Sports Current Affairs | వరల్డ్ ఆర్చరీ చాంపియన్ షిప్-2023
- 52వ ప్రపంచ ఆర్చరీ చాంపియన్ షిప్ జర్మనీలోని బెర్లిన్‌లో జూన్ 31 నుంచి ఆగస్టు 6 వరకు జరిగాయి.
- తొలిసారిగా ప్రపంచ ఆర్చరీ చాంపియన్ షిప్ పోటీలు 1931లో ఉక్రెయిన్‌లోని ఎల్వివ్‌లో జరిగాయి.
- ఈ పోటీల్లో ఇండియా 1981 నుంచి పాల్గొంటుంది.
- బెర్లిన్‌లో జరిగిన పోటీల్లో 81 దేశాల నుంచి 531 మంది కీడ్రాకారులు పాల్గొన్నారు.
- 53వ చాంపియన్ షిప్ పోటీలు చైనాలోని గ్వాంగ్జులో జరుగుతాయి.
52వ చాంపియన్ షిప్ పోటీల్లో భారత్ సాధించిన పతకాల వివరాలు - ఈ పోటీల్లో భారత్ 3 స్వర్ణాలు, 1 కాంస్య పతకంతో మొత్తం నాలుగు పతకాలు సాధించింది.
- ఇప్పటి వరకు జరిగిన చాంపియన్ షిప్ పోటీల్లో భారత్‌కు మొత్తం 15 పతకాలు రాగా అందులో 3 స్వర్ణాలు, 9 రజతాలు, 3 కాంస్యాలు ఉన్నాయి.
- మహిళల కాంపౌండ్ టీమ్ విభాగం ఫైనల్లో తెలుగు తేజం వెన్నం జ్యోతి సురేఖ, మహారాష్ట్ర అమ్మాయి అదితి గోపీచంద్ స్వామి, పంజాబ్ క్రీడాకారిణి వర్ణిత కౌర్‌లతో కూడిన జట్టు, వ్యక్తిగత విభాగంలో అదితి గోపిచంద్ స్వామి, ఓజన్ ప్రవీణ్ స్వర్ణం సాధించారు.
అదితి గోపీచంద్ స్వామి: తొలిసారి ప్రపంచ ఆర్చరీ చాంపియన్ షిప్లో మహిళల వ్యక్తిగత విభాగంలో ఆరో సీడ్ అదితి గోపీచంద్ స్వామి (మహారాష్ట్ర) 149-147 తేడాతో 16వ సీడ్ ఆండ్రియా బెసెరా (మెక్సికో)ను ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది. ప్రపంచ ఆర్చరీ చాంపియన్ షిప్ వ్యక్తిగత విభాగంలో పసిడి సాధించిన తొలి భారత ఆర్చర్‌గా చరిత్ర సృష్టించింది.
ఓజన్ ప్రవీణ్ (మహారాష్ట్ర): ప్రపంచ ఆర్చరీ చాంపియన్ షిప్ పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో 21 ఏళ్ల ఓజన్ ప్రవీణ్ 150-149 తో లుకాస్ (పోలెండ్) పై గెలిచి స్వర్ణం కైవసం చేసుకుంది. - వెన్నం జ్యోతి సురేఖ వ్యక్తిగత విభాగంలో తుర్కియేకి చెందిన ఐపెక్ తోమ్రుక్ను 150-146 తో ఓడించి కాంస్యం సాధించింది.
- ఆర్చరీ చాంపియన్ షిప్లో గురి తప్పకుండా లక్ష్యం చేరి తొలిసారిగా మహిళల కాంపౌండ్ టీమ్ విభాగం ప్యానల్లో తెలుగు అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, మహారాష్ట్రకు చెందిన అదితి గోపీచంద్ స్వామి, పంజాబ్‌కు చెందిన వర్ణిత కౌర్‌లతో కూడిన జట్టు 235-239 పాయింట్లతో డాప్ని క్వింటెరో, అనా సోఫియా హెర్నాండెజ్ జియోన్, ఆండ్రియా బెసెరాలతో కూడిన మెక్సికో జట్టుపై గెలిచి విశ్వ విజేతగా అవతరించింది.
- 2017, 2021 చాంపియన్ షిప్ ఫైనల్స్‌కు చేరిన భారత జట్టు రజత పతకాలతో సరిపెట్టుకుంది. ఈ పోటీల్లో మాత్రం విజయం సాధించి పసిడి స్వప్నాన్ని సాకారం చేసుకుంది.
- ఆర్చరీ పోటీల్లో ఒక్కో సిరీస్‌లో జట్టులోని ముగ్గురు సభ్యులు రెండు బాణాల చొప్పున ఆరు సంధిస్తారు. తొలి సిరీస్‌లో భారత్ 59-57, రెండో సిరీస్‌లో 59-58, మూడో సిరీస్‌లో 59-57, నాలుగో సిరీస్‌లో 58-57తో ఆధిక్యం సాధించి మొత్తం 235-229తో విజయం సాధించింది.
వెన్నం జ్యోతి సురేఖ: భారత బృందం స్వర్ణం నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన వెన్నం జ్యోతి సురేఖ ఈ పోటీల్లో ఇప్పటికి 9 సార్లు పాల్గొన్నది. 27 ఏళ్ల ఈ అమ్మాయి ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాలో డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తుంది.
ప్రపంచ చాంపియన్ షిప్ పోటీల్లో జ్యోతి సురేఖ విజయాలు
సంవత్సరం విభాగం పతకం
2017 మహిళల కాంపౌండ్ టీమ్ రజతం
2019 మహిళల టీమ్ కాంస్యం
2019 మహిళల వ్యక్తిగత విభాగం కాంస్యం
2021 మహిళల కాంపౌండ్ టీమ్ రజతం
2021 మిక్స్డ్ టీమ్ రజతం
2021 వ్యక్తిగత విభాగం కాంస్యం
2023 మహిళల కాంపౌడ్ టీమ్ స్వర్ణం
2023 వ్యక్తిగత విభాగం కాంస్యం
Aditi Gopichand swamy, TSPSC, Competitive exams
Previous article
Biology | రవాణాదారులు.. అవరోధకారులు.. రోగ నిరోధకాలు
Next article
Scholarships | Scholarships for 2023 students
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?