Economy – Groups Special | ఏ పారిశ్రామిక తీర్మానాన్ని ఆర్థిక రాజ్యాంగం అంటారు?
1. కింది వాటిలో ఆర్థిక కార్యకలాపం కానిది ఏది?
ఎ) ఉత్పత్తి బి) పంపిణీ
సి) వినియోగం డి) పరిపాలన, కొరత
2. కింది వాటిలో స్థూల అర్థశాస్ర్తానికి సంబంధించినది కానిది?
ఎ) స్థూల అర్థశాస్ర్తాన్ని ఆదాయ ఉద్యోగితా సిద్ధాంతం అని కూడా అంటారు
బి) దీన్ని అభివృద్ధి చేసినది జె.ఎం.కీన్స్
సి) ఇది మొత్తం ఆదాయం, పొదుపు, సమష్టి డిమాండ్, సప్లయ్‌ని వివరిస్తుంది
డి) ఇది ఒక సంస్థ, పరిశ్రమ వినియోగదారుడి గురించి వివరిస్తుంది
3. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పితామహుడు ఎవరు?
ఎ) ఆడమ్‌స్మిత్ బి) మార్షల్
సి) జె.ఎం.కీన్స్ డి) డాల్టన్
4. అర్థశాస్త్రంలో తొలిసారి నోబెల్ బహుమతి పొందిన వారు ఎవరు?
ఎ) రాగ్నర్ఫ్రిష్ బి) జాన్ టిన్బర్జన్
సి) అమర్త్యసేన్ డి) ఎ, బి
5. కింది వాటిలో సహజ వనరులు కానిది ఏది?
ఎ) భూమి భూసారం
బి) అటవీ సంపద
సి) ఖనిజాలు, వాతావరణం
డి) ఉత్పత్తి
6. కింది వాటిలో శ్రమ విభజన ప్రయోజనాలు
ఎ) శ్రామికుల ఉత్పాదక సామర్థ్యం పెరుగుతుంది
బి) సమయం ఆదా అవుతుంది
సి) ఉత్పత్తిలో నూతన ప్రక్రియ జరుగుతుంది
డి) పైవన్నీ
7. పండగలు, పెళ్లిళ్లపై చేసే వ్యయాన్ని ఏమంటారు?
ఎ) ఆడంబర వినియోగం
బి) అనుత్పాదక వ్యయం
సి) ఎ, బి డి) ప్రకటిత వ్యయం
8. కింది వాటిలో సరైనది ఏది?
ఎ) యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా మొదటి ప్రపంచ దేశాలు
బి) యూఎస్ఎస్ఆర్, చైనా, క్యూబా రెండో ప్రపంచ దేశాలు
సి) ఇండియా, ఇండోనేషియా, ఈజిప్టు – మూడో ప్రపంచ దేశాలు
డి) పైవన్నీ సరైనవే
9. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు ఎన్ని రకాల ఉత్పత్తి పద్ధతులు ఉన్నాయి?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
10. కింది వాటిని జతపరచండి?
ఎ) వినియోగ ద్వంద్వత్వం 1) వెబ్లన్
బి) ఆర్థిక ద్వంద్వత్వం 2) బెమ్స్ డ్యూస్ అండ్ బెర్రీ
సి) అంతర్జాతీయ 3) బెంజిమన్ ద్వంద్వత్వం హిగ్గిన్స్
డి) ఆడంబర వినియోగం
4) ఇమాన్యుయెల్
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-4, బి-3, సి-2, డి-1
సి) ఎ-4, బి-3, సి-1, డి-2
డి) ఎ-1, బి-2, సి-4, డి-3
11. కింది వాటిలో సరైనది ఏది?
ఎ) వేతన వస్తు వ్యూహాన్ని ప్రొఫెసర్ వకీల్ అండ్ బ్రహ్మానందం ప్రతిపాదించారు
బి) భారీ పరిశ్రమల వ్యూహాన్ని పీసీ మహలనోబిస్ రూపొందించారు
సి) క్రమవృద్ధి సిద్ధాంతాన్ని గౌతమ్ మాథుర్ వివరించారు
డి) పైవన్నీ సరైనవే
12. కిందివాటిని జతపరచండి?
ఎ) లింగ అభివృద్ధి సూచీ 1) 1997
బి) లింగ అసమానత సూచీ 2) 2012
సి) మానవ పేదరిక సూచీ 3) 1995
డి) ప్రపంచ సంతోష సూచీ 4) 2010
ఎ) ఎ-3, బి-4, సి-1, డి-2
బి) ఎ-1, బి-2, సి-3, డి-4
సి) ఎ-3, బి-2, సి-1, డి-4
డి) ఎ-4, బి-3, సి-2, డి-1
13. కింది వాటిలో కారల్‌మార్క్స్‌కు సంబంధించనిది?
ఎ) సామ్యవాదం
బి) కమ్యూనిజం
సి) మిగులు విలువ సిద్ధాంతం
డి) వృద్ధి దశ
14. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 17 కలవు వాటిని P5 గా సూచిస్తారు ఆ 5 అంశాలు ఏవి?
ఎ) People, Prosperity,Planet, Peace, Participation
బి) People, Programme,Planet, Power, Participation
సి) Properity Prosperity,Power, Percapital, Plan
డి) People, Programme, Power, Percapital, Plan
15. కింది వాటిని జతపరచండి?
ఎ) నశ్వర వస్తువులు 1) బొగ్గు
బి) మన్నిక గల వస్తువులు 2) పాలు
సి) మాధ్యమిక వస్తువులు 3) దుస్తులు
డి) ఉచిత వస్తువులు 4) సూర్యరశ్మి
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-2, బి-3, సి-1, డి-4
సి) ఎ-2, బి-1, సి-4, డి-3
డి) ఎ-3, బి-2, సి-1, డి-4
16. కింది వాటిని జతపరచండి.
ఎ) సంపద 1) ఒక ప్రవాహ భావన
బి) ఆదాయం 2) బంగారం
సి) చర మూలధన వస్తువు 3) విద్యుత్తు
డి) స్థిర మూలధన వస్తువు 4) యంత్రం
ఎ) ఎ-4, బి-3, సి-2, డి-1
బి) ఎ-1, బి-2, సి-3, డి-4
సి) ఎ-2, బి-1, సి-3, డి-4
డి) ఎ-1, బి-2, సి-4, డి-3
17. కిందివాటిలో సరైనది ఏది?
ఎ) స్థూల ఉత్పత్తి=నికర ఉత్పత్తి + తరుగుదల
బి) నికర ఉత్పత్తి = స్థూల ఉత్పత్తి – తరుగుదల
సి) తరుగుదల = స్థూల ఉత్పత్తి – నికర ఉత్పత్తి
డి) పైవన్నీ సరైనవే
18. కింది వాటిలో తప్పుని గుర్తించండి?
ఎ) జీడీపీ – గ్రాస్ డొమస్టిక్ ప్రొడక్ట్
బి) ఎన్డీపీ నేషనల్ డొమస్టిక్ ప్రొడెక్ట్
సి) జీఎన్‌పీ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్
డి) ఎన్‌ఎన్‌పీ – నెట్ నేషనల్ ప్రొడెక్ట్
19. అనార్జిత ఆదాయానికి ఉదాహరణ?
ఎ) స్కాలర్షిప్ బి) పెన్షన్
సి) నిరుద్యోగభృతి డి) పైవన్నీ
20. ఆచార్య వీకేఆర్‌వీ రావు పూర్తి పేరు?
ఎ) విజయేంద్ర కస్తూరి రంగ వరద రాజారావు
బి) విజయేంద్ర కస్తూరి రంగ వరదారావు
సి) విజయ కస్తూరి రంగ వరదారావు
డి) విజయ కస్తూరి రంగ వరద రామారావు
21. కింది వారిని జాతీయాదాయ అంచనా వేసిన సంవత్సరంతో జతపరచండి?
ఎ) దాదాభాయ్ నౌరోజీ 1) 1897-98
బి) అట్కిన్సన్ 2) 1898-99
సి) విలియం డిగ్బీ 3) 1875
డి) లార్డ్ కర్జన్ 4) 1868
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-4, బి-3, సి-2, డి-1
సి) ఎ-4, బి-3, సి-1, డి-2
డి) ఎ-1, బి-2, సి-4, డి-3
22. కింది వాటిలో సరైంది కానిది ఏది?
ఎ) సీఎస్‌వో – 1951
బి) ఎన్ఎస్ఎస్వో – 1970
సి) ఎన్ఎస్వో – 2019
డి) ఎన్డీసీ -1950
23. కింది వాటిలో తప్పుని గుర్తించండి?
ఎ) సంపద నిల్వను సూచిస్తుంది
బి) ఆదాయ ప్రవాహాన్ని సూచిస్తుంది
సి) జనాభా నిల్వను సూచిస్తుంది
డి) జనాభాలో మార్పు కూడా నిల్వను
సూచిస్తుంది
24. కింది వాటిని జతపరచండి?
ఎ) 3వ ప్రణాళిక 1) 2.8 శాతం
బి) 4వ ప్రణాళిక 2) 7.6 శాతం
సి) 10వ ప్రణాళిక 3) 7.5 శాతం
డి) 11వ ప్రణాళిక 4) 3.3 శాతం
ఎ) ఎ-1, బి-4, సి-2, డి-3
బి) ఎ-4, బి-3, సి-2, డి-1
సి) ఎ-1, బి-2, సి-3, డి-4
డి) ఎ-3, బి-2, సి-4, డి-1
25. జీవీఏ అంటే
ఎ) గ్రాస్ వ్యాల్యూ యాడెడ్
బి) గ్రాస్ వ్యాల్యూ యాడ్
సి) జనరల్ వ్యాల్యూ యాడెడ్
డి) గ్రాస్ వ్యాల్యూ యావరేజ్
26. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) పేదరిక భావనను 1960-61లో దండేకర్ + నీలకంఠ రధ్ ప్రతిపాదించారు
బి) BPL below Poverty line
సి) APL Above Poverty line
డి) పైవన్నీ సరైనవే
27. కింది వాటిని జతపరచండి.
ఎ) సూచనాత్మక ప్రణాళిక 1) 1978-80
బి) కేంద్రీకృత ప్రణాళిక 2) ఫ్రాన్స్
సి) నిరంతర ప్రణాళిక 3) రష్యా
డి) ఆదేశాత్మక ప్రణాళిక 4) 1951-92
ఎ) ఎ-2, బి-3, సి-1, డి-4
బి) ఎ-1, బి-2, సి-3, డి-4
సి) ఎ-4, బి-1, సి-3, డి-2
డి) ఎ-3, బి-2, సి-1, డి-4
28. నాలుగు రంగాల నమూనాలో C2 అంటే?
ఎ) భారీ పెట్టుబడి గల మౌలిక పరిశ్రమ రంగం
బి) కర్మాగారాల్లో వినియోగ వస్తువుల ఉత్పత్తి
సి) చిన్న కుటీర పరిశ్రమల్లో వినియోగ వస్తువుల ఉత్పత్తి
డి) సేవారంగం
29. కింది వాటిలో ‘పురా’ (PURA)కు సంబంధించనిది?
ఎ) పురా పథకం 2004లో ప్రారంభించారు
బి) రూపకర్త: ఏపీజే అబ్దుల్ కలాం
సి) పురాస్థానంలో రూర్బన్ మిషన్ పథకం వచ్చింది
డి) రూర్బన్ మిషన్ 2014లో ప్రారంభం
30. కింది వాటిలో ప్రణాళిక అధ్యక్షులను జతపరచండి.
ఎ) 2వ ప్రణాళిక 1) మన్మోహన్ సింగ్
బి) 4వ ప్రణాళిక 2) ఇందిరాగాంధీ
సి) 11వ ప్రణాళిక 3) పి.వి. నరసింహ రావు
డి) 8వ ప్రణాళిక 4) జవహర్‌లాల్‌నెహ్రూ
ఎ) ఎ-4, బి-2, సి-1, డి-3
బి) ఎ-2, బి-1, సి-3, డి-4
సి) ఎ-3, బి-1, సి-2, డి-4
డి) ఎ-4, బి-3, సి-2, డి-1
31. భాక్రానంగల్ ప్రాజెక్ట్‌ను ఏ ప్రణాళిక కాలంలో ప్రారంభించారు?
ఎ) 1 బి) 2 సి) 3 డి) 4
32. మొదటి ఎస్‌ఎఫ్‌సీని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?
ఎ) పంజాబ్ బి) హర్యానా
సి) గుజరాత్
డి) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
33. భిలాయ్ ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహకారంతో ఏర్పాటు చేశారు?
ఎ) ఇంగ్లండ్ బి) రష్యా
సి) జపాన్ డి) జర్మనీ
34. ఏ పారిశ్రామిక తీర్మానాన్ని ఆర్థిక రాజ్యాంగం అంటారు?
ఎ) 1948 పారిశ్రామిక విధాన తీర్మానం
బి) 1956 పారిశ్రామిక విధాన తీర్మానం
సి) 1971 పారిశ్రామిక విధాన తీర్మానం
డి) 1991 పారిశ్రామిక విధాన తీర్మానం
35. కింది వాటిలో 2వ ప్రణాళికకు సంబంధించినది ఏది?
ఎ) 2వ ప్రణాళిక అధ్యక్షులు జవహర్లాల్ నెహ్రూ
బి) 2వ ప్రణాళిక రూపకర్త మహలనోబిస్
సి) 2వ ప్రణాళిక వ్యూహం-నాలుగు రంగాల నమూనా
డి) పైవన్నీ
36. కింది వాటిలో జతపరచండి?
ఎ) వరకట్న నిషేధ చట్టం 1) 1961
బి) మెటర్నిటీ బెనిఫిట్ చట్టం 2) 1961
సి) అప్రెంటిస్ చట్టం 3) 1961
ఎ) ఎ-1, బి-2, సి-3
బి) ఎ-3, బి-2, సి-1
సి) ఎ-3, బి-1, సి-2
డి) పైవన్నీ
37. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్లానింగ్ బోర్డ్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1972 బి) 1973
సి) 1974 డి) 1975
38. 5వ ప్రణాళిక ప్రత్యేకతలు ఏవి?
ఎ) ఒక సంవత్సరం ముందుగా ముగించిన ప్రణాళిక
బి) పేదరిక నిర్మూలన గల ప్రణాళిక
సి) మధ్యంతరంగా రద్దు చేసిన ప్రణాళిక
డి) పైవన్నీ
39. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) హెచ్డీఎఫ్సీ ఏర్పాటు 1) 1978
బి) TRYSEM 2) 1977
సి) ITDA 3) 1979
డి) జనతా ప్రభుత్వం 4) 1975
ఎ) ఎ-2, బి-3, సి-4, డి-1
బి) ఎ-1, బి-1, సి-3, డి-4
సి) ఎ-4, బి-3, సి-2, డి-1
డి) ఎ-2, బి-1, సి-4, డి-3
40. జాతీయ పనికి ఆహార పథకం ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 2002 బి) 2003
సి) 2004 డి) 2005
41. ధనలక్ష్మి పథకం ప్రారంభం?
ఎ) 2005 బి) 2006
సి) 2007 డి) 2008
42. 12వ ప్రణాళిక నమూనా?
ఎ) ఎల్పీజీ నమూనా
బి) రూర్బన్ నమూనా సి) ఎ, బి
డి) నాలుగు రంగాల నమూనా
43. ఏ ప్రణాళిక కాలంలో నాబార్డ్‌ను స్థాపించారు?
ఎ) 4 బి) 5 సి) 6 డి) 7
44. ఏ సూత్రం ప్రాతిపదికపై నీతి ఆయోగ్ పనిచేస్తుంది?
ఎ) రాష్ర్టాల ఆధిక్యత
బి) కేంద్ర రాష్ర్టాల మధ్య పరస్పర సహకారం
సి) అభివృద్ధి సమాఖ్య
డి) కేంద్ర ఆధిక్యత
45. ఏ ప్రణాళికను రెండు సార్లు ప్రకటించడం జరిగింది?
ఎ) 4 బి) 5 సి) 6 డి) 7
46. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ రూపకర్త?
ఎ) సుభాష్ బి) స్వామినాథన్
సి) జయతీఘోష్ డి) కురియన్
47. ప్రభుత్వ జోక్యం లేకుండా కింది వాటిలో దేన్ని సాధించవచ్చు?
ఎ) సుస్థిరాభివృద్ధి బి) సమ్మిళిత వృద్ధి
సి) ఆర్థిక వృద్ధి డి) ఆర్థికాభివృద్ధి
48. కొనసాగించే అభివృద్ధి అంటే?
ఎ) పునరావృతం కాని వనరుల సంరక్షణ
బి) పర్యావరణ వనరులు
సి) ఎ, బి డి) పైవేవీకాదు
సమాధానాలు
1-డి 2-డి 3-సి 4-డి
5-డి 6-డి 7-సి 8-డి
9-ఎ 10-బి 11-డి 12-ఎ
13-డి 14-ఎ 15-బి 16-సి
17-డి 18-బి 19-డి 20-ఎ
21-బి 22-డి 23-డి 24-ఎ
25-ఎ 26-డి 27-ఎ 28-సి
29-డి 30-ఎ 31-ఎ 32-ఎ
33-బి 34-బి 35-డి 36-డి
37-సి 38-డి 39-ఎ 40-సి
41-డి 42-సి 43-ఎ 44-బి
45-ఎ 46-ఎ 47-సి 48-సి
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు