Groups Special – Geography | సూర్యుడు ఉదయించే దేశాలు.. శృంగాకారపు అడవులు
యూరప్ ఖండం
సరిహద్దులు:
- ఉత్తరం-ఆర్కిటిక్ మహసముద్రం
- దక్షిణం-మధ్యధరా సముద్రం
- పడమర-అట్లాంటిక్ మహసముద్రం
- తూర్పు-ఆసియా
సముద్రాలు-తీర దేశాలు :
1. ఆర్కిటిక్ మహసముద్రం-నార్వే, రష్యా
2. బాల్టిక్ సముద్రం-నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, రష్యా, ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా, పోలాండ్, జర్మనీ, డెన్మార్క్
3. ఉత్తర సముద్రం- డెన్మార్క్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్, ఇంగ్లండ్
4. అట్లాంటిక్ మహాసముద్రం – ఇంగ్లండ్, ఐర్లాండ్, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చ్‌గల్
5. మధ్యధరా సముద్రం- స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, యుగోస్లెవియా
6. ఇంగ్లిష్ చానల్- ఇంగ్లండ్, ప్రాన్స్‌లను విడదీస్తూ, ఉత్తర సముద్రాన్ని అట్లాంటిక్ మహసముద్రాన్ని కలుపుతుంది.
7. నార్వేజిలున్ సముద్రం- నార్వేతీరం వెంబడి గల అట్లాంటిక్ సముద్రం
8. బేరెంట్స్ సముద్రం- స్కాండివేనియన్ ద్వీపకల్పానికి ఉత్తరం వైపున గల సముద్రం
9. వైట్ సముద్రం- కోల ద్వీపకల్పానికి దక్షిణం వైపున గల సముద్రం. రష్యాలోని పశ్చిమ భాగాన కలదు .
10. అయోనియన్ సముద్రం – ఇటలీ, గ్రీకు మధ్యగల సముద్రం
11. అడ్రియాటిక్ సముద్రం- ఇటలీ, యుగోస్లేవియా మధ్యగల సముద్రం
12. అజోవ్‌కు సముద్రం- ఉక్రెయిన్, రష్యా మధ్యగల సముద్రం. నల్ల సముద్రం ఉత్తరభాగంలో ఉంది. ఈ అజోవ్‌కు, నల్ల సముద్రానికి మధ్యలో క్రిమియా ద్వీపకల్పం ఉంది.
ఐరోపాను (3 )భౌతిక స్వరూపాలు
1. ఉత్తరాన గల ఉన్నత పర్వతాలు, బాల్టిక్ షీల్డ్ : నార్వే, స్వీడన్ దేశాలు స్కాండినేనియన్ ద్వీపకల్పంలో ఉన్నాయి. ఇక్కడ గల పురాతన ముడత పర్వతాలను స్కాండినేలియన్ పర్వతాలు అంటారు.
- ఇవి కాలెడొనియన్ యుగానికి చెందినవి. వీటి పాదాల వద్ద హిమనీ నదాల క్రమక్షయాలు, స్వరూపాలు అయిన ఫియార్డ్స్ ఏర్పడ్డాయి.
- ఈ పర్వతాల దక్షిణ వాలులలో బాల్టిక్ సముద్రం చుట్టూ గల ప్రాంతాన్ని ‘బాల్టిక్ షీల్డ్’ అంటారు. షీల్డ్ అంటే పురాతనమైన పీఠభూమి భాగం అని అర్థం.
2. మధ్య పల్లపు ప్రాంతాలు: వీటిని ఉత్తర ఐరోపా మైదానాలు అని, రష్యా ప్లాట్ఫారం అని పిలుస్తారు. - ఇవి పశ్చిమాన తక్కువ వెడల్పుగా ఉండి, తూర్పునకు వెళ్లే కొలది అధిక వెడల్పును కలిగి ఉంటాయి. యూరల్ పర్వతాల పశ్చిమం నుంచి ఆల్ఫ్స్ పర్వతాల ఉత్తర అంచు వరకు విస్తరించిన విశాల మైదానం.
- జర్మనీ, పోలాండ్, బెలారస్, ఉక్రెయిన్, రష్యా దేశాలలో ఈ మైదానం ఉంది.
