Indian History | చోళుల కాలం.. వ్యవసాయానికి ప్రాధాన్యం
మధ్యయుగ సంస్కృతి
నూతన రాజ్యాలు
- 7వ శతాబ్దం తర్వాత భారతదేశంలో కొత్త రాజవంశాలు అవతరించాయి.
- 7-12 శతాబ్దాల మధ్య కాలంలో భారత ఉపఖండం వివిధ ప్రాంతాల్లో పాలించిన ముఖ్య రాజవంశాలు.
గాంగులు (ఒడిశా)
రాష్ట్రకూటులు (మహారాష్ట్ర)
చోళరాజ్యం (తమిళనాడు)
చేరరాజ్యం (తమిళనాడు)
పాండ్యరాజ్యం (కేరళ)
తూర్పు చాళుక్యులు (కోస్తాంధ్ర)
గూర్జర ప్రతిహారులు (మధ్యప్రదేశ్)
చహమనులు (ఢిలీ అజ్మీర్)
చందేరులు
కొత్త రాజవంశాల పుట్టుక
- భారత ఉపఖండంలో 7వ శతాబ్దం నాటికి వివిధ ప్రాంతాల్లో అనేక మంది భూస్వాములు, ముఖ్యులైన యుద్ధ యోధులు ఉన్నారు.
రాజులు వీరిని సామంతులుగా గుర్తించి ఆశించినవి - సామంతులు తమకు కానుకలు తేవాలి
- వారి ఆస్థానాల్లో ఉండాలి
- సైనిక సహాయం అందించాలి
- సామంతులకు అధికారం, సంపద లభించిన క్రమంలో తమకు తాము “మహా సామంతులుగా, మహా మండలేశ్వరులుగా”(ఒక ప్రాంతానికి లేదా పరిధికి గొప్ప దేవుడు) ప్రకటించుకొన్నారు.
- కొన్నిసార్లు వారు తమకు తాముగా ప్రభువుల నుంచి స్వాతంత్య్రాన్ని కూడా ప్రకటించుకొన్నారు.
రాష్ట్రకూటులు - రాష్ట్రకూటులు మొదట కర్ణాటకలోని చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు.
- రాష్ట్రకూటుల్లో ముఖ్యుడు “దంతిదుర్గుడు”
- దంతిదుర్గుడు 8వ శతాబ్దం మధ్యలో చాళుక్య ప్రభువును ఓడించి “హిరణ్యగర్భ” (బంగారు గర్భం) అనే సంస్కార విధి నిర్వహించాడు.
- దీన్ని బ్రాహ్మణుల సహకారంతో నిర్వహించి, తాను పుట్టుకతో క్షత్రియుడు కాకున్ననూ, క్రతువులతో పునర్జన్మ పొందుతానని భావించాడు.
- కదంబ మయూరశర్మ, గూర్జర ప్రతిహార హరిశ్చంద్రుడు బ్రాహ్మణులయినప్పటికీ వారి సంప్రదాయ వృత్తులను వదిలిపెట్టి ఆయుధాలను చేపట్టి కర్ణాటక, రాజస్థాన్‌లో రాజ్యాలను స్థాపించారు.
- ఎల్లోరాలోని 15వ నెంబర్ గుహలోని విష్ణువును నరసింహునిగా చూపుతున్న చిత్రం రాష్ట్ర కూటులకు చెందింది.
ప్రశస్తి – భూదానాలు - శాసనాల్లో మొదట పేర్కొనే భాగాన్ని ప్రశస్తి అంటారు.
- పరిపాలనలో సహకరించే బ్రాహ్మణ పండితులు వీటిని రాసేవారు.
ప్రశస్తి తెలిపే వివరాలు - పాలకుల కుటుంబాలు, వారి పూర్వపు రాజుల గురించి పాలకులు ఏ కాలానికి చెందిన వారో, పాలకుల ఘనతలు, విజయాలు ఎలా చాటుకునే వారో, విజయాలను, పరాక్రమాలను ఎలా వర్ణించుకునేవారో వంటి విషయాలు తెలుపుతాయి.
- బ్రాహ్మణులకు రాజులు తరచూ భూదానాలు చేసేవారు. ఈ దానాలు రాగి ఫలకాలపై చెక్కించి దాన గ్రహీతలకు ఇచ్చేవారు.
కల్హణుడి రచనలు - 12వ శతాబ్దంలో కశ్మీర్‌ను పాలించిన రాజులపై సంస్కృతంలో పద్యాలు రాశాడు.
- ఇతను శాసనాలు, రాజప్రతులు, పూర్వ చరిత్రల దృష్టాంతాలను, వివిధ వనరులను తన రచనలకు వినియోగించాడు.
- ప్రశస్తి రచయితల వలె కాకుండా రాజులను వారి విధానాలను కల్హణుడు తరచుగా విమర్శించేవాడు.
నాగభట్టు విజయాలు - చాలా మంది రాజులు తమ విజయాలను ప్రశస్తిల్లో వర్ణించేవారు.
- మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో సంస్కృత లిపిలో లభించిన ఒక ప్రశస్తి ప్రతిహార రాజైన నాగభట్టు విజయాలను
కింది విధంగా వర్ణిస్తుంది. - ఆంధ్రరాజులు, సైంధవులు (సింధు)
- విదర్భ మహారాష్ట్రలోని ఒక భాగం
- కళింగ (ఒడిశాలోని కొంతభాగం) రాజులు తాను యువ రాజుగా ఉన్నపుడే తన ముందు మోకరిల్లాడు.
- అతడు చక్రాయుధు (కనోజ్ పరిపాలకుడు)నిపై విజయం సాధించాడు.
- అతడు వంగ (బెంగాల్లో భాగం)
- అనార్త (గుజరాత్లో భాగం)
- మాళవ (మధ్యప్రదేశ్‌లో భాగం)
- కిరాట (వనవాసులు)
- తురుష్క (టర్కులు)
- వత్స, మత్స్య (ఉత్తరభారత రాజ్యాలు) రాజులను ఓడించాడు.
భూదాన తామ్రఫలకల గుచ్ఛం - క్రీ.శ. 9వ శతాబ్దంనాటి పాలకులది.
- దీనిలో కొంత సంస్కృతంలో, కొంత తమిళంలో రాసి ఉంది.
- ఈ తామ్రపత్రాలపై రాజముద్రలు వేసి అధికారికంగా ధ్రువీకరించారు.
- చోళుల భూదాన పత్రం గురించి తమిళంలో పేర్కొన్న భాగం
- మేము ఈ భూమి సరిహద్దులను మట్టికట్టలతో, పొదలు నాటి గుర్తించాం.
- ఈ పండ్లచెట్లు, నీరు, భూమి, ఉద్యావనం, చెట్లు, బావులు, ఖాళీ స్థలాలు, పచ్చిక బయళ్లు, ఒక గ్రామం, పుట్టలు, వేదికలు, కాలువలు, గుంతలు, నదులు, ఒండ్రుభూమి, చెరువులు, ధాన్యాగారాలు, చేపల చెరువులు, తేనెపట్టులు, లోతైన సరస్సులు కలిగి ఉన్నాయి.
- ఈ భూమి స్వీకరించిన వారు దీనిపై పన్నులు వసూలు చేస్తారు.
- ఇతడు న్యాయమూర్తులు విధించే జరిమానాలను, తమలపాకులపై పన్ను, నేత వస్ర్తాలపై, వాహనాలపై పన్నులు వసూలు చేస్తారు.
- అతడు కాల్చిన ఇటుకలతో పెద్ద గదులను, పై అంతస్తులతో నిర్మించవచ్చు. చిన్న, పెద్ద బావులను తవ్వించవచ్చు, చెట్లను పొదలను నాటవచ్చు.
- నీటిపారుదలకు అవసరమైతే కాలువలు నిర్మించవచ్చు.
- అతడు నీరు వృథా కాకుండా కట్టలు నిర్మించాలి.
రాజ్యాల్లో పరిపాలన
- ఇచ్చట రాజుకు ఉండే బిరుదులు : కొత్తరాజుల్లో ఎక్కువగా – మహారాజాధిరాజ (గొప్పరాజు, రారాజు)
త్రిభువన చక్రవర్తి (ముల్లోకాలకు రాజు) - రాజులు కొన్ని సందర్భాల్లో సామంతులు, రైతు సంఘాలు, వ్యాపారస్థులు, బ్రాహ్మణుల సంఘాలతో అధికారాన్ని
పంచుకొనేవారు. - ప్రతి రాజ్యంలో రైతులు, పశుపోషణ, చేతి వృత్తుల వారి నుంచి ఉత్పత్తి చేసిన దానిలో భాగం తీసుకొనేవారు.
- భూమి మొత్తం రాజుదైనందున, దానికి చెల్లించిన అద్దెగా దీన్ని భావించేవారు.
- వ్యాపారుల నుంచి పన్నులు కూడా వసూలు చేసేవారు.
- పన్నుల రూపంలో వచ్చిన వనరులను పరిపాలనకు, దేవాలయాల నిర్మాణానికి, కోటల నిర్మాణానికి వినియోగించే వారు.
- యుద్ధాల ద్వారా సంపద దోచుకోవడానికి వ్యాపార మార్గాల అభివృద్ధికి వెచ్చించేవారు.
- పన్నుల వసూలకై పలుకుబడి గల కుటుంబాల నుంచి అధికారులను నియమించేవారు.
- వీరి నియామకం తరచూ వంశపారంపర్యంగా ఉండేది.
- సైన్యం విషయంలో కూడా ఇదే పద్ధతిని కొనసాగించేవారు.
- చాలా సందర్భాల్లో రాజుల దగ్గరి బంధువులే ఈ పదవుల్లో కొనసాగేవారు.
త్రైపాక్షిక పోరాటం - గంగా నదీలోయ ప్రాంతంలోని కనోజ్ ఒక ప్రత్యేకమైన ప్రాంతం.
- ఈ ప్రాంతంపై నియంత్రణ కోసం అనేక శతాబ్దాలు పోరాడిన వారు
1. గూర్జర ప్రతిహారులు
2. రాష్ట్రకూటులు
3. పాలవంశపు రాజులు - ఈ సుదీర్ఘ సంఘర్షణలో మూడు పక్షాలు పాల్గొన్నాయి. కాబట్టి దీన్ని చరిత్రకారులు “త్రైపాక్షిక పోరాటం” అన్నారు.
మహమూద్ గజనీ
- క్రీ.శ. 997 – 1030 వరకు అఫ్గానిస్థాన్‌ను పాలించిన గజనీ మధ్య ఆసియా, ఇరాన్, భారత ఉపఖండ వాయవ్య ప్రాంతాలు తన రాజ్యాన్ని విస్తరించాడు.
- దాదాపు ప్రతి సంవత్సరం ఉపఖండంపై దాడి చేశాడు.
- సంపన్నమైన గుజరాత్‌లోని సోమనాథ్ వంటి దేవాలయాలు అతడు లక్ష్యంగా చేసుకున్నాడు.
- దోచుకెళ్లిన సంపదలో చాలా భాగం తన రాజధానిని వైభవంగా పునరుద్ధరించడానికి గజనీ వినియోగించాడు.
- ఆక్రమించిన ప్రాంతాల విషయాలు తెలుసుకోవడంలో మహమూద్ గజనీ ఆసక్తి చూపేవాడు.
- భారత ఉపఖండం గురించి అల్బెరూనీ అనే పండితుడికి రచనలు చేసే పనిని అప్పగించాడు.
అల్బెరూనీ - ఆల్బిరూనీ రాసిన గ్రంథం- “కితాబ్ ఉల్ హింద్”.
- ‘కితాబ్ ఉల్ హింద్’ అని పిలిచే ఈ అరబిక్ గ్రంథం చరిత్రకారులకు ఒక ఆధారమయింది.
- ఈ గ్రంధం రచనకు అల్బెరూనీ సంస్కృత పండితులను సంప్రదించాడు.
చహమనులు (చౌహానులు) - చౌహానులుగా పిలిచే చహమనులు ఢిల్లీ, అజ్మీర్ ప్రాంతాలను పాలించారు.
- చౌహానులు భారతదేశంలో తమ రాజ్యాలను పశ్చిమం, తూర్పువైపునకు విస్తరించడానికి ప్రయత్నించారు.
- ఈ విషయంలో చౌహానులను వ్యవతిరేకించినవారు
1. గుజరాత్‌లోని చాళుక్యులు
2. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని గహద్వాలులు
మూడో పృథ్వీరాజ్ చౌహాన్ (1168-1192) - అఫ్గాన్‌కు చెందిన మహమ్మద్ ఘోరీని మూడో పృథ్వీరాజ్ చౌహాన్ 1191లో ఓడించాడు.
- 1192లో పృథ్వీరాజ్ ఘోరీ చేతిలో ఓడిపోయి, వధించబడ్డాడు.
చోళులు: దక్షిణ భారతదేశంలో సమగ్రంగా రాసిన చరిత్రలో చోళుల పాలన ఒకటి. - ముత్తరాయర్గా పిలిచే ఒక చిన్న ముఖ్యకుటుంబం కావేరీ డెల్టా ప్రాంతంపై అధికారం చేజిక్కించుకుంది.
- వారు కాంచీపురాన్ని పాలించే పల్లవులకు సామంతులు.
విజయాలయుడు - 9వ శతాబ్ది మధ్యలో ఉరయూర్కు చెందిన పురాతన చోళ వంశస్థుడైన “విజయాలయుడు” ముత్తరాయర్కు చెందిన డెల్టా ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు.
విజయాలయుడు నిర్మించినవి - తంజావూరు పట్టణం
- నిశుంభసూదిని దేవతకు దేవాలయం
- విజయాలయుని తరువాత వచ్చిన రాజులు పొరుగు రాజ్యాలను ఆక్రమించుకోవడంలో వీరి రాజ్య పరిమాణం, అధికారం పెరిగాయి.
- పాండ్య, పల్లవ, ఉత్తర దక్షిణ ప్రాంతాలు వీరి రాజ్యాంలో అంతర్భాగమయ్యాయి.
మొదటి రాజరాజు - చోళుల్లో అతిశక్తిమంతుడు – “మొదటి రాజారాజు
- అధికారంలోకి వచ్చిన సంవత్సరం క్రీ.శ. 985.
- పాండ్య, పల్లవ, ఉత్తర, దక్షిణ ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు.
- సామ్రాజ్య పరిపాలనకు పునర్య్వవస్థీకరించాడు.
మొదటి రాజేంద్రడు - మొదటి రాజరాజు కుమారుడు “మొదటి రాజేంద్రుడు”.
- గంగానదీలోయ, శ్రీలంక, ఆగ్నేయాసియా ప్రాంతాలపై దాడి చేశాడు.
- దీనికోసం నౌకాదళాన్ని, అభివృద్ధి పరిచాడు.
- అద్భుత దేవాలయాలు – కాంస్య శిల్పకళ
- చోళుల అద్భుత నిర్మాణాలకు, శిల్పకళకు నిదర్శనం “వీరి దేవాలయాలు”
- మొదటి రాజరాజు, మొదటి రాజేంద్రుడు తంజావూరులో “గంగైకొండ చోళపురం”లో నిర్మించిన పెద్ద దేవాలయాలు అద్భుత నిర్మాణానికి శిల్పకళకు నిదర్శనాలు.
- చోళులు నిర్మించిన దేవాలయాలు ప్రజలు వాటి చుట్టుపక్కల స్థిరపడిన కేంద్రాలయ్యాయి.
- ఇవి చేతివృత్తుల ఉత్పత్తులకు కేంద్రమైనాయి.
- దేవాలయంలో పనిచేసే “పూజారులు” పూలదండలు తయారు చేసేవారు.
- వంటవారు ఆలయాన్ని శుభ్రం చేసేవారు.
- సంగీత వాయిద్యకారులు, నాట్యకత్తెలు మొదలగు వారి పోషణ కోసం ఈ భూముల్లో పండిన పంటలనే ఉపయోగించేవారు.
- దేవాలయాలు కేవలం పూజాకేంద్రాలుగా మాత్రమే కాకుండా ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక జీవన
కేంద్రాలుగా వెలిశాయి. - దేవాలయాల్లో అనుబంధమైన చేతివృత్తిపని వారు చాలా వరకు ప్రత్యేకమైన కాంస్య విగ్రహాలను తయారు చేసేవారు.
- చోళుల కాంస్య విగ్రహాలకు ప్రపంచంలో అందమైన వాటిగా గుర్తింపు ఉంది.
- అనేక విగ్రహాలు దేవతలవి కాగా కొన్ని భక్తులవి కూడా ఉన్నాయి.
- గంగైకొండ చోళపురం దేవాలయం – తంజావూరు
- ఈ దేవాలయం గుడి పైకప్పు వాలును కలిగి ఉంటుంది.
- గుడి బయట గోడలను పెద్ద పెద్ద రాతి శిలలతో అలంకరించారు.
వ్యవసాయం – నీటిపారుదల - చోళులు వ్యవసాయంలో నూతన అభివృద్ధి చర్యలు చేపట్టి విజయం సాధించారు.
- కావేరి నది బంగాళాఖాతంలో కలిసేముందు చిన్న చిన్న పాయలుగా విడిపోతుంది.
- ఈ పాయలు తరచుగా ఉప్పొంగి వాటి తీరాలను సారవంతం చేసి, ముఖ్యంగా వరిపంటకు కావలసిన నీటిని
అందించేవి. - క్రీ.శ. 5, 6 శతాబ్దాల్లో తమిళనాడులో అధికంగా వ్యవసాయం వృద్ధి చెందింది.
- అడవులను నరికి, నేలను చదును చేసి డెల్టా ప్రాంతాల్లో వరదల నివారణకు కట్టకట్టి కాలువల నిర్మాణం చేశారు.
- చాలా ప్రాంతాల్లో సంవత్సరానికి 2 పంటలు కూడా పండించేవారు.
- నీటిపారుదలపై కొన్ని ప్రాంతాల్లో బావులు తవ్వారు, చెరువులు నిర్మించారు.
- మరికొన్ని ప్రాంతాల్లో వర్షపు నీటిని నిల్వ చేయడానికి పెద్ద చెరువులను నిర్మించారు.
సామ్రాజ్య పరిపాలనా విధానం - రాజుకు సహకరించడానికి మంత్రిమండలి ఉండేది.
- రాజుకు బలమైన సైన్యం, నౌకాదళం ఉండేవి.
- రాజ్యాన్ని మండలాలుగా విభజించే వారు.
- ఈ మండలాలను తిరిగి వలనాడులుగా, నాడులుగా విభజించేవారు.
- రైతులు స్థిర నివాసాలను “ఉర్” అనేవారు.
- ఇవి నీటిపారుదల, వ్యవసాయ విస్తరణలో సుసంపన్నమైనవి.
- ఇలాంటి “ఉర్”లు కలిసి “నాడు”లుగా ఏర్పడేవి.
- గ్రామసభ నాడుల పరిపాలనా సంబంధ వ్యవహారాలే కాక, న్యాయపరిపాలన, పన్నులు వసూలు కూడా చేసేది.
- “వెల్లాల” కులానికి చెందిన సంపన్నులైన రైతులు చోళుల ప్రభుత్వంలో “నాడు”లకు సంబంధించిన పాలనా వ్యవహారాలను చూసేవారు.
- చోళరాజులు ధనవంతులైన భూస్వాములకు “మువ్వేండ వేలన్” అనగా ముగ్గురు రాజులకు సేవలందించే రైతు లేదా వేలన్ “అరయ్యార్” (ముఖ్యుడు) అనే గౌరవ సూచిక బిరుదులనిస్తూ కేంద్ర స్థాయిలో రాజ్యానికి సంబంధించిన ముఖ్యమైన బాధ్యతలు
అప్పగించేవారు.
Previous article
Telangana History | ‘టియర్స్ ఆఫ్ ఆసిఫ్’ అనే కవితను ఎవరు రాశారు?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు