Indian History – Groups Special | మొఘలుల దోపిడీ.. తిరుగుబాటుకు దారి
మొఘల్ సామ్రాజ్యం
మొఘలుల పాలనా కాలం (క్రీ.శ. 1550-1700)
- ఢిల్లీ మొదలుకొని భారత ఉపఖండమంతా తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు.
- మొఘలుల పరిపాలనా ఏర్పాట్లు, పాలనా విధానం, వాస్తు కళలు మొదలైనవి వీరి తదనంతరం కూడా చాలా కాలం వరకు రాజులను వారి పాలనా పద్ధతులను ప్రభావితం చేశాయి.
- స్వాతంత్య్ర దినోత్సవం రోజు భారత ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించే ఎర్రకోట మొఘల్ చక్రవర్తుల నివాసం.
- మొఘలులు మధ్య ఆసియా దేశాలైన ఉజ్బెకిస్థాన్, మంగోలియా దేశాలకు చెందినవారు.
ఇతర రాజులతో మొఘలుల సంబంధాలు : - మొఘల్ రాజ్య స్థాపనానంతరం, స్థానిక రాజులు, పాలకులపై పాలనాపరమైన నియంత్రణ సాధించారు.
- వారు పాత రాజులను, పూర్వ రాజ్యాల పరిపాలన కొనసాగించేందుకు రాజులకు అనుమతించారు.
- వీరి ద్వారానే రెవెన్యూ శిస్తు వసూలు చేసేవారు.
- సామ్రాజ్యంలోని రాజ్యాల మధ్య యుద్ధాల నివారణకు చక్రవర్తి ఎప్పుడూ తన సైన్యంతో సిద్ధంగా ఉండేవాడు.
- ఏ రాజులైతే వీరి అధికారాన్ని అంగీకరించలేదో వారిపై నిరంతరం యుద్ధాలు చేయడం ద్వారా వారిని అదుపులో ఉంచారు.
- మొఘలులతో స్వచ్ఛందంగా సత్సంబంధాలు ఏర్పరచుకున్నది – రాజపుత్రులు
- రాజ పుత్రుల్లో చాలా మంది తమ రాజకుమార్తెలను మొఘలులతో వివాహాలు జరిపించి, ఉద్యోగాల్లో ఉన్నత స్థానాన్ని పొందారు.
- అయితే చిత్తోడ్, సిసోడియా రాజపుత్రులు చాలా కాలం పాటు మొఘలుల అధికారాన్ని గుర్తించలేదు.
- మొఘలాయిల చేతిలో ఓడిన రాజులను కూడా గౌరవించి వారి భూభాగాల్ని తిరిగి అప్పగించేవారు.
- మొఘలుల ముఖ్య ఉద్దేశం ఓడించడమే గాని శత్రువులను అవమానించడం కాదు.
- తమ స్నేహానికి గుర్తుగా మొఘలాయిలు రాజపుత్రుల రాజకుమార్తెలను వివాహం చేసుకున్నారు.
- జహంగీర్ తల్లి – అంబర్ రాజపుత్ర రాజు (జైపూర్) రాజకుమార్తె.
- షాజహాన్ తల్లి – రాజపుత్రులైన జైపూర్ యువరాణి
మునసబ్దార్లు, జగీరుదార్లు
- మొఘల్ సామ్రాజ్యంలో వివిధ ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు : తురుష్కులు, ఇరానియన్, భారత ముస్లింలు, అఫ్గాన్లు, రాజపుత్రలు, మరాఠాలు మొదలగు వారు.
- వీరిని మునసబ్దార్లుగా నియమించుకొని సైనిక హోదా కల్పించారు.
- వీరంతా చక్రవర్తి ప్రత్యక్ష ఆధీనంలో ఉండేవారు.
మునసబ్దారుల బాధ్యతలు
1. చక్రవర్తి భవంతులు కాపాడటం.
2. ఒక ప్రాంతాన్ని పరిపాలించడం.
3. కొత్త రాజ్యాలపై దండయాత్ర.
4. తిరుగుబాట్లను అణచివేయడం.
5. నిర్ణీత సంఖ్యలో అశ్వికదళం, గుర్రపు రౌతులను పెంచి పోషించడం.
మునసబ్దారీ వ్యవస్థ లక్షణాలు : - మునసబ్దార్లు ఎలాంటి సొంత నిర్ణయాలు తీసుకోరాదు.
- చక్రవర్తి అభీష్టం మేరకు నడుచుకొనే విధంగా ఒక పరిపాలనా పద్ధతిని అభివృద్ధి చేసేవారు.
- విజయనగర ప్రభువుల సామంతులుగా ఉన్న నాయకరాజులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని చక్రవర్తిని సైతం ధిక్కరించేవారు.
- మొఘలులు ప్రతి రెండు, మూడు సంవత్సరాలకు మునసబ్దారులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదిలీ చేసేవారు.
- వీరు ఒకే ప్రాంతంలో స్థిరంగా ఉండకపోవడం వల్ల వారికి బలపడే అవకాశాలు ఉండేవి కావు.
- ప్రతి మునసబ్దారు అశ్వికదళాన్ని నమోదు చేయించి, గుర్రాలకు ముద్రలు వేయించి జీతభత్యాలను పొందేవారు.
- మునసబ్దారు పదవి వంశపారంపర్యం కాదు.
- చక్రవర్తి మాత్రమే మునసబ్దారు కుమారుడు మునసబ్దారు కాగలడో లేదో నిర్ణయిస్తాడు.
- మునసబ్దారు మరణానంతరం అతని యావదాస్తిని చక్రవర్తి జప్తు చేసుకునే వాడు.
- జాగీర్ల నుంచి వచ్చే ఆదాయాల నుంచి మునసబ్దార్లు వారి జీతాలను తీసుకునే వారు. ఇవి విజయనగర కాలపు “అమరనాయక” విధానాన్ని పోలి ఉన్నాయి.
- జాగీర్ పరిపాలనను చక్రవర్తిచే నేరుగా నియమించిన అధికారులను చూసుకొనేవారు.
- అధికారులు నిర్ణయించిన పరిమితికన్నా రైతులు ఎక్కువగా పన్నులు కట్టనవసరం లేదు.
- జాగీర్లు కూడా ప్రతి రెండు, మూడు సంవత్సరాలకు ఒకరి నుంచి మరొకరికి బదిలీ అవుతుండేవి.
- అక్బర్ కాలంలో ఈ జాగీరు కూడా మునసబ్దార్ల, జీతానికి సరిపోయే విధంగా జాగ్రత్తగా లెక్కించబడి నిర్ణయించేవారు.
- ఔరంగజేబు పరిపాలనా కాలంలో మునసబ్దార్ల సంఖ్యను ఎక్కువగా పెంచారు. కాబట్టి జాగీర్ల కొరత ఏర్పడింది.
- ఫలితంగా జాగీరుదార్లు చాలా మంది వారికి జాగీరు లభించినప్పుడు ఎంత వీలైతే అంత భారీగా వసూళ్లకు పాల్పడేవారు.
- ఔరంగజేబు చివరి దశలో ఈ అక్రమ వసూళ్లను ఆపలేకపోయాడు.
- ఫలితంగా రైతులు చాలా ఇబ్బందులకు గురయ్యారు.
జప్త్..జమీందార్లు
- మొఘలుల ప్రధాన ఆదాయ వనరు – వ్యవసాయ ఉత్పత్తులపై వేయబడే పన్ను. జప్త్
- ప్రతి ప్రాంతాన్ని రెవెన్యూ బ్లాక్‌గా నిర్ణయించడం
- ప్రతి బ్లాక్‌కు ప్రత్యేక శిస్తు పట్టిక ఏర్పాటు చేసి కట్టవలసిన పన్నులు నిర్ణయించడం.
- ఈ పద్ధతి భూములను సర్వే చేసిన చోట సాధ్యపడింది.
- గుజరాత్, బెంగాల్ వంటి ప్రాంతాల్లో సాధ్యపడలేదు.
జమీందార్లు - చాలా ప్రాంతాల్లో గ్రామ పెద్ద ద్వారా రైతులు పన్నులు చెల్లించేవారు.
- స్థానిక పెద్దలు లేక పలుకుబడి గల ముఖ్యులు ఎవరైతే పన్నులు వసూలు చేసి చెల్లించడానికి మధ్యవర్తులుగా, సుముఖంగా ఉంటారో వారే జమీందార్లు.
- వీరిని చక్రవర్తి నియమించడు
- జమీందార్లకు అధికారం వంశపారంపర్యంగా వచ్చేది.
- వీరు సొంత బలగాలను పోషించుకునేవారు.
- భూమి శిస్తును వసూలు చేసినందుకు ఆ శిస్తులో వాటా ఉంటుంది.
- వీరు మొఘల్ అధికారులతో గ్రామస్థుల తరఫున సంప్రదింపులు జరిపే ప్రతినిధులు.
- కొన్ని ప్రాంతాల్లో వీరు అత్యంత శక్తిమంతులు
- మొఘలుల పాలనలోని దోపిడీ విధానాలు తిరుగుబాటుకు దారి తీశాయి.
- జమీందార్ల తిరుగుబాటు 17వ శతాబ్దం చివరిలో మొఘల్ సామ్రాజ్య స్థిరత్వానికి సవాలుగా మారింది.
అక్బర్ విధానాలు
- క్రీ.శ. 1570లో అక్బర్ ఫతేపూర్ సిక్రీలో (ఆగ్రాకు సమీపాన) నివసించాడు.
- అక్కడ మతం పట్ల చర్చ జరపడానికి ముస్లిం పండితులను, బ్రాహ్మణులను, రోమన్ క్యాథలిక్కులను, జొరాష్ట్రియన్లను
ఆహ్వానించేవాడు. - వివిధ మత పెద్దలతో అక్బర్ చర్చలు జరిపే ప్రదేశం – “ఇబాదత్‌ఖానా”
- ప్రజల విభిన్న సంప్రదాయాలు, మత విశ్వాసాలు గల వారిని ఒక చోటుకు చేర్చాలని తలచిన వాడు – అక్బర్.
- దీని కోసం అక్బర్ మనస్సులో మొదలిన భావన – “సుల్హ్-ఇ-కుల్”
- సుల్హ్-ఇ-కుల్ -ప్రపంచశాంతి.
- సహనంతో కూడిన ఇలాంటి భావన భిన్న మతస్థుల మధ్య వివక్ష చూపే పద్ధతి లేకుండా చేసింది.
- ఏదో ఒక పద్ధతి పట్ల లేక విశ్వాసం పట్ల కాక నీతి, నిజాయితీ, సమన్యాయం, శాంతి యావత్ ప్రపంచానికి అన్వయించే సిద్ధాంతాలు ప్రవేశపెట్టాలని అక్బర్ సంకల్పించాడు.
- సుల్హ్-ఇ-కుల్ పద్ధతి ఆధారంగా రాజ్యపాలన అమలు పర్చడంలో అక్బర్‌కు సహాయపడినది- “అబుల్ ఫజల్”
- చక్రవర్తి ఏదో ఒక మతం, వర్గం, సాంఘిక స్థితి, కులం సంబంధాలకు అతీతంగా ఒక రాజ్య ప్రజలందరి క్షేమం కోసం పనిచేశాడు.
- జహంగీర్, షాజహాన్‌లు కూడా ఈ సిద్ధాంతాన్ని అవలంబించారు.
- కాని ఔరంగజేబు ఈ పద్ధతిని అవలంబించక, సున్నీ ముస్లిం వర్గాన్ని అభిమానించాడు.
- ఇతర మత ప్రజలు ఈ విషయం పట్ల తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
జహంగీర్ అభిప్రాయం ప్రకారం “సుల్హ్-ఇ-కుల్” - ఇందులో అందరికీ చోటుంది.
- ఈ రాజ్యంలో అన్ని దిశల్లో పరిమితి ఉంది.
- చుట్టూ సముద్రం తప్ప మరేమీ లేదు.
- ఇతర నమ్మకాలు, మత పెద్దలకూ, మతస్థుల వారికి నివాసముంది.
- మత వివక్షకు దారే లేదు.
- సున్నీలు, షియాలు ప్రార్థనల కోసం మసీదులో కలిస్తే, క్రైస్తవులు, యూదులు చర్చిలో కలుస్తారు.
- అతను స్థిరంగా ప్రపంచశాంతి (సుల్హ్-ఇ-కుల్) విధానాలను అవలంబించాడు.
17వ శతాబ్దం తర్వాత మొఘల్ సామ్రాజ్యం - ఆర్థిక, వ్యాపార రంగాల్లో మొఘల్ సామ్రాజ్యం మంచి అభివృద్ధి సాధించింది.
- ప్రసిద్ధి చెందిన సంపన్న దేశమని అప్పటి విదేశీ యాత్రికులు వర్ణించారు.
- కాని వీరు సంపదతో పాటు దారిద్య్రాన్ని చూసి బాధపడ్డారు.
- మొఘల్ చక్రవర్తులు వారి మునసబ్దార్లు ఆదాయంలో ఎక్కువ భాగం జీతాలకు, రోజువారీ అవసరాలకు, వస్తువుల కొనుగోలుకు వినియోగించేవారు.
- ఈ ఖర్చుల ద్వారా వస్తువులు సరఫరా చేసే రైతులు, చేతి వృత్తుల వారు ఉపాధి పొందేవారు.
- నిరుపేదలకు దీనివల్ల ఎలాంటి లబ్ధి చేకూరలేదు.
- 17వ శతాబ్దం చివరలో ధనవంతులైన రైతులు, చేతి వృత్తుల వారు శక్తిమంతమైన వర్గంగా ఉన్నారు.
- మొఘల్ చక్రవర్తుల అధికారం తగ్గేకొద్దీ ప్రాంతీయ రాజ్యాలు బలపడ్డాయి.
- హైదరాబాద్, అవధ్ లాంటి రాజ్యాలను స్థాపించారు.
- ఢిల్లీ చక్రవర్తిని తమ ప్రభువుగా అంగీకరించినప్పటికీ 18వ శతాబ్దంలో ఈ రాజ్యాలు స్వతంత్ర రాజ్యాలుగా అవతరించాయి.
సర్దార్ సర్వాయి పాపన్న : - వరంగల్ జిల్లాకు చెందిన వారు
- తెలంగాణలో మొఘలుల పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు.
పాపన్న కట్టిన కోటలు
1. తాటికొండ 2. వేములవాడ
3. షాపురం
- తాటికొండలో ప్రస్తుతమున్న చెక్‌డ్యాం పాపన్న పరిపాలనా కాలంలో నిర్మించినదే.
- ఇది పాలకుడిగా అభివృద్ధి పట్ల పాపన్నకు ఉన్న పరిపాలనా దక్షతకు, దృష్టికోణానికి నిదర్శనం.
- సుబేదారులు, జమీందార్లు, భూస్వాములపై గెరిల్లా దాడులు చేసి, సైన్యానికి కావలసిన ధనాన్ని పోగు చేశాడు.
- పాపాన్న అణచివేతకు ఔరంగజేబు రుస్తుం దిల్‌ఖాన్, ఖాసీంఖాన్‌ను పంపించి పాపన్నతో పోరాటం చేసి షాపురం కోటను ఆక్రమించుకోమన్నాడు.
- పాపన్న ఖాసింఖాన్‌ను ఓడించి, చంపేశాడు.
- దీనితో రుస్తుం దిల్‌ఖాన్ స్వయంగా యుద్ధానికి దిగాడు.
- ఆ యుద్ధం మూడు నెలలు సాగింది.
- చివరికి రుస్తుం దిల్ ఖాన్ యుద్ధం నుంచి పారిపోయాడు. l కాని పాపన్న తన స్నేహితుడు, అనుయాయుడైన సర్వన్న ను కోల్పోయాడు.
- క్రీ.శ.1707లో ఔరంగజేబు మరణానంతరం, దక్కన్ సుబేదారు అయిన కంబక్షఖాన్ దక్కన్‌పై నియంత్రణ కోల్పోయాడు.
- ఈ బలహీనమైన పరిపాలనను గమనించిన పాపన్న 1708, ఏప్రిల్ 1న వరంగల్ కోటను ఆక్రమించాడు.
- తాటికొండ వద్ద, తర్వాత ఖిలాషాపురం వద్ద చాలా కాలం యుద్ధం జరిగింది.
- అక్కడి నుంచి తప్పించుకున్న పాపన్నను క్రీ.శ. 1712లో పట్టుకుని శిరచ్ఛేదం చేశారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు