Biology JL/ DL Special | శాఖీయ ప్రత్యుత్పత్తి వల్ల తర్వాతి తరంలో కలిగే లక్షణం?
ప్రత్యుత్పత్తి
1. ఏ ప్రత్యుత్పత్తి కేవలం మొక్కల దేహ భాగాల ద్వారా మాత్రమే జరుగుతుంది?
1) శాఖీయ ప్రత్యుత్పత్తి
2) లైంగిక ప్రత్యుత్పత్తి
3) అలైంగిక ప్రత్యుత్పత్తి
4) అంతర ప్రత్యుత్పత్తి
2. కేవలం కాండం ద్వారా వ్యాప్తి చెందే మొక్కకు ఉదాహరణ?
1) వేప 2) చెరకు
3) వరి 4) గోధుమ
3. అలైంగిక ప్రత్యుత్పత్తికి అవసరమైనది?
1) రెండు జీవులు
2) వ్యతిరేక లింగానికి చెందిన
రెండు జీవులు
3) ఒకే జీవి 4) స్త్రీ జీవి
4. మానవుడిలో ఫలదీకరణం జరిగే భాగం?
1) గర్భాశయం 2) యోని
3) ఫాలోపియన్ నాళం
4) పుటిక
5. నిశ్చితం (ఎ): సమ విభజన అన్ని శరీర కణాల్లో జరుగుతుంది. అయితే క్షయకరణ విభజన ప్రత్యుత్పత్తి కణాల్లో జరుగుతుంది.
కారణం (ఆర్): సమ విభజన వల్ల క్రోమోజోమ్‌ల సంఖ్య సగానికి తగ్గించబడుతుంది. క్షయకరణ విభజనలో క్రోమోజోమ్‌ల సంఖ్య స్థిరంగా ఉంటుంది.
1) ఎ, ఆర్ రెండూ సరైనవి. ఆర్ అనేది ఎ కు సరైన వివరణ
2) ఎ, ఆర్లు రెండూ సరైనవి. ఆర్ అనేది ఎ కు సరైన వివరణ కాదు
3) ఎ సరైనది, ఆర్ సరైనది కాదు
4) ఎ సరైనవి కాదు, ఆర్ సరైనది
6. ఏ జంతువుల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి ఎక్కువగా జరుగుతుంది?
1) మత్స్యాలు 2) ఉభయచరాలు
3) క్షీరదాలు 4) అకశేరుకాలు
7. మొక్కల ప్రత్యుత్పత్తిలో రెండో పురుష సంయోగ బీజం ద్వితీయ కేంద్రకంతో సంయోగం చెందిన తర్వాత ఏర్పడే నిర్మాణం, దాని కేంద్రక స్థితి?
1) అండాంతః కణజాలం-3n
2) సంయుక్త బీజం- 2n
3) పరిచ్ఛదం- 2n
4) అంకురచ్ఛదం- 3n
8. ఏదైనా వ్యాధికి గురైనప్పుడు శస్త్రచికిత్స ద్వారా గర్భాశయాన్ని తొలగించడం?
1) ట్యూబెక్టమీ 2) వాసెక్టమీ
3) హిస్టిరెక్టమీ 4) ఏదీకాదు
9. ఒకే విధమైన కవలలు పుట్టడానికి కారణం?
1) రెండు అండాలు, ఒక శుక్రకణం చేత ఫలదీకరణం చెందుతుంది
2) ఒకే అండం, రెండు శుక్రకణాల చేత ఫలదీకరణం జరిగినప్పుడు
3) ఒక అండం, ఒక శుక్రకణం కలిసినప్పుడు
4) రెండు శుక్రకణాలు, రెండు అండాలు ఫలదీకరణం చెందినప్పుడు
10. ఏ భూగర్భ కాండంలో కన్నులు అనే నిర్మాణాలు ఉండి ఆ భాగాల నుంచి కొత్త మొక్కలు ఏర్పడుతాయి?
1) క్యారెట్ 2) అరటి
3) పసుపు 4) బంగాళదుంప
11. సాధారణ మానవ శరీరంలో ఉండే క్రోమోజోమ్‌ల సంఖ్య?
1) 43 2) 44 3) 45 4) 46
12. సంకరీకరణ ప్రయోగాలకు మెండల్ బఠానీ మొక్కను ఎంపిక చేసుకోవడానికి కారణం?
1) ఆత్మపరాగ సంపర్కం జరుపుకోవడం
2) ఏకవార్షిక మొక్క
3) ఏకలింగ పుష్పాలు
4) స్పష్టమైన లక్షణాలు కలిగి ఉండటం
13. కింది వాటిలో మార్పు చెందిన భూగర్భకాండం?
1) ముల్లంగి 2) బీట్రూట్
3) క్యారెట్ 4) పసుపు
14. మనకు ఆర్థికంగా ఉపయోగపడే అల్లం అనేది?
1) మార్పు చెందిన వేరు
2) మార్పు చెందిన భూగర్భకాండం
3) వాయుగత కాండం
4) రసయుత భూగర్భభాగం
15. శాఖీయ ప్రత్యుత్పత్తి వల్ల తర్వాతి తరంలో కలిగే లక్షణం?
1) కొత్త లక్షణాలు ఏర్పడతాయి
2) ఉత్పరివర్తనాలు కలుగుతాయి
3) తల్లి మొక్కల లక్షణాలు ఉంటాయి
4) రెండు మొక్కల లక్షణాలు ఉంటాయి
16. ఏ మొక్క వేరుపై మొగ్గలు ఏర్పడి అవి వాయుగతమై కొత్త మొక్కలు ఏర్పడతాయి?
1) అరటి 2) మందార
3) అల్లం 4) కరివేపాకు
17. కింది వాటిని జతపరచండి.
మొక్క క్రోమోజోమ్‌ల సంఖ్య
ఎ. ముల్లంగి 1. 18
బి. బఠాని 2. 14
సి. వరి 3. 24
డి. మొక్కజొన్న 4. 20
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-2, సి-1, డి-4
4) ఎ-2, బి-3, సి-1, డి-4
18. ఒక పొడవు (సమయుగ్మజం) బఠానీ మొక్కను పొట్టి బఠానీ మొక్కతో సంకరణం చేసినప్పుడు ఏర్పడే పొడవు, పొట్టి బఠానీ మొక్కల నిష్పత్తి?
1) 3:1 2) 1:2:1
3) 1:2:1, 3:1 4) 1:0
19. కింది వాటిలో సరైనది ఏది?
ఎ. టర్నర్ సిండ్రోమ్‌లో 45 క్రోమోజోమ్స్ ఉంటాయి
బి. డౌన్ సిండ్రోమ్‌లో 47 క్రోమోజోమ్స్ ఉంటాయి
సి. పాలి ప్లాయిడ్‌కు ఉదాహరణ పంట మొక్కలు
1) ఎ 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
20. ఫలదీకరణం అనంతరం అండాశయం దేనిగా మారుతుంది?
1) పిండం 2) విత్తనం
3) అండం 4) ఫలం
21. అంకురచ్ఛదయుత విత్తనాలకు ఉదాహరణ?
1) చిక్కుడు 2) వరి
3) బఠానీ 4) శనగ
22. కింది వాటిని జతపరచండి.
కారకం పరాగసంపర్క విధానం
ఎ. గాలి 1 హైడ్రోఫిలి
బి. నీరు 2. ఎనిమోఫిలి
సి. పక్షులు 3. ఎంటమోఫిలి
డి. కీటకాలు 4. ఆర్నిథోఫిలి
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-3, బి-2, సి-1, డి-4
4) ఎ-4, బి-3, సి-2, డి-1
23. ఫలదీకరణం చెందని అండం నుంచి జరిగే ప్రత్యుత్పత్తి?
1) అనిషేక జననం 2) సంయుగ్మం
3) అర్హీనోటాకీ 4) ప్లాస్మాటోమీ
24. కింది జంతువుల్లో అత్యధిక గర్భావధి గలది?
1) ఆవు 2) మనిషి
3) మేక 4) ఏనుగు
25. కింది వాటిని జతపరచండి.
పుష్ప వలయం పుష్ప భాగాలు
ఎ. మొదటి 1. అండకోశం
బి. రెండో 2. కేసరావళి
సి. మూడో 3. ఆకర్షణ పత్రాలు
డి. నాలుగో 4. రక్షణ పత్రాలు
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-3, బి-2, సి-1, డి-4
3) ఎ-3, బి-2, సి-3, డి-1
4) ఎ-4, బి-3, సి-2, డి-1
26. కింది వాటిలో అలైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించినది కానిది?
1) విచ్ఛిత్తి 2) కోరకీభవనం
3) సిద్ధబీజం 4) సంయుక్త బీజం
27. కోరకీభవనం (బడ్డింగ్) ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే ఏక కణ జీవి?
1) క్లామిడోమోనాస్ 2) ఈస్ట్
3) వాచీరియా 4) బ్యాక్టీరియా
28. కింది వాటిని జతపరచండి.
ఎ. మామిడి 1. అంటుకట్టడం
బి. ఉల్లి 2. లశునం
సి. గులాబీ 3. ఛేదనం
1) ఎ-3, బి-2, సి-1
2) ఎ-1, బి-2, సి-3
3) ఎ-3, బి-1, సి-2
4) ఎ-2, బి-1, సి-3
29. సుఖ ప్రసవానికి, పొదుగు నుంచి పాల విడుదలకు తోడ్పడే హార్మోన్ ఏది?
1) ఈస్ట్రోజన్ 2) ప్రొజెస్టిరాన్
3) ఆక్సిటోసిన్ 4) టెస్టోస్టిరాన్
30. పుష్పంలోని రక్షక, ఆకర్షణ పత్రావళిని కలిపి ఏమని పిలుస్తారు?
1) అనావశ్యక భాగాలు
2) శాఖీయ భాగాలు
3) ప్రాథమిక భాగాలు
4) ఆవశ్యక భాగాలు
31. కింది వాటిని జతపరచండి.
గ్రంథి/హార్మోన్ ప్రభావం
ఎ. ముష్కాలు/ 1. శుక్ర కణాల టెస్టోస్టిరాన్ ఉత్పత్తి
బి. ఈస్ట్రోజన్ 2. అండాల విడుదల
సి. ఎడ్రినలిన్ 3. ఉద్వేగాల నియంత్రణ
1) ఎ-3, బి-2, సి-1
2) ఎ-2, బి-3, సి-1
3) ఎ-1, బి-2, సి-3
4) ఎ-2, బి-1, సి-3
32. రణపాల మొక్క ఏవిధంగా ప్రత్యుత్పత్తి జరుపుతుంది?
1) కాండపు మొగ్గల ద్వారా
2) వేరు మొగ్గల ద్వారా
3) పత్రపు మొగ్గల ద్వారా
4) కాండ ఛేదనాల ద్వారా
33. ఏ మొక్కలో వాయుగతంగా ఉండే మిద్యాకాండం ఉంటుంది?
1) మందార 2) అరటి
3) జామ 4) క్రోటాన్
34. ఆవృత బీజ మొక్కల్లో అంకురచ్ఛదం ఏవిధంగా ఉంటుంది?
1) ఏకస్థితికంగా 2) ద్వయస్థితికంగా
3) త్రయస్థితికంగా 4) పంచస్థితికంగా
35. పరపరాగ సంపర్కం వల్ల కలిగే ఉపయోగం?
1) తల్లి లక్షణాలు ఏర్పడతాయి
2) తండ్రి లక్షణాలు ఏర్పడతాయి
3) వ్యాధులకు నిరోధకత పెరుగుతుంది
4) కొత్త లక్షణాలు ఏర్పడతాయి. దిగుబడి పెరుగుతుంది
సమాధానాలు
1. 1 2. 2 3. 3 4. 3
5. 3 6. 4 7. 4 8. 3
9. 3 10. 4 11. 4 12. 1
13. 4 14. 2 15. 3 16.4
17.1 18.4 19.4 20.4
21.2 22.2 23.1 24.4
25.4 26.4 27.2 28.2
29.3 30.4 31.3 32.3
33.2 34.3 35.4
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు