CRPF Recruitment | టెన్త్ అర్హతతో ‘సీఆర్పీఎఫ్’లో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. వీరు మాత్రమే అర్హులు!
CRPF Constable Recruitment 2023 | కేంద్ర హోంశాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్ ‘సి’ విభాగంలోని కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 169 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు నిర్ధిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అలాగే సంబంధిత క్రీడాంశాల్లో అర్హత సాధించి ఉండాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు విధానం ఉండగా.. ఫిబ్రవరి 15 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఇక ఎంపికైన అభ్యర్థులు భారతదేశంలోని వివిధ ప్రాంతల్లో పని చేయవలసి ఉంటుంది.
మొత్తం పోస్టులు : 169
పోస్టులు : కానిస్టేబుల్
క్రీడా విభాగాలు : షూటింగ్, బాక్సింగ్, అథ్లెటిక్స్, ఆర్చరీ, రెజ్లింగ్ ఫ్రీ స్టైల్, గ్రీకో రోమన్, తైక్వాండో, వాటర్ స్పోర్ట్స్ కయాక్, కానో, జిమ్నాస్టిక్, జూడో, వుషు తదితరాలు.
జీతం : రూ.21,700 నుంచి 69,100 వరకు
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు నిర్ధిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అలాగే సంబంధిత క్రీడాంశాల్లో అర్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి: ఫిబ్రవరి 15 (2024) నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాలు
దరఖాస్తు రుసుము: రూ.100
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 15
వెబ్సైట్: www.crpf.nic.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?