3. దక్షిణ పర్వతాలు : ఐరోపా దక్షిణ భాగం మొత్తం ఎత్తైన ఆల్ఫ్స్ పర్వతాలు కలవు. ఇవి నవీన ముడత పర్వతాలు .
ముఖ్యమైన పర్వతాలు
1. పైరీనాస్ పర్వతాలు- ఫ్రాన్స్‌కు, స్పెయిన్‌కు మధ్య సరిహద్దుగా ఉన్నాయి
2. అపన్నైన్ పర్వతాలు-ఇటలీ
3. డైనారిక్ ఆల్ఫ్స్- యుగోస్లేవియా (బాల్కన్ ద్వీపకల్పం)
4. కాకసస్ పర్వతాలు- రష్యాలో ఉన్నాయి. ఇవి నల్ల సముద్రానికి, కాస్పియన్ సముద్రానికి మధ్య వారధిగా ఉంటాయి.
5. యూరల్ పర్వతాలు : రష్యాలోని ప్రాచీన ముడత పర్వతాలు
6. స్కాండినేవియన్ పర్వతాలు- నార్వే
7. పెన్నైన్ పర్వతాలు – ఇంగ్లండ్
8. ఆల్ఫ్స్ పర్వతాలు – ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, ఇటలీలో
9. బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు – జర్మనీలోని ఖండపర్వతాలు
10. వాస్జెస్ పర్వతాలు – ఫ్రాన్స్‌లోని ఖండ పర్వతాలు
ద్వీప కల్పాలు :
- 1. ఐబీరియన్ ద్వీపకల్పం – పోర్చ్‌గల్, స్పెయిన్ దేశాలు
- ఇది మధ్యధరా, అట్లాంటిక్ మహసముద్రాల మధ్య ఉంది
2. స్కాండివేనియా ద్వీపకల్పం-నార్వే స్వీడన్ - ఇది బాల్టిక్ సముద్రం, ఉత్తర సముద్రం, నార్వేజియన్ సముద్రాల మధ్య కలదు.
3. కోల ద్వీపకల్పం- ఆర్కిటిక్ సముద్రతీరాన రష్యాలో ఉంది. - ఇది వైట్ సముద్రం, బేరెంట్స్ సముద్రం మధ్య కలదు.
4. బాల్కన్ ద్వీపకల్పం- యుగోస్లేవియా - ఇది ఏజియన్, అయోనియన్, అడ్రియాటిక్ సముద్రాల మధ్య ఉంది.
5. ఇటాలియన్ ద్వీపకల్పం-ఇటలీలో - ఇది టైర్వేనియన్, అయోనియన్. అండ్రియాటిక్ సముద్రాల మధ్య కలదు.
6. జూట్ ల్యాండ్ ద్వీపకల్పం- డెన్మార్క్ దేశం ఉన్న భాగం. ఇది బాల్టిక్, ఉత్తర సముద్రాలను కలుపుతుంది - దీన్ని కింబ్రిక్ ద్వీపకల్పం అంటారు.
ద్వీపాలు
1. బ్రిటీష్ ద్వీపాలు 2. ఐస్‌ల్యాండ్
3. ఫారోద్వీపాలు
4. మధ్యధరా సముద్రంలో- కోర్కికా, సాథినాయా, సిసిరి, క్రీట్, మజోర్క్ ద్వీపాలు - ఐరోపాలోని ఎత్తైన శిఖరం ఎల్బ్రస్ శిఖరం (5642 మీటర్లు). కాకసస్ పర్వతాలలో ఉంది. ఇది రష్యా దేశంలో ఉంది.
- రష్యా మినహాయిస్తే ఎత్తైన శిఖరం మౌంట్ బ్లాంక్ (4809 మీటర్లు) .‘ మౌంట్ బ్లాంక్ అనగా తెల్ల శిఖరం అని అర్థం. ఇది ఆల్ఫ్స్ పర్వతాలలో, పశ్చిమ ఐరోపాలో ఎత్తైన శిఖరం. ఇది ఇటలీ, ఫ్రాన్సు దేశాల మధ్య కలదు.
ఐరోపా నదులు :
1. యురల్ నది- యూరప్‌ను, ఆసియాను వేరు చేస్తుంది - కాస్పియన్ సముద్రంలో కలుస్తుంది
2. ఓల్గానది – కాస్పియన్ సముద్రంలో కలుస్తుంది - యూరప్‌లో పొడవైన నది ( 3,692 కి.మీ)
3. డాన్ నది – నల్ల సముద్రంలో కలుస్తుంది
4. నైపర్ నది – నల్ల సముద్రంలో కలుస్తుంది
5. విష్టులానది – బాల్టిక్ సముద్రంలో
కలుస్తుంది
6. ఓడర్ నది – బాల్టిక్ సముద్రంలో కలుస్తుంది
7. ఎల్బ్నది- ఉత్తర సముద్రంలో కలుస్తుంది
8. రైన్ నది- ఉత్తర సముద్రంలో కలుస్తుంది.
l ఇది వాస్జెస్, బ్లాక్‌ఫారెస్ట్ పర్వతాల మధ్యలో గల పగులు లోయ గుండా ప్రవహిస్తుంది .
9. సీన్ నది – అట్లాంటిక్ మహాసముద్రంలోకి వెళుతుంది. - పారిస్ పట్టణం దీని ఒడ్డున కలదు
- ఈ నది ఇంగ్లిష్ చానల్లోకి ప్రవేశిస్తుంది
10. లొలుర్ నది- అట్లాంటిక్ మహాసముద్రంలోకి ప్రవేశిస్తుంది
11. గరోన్ నది- అట్లాంటిక్ మహాసముద్రంలోకి ప్రవేశిస్తుంది
12. పో నది – అడ్రియాటిక్ సముద్రంలోకి ప్రవేశిస్తుంది - వేనిస్ నగరం దీని ఒడ్డున కలదు
13. డాన్యుబ్ నది- నల్ల సముద్రంలోకి ప్రవేశిస్తుంది.-దీన్ని అంతర్జాతీయ నది అంటారు.
14. రోన్ నది – మధ్యధరా సముద్రంలోకి
ప్రవేశిస్తుంది. - ఐరోపాలోని నదులు అన్ని జీవనదులు అందువల్ల ఇక్కడ నదుల ద్వారా రవాణా భాగా అభివృద్ధి చెందింది.
- ఓల్గా, డాన్, నైపర్ నదులు శీతాకాలంలో కురిసిన మంచు వేసవిలో కరిగి నదుల రూపంలో ప్రవహించడం వల్ల ఏర్పడింది.
ఐరోపాలోని శీతోష్ణస్థితి.. విభజన
- 1. మధ్యధరా శీతోష్ణస్థితి : శీతాకాలంలో వర్షం పడటం ఈ శీతోష్ణస్థితి లక్షణం. ఇక్కడ
వేసవిలో వర్షాభావాన్ని కలిగి ఉంటాయి. - ఇవి సహజంగా ఎడారి పక్కన, సముద్రతీర ప్రాంతాన్ని కలిగి ఉంటాయి.
- పశ్చిమ పవనాల వల్ల వర్షాన్ని పొందుతాయి. ఆహ్లాదకరమైన శీతోష్ణస్థితిని కలిగి ఉంటుంది. పండ్ల తోటలకు ( Orchards) అనువైనది .
2. పశ్చిమ ఐరోపా శీతోష్ణస్థితి : ఇక్కడ సంవత్సరం మొత్తం చినుకులు పడటం దీని ప్రత్యేక లక్షణం.
కారణం
ఎ. పశ్చిమ పవన ప్రవాహం
బి. అట్లాంటిక్ మహసముద్రం
సి. పశ్చిమ పవనాలు - పోర్చుగల్ నుంచి నార్వే వరకు గల పశ్చిమ తీరప్రాంతాలు సంవత్సరం పొడవునా వర్షాన్ని పొందుతున్నాయి.
3. టైగా శీతోష్ణస్థితి : దీనిని ఉత్తర ఐరోపా శీతోష్ణస్థితి అంటారు. ఉత్తర ప్రాంతం ఆర్కిటిక్ వలయానికి దగ్గరగా ఉండడం వల్ల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. - అక్కడక్కడా గల పర్వత ప్రాంతాలలో టండ్రా శీతోష్ణస్థితి కూడా ఉంటుంది .
4. తూర్పు ఐరోపా శీతోష్ణస్థితి : దీన్ని ఖండాంతర్గత శీతోష్ణస్థితి అని అంటారు. సముద్రానికి దూరంగా ఉండటం వల్ల ఉష్ణోగ్రత వ్యత్యాసాలు గరిష్ఠంగా ఉంటాయి. ఇక్కడ సంవత్సరాంతం వర్షపాతం నమోదవుతుంది .
ముఖ్యాంశాలు : ప్రపంచంలోని అతిపెద్ద ద్వీపం గ్రీన్‌ల్యాండ్ ఆధీనంలో ఉంది - డెన్మార్క్ రాజధాని కొపెన్ హగెన్ను బాల్టిక్ సముద్రపు తాళం చెవి అంటారు .
- హిమనీనది క్రమక్షయం వల్ల వేలాదిగా ఏర్పడిన సరస్సులు ఫిన్లాండ్ దేశంలో కలవు. అందుకే దాన్ని “వేయి సరస్సుల దేశం” అంటారు.
- ఫిన్లాండ్ రాజధాని హెల్సింకిని ఉత్తరాన గల “ శ్వేత నగరం” అంటారు.
- స్వీడన్ రాజధాని స్టాక్ హోంను “ సముద్రం మీద గల అందం’ అంటారు
- రోమ్ నగరం లైబర్ నది ఒడ్డున ఉంది
- ఇటలీలోని మిలన్ నగరాన్ని
“ మాంచెస్టర్ ఆఫ్ ఇటలీ ” అని అంటారు - స్విట్జర్లాండ్ పర్వతాంతర దేశం
- రోమ్ను శాశ్వత నగరం,
సప్త పర్వతాల నగరం అంటారు - నార్వే, స్వీడన్ దేశాలను అర్ధరాత్రి “సూర్యుడు ఉదయించే దేశాలు ” అంటారు.
టైగా మండలం
- ఉప ఆర్కిటిక్ ప్రాంతాలు అని కూడా దీన్ని పిలుస్తారు. ఇది ఉత్తరార్ధగోళంలో మాత్రమే 60 డిగ్రీల నుంచి 70 డిగ్రీల అక్షాంశాల మధ్యగల ప్రాంతం.
- దీనికి ఉత్తర సరిహద్దుగా టండ్రా మండలం, దక్షిణ సరిహద్దుగా సముద్ర ప్రభావిత పశ్చిమ తీర మండలం, స్టెప్పీలు, లారెన్సియా మండలం ఉన్నాయి.
- ఈ మండలంలో రెండు ప్రధాన ప్రాంతాలు ఉన్నాయి
1. ఉత్తర అమెరికా ప్రాంతం : అలాస్కా, కెనడా ఉత్తర ప్రాంతాల మీదుగా ఆగ్నేయంగా అట్లాంటిక్‌లోని న్యూపొండ్ వరకు ఉంది.
2. యూరేషియా ప్రాంతం : ఇది స్కాండి వేనియా మెట్ట ప్రాంతాల నుంచి స్వీడన్, ఫిన్లాండ్, రష్యా మీదుగా తూర్పున పసిఫిక్ వరకు ఉంది. రష్యాలో సైబీరియాలో ఎక్కువగా ఉంది .
శీతోష్ణస్థితి : ప్రపంచంలో కెల్లా అత్యధిక సంవత్సరిక ఉష్ణోగ్రత వ్యత్యాసాలు నమోదు అవుతాయి . - శీతల ధ్రువంగా పిలువబడే సైబీరియాలోని వేర్కొయాన్స్ ప్రాంతంలో మైనస్ 68 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. అంటార్కిటి కాను మినహాయిస్తే ఇది ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రత . ఈ అల్ప ఉష్ణోగ్రత వల్ల ఇక్కడ నదులు, సరస్సులు, సముద్రాలు సైతం గడ్డకట్టి పోతాయి .
- సమశీతోష్ణ మండల చక్రపాతాల వల్ల 25 నుంచి వర్షం నమోదవుతుంది .
వృక్షాలు : ఈ ప్రాంతంలో శృంగాకారపు అడవులు ఉంటాయి వీటినే రష్యా భాషలో టైగాలు అంటారు. - శృంగాకారంలో ఉండి, మెలితిరిగిన సూదుల లాంటి ఆకులు, మెత్తని కలప నిచ్చే అడవులు ఇవి.
- ఇవి శృంగాకారంలో ఉండటానికి కారణం హిమపాతం నుంచి రక్షించుకోవడం కోసం
- కాగితం పరిశ్రమకు అత్యంత ఉపయోగకర కర్రగుజ్జు ఉత్పత్తికి ప్రసిద్ధి.
- స్ప్రూస్, లార్చ్, ఫిర్, పైన్, ఆల్డర్, విల్లోస్ వంటి వృక్షాలు పెరుగుతాయి.
జంతువులు : - ధ్రువపు ఎలుగుబంటి, ధ్రువపు జింక, మూస్, ఎల్క్, బీవర్ వంటివి.
- ఉన్నిని (Fur) ఉత్పత్తి చేసే జంతువులు ఉంటాయి. ఎర్మిన్ అనే జంతువు తన చర్మాన్ని కప్పి ఉంచే ఉన్నిని, అదేవిధంగా ఊసరవెల్లిలాగా రుతువును బట్టి రంగు మార్చుకుంటుంది .
ఆర్థిక ప్రగతి: లంబరింగ్ ఇక్కడ ప్రధాన వృత్తి. అంటే అటవీ వృక్షాలను నరికి తరలించడం. - ప్రపంచంలోనే కాగితం పరిశ్రమకు ఇవి ప్రసిద్ధ ప్రాంతాలు. మెత్తని కలపనిచ్చే శృంగారపు అడవుల వల్ల నాణ్యమైన కాగితం తయారవుతుంది.
- ప్రపంచంలోనే అత్యత నాణ్యమైన ఇనుప ఖనిజ నిక్షేపాలు స్వీడన్లో దొరుకుతున్నాయి.
- ప్రపంచంలో కెనడా దేశం కర్రగుజ్జును అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది.
- ఇక్కడ లీనా నది సగటున సంవత్సరంలో 210 రోజులు ఘనీభవించి ఉంటుంది.
టండ్రా మండలం - టండ్రా మండలం, లేదా ఖాళీగా ఉండే ఈ ప్రాంతాలు శీతల ఎడారులు. ఇవి ధ్రువాలను నిరంతరం కప్పి ఉంచే మంచుపొరతో సరిహద్దుల్లో ఏర్పడ్డాయి .
ఉనికి : 70 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 80 డిగ్రీల దక్షణ అక్షాంశాల మధ్యల్లో దాదాపుగా ఆర్కిటిక్ వలయానికి ధ్రువ హిమాచ్ఛాదిత ప్రాంతానికి మధ్యలో ఉంటుంది. - సైబీరియా ఉత్తర అంచు ప్రాంతం, అలాస్కా నుంచి న్యూపోలాండ్ వరకు గల కెనడా ఉత్తర ప్రాంతం, గ్రీన్లాండ్ ద్వీపతీర ప్రాంతాలు ఈ మండలంలో ఉంటాయి.
శీతోష్ణస్థితి : నవంబర్, డిసెంబర్, జనవరిలో సూర్యుడు కనిపించడు. కటిక చీకటి ఏర్పడకుండా ‘అరోరా బోరియాలిస్ ’ అనే ధ్రువపు వెలుగులు ఏర్పడతాయి . - డిసెంబర్, జనవరిలో మైనస్ 34 డిగ్రీల నుంచి మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అవుతుంది.
- మే, జూన్, జూలై నెలలో సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. ఏటవాలు కిరణాలు కాబట్టి మరీ ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావు .
జీ గిరిధర్
సివిల్స్ ఫ్యాకల్టీ
ఏకేఎస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్
అశోక్‌నగర్, హైదరాబాద్
9966330068
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు