SBI PO Recruitment | డిగ్రీతో ఎస్బీఐలో పీవో పోస్టులు
SBI PO Recruitment | దేశంలో అతిపెద్ద బ్యాంకుగా పేరుగాంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో కేవలం డిగ్రీ అర్హతతో పీవో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రస్తుతం రెండువేల పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా…
- మొత్తం ఖాళీలు: 2000 ( వీటిలో ఎస్సీ-300, ఎస్టీ-150, ఓబీసీ- 540, ఈడబ్ల్యూఎస్-200, జనరల్- 810 ఖాళీలు ఉన్నాయి. పీహెచ్సీ కోటాలో వీఐ-20, హెచ్ఐ-36, ఎల్డీ-20, డీ అండ్ ఈఈ-36 పోస్టులను కేటాయించారు.)
- పోస్టు: ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)
- జీతభత్యాలు: ప్రారంభ వేతనం రూ. 41,960 (నాలుగు అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్‌తో)
- పేస్కేల్: రూ.36,000-63,840/- వీటితోపాటు అదనంగా డీఏ, హెచ్ఆర్ఏ, సీసీఏ, పీఎఫ్ తదితరాలు ఉంటాయి.
ఎంపిక విధానం
- ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా చేస్తారు.
ప్రిలిమినరీ పరీక్ష - ఇది ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు
- దీనిలో మూడు సెక్షన్లు ఉంటాయి
- మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది
- పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు (గంట)
- పరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 30, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-35, రీజనింగ్ ఎబిలిటీ- 35 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి సెక్షన్‌కు 20 నిమిషాల సమయం కేటాయించారు.
- ప్రిలిమ్స్‌లో సెక్షన్లో కటాఫ్ లేదు.
మెయిన్ ఎగ్జామినేషన్ - ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఒక్కో పోస్టుకు సుమారు 10 మంది చొప్పున
మెయిన్‌కు ఎంపిక చేస్తారు. - మెయిన్ పరీక్షలో ఆబ్జెక్టివ్ పరీక్ష 200 మార్కులు, డిస్క్రిప్టివ్ పేపర్ 50 మార్కులకు ఉంటుంది
- మెయిన్ ఆబ్జెక్టివ్ పరీక్షలో
నాలుగు సెక్షన్లు ఉంటాయి. - రీజనింగ్&కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 40 ప్రశ్నలు- 50 మార్కులు, డేటా అనాలిసిస్ & ఇంట్రప్రిటేషన్- 30 ప్రశ్నలు- 50 మార్కులు, జనరల్ ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్నెస్- 50 ప్రశ్నలు- 60 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి – 35 ప్రశ్నలు-40 మార్కులు.
- మొత్తం 155 ప్రశ్నలు- 200 మార్కులు
- పరీక్ష కాలవ్యవధి 3 గంటలు
ఎవరు అర్హులు ?
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వారు.
అదేవిధంగా ప్రస్తుతం ఫైనల్ ఇయర్/ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు రాయనున్నవారు 2023, డిసెంబర్ 31లోగా ఉత్తీర్ణత సాధించేవారు కూడా
దరఖాస్తు చేసుకోవచ్చు. మెడికల్, ఇంజినీరింగ్, సీఏ, కాస్ట్ అకౌంటెంట్ తదితర డిగ్రీలు చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. - నోట్: అభ్యర్థులు బ్యాంకులు/ఎన్ఎఫ్బీసీలకు సంబంధించి
పేమెంట్‌లో డిఫాల్టర్స్‌గా ఉన్నవారు అర్హులు కారు, సిబిల్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. - వయస్సు: 2023, ఏప్రిల్ 1 నాటికి 21- 30 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ముఖ్యతేదీలు
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: సెప్టెంబర్ 27
ప్రిలిమినరీ ఎగ్జామ్ కాల్ లెటర్- అక్టోబర్ రెండో వారం నుంచి
ప్రిలిమినరీ ఫలితాలు-నవంబర్/ డిసెంబర్ 2023లో ప్రకటిస్తారు - మెయిన్ ఎగ్జామ్ – డిసెంబర్ 2023/ జనవరి 2024
- సైకోమెట్రిక్ టెస్ట్ – జనవరి/ఫిబ్రవరి 2024
- తుది ఫలితాలు-
- ఫిబ్రవరి/మార్చి 2024
- వెబ్సైట్: https://sbi.co.in
మెయిన్ డిస్క్రిప్టివ్ పరీక్ష
- ఇంగ్లిష్ లాంగ్వేజ్ (లెటర్ రైటింగ్&ఎస్సే)- 2 ప్రశ్నలు ఇస్తారు. 50 మార్కులు.
- పరీక్ష కాలవ్యవధి 30 నిమిషాలు
నోట్: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్‌లో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. - ప్రతి తప్పుకు 1/4 మార్కుల కోతవిధిస్తారు.
- ప్రిలిమ్స్, మెయిన్స్‌లో సెక్షనల్ కటాఫ్ మార్కులు లేవు
- మెయిన్‌లో వచ్చిన కటాఫ్ ఆధారంగా సైకోమెట్రిక్ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు
- సైకోమెట్రిక్ టెస్ట్ 50 మార్కులకు ఉంటుంది
- గ్రూప్ ఎక్సర్సైజ్ 20, ఇంటర్వ్యూకు 30 మార్కులు కేటాయించారు.
తుది ఎంపిక - ఫేజ్-2 (మెయిన్)లో అర్హతలు సాధించిన వారిని ఫేజ్-3 (సైకోమెట్రిక్ టెస్ట్)కు ఎంపిక చేస్తారు. ఫేజ్-2,3లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
శిక్షణ: ఎంపికైన అభ్యుర్థులకు ఆన్లైన్ కోర్సు ద్వారా బేసిక్ బ్యాంకింగ్ నాలెడ్జ్‌ను కల్పిస్తారు. ప్రొబేషనరీ ఆఫీసర్‌గా జాయిన్ అయిన వారికి రెండేండ్లు ప్రొబేషనరీ పీరియడ్.
Previous article
TET – Methodology | చెబుతూ చేయడం ద్వారా గుర్తుంచుకునేశాతం?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?