kakatiya Dynasty – Groups Special | గొలుసుకట్టు చెరువుల నిర్మాణం.. వ్యవసాయానికి ప్రాధాన్యం
కాకతీయ సామ్రాజ్యం
- కాకతీయ వంశ మూలపురుషుడు – దుర్జయ
- కాకతీయ ఆస్థాన భాష – తెలుగు
- తెలుగుకు ఇచ్చిన ప్రాధాన్యం వల్ల వీరిని “ఆంధ్రరాజులు”గా కీర్తించారు.
- తెలుగు మాట్లాడే కోస్తా, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలను ఒకే ఛత్రం కిందికి తెచ్చారు.
- కాకతీయులు మొదటగా కర్ణాటకను పాలించిన రాష్ట్ర కూటులు, చాళుక్యుల వద్ద సైనికులుగా, సామంతులుగా ఉంటూ తమ రాజ్య స్థాపనను ప్రారంభించారు.
- వీరు మొదట గ్రామోద్యోగులైన గ్రామపెద్ద (రట్టడి)గా నియమితులయ్యారు.
- తమ సైనిక నైపుణ్యం, శక్తియుక్తులతో సైన్యాధిపతులుగా సామంతులుగా ఎదిగారు.
- తెలంగాణ ప్రాంతంలోని అనుమకొండను పొందారు.
- పశ్చిమ చాళుక్యుల పతనానంతరం కాకతీయుల స్వతంత్ర పాలకులుగా ఆవిర్భవించారు.
రుద్రదేవుడు (క్రీ.శ.1158 – 1195)
- రుద్రదేవుని పాలనా కాలంలో రాజధాని అనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చారు.
- కొత్త రాజధాని నగరాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్మించి, విశాలమైన కోటను నిర్మించాడు, చెరువు తవ్వించాడు.
ఓరుగల్లు కోట
- బయటికోట గోడకు నాలుగు ద్వారాలు ఉన్నాయి.
- ఇది వ్యవసాయ భూములకు, చెరువులకు రక్షణగా ఉంది.
- కోటలోనే చేతి వృత్తి పనివారైన బుట్టలు అల్లే వారి గుడిసెలు ఉండేవి.
- వీటిని దాటాక కందకం, ఆ పక్కనే మట్టితో నిర్మించిన కోట గోడ ఉంటుంది.
- కోట మధ్యకు చేరడానికి ఇంకా ముందుకు వెళ్తే మరో కందకాన్ని ఆనుకుని రాతి కోట నిర్మాణం కనిపిస్తుంది.
- ఈ కోట మధ్యలో రాజధాని, నగర భవనాలు, రాజాంతఃపుర నివాసాలు ఉంటాయి.
- దీనికి నాలుగువైపులా ద్వారాలు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలుగా ఉన్నాయి.
- ప్రతి ద్వారం గుండా కోట మధ్యకు చేరడానికి రోడ్డు కలిపి ఉంది.
- ఇక్కడే వారు నిర్మించిన స్వయంభూ శివాలయం కూడా ఉంది.
- ఈ దేవాలయానికి కూడా నాలుగువైపులా ద్వారాలు నిర్మించారు.
- ఓరుగల్లు నగరాన్ని వివిధ వాడలుగా విభజించారు.
- ఒక్కో వాడలో ఒక్కో రకమైన వృత్తి పనివారు నివసించేవారు.
- కాకతీయుల వంశదైవం – శివుడు
- కాకతీయ రాజులు నిర్మించిన “స్వయంభూ శివాలయ కీర్తి తోరణ ప్రవేశ ద్వారం”గల ప్రదేశం – వరంగల్లు
- కాకతీయులు తమ సామంత పాలకుల మీద విదేశీయుల దాడులను నియంత్రించడంతో పాటుగా తాము చేసే దండయాత్రల్లో సామంతులను కూడా భాగస్వాములను చేశారు.
- పరిస్థితులను బట్టి సామంతులు స్వతంత్రకాంక్షతో తిరుగుబాటు చేయగా, కాకతీయులు ఆ తిరుగుబాటును అణచడానికి సైన్యాన్ని పంపేవారు.
రుద్రమదేవి
- 1262 నుంచి 1289 వరకు సుమారు 27సంవత్సరాల పాటు ఓరుగల్లు రాజధానిగా చేసుకుని పాలన చేసింది.
- రాణి రుద్రమదేవికి కొద్దికాలం ముందే సుదూరంలో ఉన్న ఢిల్లీని పరిపాలించిన మహిళ – రజియా సుల్తానా
- ప్రభుత్వ వర్గాలకు చెందిన వారు స్త్రీ పరిపాలన ఇష్టం లేక ఆమెను పాలకురాలిగా అంగీకరించక తుదముట్టించారు.
- నాటి శాసనాలలో రుద్రమదేవిని “రుద్రదేవ మహారాజు”గా కీర్తించారు.
- రజియా సుల్తానా వలె రుద్రమదేవి కూడా తన తండ్రి పాలన కాలంలోని ముఖ్యమైన నాయకుల వ్యతిరేకతను విజయవంతంగా అణచివేసింది.
- రుద్రమదేవి మనుమడైన ప్రతాపరుద్రుడి పాలనలో చెలరేగిన అనేక సామంత తిరుగుబాటును నియంత్రించడానికి పలు చర్యలు తీసుకున్నాడు.
- రుద్రమదేవి సామంతుల్లో ఒకరైన “కాయస్థ అంబదేవుడు” తిరుగుబాటు చేయగా నల్లగొండ జల్లాలోని “చందుపట్ల”లో జరిగిన యుద్ధంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
- రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు నైపుణ్యం గల అనేక యోధులను శక్తిమంతులైన సామంత కుటుంబాల నుంచే కాకుండా రాజభక్తి గల నాయకులను ప్రోత్సహించడానికి ఉన్నత స్థానం కల్పిస్తూ “నాయక” బిరుదుతో నియామకం చేసేవారు.
- వీరి సేవలకు ప్రతిఫలంగా అనేక గ్రామాల్లో శిస్తు వసూలు చేసే హక్కు కల్పించారు.
- ఈ గ్రామాలను వారు “నాయంకరలు”గా వ్యవహరించేవారు.
- వీటిపైన వచ్చే ఆదాయంతో నాయకుడు రాజు నిర్దేశించిన సైన్యాన్ని రాజు సేవ కోసం పోషించేవాడు.
- ఈ గ్రామాలపై నాయకులకు శిస్తు వసూలు చేసుకునే హక్కు శాశ్వతంగా ఉంచకుండా, తరచుగా కొత్త ప్రదేశాలకు మార్చేశారు.
- నాయకులు, రాజుకు లేదా రాణికి విశ్వాసమున్నంత వరకు పదవిలో కొనసాగేవారు.
- రాజుకు వ్యతిరేకంగా జరిగే నాయకుల తిరుగుబాట్లను అణచడంలోను వీరు పాల్గొనేవారు.
- ఈ నియమాల ఆధారంగా రూపొందించిన విధానాన్ని ‘నాయంకర విధానం” అంటారు.
బొల్లినాయకుడు-శాసనం
- 1270లో సంక్రాంతి పర్వదిన సందర్భంగా కాకతీయ రుద్రదేవ మహారాజు ప్రవేశద్వార సంరక్షకుడైన బొల్లి నాయకుడు, క్రంజ గ్రామంలో తన స్వీయ నాయంకర పరిధిలోని భూమిని రుద్రదేవ మహారాజు గౌరవార్థం 10 కొలతలు గల భూమిని కేశవ దేవాలయ సేవకులకు ఇచ్చాడు.
- రుద్రమదేవిని “రుద్రదేవ మహారాజు”గా పిలిచిన వారు -బొల్లినాయకుడు
వ్యవసాయాభివృద్ధి – దేవాలయ నిర్మాణం
- కాకతీయులు చెరువులు, బావులు నిర్మించడం ద్వారా ఎక్కువ భూమిని సాగులోకి తెచ్చారు.
- మెట్ట పల్లాలతో కూడిన తెలంగాణ, రాయలసీమలో ఉన్న వ్యవసాయ భూములను సాగులోకి తేవడానికి కృషి చేశారు.
- కాకతీయులు విరివిగా దానాలు ఇవ్వడం ద్వారా దేవాలయాలు విస్తృత స్థాయిలో నిర్మించారు.
- ముప్పమాంబ, మైలమ వంటి రాజకుటుంబ స్త్రీలు దేవాలయాల నిర్మాణానికి అధికంగా భూములను దానం చేశారు.
- ఇతర సంపన్న వర్గాల స్త్రీలు దేవాలయాల అభివృద్ధికి, భూదానాలతో పాటు చెరువులు, గోవులు, నగదు, బంగారు ఆభరణాలను దానమిచ్చారు.
- వీరి కాలంలో సమాజంలో మహిళలకు ఆస్తులు, ఆర్థిక స్వాతంత్య్రం ఉంది.
- వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం వల్ల వ్యవసాయ ఉత్పత్తులతో పాటు పన్నుల రూపేణా పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరింది.
- కాకతీయుల కాలం నాటి బాంగారు నాణెం – శ్రీ అహిత గజ కేసరి” వ్యాపారం
- నాటి పాలకులు రాజులు, సామంతనాయకులు ఆదాయ వనరులను వర్తకం మీద విధించే పన్నుల ద్వారా సమకూర్చుకునే వారు.
- రాజ్య ఆదాయంలో అధికభాగం విదేశీ వాణిజ్యం చేసే వర్తకులు ఓడరేవుల దగ్గర చెల్లించే సుంకాలు.
మోటుపల్లి అభయ శాసనం
- దీన్ని వేయించిన కాకతీయ రాజు – “గణపతిదేవుడు”
- దీని ప్రకారం “విదేశీ వాణిజ్యం, ఖండాంతర వాణిజ్యం చేసే వర్తకులకు రక్షణ కల్పించేవారు.
- గతంలో రాజులు తుఫానుల్లో ఓడలు కొట్టుకపోయినప్పటికీ బలవంతంగా సుంకాలు వసూలు చేసేవారు.
- వ్యాపారుల బంగారం, ఏనుగులు, గుర్రాలు, ఆభరణాలను స్వాధీనం చేసుకునేవారు.
- “ఇలాంటి పరిస్థితుల నుంచి వర్తకులను రక్షణ కల్పిస్తూ, విదేశీ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూ, మేము మా పేరు ప్రతిష్ఠల కోసం పుణ్యం కోసం కరుణతో కేవలం నామమాత్రపు సుంకాలను విధిస్తున్నాం”అని మోటుపల్లి శాసనంలో ఉంది.
కాకతీయుల పాలన ముగింపు
- టర్కిస్తాన్ నుంచి సుల్తానులుగా పిలిచే వారు 1190 ప్రాంతంలో ఢిల్లీ కేంద్రంగా కొత్త రాజ్యం స్థాపించారు.
- వీరు శక్తిమంతమైన సైన్యాన్ని ఏర్పరచుకుని ఉత్తర భారతదేశంలోని రాజ్యాలపై ఆధిపత్యం సాధించి, దక్కన్ వైపు దృష్టిని మరల్చారు.
- సుల్తాన్ మహ్మద్ బీన్ తుగ్లక్ కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేసి ప్రతాపరుద్రుని ఓడించడంతో 1323లో కాకతీయ వంశ పాలన ముగిసింది.
మాదిరి ప్రశ్నలు
1. తెలుగుభాషకు ఇచ్చిన ప్రాధాన్యం వల్ల ఎవరిని“ఆంధ్ర రాజు”లుగా కీర్తించారు?
1. శాతవాహనులు
2. విజయనగర రాజులు
3. కాకతీయులు 4. చోళులు
2. ఎవరి పాలనా కాలంలో రాజధాని అనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చబడింది?
1. రుద్రదేవుడు 2. గణపతిదేవుడు
3. ప్రతాపరుద్రుడు 4. ఎవరూ కాదు
3. వరంగల్లు కోట మధ్య ఉన్న దేవాలయం?
1. రామాలయం
2. హనుమాన్ ఆలయం
3. స్వయంభూ శివాలయం
4. వేంకటేశ్వరాలయం
4. ఆంధ్రదేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి మహిళ?
1. నాగాంబ 2. రుద్రమదేవి
3. రజియాసుల్తానా 4. లక్ష్మీబాయి
5. పశువుల కాపరుల రక్షణ కోసం, హక్కుల కోసం నెల్లూరు రాజులతో పోరాటం చేసిన రాజు?
1. కాటమరాజు 2. ధర్మరాజు
3. బ్రహ్మనాయుడు 4. బాలచంద్రుడు
6. గిరిజన తెగల హక్కుల రక్షణ కోసం నాటి రాజుల సైన్యాలతో యుద్ధాలు చేసినవారు?
1. సమ్మక్క 2. సారక్క
3.1, 2 4. రుద్రమదేవి
7. కవిత్రయంగా పిలిచే నన్నయ, తిక్కన, ఎర్రా ప్రగడ ఏ కాలానికి చెందిన వారు?
1. క్రీ.శ. 500-800
2. క్రీ.శ. 1000-1200
3. క్రీ.శ. 1600-1800
4 క్రీ.శ. 1200-1300
8. కాకతీయుల రాజధాని?
1. ఓరుగల్లు 2. హైదరాబాద్
3. ఖమ్మం 4. మోటుపల్లి
9. కాకతీయుల ఆస్థాన భాష?
1. సంస్కృతం 2. తెలుగు
3. తమిళం 4. కన్నడం
10. ప్రముఖ ఇటాలియన్ యాత్రికుడైన మార్కోపోలో కాకతీయ సామ్రాజ్యాన్ని ఎవరి పాలనాకాలంలో సందర్శించాడు?
1. రుద్రదేవుడు 2. గణపతిదేవుడు
3. రుద్రమదేవి 4. ప్రతాపరుద్రుడు
11. కాకతీయ వంశపాలన అంతమైన సంవత్సరం?
1. క్రీ.శ. 1323 2. క్రీ.శ. 1346
3. క్రీ.శ. 1526 4. క్రీ.శ. 1356
12. పల్నాటి వీరుల చరిత్రను క్రీ.శ. 1350లో ఏ కవి రచించాడు?
1. శ్రీనాథుడు 2. కాళిదాసు
3. నన్నయ 4. వేమన
13. శ్రీమదాంధ్ర మహాభారతాన్ని రాసిన వారు?
1. నన్నయ 2. తిక్కన
3. ఎర్రాప్రగడ 4. పైవారందరు
14. కాకతీయుల కాలంలో గ్రామోద్యోగులైన గ్రామపెద్ద?
1. రట్టడి 2. గ్రామణి
3. భద్రపాల 4. ఏదీకాదు
15. రుద్రమదేవి పరిపాలనా కాలం?
1. క్రీ.శ. 1116-1157
2. క్రీ.శ. 1199-1262
3. క్రీ.శ. 1262-1289
4 క్రీ.శ. 1232-1268
16. ఢిల్లీ సుల్తాన్ రాజ్యాన్ని పరిపాలించిన మొట్టమొదటి మహిళ?
1. రజియాబాయి 2. లక్ష్మీబాయి
3. రుద్రమదేవి 4. నాగాంబిక
17. రాణి రుద్రమదేవి ఎన్ని సంవత్సరాలు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించింది?
1. 25 2. 27 3. 29 4. 37
18. మోటుపల్లి శాసనాన్ని వేయించిన కాకతీయ రాజు?
1. రుద్రమదేవుడు 2. గణపతిదేవుడు
3. ప్రతాపరుద్రుడు 4. రుద్రమదేవి
19. ప్రతాపరుద్రుని “యశోభూషణం” అనే గ్రంథాన్ని ఎవరు రాశారు?
1. విద్యానాథుడు 2.ఎర్రాప్రగడ
3. నన్నయ 4. తిక్కన
20. శాసనాలు, సాహిత్యాధారాల ప్రకారం కాకతీయ వంశం మూలపురుషుడు ఎవరు?
1. విజయ 2. దుర్జయ
3. రుద్రదేవుడు 4. కాకతీయుడు
సమాధానాలు
6-3 7-1 8-3 9-2
1-1 2-3 3-2 4-1
5-2 15-3 16-1 17-1
18-4 10-1 11-3 12-1
13-2 14-1 19-1 20-2
అంజి
ఏకేఆర్ స్టడీ సర్కిల్
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు