
3. ప్రయాణ మార్గం తెలుసుకోవచ్చు
4. ప్రదేశాలను గుర్తించలేము
3. కింది వాటిలో కాంటూరు రేఖల లక్షణం కానిది?
1. వంకర టింకరగా ఉండవచ్చు.
2. దగ్గరగా లేదా దూరంగా ఉండవచ్చు
3. రెండు రేఖలు ఖండించుకొంటాయి
4. భూస్వరూపాన్ని బట్టి ఆకారం మారుతుంది
4. కాంటూరు రేఖల వల్ల ఉపయోగం ఎవరికి గలదు?
1. రోడ్లు, ఆనకట్టలు నిర్మించేవారికి
2. పంటలు సాగుచేసే రైతులకు
3. వ్యాపారులకు
4. గ్రామీణ ప్రజలకు
5. పటం స్కేలు 1సెం.మీ : 150 మీ. అయిన పటంలో రెండు బిందువుల మధ్య దూరం 4 సెం.మీ. అయితే వాస్తవ దూరం?
1. 400 మీ 2. 500 మీ
3. 600 మీ 4. 900 మీ
6. కోహిమా నుంచి జైపూర్ వెళ్లటానికి ప్రయాణించవలసిన దిక్కు?
1. తూర్పు 2. పడమర
3. ఉత్తరం 4. దక్షిణం
7. భారతదేశం మధ్యగా ఉన్న పర్వతాలు?
1. ఆరావళి
2. తూర్పు కనుమలు
3. పశ్చిమ కనుమలు
4. వింధ్య. సాత్పురా
8. భూమిపై నుంచి వస్తువులు వ్యక్తులు జారి పడిపోకుండా ఉండటానికి గల కారణం?
1. భూభ్రమణం
2. భూమి ఆకర్షణ శక్తి
3. భూ పరిభ్రమణం
4. భూమి చాలా పెద్ద పరిమాణంలో ఉండటం
9. కింది వాటిలో ఒకే పొడవును కలిగిన రేఖలు?
1. భూమధ్య రేఖ, కర్కట రేఖ
2. భూమధ్య రేఖ, గ్రీనిచ్ రేఖ
3. గ్రీనిచ్ రేఖ, అంతర్జాతీయ దినరేఖ
4. అంతర్జాతీయ దినరేఖ, కర్కటరేఖ
10. 180౦ రేఖాంశాన్ని ఏ విధంగా పిలుస్తారు?
1. గ్రీనిచ్ మెరిడియన్
2. యాంటీ మెరీడియన్
3. అన్నో-డొమిని 4. ఏదీకాదు
11. 1492లో కొలంబస్ ఏ దీవులను కనుగొన్నాడు?
1. తూర్పు ఇండియా
2. కరేబియన్ దీవులు
3. మడగాస్కర్ దీవులు
4. జపాన్ దీవులు
12. భూభ్రమణం దిశను గుర్తించండి?
1. పడమర నుంచి తూర్పునకు
2. తూర్పు నుంచి పడమరకు
3. ఉత్తరం నుంచి దక్షిణానికి
4. దక్షిణం నుంచి ఉత్తరానికి
13. లండన్ గుండా వెళ్లే రేఖాంశాన్ని 00 రేఖాంశంగా గుర్తించడానికి కారణం?
1. ఇది రేఖాంశాలన్నింటికీ మధ్యగా ఉంది
2. అప్పట్లో ప్రపంచంలో అధిక భాగాన్ని ఇంగ్లండ్ పరిపాలిస్తుంది
3. ఇది సమయాన్ని లెక్కించటానికి అనుకూలం
4. భౌగోళిక అన్వేషకాలు ఇక్కడ నుంచే ప్రారంభమయ్యాయి
14. భారత కాలమానానికి గ్రీనిచ్ కాలమానానికి తేడా?
1. మూడున్నర గంటలు
2. రెండున్నర గంటలు
3. ఐదున్నర గంటలు
4. ఆరున్నర గంటలు
15. భూమి మధ్య గుండా ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపే ఊహా రేఖకు గల పేరు?
1. కక్ష్య 2. అక్షం
3. అక్షాంశం 4. భూమధ్యరేఖ
16. విజయవాడ కృష్ణానదికి ఏ ఒడ్డున గలదు?
1. తూర్పు 2. పశ్చిమ
3. ఉత్తర 4. దక్షిణ
17. స్వయం మట్టి మార్పిడి విధానాన్ని అనుసరించే నేలలు?
1. ఎర్రనేలలు 2. ఒండ్రునేలలు
3. నల్లనేలలు 4. ఇసుక నేలలు
18. 2011 జనాభా గణన ప్రకారం తెలంగాణలో పురుషులు?
1. 181.04 లక్షలు 2. 176.12 లక్షలు
3. 69.04 లక్షలు 4. 177.04 లక్షలు
19. తెలంగాణ రాష్ట్రంలో 2011లో స్త్రీ అక్షరాస్యత రేటు?
1. 77.04 % 2. 66.46 %
3. 48.06 % 4. 57.99 %
20. తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయితీలు?
1. 12.765 2. 9778
3. 7778 4. 6778
21. కోయ తెగ ప్రజలు తెలంగాణలో నివసిస్తున్నారు. కోయ అంటే?
1. అడవుల్లో నివసించే మనిషి
2. కొండల్లో ఉంటున్న మంచి మనిషి
3. కొండల్లో నివసించే గిరిజనుడు
4. అడవిలో నివసించే దేవుని జాతి ప్రజలు
22. చీకుపల్లి వద్ద గోదావరి నది సమీపంలో గల గొప్ప జలపాతం?
1. కడెం 2. కుంతల
3. భొగతా 4. పొచ్చెర
23. పెనుగోలు గ్రామం చుట్టూ విస్తరించి ఉన్న గుట్టల్లో తప్పుగా ఉన్న జతను గుర్తించండి?
1. ఉత్తరాన – కర్రెగుట్ట
2. దక్షిణాన – ఎర్రగుట్ట
3. తూర్పున -కుల్లుకుంటలు గుట్ట
4. పడమర – చినకుమ్మరి గుట్ట
24. కోయ గిరిజనులు వ్యవసాయాన్ని ఏ విధానంలో చేస్తారు?
1. సాంద్ర 2. విస్తృత
3. వాణిజ్య 4. ఝూమ్
25. కోయలు కరికొమ్ములతో రుచికరమైన ఆహారాన్ని తయారు చేస్తారు? కరికొమ్ములు అంటే?
1. జింకతల
2. వెదురు చిగుళ్లు
3. కందమూలాలు
4. ఒకరకమైన నల్లటి పండు విత్తనాలు
26. నల్లందేవి వాగు ప్రారంభమయ్యే ప్రదేశం?
1. కర్రెగుట్ట (నల్లగుట్ట)
2. వంకమామిడి గుట్ట
3. కల్లు కుంటల గుట్ట
4. చిన కుమ్మరి లంక
27. అడవులు నరికి కొన్ని సంవత్సరాలు భూమిని సాగుచేసి తర్వాత మరో ప్రాంతంలో వ్యవసాయం చేసే విధానం?
1. విస్తృత 2. సాంద్ర
3. పోడు 4. వాణిజ్య
28. కోయలు వ్యవసాయ భూమిని ఎందుకు దున్నరు ?
1. వారికి నాగలి తెలియదు
2. వర్షాలకు భూసారం కొట్టుకుపోకుండా ఆపడానికి
3. భూమి దున్నటం వారి మతాచారాలకు వ్యతిరేకం
4. వారుండే ప్రాంతాలు దున్నటానికి వీలు కావు
29. బందరు కాలువకు నీరు సరఫరా చేసే రిజర్వాయర్?
1. నాగార్జున సాగర్ 2. శ్రీశైలం
3. పులిచింతల 4. ప్రకాశం బ్యారేజ్
30. ఒండ్రు నేలలు వేటి వల్ల ఏర్పడతాయి?
1. నదులు 2. గాలి
3. అగ్నిపర్వత లావా
4. రూపాంతర శిలలు
31. కృష్ణానదికి భయంకర వరదలు వచ్చిన సంవత్సరం?
1. 1997 2. 2006
3. 2009 4. పైవన్నీ
32. కింది వాటిలో అత్యంత దీర్ఘకాల పంట?
1. వరి 2. చెరకు
3. మొక్కజొన్న 4. అరటి
33. మానవుడి స్థిర జీవనానికి దారి తీసిన సంఘటన?
1. నిప్పును కనుగొనడం
2. చక్రాన్ని కనుగొనడం
3. వ్యవసాయం ప్రారంభించడం
4. ఆయుధాల తయారీ
34. మానవుడు పంటలు పండించటం సుమారు ఎన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించాడు?
1. 8000 2. 9000
3. 10,000 4. 12,000
35. ఆదిమానవుడు నిప్పును కింది అవసరాలకు కోసం ఉపయోగించాడు
ఎ. క్రూర మృగాలను తరమటానికి
బి. నివసించే గుహల్లో వెలుగు కోసం
సి. చెక్కను గట్టి పరచటానికి
1. ఎ, బి 2. ఎ, సి
3. ఎ, బి, సి 4. బి, సి
36. ఆంత్రోపాలజిస్ట్లు అధ్యయనం చేసే అంశం?
1. గిరిజన ప్రజలు 2. చారిత్రక కట్టడాలు
3. దేవాలయాలు
4. ప్రాచీన నాగరికత
37. గోండుల గ్రామ పెద్దను ఏమంటారు?
1. భరుక్త 2. పట్లా
3. గృహపతి 4. దాస
38. కింది వాటిలో గిరిజన సహజ లక్షణం కానిది ఏది?
1. ధనిక, పేద తారతమ్యాలుండవు
2. తెగలోని వారందరూ అన్ని పనులు చేస్తారు
3. స్త్రీ, పురుషులు సమాన అధికారాలు కలిగి ఉంటారు
4. అందరి మధ్య బంధుత్వం ఉంటుంది
39. 1940లో ఫ్యూరర్ హైమన్ డార్ఫ్ ఎవరిపై పరిశోధనలు చేశాడు?
1. కొండరెడ్లు 2. చెంచులు
3. గోండులు 4. పైవన్నీ
40. కింది వాటిలో ప్రజలు కొత్త ప్రదేశాల్లో స్థిరపడటానికి కారణం?
ఎ. వరదలు బి. వర్తకం
సి. అంటువ్యాధులు
1. ఎ, బి 2. ఎ, బి, సి
3. బి, సి 4. ఎ, సి
41. థార్ ఎడారి ఏ రెండు దేశాల మధ్య ఉంది?
1. భారతదేశం, చైనా
2. భారతదేశం, అఫ్గానిస్థాన్
3. భారతదేశం, పాకిస్థాన్
4. భారతదేశం, మయన్మార్
42. జైసల్మేర్, బికనీర్, జోధ్పూర్లు ముఖ్య పట్టణాలుగా ఎదగడానికి కారణం?
1. ఈ ప్రాంతాల గుండా సాగునీటి కాలువ నిర్మించటం
2. ఇవి వర్తకులు ప్రయాణించే మార్గంలో ఉండటం
3. ఇక్కడ కోటలు, దేవాలయాలుండటం
4. ఇక్కడ వెండి, మార్జల్ గనులుండటం
43. పుష్కర్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది?
1. రాజస్థాన్ 2. గుజరాత్
3. మహారాష్ట్ర 4. సిక్కిం
44. నేడు విదేశీ యాత్రికులు థార్ ఎడారిని సందర్శించటానికి కారణం?
1. ఇక్కడ ఎడారి అందాలు ఆస్వాదించటానికి
2. ఇక్కడ ప్రజల వైవిధ్యం చూడటానికి
3. ఇక్కడ వాతారణం ఆస్వాదించటానికి
4. ఇక్కడ వైద్యం చేయించుకోవడానికి
45. రాజస్థాన్లో మిఠాయిలు చిరుతిళ్లకు ప్రసిద్ధి చెందిన నగరం?
1. జైసల్మేర్ 2. బికనీర్
3. జైపూర్ 4. జోధ్పూర్
46. కాంచన గంగ శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది?
1. సిక్కిం 2. అరుణాచల్ ప్రదేశ్
3. పశ్చిమబెంగాల్ 4. అస్సాం
47. సిక్కిం భారతదేశంలో కలిసిపోయిన సంవత్సరం?
1. 1970 2. 1980
3. 1975 4. 1985
48. సిక్కింలో ప్రసిద్ధి చెందిన బౌద్ధమతం?
1. రూమేటిక్ మఠం 2. చోంగ్యాల్ మఠం
3. నేపాలీల మఠం 4. లామా మఠం
49. కౌటిల్యుడు రాసిన “అర్థశాస్త్రం” లో చర్చించిన అంశం?
1. రాజ్యపాలన 2. ఆర్థిక విషయాలు
3. సాహిత్యం 4. శిల్పాలు
50. ప్రజల్లో ధర్మ ప్రచారం చేయటానికి అశోకుడు నియమించిన అధికారులు?
1. ధర్మ మహామాత్రులు
2. రాజామాత్యులు
3. ధర్మ రాయబారులు
4. ఎవరూ కారు
51. కర్ణాటకలోని బళ్లారిలో లభించిన మ్యాకదోని శాసనం ఏ రాజు కాలానికి చెందింది?
1. యజ్ఞశ్రీ శాతకర్ణి
2. గౌతమీపుత్ర శాతకర్ణి
3. శ్రీ పులోమావి
4. వశిష్టపుత్ర పులోమావి
52. చంద్రగుప్త మౌర్యుడి కుమారుడు?
1. బిందుసారుడు 2. అశోకుడు
3. బింబిసారుడు 4. సంప్రీతి
53. మౌర్యుల కాలంలో సారవంతమైన అధిక జనసాంద్రత గల ప్రాంతం?
1. తమిళనాడు తీరం
2. మాళ్వా
3. హిందూకుష్ ప్రాంతం
4. మధ్య భారతదేశం
54. కింది వాటిలో మౌర్యుల ప్రాదేశిక రాజధాని?
1. కౌశంబి 2. ఢిల్లీ
3. సువర్ణగిరి 4. రాజ్గిర్
55. వశిష్టపుత్ర పులోమావి ఏ వంశానికి చెందిన వాడు?
1. ఇక్షాకులు 2. మౌర్యులు
3. పల్లవులు 4. శాతవాహనులు
56. శాతవాహనులఅ కాలంలో ఏ విదేశంలో వ్యాపారం వృద్ధి చెందింది?
1. పర్షియన్ 2. చైనా
3. రోమ్ 4. తూర్పు ఇండియా
57. స్థూపాలు నిర్మించిన వారు?
1. హిందువులు 2. బౌద్ధులు
3. జైనులు 4. పర్షియన్లు
58. విదేశీ వస్తువులు లభించే ప్రాంతం?
1. పాటలీపుత్రం 2. తక్షశిల
3. ఉజ్జయిని 4. సువర్ణగిరి
59. వేపుర గ్రామం శాతవాహనుల రాజ్యంలో ఏ జనపదంలో ఉంది?
1. స్కంధనాగ 2. మామాలా
3. గోవర్ధన 4. హైరాన్
60. ఇక్ష్వాకు కుటుంబంలోని మహిళలు ఎవరిని ఆరాధించారు?
1. శివుడు 2. జైన గురువులు
3. బౌద్ధ గురువులు 4. రాముడు
61. శంకరాచార్యులు బోధించిన తత్వం?
1. అద్వైతం 2. ద్వైతం
3. విశిష్టాద్వైతం 4. సూఫీ
సమాధానాలు
1-2 2-2 3-3 4-1
5-3 6-2 7-4 8-2
9-3 10-2 11-2 12-1
13-2 14-3 15-2 16-3
17-3 18-2 19-4 20-1
21-2 22-3 23-2 24-4
25-2 26-1 27-3 28-2
29-4 30-1 31-4 32-2
33-3 34-4 35-3 36-1
37-2 38-3 39-3 40-2
41-3 42-2 43-1 44-2
45-2 46-1 47-3 48-1
49-1 50-1 51-3 52-1
53-2 54-3 55-4 56-3
57-2 58-2 59-1 60-3
61-1
ఆంజనేయులు
ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు