Telangana History | ‘టియర్స్ ఆఫ్ ఆసిఫ్’ అనే కవితను ఎవరు రాశారు?
618. వేములవాడ చాళుక్యులు సూర్య వంశం రాజులని ఏ శాసనంలో ఉంది?
a) కొల్లిపర శాసనం b) పర్బణి శాసనం
c) కుర్క్యాల శాసనం
d) వేములవాడ శిలాశాసనం జవాబు: (b)
వివరణ: దీన్ని మూడో అరికేసరి వేయించాడు.
619. ‘ఏ జంగ్ హై జంగ్ ఏ ఆజాది’ అనే ప్రసిద్ధ గేయాన్ని ఎవరు రచించారు?
a) కిషన్ చందర్
b) ఖాజీ నజ్రుల్ ఇస్లాం
c) మగ్దూం మొహియుద్దీన్
d) ఫిరాక్ గోరఖ్‌పురి జవాబు: (c)
620. స్వాతంత్య్ర పోరాటంలోని మూడు దశలను వర్ణిస్తూ ‘చాంద్ తారోంకా బన్’ అనే గేయాన్ని ఎవరు రచించారు?
a) మగ్దూం మొహియుద్దీన్
b) దాశరథి కృష్ణమాచార్య
c) నెల్లూరి కేశవస్వామి
d) కిషన్ చందర్ జవాబు: (a)
వివరణ: మగ్దూం మొహియుద్దీన్‌కు ‘షాయర్ ఏ ఇంక్విలాబ్ (విప్లవ కవి)’ అనే బిరుదు ఉంది. ఈయన హుజూర్నగర్ శాసనసభ్యుడిగా పనిచేశారు.
621. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుపై ‘కలిసి ఉండటం కుదరకపోతే, మళ్లీ రెండు ప్రాంతాలు విడిపోవచ్చు’, ‘అమాయకపు వధువు (తెలంగాణ)ను తుంటరి వరుడికి (ఆంధ్ర రాష్ట్రం) ఇచ్చి పెళ్లి చేసినట్లు’ అనే వ్యాఖ్యలు జవహర్లాల్ నెహ్రూ ఎక్కడ జరిగిన సభలో చేశారు?
a) నిజామాబాద్ b) హైదరాబాద్
c) పెద్ద మనుషుల ఒప్పందం సమయంలో ఢిల్లీలో
d) వనపర్తి సభలో జవాబు: (a)
వివరణ: ఈ సభ 1956 మార్చి 5న జరిగింది.
622. 1956 ఫిబ్రవరి 20న పెద్ద మనుషుల ఒప్పందం ఎవరి సమక్షంలో కుదిరింది?
a) జవహర్లాల్ నెహ్రూ
b) ఆచార్య జె.బి. కృపలాని
c) పండిత్ గోవింద్ వల్లభ్ పంత్
d) కృష్ణ మీనన్ జవాబు: (c)
వివరణ: పెద్ద మనుషుల ఒప్పందం సమయంలో గోవింద్ వల్లభ్ పంత్ భారతదేశ హోంమంత్రిగా ఉన్నారు.
623. ముల్కీ (స్థానికుల) హక్కుల పరిరక్షణ కోసం హైదరాబాద్ రాజ్య విద్యావంతులు 1934లో ఏర్పాటు చేసిన సంస్థ ఏది?
a) నిజాం ముల్కీ లీగ్
b) నిజాం సబ్జెక్ట్స్ సొసైటీ
c) హైదరాబాద్ సబ్జెక్ట్స్ లీగ్
d) నిజాం సబ్జెక్ట్స్ లీగ్ జవాబు: (d)
వివరణ: నిజాం సబ్జెక్ట్స్ లీగ్‌నే నిజాం ప్రజల సంఘం అని కూడా అంటారు. 1935లో ఇదే నిజాం ముల్కీ లీగ్‌గా రూపాంతరం చెందింది. ‘హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్’ ముల్కీ లీగ్ నినాదం.
624. ఏ సంవత్సరంలో హైదరాబాద్ రాజ్యంలో పర్షియా భాష స్థానంలో ఉర్దూను రాజభాషగా ప్రకటించారు?
a) 1858 b) 1884
c) 1883 d) 1911
జవాబు: (b)
625. ఏ సంవత్సరంలో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ముల్కీ నిబంధనల గురించి స్పష్టమైన ఫర్మానా జారీ చేశాడు?
a) 1919 b) 1920
c) 1925 d) 1921
జవాబు: (a)
626. హైదరాబాద్‌లో సివిల్ సర్వీస్ తొలిసారిగా ఏ సంవత్సరంలో ఏర్పాటైంది?
a) 1863 b) 1884
c) 1885 d) 1902
జవాబు: (b)
వివరణ: 1885 జనవరిలో పోటీ పరీక్ష నిర్వహించి 34 మందిని హైదరాబాద్ సివిల్ సర్వీస్‌కు ఎంపికచేశారు.
627. నిజాం నవాబుల పాలనలో హైదరాబాద్ కొత్వాల్‌గా పనిచేసిన ఏకైక హిందువు ఎవరు?
a) రాజబహదూర్ వెంకటరామారెడ్డి
b) కిషన్ పర్షాద్
c) దివాన్ చందూలాల్
d) రాజా మనోహర్ రాయ్ జవాబు: (a)
వివరణ: వెంకటరామారెడ్డికి బ్రిటిష్ ప్రభుత్వం ‘ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్’ గౌరవం కూడా ప్రదానం చేసింది.
628. హైదరాబాద్ సంస్థాన మొదటి చీఫ్ ఇంజినీర్‌గా ఎవరు సేవలందించారు?
a) నవాబ్ అలీయావర్ జంగ్
b) మీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్
c) మెహదీ నవాజ్ జంగ్
(d) బహదూర్ యార్ జంగ్ జవాబు: (b)
వివరణ: మీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ జన్మదినం జూలై 11ను తెలంగాణ ఇంజినీర్ల దినోత్సవంగా జరుపుకొంటున్నారు.
629. జవహర్లాల్ నెహ్రూ ఎవరిని ‘దక్కన్ సర్దార్’ అని ప్రశంసించాడు?
a) జమలాపురం కేశవరావు
b) స్వామి రామానందతీర్థ
c) భూపతి కృష్ణమూర్తి
d) వెల్దుర్తి మాణిక్యరావు జవాబు: (a)
వివరణ: జమలాపురం కేశవరావుకు ‘తెలంగాణ సరిహద్దు గాంధీ’ అనే బిరుదు కూడా ఉంది.
630. నిజాం పాలనలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ‘రైతు’ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
a) సర్దార్ జమలాపురం కేశవరావు
b) మాడపాటి హనుమంతరావు
c) వెల్దుర్తి మాణిక్యరావు
d) సురవరం ప్రతాపరెడ్డి జవాబు: (c)
వివరణ: ఈ పుస్తకాన్ని నిజాం ప్రభుత్వం నిషేధించింది. ఇది 1946లో ప్రచురితమైంది. రాజ్యాంగ సంస్కరణలు, మాడపాటి వారి జీవితం, సర్దార్ జమలాపురం కేశవరావు జ్ఞాపకాలు, హైదరాబాద్ స్వాతంత్య్రోద్యమ చరిత్ర వెల్దుర్తి మాణిక్యరావు ఇతర రచనలు.
631. 1942, మే 30న మహారాష్ట్రలోని పర్బణీలో జరిగిన డిప్రెస్డ్ క్లాసెస్ మహాసభకు ఎవరు అధ్యక్షుడిగా ఉన్నారు?
a) బి.ఎస్.వెంకట్రావు
b) భాగ్యరెడ్డివర్మ
c) బత్తుల శ్యాంసుందర్
d) జె.ఎస్.ముత్తయ్య జవాబు: (c)
వివరణ: బత్తుల శ్యాంసుందర్ 1968లో భారతీయ భీం సేన స్థాపించాడు.
632. ‘యాభై సంవత్సరాల హైదరాబాద్’ ఎవరి ఆత్మకథ?
a) మాడపాటి హనుమంతరావు
b) మందుముల నరసింగరావు
c) పాగ పుల్లారెడ్డి
d) జమలాపురం కేశవరావు
జవాబు: (b)
633. సరోజినీ నాయుడు ఎవరి గురించి ‘టియర్స్ ఆఫ్ ఆసిఫ్’ అనే కవిత రాశారు?
a) మీర్ ఉస్మాన్ అలీఖాన్
b) మౌలానా అబుల్ కలాం ఆజాద్
c) మీర్ మహబూబ్ అలీఖాన్
d) సాలార్ జంగ్ జవాబు: (c)
వివరణ: 1908లో మూసీ వరదల సమయంలో ప్రజల కష్టాలకు అప్పటి నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ చలించిన సంఘటన నేపథ్యంలో ఈ కవిత రాశారు.
634. కింది రచనలను పరిశీలించండి.
1. సంగీత సుధాకరం
2. రసార్ణవ సుధాకరం
3. భోగినీ దండకం 4. రత్నపాంచాలిక
పై వాటిలో రాచకొండ రెండో సింగమ నాయకుని రచనలు ఏవి?
a) 1, 4 b) 1, 3, 4
c) 1, 2, 4 d) 1, 2, 3, 4
జవాబు: (c)
వివరణ: రెండో సింగమ నాయకుడి బిరుదు సర్వజ్ఞ సింగభూపాలుడు, లక్షలక్షణ వేది. ఈయన ఆస్థానాన్ని కవిసార్వభౌముడు శ్రీనాథుడు సందర్శించాడు. సమకాలీన రెడ్డి రాజులకు, రాచకొండ వెలమ నాయకులకు మధ్య దౌత్యం నెరపడానికి శ్రీనాథుడు ప్రయత్నించాడు.
635. తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామికి కానుకలు ఇస్తూ 1475లో తిరుపతి శాసనం వేయించిన రాచకొండ పాలకుడు ఎవరు?
a) రావు మాదానాయకుడు
b) మూడో సింగమ నాయకుడు
c) రెండో సింగమ నాయకుడు
d) రెండో అనపోతా నాయకుడు
జవాబు: (b)
636. పోతన తెలుగులో తొలి దండక కావ్యం ‘భోగినీ దండకము’ను ఎవరి గురించి రాశాడని పేర్కొంటారు?
a) మూడో సింగమ నాయకుడు
b) రెండో సింగమ నాయకుడు
c) రావు మాదానాయకుడు
d) మొదటి అనపోతా నాయకుడు
జవాబు: (a)
వివరణ: రాచకొండ పాలకుల్లో చివరివాడు మూడో సింగమ నాయకుడు.
637. కింది వారిలో ఎవరు తనను తాను ‘చతుర్భాషా కవితా పితామహాంకుడను’ అని చెప్పుకొన్నారు?
a) పోతన b) గౌరన
c) కొరవి గోపరాజు d) శాకల్య మల్లభట్టు
జవాబు: (d)
వివరణ: శాకల్య మల్లభట్టు రాచకొండ మూడో సింగమ నాయకుడి ఆస్థాన కవి. నిరోష్ఠ్యరామాయణం, ఉదార రాఘవం, అన్వయ సంగ్రహం ఈయన రచనలు.
638. యశస్తిలక చంపు, నీతి వాక్యామృత, యుక్తి చింతామణి సూత్ర అనే రచనలు ఎవరివి?
a) జినవల్లభుడు b) పంప కవి
c) సోమదేవ సూరి d) మల్లినాథ సూరి
జవాబు: (c)
639. బోధన్, వేములవాడ, గంగాధర పట్టణాలకు ఉమ్మడిగా వర్తించే లక్షణం ఏది?
a) మూడు ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలు
b) వేములవాడ చాళుక్యుల రాజధానులు
c) కాకతీయుల తొలి రాజధానులు
d) మూడు పట్టణాలు మానేరు నది
ఒడ్డున ఉన్నాయి జవాబు: (b)
వివరణ: వేములవాడ చాళుక్య రాజ్య స్థాపకుడు వినయాదిత్య యుద్ధమల్లుడు బోధన్ కేంద్రంగా పరిపాలించాడు. మొదటి అరికేసరి కాలంలో వేములవాడకు మార్చినట్లు తెలుస్తుంది. కాగా 955-966 మధ్య పాలించిన వాగరాజు రాజధానిని గంగాధరకు మార్చాడు. చివరి రాజైన మూడో అరికేసరి గంగాధర నుంచి రాజధానిని వేములవాడకు మార్చాడు.
640. తూర్పు (వేంగి) చాళుక్యుల సామంతులైన ముదిగొండ చాళుక్యుల మూల పురుషుడు ఎవరు?
a) కొక్కిరాజు b) దానార్ణవుడు
c) జటాచోడ భీముడు
d) మొదటి కుసుమాయుధుడు
జవాబు: (a)
వివరణ: కొక్కిరాజు, రణమర్దుడు సోదరులు ముదిగొండ చాళుక్యుల మూల పురుషులు.
641. ముదిగొండ చాళుక్య రాజుల్లో ‘వినీత జనాశ్రయుడు’ అనే బిరుదు ఎవరికి ఉంది?
a) కొక్కిరాజు b) రణమర్దుడు
c) మొదటి కుసుమాయుధుడు
d) రెండో కుసుమాయుధుడు
జవాబు: (d)
642. తనను కష్టకాలంలో ఆదుకున్న మంత్రులు ఇందుపరాజు, రెమ్మరాజుకు మహామండలేశ్వర బిరుదులను, క్రివ్వక గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చిన ముదిగొండ చాళుక్య రాజు ఎవరు?
a) నిరవద్యుడు
b) రెండో కుసుమాయుధుడు
c) ఐదో కుసుమాయుధుడు
d) నాగతిరాజు జవాబు: (c)
వివరణ: ఐదో కుసుమాయుధుడికి ‘ముత్తెనగల్ల’ అనే బిరుదు ఉంది.
643. ముదిగొండ చాళుక్య రాజుల్లో చివరి పాలకుడు ఎవరు?
a) నిరవద్యుడు
b) ఐదో కుసుమాయుధుడు
c) ఆరో కుసుమాయుధుడు
d) మొదటి బేతరాజు జవాబు: (c)
644. వేములవాడ చాళుక్యుల పాలనకు సంబంధించి ‘తైర్థికులు’ అనే పదం దేన్ని సూచిస్తుంది?
a) జైన తీర్థంకరులు
b) తీర్థయాత్రలు చేసే ప్రజలు
c) బౌద్ధ భిక్షువులు d) వర్తకులు
జవాబు: (d)
645. వేములవాడ చాళుక్యుల గ్రామ పాలనకు సంబంధించి ‘గ్రంథి’ అనే పదం దేన్ని సూచిస్తుంది?
a) గంధం అమ్మే వర్తకులు
b) నీటి నిల్వల మీద అధికారి
c) దేవాలయాలకు గంధం దానంగా
ఇచ్చేవాళ్లు
d) నిర్గ్రంథ జ్ఞాతపుత్రుడైన మహావీరుని
ఆరాధించేవాళ్లు
జవాబు: (b)
646. తన దగ్గరున్న 500 ఏనుగులకు నిత్యం తైలంతో స్నానం చేయించడానికి ఏర్పాట్లు చేసిన వేములవాడ చాళుక్య పాలకుడు ఎవరు?
a) వినయాదిత్య యుద్ధమల్లుడు
b) మొదటి అరికేసరి
c) సోలదగండ బద్దెగుడు
d) రెండో అరికేసరి జవాబు: (a)
వివరణ: వినయాదిత్య యుద్ధమల్లుడు (క్రీ.శ.750 -780) వేములవాడ చాళుక్య వంశ స్థాపకుడు. ఇతడిని ‘సాగరవేలా పరివేష్టిత సకల ధరామండలుడ’ని అప్పటి శాసనాలు, గ్రంథాలు వర్ణించాయి.
647. విష్ణుకుండినుల రాజ లాంఛనం ఏది?
a) పంజా ఎత్తిన సింహం
b) గండబేరుండం c) వరాహం
d) బాణం ఎక్కుపెట్టిన విల్లు
జవాబు: (a)
648. హైదరాబాద్ సమీపంలోని కీసరలో ‘పురుషమేధము’ అనే యజ్ఞాన్ని నిర్వహించినట్లుగా పేర్కొనే విష్ణుకుండిన పాలకుడు ఎవరు?
a) గోవిందవర్మ
b) మొదటి మాధవవర్మ
c) రెండో మాధవవర్మ
d) విక్రమేంద్ర భట్టారకవర్మ
జవాబు: (c)
వివరణ: విష్ణుకుండిన పాలకుల్లో గొప్పవాడు రెండో మాధవవర్మ. యుద్ధాల్లో విజయం సాధించిన ప్రతి దగ్గర రామలింగేశ్వర ఆలయాలను నిర్మించాడు.
* 1908 మూసీ వరదల గురించి ‘ఖయామత్ ఎ సోఘ్రా’ అనే ఉర్దూ కవితను రచించిన హైదరాబాద్‌కు చెందిన ప్రసిద్ధ ఉర్దూ కవి ఎవరు?
1) మగ్దూం మొహియుద్దీన్
2) కిషన్ చందర్
3) అమ్జాద్ హైదరాబాదీ
4) జవ్వాద్ రజ్వీ
జవాబు: (3)
వివరణ: 1908 సెప్టెంబర్ 28 (తుగ్యానీ సితంబర్)న మూసీకి వచ్చిన వరదల్లో హైదరాబాద్‌లో నదీతీరంలోని ఓ చింతచెట్టును ఆసరాగా చేసుకుని ప్రాణాలు దక్కించుకున్న 150 మందిలో అమ్జాద్ హైదరాబాదీ ఒకరు. అప్పటి మూసీ విలయం గురించి తర్వాత ఆయన ఒకచిన్నపాటి ప్రళయం అనే అర్థంలో ‘ఖయామత్ ఎ సోఘ్రా’ అనే కవిత రచించాడు. వరదల్లో అమ్జాద్ తల్లి, భార్య, కూతురు కొట్టుకుపోయారు.
హర్షవర్ధన్ చింతలపల్లి
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు