DSC Special – Social Studies | బ్యాంకులు పూచీకత్తులు లేకుండా రుణాలు ఎవరికి ఇస్తాయి?
సేవారంగ కార్యకలాపాలు
1. కింది వాటిలో సేవారంగ కార్యకలాపం కానిది?
1) బ్యాంకింగ్ 2) విద్య
3) రోడ్ల నిర్మాణం 4) టోకు వ్యాపారం
2. భారతదేశంలో ఉద్యోగాలు చేసేవారిలో సేవాకార్యకలాపాల్లో పనిచేసేవారి భాగం?
1) 1/2 2) 1/3
3) 1/4 4) 1/5
3. టెలికమ్యూనికేషన్ల అనుసంధానం ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్నవారికైనా సేవలందించే విధానం?
1) పొరుగు సేవలు 2) కేంద్ర సేవలు
3) విదేశీ సేవలు
4) కమ్యూనికేషన్ సేవలు
4. కింది రాష్ర్టాల్లో రెండు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్‌లు కలిగిన రాష్ట్రం?
1) ఆంధ్రప్రదేశ్ 2) ఒడిశా
3) మహారాష్ట్ర 4) తమిళనాడు
5. కింది వాటిలో విత్తరంగ సేవా కార్యకలాపం?
1) బీమా 2) చిల్లర వ్యాపారం
3) కమ్యూనికేషన్ సేవలు
4) రవాణా
6. సేవా రంగంలో అధిక ఉద్యోగ అవకాశాలు కల్పించింది?
1) ప్రభుత్వం 2) ప్రైవేట్ రంగం
3) మిశ్రమ రంగం 4 పైవేవీకాదు
7. కిందివాటిలో అత్యధిక ఉపాధిని కల్పిస్తున్న సేవారంగం?
1) వర్తకం
2) రవాణా సమాచారం
3) విత్తరంగం
4) సామాజిక, సాంఘిక వ్యక్తిగత సేవలు
8. చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏ సంవత్సరం నుంచి అనుమతిస్తున్నారు?
1) 2008 2) 2010
3) 2012 4) 2014
9. భారతదేశంంలో అత్యధిక నిపుణుల కొరత ఏరంగంలో ఉంది?
1) రవాణా 2) వైద్య
3) విద్య 4) వ్యవసాయం
సమాధానాలు
1-3 2-3 3-1 4-3
5-1 6-1 7-4 8-3
9-2
ద్రవ్యం బ్యాంకింగ్
1. కింది వాటిలో ప్రత్యక్ష ఉపయోగం లేని వస్తువు?
1) ధాన్యం 2) డబ్బు
3) భూమి 4) మేక
2. వస్తుమార్పిడి విధానం స్థానంలో మార్పిడి మాధ్యమంగా మొదట దేన్ని ఉపయోగిస్తారు?
1) లోహాలు 2) కరెన్సీ నోట్లు
3) చెక్కులు 4) ధాన్యం
3. భారతదేశంలో ద్రవ్యాన్ని ముద్రించి పంపిణీ చేసేది?
1) స్టేట్ బ్యాంక్ 2) రిజర్వు బ్యాంక్
3) రాష్ట్రపతి 4) గవర్నర్
4. భారతదేశంలో తొలి బ్యాంకర్ జగత్‌సేఠ్ ఏ ప్రాంతానికి చెందినవాడు?
1) పట్నా 2) బెంగాల్
3) మద్రాస్ 4) సూరత్
5. నాణేల బరువు, నాణ్యత సమస్యల పరిష్కారానికి మొదటగా బ్యాంక్ ఎక్కడ స్థాపించారు?
1) లండన్ 2) ప్యారిస్
3) అమ్‌స్టర్‌డామ్ 4) రోమ్
6. కింది వాటిలో వాణిజ్య బ్యాంకు విధి కానిది?
1) డబ్బు జమ 2) డబ్బు బదిలీ
3) రుణం 4) డబ్బు ముద్రణ
7. బ్యాంకుల మధ్య చెల్లింపులు, వసూళ్లు నిర్వహించే బ్యాంకు?
1) శిఖరాగ్ర బ్యాంకు
2) క్లియరింగ్ బ్యాంకు
3) నాబార్డ్
4) జిల్లా కేంద్ర బ్యాంక్
8. నగదు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా మన ఖాతాలోంచి చెల్లింపులు చేయటకు వీలు కల్పించే బ్యాంకింగ్ సౌకర్యం?
1) ఏటీఎం 2) క్రెడిట్ కార్డ్
3) డెబిట్ కార్డ్ 4) ఫోన్ బ్యాంకింగ్
9. సేవారుసుం ఏ ఖాతాపై వసూలు చేస్తారు?
1) పొదుపు ఖాతా
2) బేసిక్ సేవింగ్ ఖాతా
3) కరెంటు ఖాతా
4) ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతా
10. రిజర్వు బ్యాంక్ లోగోలో కనిపించే జంతువు?
1) పులి 2) సింహం
3) వృషభం 4) ఏనుగు
11. రియల్‌టైం గ్రాస్ సెటిల్మెంట్ ద్వారా నగదు బదిలీ కనీస గరిష్ఠ పరిమితి?
1) లక్ష నుంచి 5 లక్షలు
2) 2 లక్షలు – 5 లక్షలు
3) లక్ష నుంచి 10 లక్షలు
4) 2 లక్షలు – గరిష్ఠ పరిమితి లేదు
12. కింది వాటిలో ఐఎఫ్ఎస్సీ అవసరం లేకుండా నగదు బదిలీ చేయగలిగేది?
1) ఎన్ఈఎఫ్టీ
2) ఆర్టీజీఎస్
3) యూఎస్ఎస్డీ 4) ఐఎంపీఎస్
సమాధానాలు
1-2 2-1 3-2 4-2
5-3 6-4 7-2 8-3
9-3 10-1 11-4 12-3
ద్రవ్య వ్యవస్థ – రుణం
1. డిమాండ్ డిపాజిట్లకు ఉదాహరణ?
1) బాండ్లు 2) ఫిక్స్డ్ డిపాజిట్లు
3) బ్యాంకు ఖాతా జమ
4) పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్లు
2. బ్యాంకింగ్ వ్యవస్థను పర్యవేక్షించేది?
1) స్టేట్ బ్యాంక్ 2) రిజర్వు బ్యాంక్
3) ఫెడరల్‌బ్యాంక్ 4) సుప్రీంకోర్టు
3. రుణాలు తీర్చేవరకు రుణదాతకు హామీగా పెట్టడాన్ని ఏమంటారు?
1) పూచీకత్తు 2) ఆస్తి హామీ
3) రుణహామీ 4) పైవేవీకావు
4. నాబార్డ్ అనేది ఒక ?
1) సహకార సంఘం
2) బ్యాంక్
3) ఒక వ్యాపార సంస్థ
4) వ్యవసాయోత్పత్తుల వ్యాపారం చేసే కార్పొరేషన్
5. కింది రుణాల్లో వడ్డీరేటు ఎవరి వద్ద తక్కువఎవ రి వద్ద తక్కువ?
1) బ్యాంకులు 2) వ్యాపారులు
3) భూస్వాములు 4) యాజమానులు
6. కింది వాటిలో నియత రుణాలను ఇచ్చేది?
1) భూస్వామి 2) స్నేహితుడు
3) వడ్డీవ్యాపారి 4) సహకార సంఘం
7. గ్రామీణులకు అతి తక్కువ వడ్డీరేటుకు రుణాలిచ్చే వారు?
1) భూస్వాములు 2) వడ్డీవ్యాపారులు
3) సహకార సంస్థలు
4) సహకార సంస్థలు, వాణిజ్య బ్యాంకులు
8. 2003లో గ్రామీణ కుటుంబాలకు, వాణిజ్య బ్యాంకులు సహకార సంస్థలు ఇచ్చిన రుణాల శాతం?
1) 32 శాతం 2) 42 శాతం
3) 52 శాతం 4) 62 శాతం
9. యూఐడీ సంఖ్యను తెలియజేసే కార్డు?
1) రేషన్ కార్డ్ 2) ఆధార్ కార్డ్
3) పాస్‌పోర్టు కార్డ్ 4) ఓటర్ కార్డ్
10. కనీస బ్యాలెన్స్ అవసరం లేకుండా నిర్వహించుకునే ఖాతాలకు గల పేరు?
1) పొదుపు ఖాతా
2) డిమాండ్ డిపాజిట్ ఖాతా
3) నో ప్రిల్స్ అకౌంట్
4) ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతా
11. గ్రామీణులకు ఇచ్చే నియత రుణాలను పర్యవేక్షించేది?
1) కేంద్ర ప్రభుత్వం 2) నాబార్డ్
3) స్టేట్ బ్యాంక్
4) గ్రామీణ బ్యాంక్
12. నియత రుణాలను అధికంగా పొందుతున్న వర్గం?
1) పేదలు 2) మధ్యతరగతి
3) ధనికులు 4) గ్రామీణులు
13. బ్యాంకులు పూచీకత్తులు లేకుండా రుణాలు ఎవరికి ఇస్తాయి?
1) రైతులు
2) రాజకీయ నాయకులు
3) పారిశ్రామిక వేత్తలు
4) స్వయం సహాయక బృందాలు
14. కింది వాటిలో స్వయం సహాయక బృందానికి వర్తించనిది?
1) ఇవి 15-20 మంది సభ్యులతో ఏర్పడతాయి
2) వీరికి బ్యాంకులు పూచీకత్తు లేకుండా రుణాలిస్తాయి
3) రుణాలు తీర్చే బాధ్యత సమష్టిగా ఉంటుంది
4) ఇవి గ్రామాల్లో మాత్రమే ఉంటాయి
15. ఆర్థిక అక్షరాస్యతను కల్పించడానికిb వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నది?
1) కేంద్ర ఆర్థిక శాఖ 2) ప్రణాళిక సంఘం
3) రిజర్వు బ్యాంక్ 4) ఆర్థిక సంఘం
సమాధానాలు
1-3 2-2 3-1 4-2
5-1 6-4 7-4 8-3
9-2 10-3 11-2 12-3
13-4 14-4 15-3
ధరలు-జీవనవ్యయం
1. వచ్చే ఆదాయాన్ని చేయబోయే వ్యయాన్ని తెలియజేసే నివేదిక?
1) ఆర్థిక నివేదిక 2) ఆర్థిక సర్వే
3) బడ్జెట్ 4) కోశ పట్టిక
2. జీవన వ్యయం పెరుగుట వల్ల జీవన ప్రమాణం?
1) తగ్గుతుంది 2) పెరుగుతుంది
3) మారదు 4) చెప్పలేదు
3. ధరల స్థాయిలో నిరంతర పెరుగుదలను ఎలా వ్యవహరిస్తారు?
1) ప్రతి ద్రవ్యోల్బణం
2) ద్రవ్యోల్బణం
3) ఆర్థిక మాంద్యం
4) స్టాగ్ప్లేషన్
4. ద్రవ్యోల్బణ కాలంలో తీవ్రంగా నష్టపోయేవారు?
1) ప్రభుత్వ ఉద్యోగులు
2) వ్యాపారులు
3) ధనవంతులు
4) రోజువారీ వేతనదారులు
5. ద్రవ్యోల్బణ ప్రభావం ఎవరిపై ఉండదు?
1) తక్కువ ఆదాయం కలవారు
2) స్థిరమైన ఆదాయం కలిగిన పెన్షన్ దారులు
3) చిన్న అమ్మకం దారులు
4) వివిధ సేవలు అందించే ప్రజలు
6. ద్రవ్యోల్బణ కాలంలో ద్రవ్యం కొనుగోలు శక్తి?
1) క్షీణిస్తుంది 2) పెరుగుతుంది
3) మారదు 4) చెప్పలేం
7. సాధారణంగా ద్రవ్యోల్బణాన్ని దేని ఆధారంగా లెక్కిస్తారు?
1) టోకుధరల సూచిక
2) వినియోగదారుల ధరల సూచిక
3) పారిశ్రామిక ఉద్యోగుల వినియోగ ధరల సూచిక
4) వ్యవసాయ కార్మికుల
వినియోగధరల సూచిక
8. ద్రవ్యోల్బణ స్థాయి అధికంగా ఉన్నప్పుడు ప్రజలు కొనుగోలు చేసే వస్తువు?
1) బంగారం 2) స్థలాలు
3) ఆహార ధాన్యాలు 4) 1, 2
9. కింది వాటిలో అనుత్పాదక వస్తువులపై చేసే వ్యయం?
1) బంగారం కొనడం
2) స్థలాలు కొనడం
3) వాహనాలు కొనడం 4) 1, 2
10. సాధారణ ప్రజలపై ప్రభావితం చూపే ద్రవ్యోల్బణం?
1) టోకు ధరల సూచిక
2) వినియోగదారుల ధరల సూచిక
3) ఆహార ద్రవ్యోల్బణం
4) ముడి చమురు ద్రవ్యోల్బణం
11. ద్రవ్యోల్బణం తగ్గించడానికి ప్రభుత్వం చేపట్టే చర్య ?
1) ద్రవ్య సరఫరా తగ్గింపు
2) కొరత వస్తువుల దిగుమతి
3) అక్రమ నిల్వలపై దాడి 4) పైవన్నీ
సమాధానాలు
1-3 2-1 3-2 4-4
5-4 6-1 7-1 8-4
9-4 10-3 11-4
ప్రభుత్వ బడ్జెట్-పన్నులు
1. 2011-12లో భారత ప్రభుత్వ మొత్తం వ్యయం?
1) రూ. 21 లక్షల కోట్లు
2) రూ. 23 లక్షల కోట్లు
3) రూ. 25 లక్షల కోట్లు
4) రూ. 27 లక్షల కోట్లు
2. 2011-12 భారత ప్రభుత్వం విద్యా సంస్కృతిపై చేసిన వ్యయ శాతం?
1) 6 శాతం 2) 8 శాతం
3) 10 శాతం 4) 12 శాతం
3. పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేవారు ఎవరు?
1) రాష్ట్రపతి 2) ప్రధాన మంత్రి
3) ఆర్థిక మంత్రి
4) ఉప ప్రధానమంత్రి
4. స్వాతంత్య్రానంతరం 1947-48లో మనదేశ మొదటి బడ్జెట్ మొత్తం విలువ?
1) 197 కోట్ల రూపాయలు
2) 297 కోట్ల రూపాయలు
3) 397 కోట్ల రూపాయలు
4) 497 కోట్ల రూపాయలు
5. కింది వాటిలో ఉత్పత్తి స్థానంలోనే విధించే పన్ను?
1) సేవాపన్ను 2) అమ్మకం పన్ను
3) ఎక్సైజ్ సుంకం 4) కస్టమ్స్ సుంకం
6. టెలిఫోన్, హోటల్, ప్రథమశ్రేణి రైలు ప్రయాణం మొదలైన వాటిపై విధించే పన్ను?
1) అమ్మకం పన్ను 2) వ్యాట్
3) సేవాపన్ను
4) కస్టమ్స్ సుంకం
7. కింది వాటిలో ప్రత్యక్ష పన్ను కానిది?
1) అమ్మకం పన్ను
2) ఆదాయం పన్ను
3) కార్పొరేట్ పన్ను
4) స్టాంప్ డ్యూటీ
8. కింది ఏ ఆదాయంపై ఆదాయం పన్ను విధించరు?
1) వడ్డీలు, అద్దెలు
2) స్టాక్ మార్కెట్ డ్యూటీలు
3) వ్యవసాయదారులు
4) వేతనాలు
9. కంపెనీల వ్యాపార సంస్థలు సాధించిన లాభాలపై విధించే పన్ను?
1) ఆదాయపు పన్ను
2) కార్పొరేట్ పన్ను
3) ఎక్సైజ్ సుంకం 4) వ్యాట్
సమాధానాలు
1-2 2-4 3-3 4-1
5-3 6-3 7-1 8-3
9-2
ఎస్ ఎండ్ ఎస్ పబ్లికేషన్స్ సౌజన్యంతో..
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?