Biology – JL/DL Special | మొక్క వయస్సును దేని ఆధారంగా నిర్ణయిస్తారు?
1. కీటకాలను నాశనం చేసే బ్యాక్టీరియా ఏది?
1) ఎశ్చరీషియా కోలి 2) లాక్టోబాసిల్లస్
3) ఆగ్రోబ్యాక్టీరియా
4) బాసిల్లస్ థురంజియెన్సిస్
2. లెగ్యుమినేసి కుటుంబపు పంటను సాగుచేసినప్పుడు హెక్టారుకు ఎంత నత్రజని నేలలోకి పునరుద్ధరింపబడుతుంది?
1) 10-15 గ్రాములు
2) 15-20 గ్రాములు
3) 50-150 గ్రాములు
4) 350-550 గ్రాములు
3. మొక్కల వేళ్లు నేలలోకి చొచ్చుకొనిపోయి పోషక పదార్థాలను వేగంగా శోషించుకోవడానికి తోడ్పడే పోషక మూలకం ఏది?
1) నత్రజని 2) భాస్వరం
3) పొటాషియం 4) 1, 3
4. మొక్కల్లో కొత్త పత్రాలు ఏర్పడటం కోసం, పుష్పాలు వేగంగా రావడానికి తోడ్పడే పోషక మూలకం ఏది?
1) నత్రజని 2) భాస్వరం
3) పొటాషియం 4) 2, 3
5. మొక్కలకు క్రిమి కీటకాల నుంచి రోగనిరోధకశక్తిని పెంపొందించే పోషక మూలకం ఏది?
1) పొటాషియం 2) జింక్
3) మాంగనీస్ 4) బోరాన్
6. మొక్కలకు అవసరమయ్యే సూక్ష్మ పోషకం ఏది?
1) ఇనుము, మాంగనీస్
2) బోరాన్, జింక్
3) కాపర్, మాలిబ్డినం, క్లోరిన్
4) పైవన్నీ
7. మొక్కలకు అవసరమయ్యే స్థూల పోషకం ఏది?
1) నత్రజని 2) భాస్వరం
3) పొటాషియం 4) పైవన్నీ
8. ద్విదళబీజ కలుపు మొక్కల నాశని ఏది?
1) 2, 4 డై క్లోరో ఫినాక్సి ఎసిటిక్
ఆమ్లం (2, 4 D) 2) NAA
3) IAA 4) IBA
9. వయ్యారి భామ (పార్థీనియం) అనే కలుపుమొక్క మనదేశానికి ఏ పంట ద్వారా దిగుమతి అయ్యింది?
1) వరి 2) మొక్కజొన్న
3) రాగి 4) గోధుమ
10. 180 గ్రాముల కార్బోహైడ్రేట్ తయారీకి కావలసిన నీరు, కార్బన్ డై ఆక్సైడ్ మోతాదు వరుసగా?
1) 100 గ్రాములు, 260 గ్రాములు
2) 260 గ్రాములు, 100 గ్రాములు
3) 110 గ్రాములు, 100 గ్రాములు
4) 100 గ్రాములు, 100 గ్రాములు
11. మొక్కలు శోషించిన నీటిలో కార్బోహైడ్రేట్ల తయారీకి ఎంత శాతం వినియోగించుకుంటాయి?
1) 0.1 శాతం 2) 0.5 శాతం
3) 1 శాతం 4) 10 శాతం
12. మొక్కలు, జంతువుల వ్యర్థ పదార్థాలను కుళ్లింపజేసి సహజ ఎరువులుగా తయారుచేసే బ్యాక్టీరియా ఏది?
1) నైట్రోబాక్టర్ 2) అజటోబాక్టర్
3) 1, 2 4) ఏదీ కాదు
13. వ్యవసాయ పనులు ప్రారంభించే ముందు జరుపుకొనే పండుగ ఏది?
1) తీజ్ 2) ఏరువాక
3) సీత్లా 4) ఆరుద్ర
14. సంప్రదాయ వరి రకం ఏది?
1) అమృతసారి
2) బంగారుతీగ, కొట్లేటి కుసుమ
3) పొట్టి బాసంగి 4) పైవన్నీ
15. విశ్వ ధాన్యపు పంట అని దేన్ని పిలుస్తారు?
1) వరి 2) గోధుమ
3) మొక్కజొన్న 4) పైవన్నీ
16. ఏ మొక్కలు పుష్పించడానికి రాత్రి సమయ ప్రభావం ఉండదు?
1) గోధుమ 2) పత్తి
3) జొన్న 4) సోయాచిక్కుడు
17. సంవత్సరం పొడవునా పుష్పించగల మొక్క ఏది?
1) సోయాచిక్కుడు 2) పత్తి
3) గోధుమ 4) జొన్న
18. ఏ మొక్కలు రాత్రి 12:30 గంటల సమయంలో ఎక్కువగా పుష్పిస్తాయి?
1) సోయాచిక్కుడు 2) పత్తి
3) గోధుమ 4) జొన్న
19. కింది వాటిలో రబీలో పండించే పంట ఏది?
1) మొక్కజొన్న 2) జొన్న
3) సజ్జ 4) గోధుమ
20. కింది వాటిలో ఖరీఫ్‌లో పండించే పంటలేవి?
1) వరి, జొన్న, మొక్కజొన్న
2) సజ్జ, రాగి
3) పత్తి 4) పైవన్నీ
21. కిందివాటిలో స్వల్పకాలిక పంట ఏది?
1) మినుములు 2) పెసలు
3) మినుములు, పెసలు
4) కందులు
22. కింది వాటిలో దీర్ఘకాలిక పంట ఏది?
1) కందులు 2) జొన్న
3) జొన్న, కందులు 4) పెసలు
23. మలేరియా నివారణకు ఉపయోగపడే ఆల్కలాయిడ్ ఏది?
1) మార్ఫిన్ 2) క్వినైన్
3) కొకైన్ 4) కెఫిన్
24. నింబిన్ అనే ఆల్కలాయిడ్ ఏ మొక్క నుంచి లభిస్తుంది?
1) అజాడిరెక్టా ఇండికా
2) దతూరా 3) థియోసైనెన్సిస్
4) అట్రోపా బెల్లడోనా
25. పెపావర్ సోమ్నిఫెరం మొక్క ఏ భాగం నుంచి మార్ఫిన్ అనే ఆల్కలాయిడ్ లభిస్తుంది?
1) లేత ఫలాలు 2) పుష్పవిన్యాసం
3) లేత ఫలాలు, పుష్పవిన్యాసం
4) ఆకులు
26. కొకైన్‌ను మొక్కలోని ఏ భాగం నుంచి వేరుచేస్తారు?
1) వేరు 2) కాండం
3) పుష్పాలు 4) ఆకులు
27. పాము కాటు నుంచి రక్షణ కల్పించే ఆల్కలాయిడ్ ఏది?
1) మార్ఫిన్ 2) రిసర్ఫిన్
3) నింబిన్ 4) రావుల్ఫియా సర్పెంటైనా
28. స్కొపోలమైన్ అనే ఆల్కలాయిడ్ దతూరా (ఉమ్మెత్త) మొక్క ఏ భాగం నుంచి లభిస్తుంది?
1) పండు 2) పువ్వు
3) పండు, పువ్వు 4) పత్రాలు, వేర్లు
29. రబ్బరు మొక్క శాస్త్రీయనామం ఏది?
1) హీవియా బ్రెజిలియెన్సిస్
2) ట్రైడాక్స్ 3) స్ట్రైక్నోస్ నక్స్‌వామిక
4) డిజిటాలిస్
30. రెసిన్లు ఏ మొక్క నుంచి లభిస్తాయి?
1) వేప 2) తుమ్మ
3) పైనస్ 4) తంగేడు
31. టానిన్లు లభించే మొక్క ఏది?
1) తంగేడు 2) తుమ్మ
3) తమలపాకు 4) పైవన్నీ
32. మొక్కల శ్వాసక్రియలో ఏర్పడే అంత్య పదార్థాలేవి?
1) కార్బన్ డై ఆక్సైడ్ 2) నీరు
3) కార్బన్ డై ఆక్సైడ్, నీరు
4) కార్బన్ డై ఆక్సైడ్
33. జనపనార (జూట్)ను ఇచ్చే మొక్క పేరేమిటి?
1) కోకస్ న్యూసిఫెరా
2) గాసియం హెర్బేషియం
3) కెన్నాబినస్ సటైవం
4) కార్కోరస్ కాప్యులారిస్
34. హాకీ హ్యాండిల్, క్రికెట్ బ్యాట్ల తయారీకి ఏ మొక్క కలపను వాడుతారు?
1) మోరస్ ఆల్బా 2) సాలిక్స్
3) సాంటలమ్ ఆల్బా
4) టెక్టోనా గ్రాండిస్
35. హాకీ బ్లేడ్ల తయారీకి వాడే కలప ఏది?
1) మోరస్ ఆల్బా
2) సాంటలమ్ ఆల్బా
3) టెక్టోనా గ్రాండిస్
4) టీరోకార్పస్ సాంటైనం
36. అగ్గిపుల్లల తయారీకి ఏ మొక్క కలపను వాడుతారు?
1) ల్యూసీనియా ల్యూకోసెఫలం
2) డాల్బెర్జియా లాటిఫోలియా
3) టెక్టోనా గ్రాండిస్
4) సాంటలమ్ ఆల్బా
37. ప్రాక్దేశపు రాజ్య వృక్షం అని దేన్ని అంటారు?
1) టేకు 2) రక్త చందనం
3) ఇండియన్ రోజ్‌వుడ్
4) ఇండియన్ శాండల్‌వుడ్
38. రైల్వే వ్యాగన్ల తయారీకి ఉపయోగించే కలప ఏది?
1) టేకు
2) ఇండియన్ రోజ్‌వుడ్
3) ఇండియన్ శాండల్‌వుడ్
4) పునికి చెట్టు
39. సంగీత వాయిద్యాల తయారీకి సాధారణంగా ఏ కలపను వాడుతారు?
1) రక్త చందనం 2) సుబాబుల్
3) విల్లో 4) ఇండియన్ శాండల్‌వుడ్
40. మొక్క వార్షిక వలయాల అధ్యయనం?
1) డెండ్రాలజీ 2) డెర్మటాలజీ
3) సినకాలజీ 4) డెండ్రోక్రోనాలజీ
41. కలపనిచ్చే మొక్కల పెంపకాన్ని ఏమంటారు?
1) డెండ్రో కల్చర్ 2) సిల్వి కల్చర్
3) సినీ కల్చర్ 4) మోరీ కల్చర్
42. మొక్క వయస్సును దేని ఆధారంగా నిర్ణయిస్తారు?
1) కాండం పరిమాణం
2) మొక్క ఎత్తు 3) శాఖల సంఖ్య
4) వార్షిక వలయాల సంఖ్య
43. జీవిత చరిత్ర దశల్లో ఒకేసారి పుష్పించే మొక్క ఏది?
1) నీలగిరి 2) వెదురు
3) వేప 4) ద్రాక్ష, మామిడి
44. పొడవైన ఆవృతబీజ మొక్క ఏది?
1) వెదురు 2) జమాయిల్
3) నీలగిరి (యూకలిప్టస్)
4) రావి
45. పురాతన సాగు ఫలం ఏది?
1) అరటి 2) జామ
3) మామిడి 4) ఆపిల్
46. పురాతన పండు అని దేన్ని పిలుస్తారు?
1) జామ 2) మామిడి
3) ఆపిల్ 4) ద్రాక్ష
47. ఫలాల రాజు అని దేన్ని అంటారు?
1) జామ 2) అరటి
3) దానిమ్మ 4) మామిడి
48. పేదవాడి ఆపిల్ అని ఏ ఫలాన్ని పిలుస్తారు?
1) జామ 2) మామిడి
3) దానిమ్మ 4) కివి ఫ్రూట్
49. జామ చెట్టు శాస్త్రీయనామం ఏది?
1) మ్యూసా పారడైసికా
2) మాంజిఫెరా ఇండికా
3) సిడియం గోవా
4) మాలస్ డొమెస్టికా
50. ఆపిల్ మొక్క శాస్త్రీయనామం ఏది?
1) విటిస్
2) మాలస్ డొమెస్టికా
3) సిడియం గోవా
4) మ్యూసా పారడైసికా
51. సుగంధద్రవ్యాల రాజు అని దేన్ని అంటారు?
1) మిరియాలు 2) యాలకులు
3) లవంగాలు 4) దాల్చిన చెక్క
52. సుగంధద్రవ్యాల రాణి అని దేన్ని అంటారు?
1) దాల్చిన చెక్క 2) రాతిపువ్వు
3) యాలకులు 4) లవంగాలు
53. యూజినాల్ ఆయిల్ ఏ మొక్క నుంచి లభిస్తుంది?
1) లవంగాలు 2) కుంకుమపువ్వు
3) కుసుమలు 4) నువ్వులు
54. దాల్చిన చెక్క శాస్త్రీయనామం ఏది?
1) కోకస్ సటైవస్
2) పర్మోట్రెమా
3) క్యాప్సికం ఫ్రూటిసెన్స్
4) సిమినం జెలానికా
55. భారతదేశంలో మసాలా దినుసుల మొక్కల సాగు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉంది?
1) తెలంగాణ 2) ఆంధ్రప్రదేశ్
3) కేరళ 4) అస్సాం
56. కోప్రా ఆయిల్ దేని నుంచి లభిస్తుంది?
1) కొబ్బరి అంకురచ్ఛదం
2) ఆముదం అంకురచ్ఛదం
3) పల్లీ గింజలు
4) సూర్యకాంతం గింజలు
57. టోరియా ఆయిల్ వేటి నుంచి లభిస్తుంది?
1) ఆవాలు 2) మినుములు
3) నువ్వులు 4) లవంగాలు
58. పురాతన ధాన్యపు మొక్క అని దేన్ని అంటారు?
1) వరి 2) జొన్న
3) మొక్కజొన్న 4) సజ్జ
59. అతిపొడవైన గడ్డిజాతి మొక్క ఏది?
1) వరి 2) గోధుమ
3) జొన్న 4) మొక్కజొన్న
60. బ్రాన్ ఆయిల్ దేని నుంచి లభిస్తుంది?
1) వరి 2) గోధుమ
3) మొక్కజొన్న 4) కందులు
61. దేన్ని ప్రతిబల హార్మోన్ అంటారు?
1) అబ్సిసిక్ ఆమ్లం 2) ఇథిలిన్
3) సైటోకైనిన్లు 4) జిబ్బరెల్లిన్లు
62. మొక్క పత్రాలు, పుష్పాలు, ఫలాలు, ప్రథమ దశలో ఉన్నప్పుడే రాలిపోయేటట్లు చేసే ఫైటో హార్మోన్ ఏది?
1) ఆక్సిన్ 2) జిబ్బరెల్లిన్
3) సైటోకైనిన్ 4) అబ్సిసిక్ ఆమ్లం
63. వాతావరణం పొడిగా ఉన్నప్పుడు పత్రరంధ్రాలు మూసుకునేలా చేసే ఫైటో హార్మోన్ ఏది?
1) ఆక్సిన్ 2) జిబ్బరెల్లిన్
3) అబ్సిసిక్ ఆమ్లం 4) సైటోకైనిన్
64. ఫలాల పరిపక్వతకు తోడ్పడే ఫైటోహార్మోన్ ఏది?
1) ఆక్సిన్ 2) ఇథిలిన్
3) అబ్సిసిక్ ఆమ్లం 4) సైటోకైనిన్
65. పత్రాల్లో హరితరేణువులు ఏర్పడటానికి తోడ్పడే ఫైటోహార్మోన్ ఏది?
1) సైటోకైనిన్ 2) ఇథిలిన్
3) జిబ్బరెల్లిన్ 4) అబ్సిసిక్ ఆమ్లం
66. ఆక్సిన్లు మొక్కలోని ఏ భాగంలో ఉత్పత్తి అవుతాయి?
1) కాండం 2) వేరు
3) కాండం, వేరు 4) పత్రం
67. కింది వాటిలో వృద్ధి ప్రేరేపకాలు ఏవి?
1) ఆక్సిన్లు 2) జిబ్బరెల్లిన్లు
3) సైటోకైనిన్లు 4) పైవన్నీ
68. వృద్ధి ప్రేరేపకం, వృద్ధి నిరోధకంగా పనిచేసే ఫైటోహార్మోన్ ఏది?
1) అబ్సిసిక్ ఆమ్లం 2) సైటోకైనిన్
3) జిబ్బరెల్లిన్ 4) ఇథిలిన్
69. సున్నా డిగ్రీ ఉష్ణోగ్రత వద్ద ఎంజైమ్‌ల క్రియాశీలత ఎలా ఉంటుంది?
1) సమర్థవంతంగా ఉంటుంది
2) క్రియారహితంగా అవుతాయి
3) ఎక్కువ సమర్థవంతంగా ఉంటాయి
4) సాధారణ క్రియాశీలతలో ఎలాంటి మార్పులు ఉండవు
70. ఒక ATPలో ఎంత శక్తి నిల్వ ఉంటుంది?
1) 5600 క్యాలరీలు 2) 7800 క్యాలరీలు
3) 7200 క్యాలరీలు 4) 4200 క్యాలరీలు
సమాధానాలు
1. 4 2. 3 3. 2 4. 1
5. 1 6. 4 7. 4 8. 1
9. 4 10. 1 11. 1 12. 3
13. 2 14. 4 15. 1 16. 4
17. 1 18. 3 19. 4 20. 4
21. 3 22. 3 23. 2 24. 1
25. 3 26. 4 27. 2 28. 3
29. 1 30. 3 31. 4 32. 3
33. 4 34. 2 35. 1 36. 1
37. 1 38. 2 39. 1 40. 4
41. 2 42. 4 43. 2 44. 3
45. 1 46. 2 47. 4 48. 1
49. 3 50. 2 51. 1 52. 3
53. 1 54. 4 55. 3 56. 1
57. 1 58. 4 59. 4 60. 1
61. 1 62. 4 63. 3 64. 2
65. 1 66. 3 67. 4 68. 4
69. 2 70. 3
డాక్టర్ మోదాల మల్లేష్
విషయ నిపుణులు
పాలెం, నకిరేకల్, నల్లగొండ
9989535675
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు