Polity – Groups Special | ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ను పార్లమెంట్ ఎప్పుడు చట్టంగా చేసింది?
1. ఏ సభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి అర్హత ఉంటే తప్ప భారత రాష్ట్రపతి ఎన్నికలో పోటీకి ఏ వ్యక్తి కూడా అర్హుడు కాదు?
1) లోక్‌సభ 2) రాజ్యసభ
3) రాష్ట్ర శాసససభ
4) రాష్ట్ర శాసనమండలి
2. రాష్ట్రపతిని ఏ రకంగా ఎన్నుకోవాలని భారత రాజ్యాంగం సూచిస్తుంది?
1) ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల బహిరంగ ఓటింగ్ ద్వారా
2) నేరుగా భారత ప్రజల ద్వారా
3) ప్రస్తుత ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల మెజారిటీ ఓట్ల ద్వారా, వారంతా భారత రాజధానిలో ఓటు వేయాలి
4) ఒకే బదిలీ ఓటు ద్వారా దామాషా ప్రాతినిధ్య వ్యవస్థకు అనుగుణంగా, అటువంటి ఎన్నికల్లో రహస్య బ్యాలెట్ పద్ధతి ద్వారా ఓటింగ్ జరగడం ద్వారా
3. భారత ప్రభుత్వం ద్వారా హామీ ఇచ్చే నియంత్రణతో వ్యవహరించే బిల్లు అనేది?
1) ద్రవ్య బిల్లుగా పరిగణించరు
2) ద్రవ్య బిల్లుగా పరిగణిస్తారు
3) లోక్‌సభ స్పీకర్ తీర్మానిస్తే ద్రవ్య బిల్లుగా పరిగణిస్తారు
4) ప్రజా ప్రయోజనార్థం రాష్ట్రపతి దాన్ని ద్రవ్య బిల్లుగా భావిస్తే అది ద్రవ్య బిల్లుగా పరిగణిస్తారు
4. ప్రతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక నివేదికను పార్లమెంటు ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రవేశపెడతారు. ఇది ఏ రకమైన నివేదిక?
1) దేశ ఆర్థిక పరిస్థితి నివేదిక
2) ఆ సంవత్సరానికి భారత ప్రభుత్వం అంచనా వేసిన రసీదు, వ్యయ నివేదిక
3) గత సంవత్సరంలో భారత ప్రభుత్వం సాధించిన మిగుల ఆదాయ నివేదిక
4) భారత ఆర్థిక వ్యవస్థ ఆర్థిక సర్వే ప్రదర్శన
5. రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు రాష్ట్రపతిపై మహాభియోగ తీర్మానం ప్రవేశ పెట్టినప్పుడు దేని ద్వారా విచారణ జరుగుతుంది?
1. కేంద్ర దర్యాప్తు సంస్థ
2) కేంద్ర విజిలెన్స్ కమిషన్
3) జాతీయ దర్యాప్తు సంస్థ
4) పార్లమెంట్ సభల్లో ఏదోఒకటి
6. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్యనిర్వాహక చర్యలు ఎవరి పేరు మీద వెలువడాలి?
1) గవర్నర్ 2) ముఖ్యమంత్రి
3) ఉపరాష్ట్రపతి 4) అటార్నీ జనరల్
7. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నివేదికలను భారత రాష్ట్రపతికి ప్రతిని ఎప్పుడు పంపుతారు?
1) 3 నెలలకు 2) 12 నెలలకు
3) 6 నెలలకు 4) 15 రోజులకు
8. భారత రాజ్యాంగంలోని కింది ఏ భాగం పంచాయతీలకు సంబంధించిన నిబంధన లను అందిస్తుంది?
1) పార్ట్ -V 2) పార్ట్-IX
3) పార్ట్ VIII 4) పార్ట్ VI
9. భారత రాజ్యాంగం అత్యవసర పరిస్థితి నిబంధనలను ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించింది?
1) ఫ్రాన్స్ 2) జపాన్
3) ఆస్ట్రేలియా 4) జర్మనీ
10. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 53(3)(బి) దేన్ని అందిస్తుంది?
1) పార్లమెంట్ అనేది రాష్ట్రపతికి మినహా మరెవరికీ అధికారాలను కట్టబెట్టదు
2) పార్లమెంట్ అనేది సుప్రీంకోర్టు సమ్మతితో రాష్ట్రపతికే కాకుండా ఇతరులకు కూడా అధికారాలను కట్టబెట్టవచ్చు
3) రాజ్యాంగం ద్వారా రాష్ట్రపతికి కేటాయించిన చట్ట అమలు అధికారాలను పార్లమెంట్ నిరోధించవచ్చు
4) రాష్ట్రపతికి కాకుండా ఇతరులకు చట్టపరమైన అధికారాలను కట్టబెట్టడానికి ఆర్టికల్ 53లోని ఏదీ పార్లమెంటును నిరోధించదు
11. ఎవరిని కలిగిన ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి భారత రాజ్యాంగం అనుమతిస్తుంది?
1) పార్లమెంట్‌లోని ఉభయ సభల సభ్యులందరూ, రాష్ర్టాల శాసనసభల్లోని సభ్యులందరూ
2) పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు, రాష్ర్టాల శాసనసభల్లోని సభ్యులందరూ
3) పార్లమెంటు ఉభయ సభల్లోని సభ్యులందరూ, రాష్ర్టాల శాసనసభలకు ఎన్నికైన సభ్యులందరూ
4) పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు, రాష్ర్టాలు, ఢిల్లీ ఎన్సీటీ, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నుకోబడిన సభ్యులు
12. స్వతంత్రులు, ఇతరులు, నామినేటెడ్ సభ్యులు కాకుండా 14 ఫిబ్రవరి 2020 నాటికి రాజ్యసభలో ఎన్ని రాజకీయ పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి?
1) 34 2) 31
3) 39 4) 37
13. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 దేనికి ఒక నిబంధన చేసింది?
1) పౌరసత్వ హక్కుల కొనసాగింపు
2) అంటరానితనం రద్దు
3) విద్యాహక్కు
4) అంతర్జాతీయ శాంతిని ప్రోత్సహించడం
14. మున్సిపాలిటీల్లో ఎస్సీ, ఎస్టీల కోసం రిజర్వు చేసిన మొత్తం సీట్లలో ఎన్నో వంతుకు తక్కువ కాకుండా ఎస్సీ మహిళలకు లేదా సందర్భాన్ని బట్టి ఎస్టీలకు చెందిన మహిళలకు రిజర్వు చేయాలి?
1) One Third 2) One Fourth
3) One Half 4) One Fifth
15. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371A ఏ రాష్ర్టానికి సంబంధించి ప్రత్యేక నిబంధనలను కలిగి ఉంది?
1) గోవా 2) నాగాలాండ్
3) మిజోరం 4) జార్ఖండ్
16. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371F, దేనికి సంబంధించిన ప్రత్యేక నిబంధనలను కలిగి ఉంది?
1) ఒడిశా 2) సిక్కిం
3) పశ్చిమ బెంగాల్ 4) త్రిపుర
17. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371B ఏ రాష్ర్టానికి సంబంధించి ప్రత్యేక నిబంధనలను కలిగి ఉంది?
1) బీహార్ 2) మధ్యప్రదేశ్
3) అసోం 4) ఉత్తరప్రదేశ్
18. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371C ఏ రాష్ర్టానికి సంబంధించి ప్రత్యేక నిబంధనలను కలిగి ఉంది?
1) మేఘాలయ 2) మణిపూర్
3) కేరళ 4) అరుణాచల్ ప్రదేశ్
19. రాజ్యాంగ అసెంబ్లీలోని సభ్యులు?
1) బ్రిటిష్ వారి ద్వారా నామినేట్ చేయబడ్డారు
2) లోక్‌సభ ద్వారా నామినేట్ చేయబడ్డారు
3) మహాత్మాగాంధీ ద్వారా నామినేట్ చేయబడ్డారు
4) E 292 సభ్యులను రాష్ర్టాల శాసనసభలు ఎన్నుకున్నాయి
20. భారత రాజ్యాంగంలోని పీఠిక అనే ఆలోచన ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు?
1) జర్మనీ 2) యూఎస్ఏ
3) యూఎస్ఎస్ఆర్ 4) ఫ్రాన్స్
21. భారత రాజ్యాంగంలోని అత్యవసర పరిస్థితి నిబంధనల ప్రకారం భారతీయ రాజ్యాంగాన్ని ఎలా వివరించారు?
1) రిపబ్లిక్ 2) క్వాసీ రిపబ్లిక్
3) యూనిటరీ 4) ఖండాలు
22. మన రాజ్యాంగానికి సవరణ చేయగల విధానం అనేది ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు?
1) జపాన్ 2) ఆస్ట్రేలియా
3) దక్షిణాఫ్రికా 4) ఫ్రాన్స్
23. కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద అధ్యయనం, సిఫారసుల కోసం మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్(ఏఆర్సీ) ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) జనవరి 1948 2) జవనరి 1956
3) జనవరి 1966 4) జవనరి 1978
24. కేంద్ర రాష్ట్ర సంబంధాల అధ్యయనం కోసం సర్కారియా కమిషన్‌ను ఎప్పుడు నియమించారు?
1) 1981 2) 1982
3) 1983 4) 1984
25. ఈశాన్య ప్రాంతం నుంచి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఉపసంహరించుకోవడం గుర్తించి కేంద్రంగా పరిగణించాలని కింది ఏ కమిటీ కమిసన్ సిఫారసు చేసింది?
1) మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్
2) మదన్ మోహన్ పూంచీ కమిషన్
3) రెండో పరిపాలనా సంస్కరణల కమిషన్
4) రాజమన్నార్ కమిటీ
26. ఆగస్టు 31, 2005న ఏర్పాటైన రెండో పరిపాలనా సంస్కరణల కమిషన్ (ఏఆర్సీ) అనేది ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థను పునరుద్దరించడానికి ఒక వివరణాత్మక బ్లూప్రింట్ సిద్ధం చేయడం కోసం ఎవరి అధ్యక్షతన ఒక విచారణ కమిషన్‌గా ఏర్పాటైంది?
1) జైపాల్ రెడ్డి 2) అరుణ్ జైట్లీ
3) వీరప్ప మొయిలీ 4) శివరాజ్ పాటిల్
27. భారత ఉపరాష్ట్రపతి పదవీకాలం?
1) పదవిని చేపట్టిన నాటి నుంచి ఐదేళ్ల కాలానికి
2) పదవిని చేపట్టిన నాటి నుంచి ఆరేళ్ల కాలానికి
3) ఎన్నికల తేదీ నుంచి ఐదేళ్లకాలానికి
4) ఎన్నికల తేదీ నుంచి ఆరేళ్ల కాలానికి
28. రాష్ట్రపతి స్వయంగా రాసిన రాజీనామా లేఖను ఎవరికి పంపడం ద్వారా తన పదవికి రాజీనామా చేయవచ్చు?
1) భారత ప్రధాన న్యాయమూర్తి
2) భారత ఉపరాష్ట్రపతి
3) ప్రధాన మంత్రి
4) ప్రధాన ఎన్నికల కమిషనర్
29. కోర్టు మార్షల్ విధించిన శిక్షకు కింది వారిలో ఎవరు క్షమాభిక్ష పెట్టగలరు?
1) భారత రాష్ట్రపతి 2) రాష్ట్ర గవర్నర్
3) ప్రధానమంత్రి 4) ముఖ్యమంత్రి
30. భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఎలక్టోరల్ కాలేజీలో ఎవరు సభ్యులుగా ఉంటారు?
1) పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు
2) పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు
3) రాజ్యసభ సభ్యులు మాత్రమే
4) పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు, రాష్ట్ర శాసస సభల సభ్యులు
31. పంచాయతీలకు సంబంధించిన నిబంధనలను ఏ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చారు?
1) రాజ్యాంగ (53వ సవరణ) చట్టం, 1986
2) రాజ్యాంగ (45వ సవరణ) చట్టం 1980
3) రాజ్యాంగ (63వ సవరణ) చట్టం 1989
4) రాజ్యాంగ (73వ సవరణ) చట్టం 1992
32. రాజ్యంగంలోని ఆర్టికల్ 65 ప్రకారం, రాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్నప్పుడు ఎవరు రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. లేదా ఆ పదవికి సంబంధించిన విధులు నిర్వర్తిస్తారు?
1) భారత ప్రధాన న్యాయమూర్తి
2) ఉపరాష్ట్రపతి
3) లోక్‌సభ స్పీకర్
4) రాజ్యసభ డిప్యూటీ చైర్మన్
33. 35 సంవత్సరాలు నిండని వ్యక్తి?
1) భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యేందుకు అనర్హులు
2) 30 సంవత్సరాలు నిండితే భారత రాష్ట్రపతిగా ఎన్నికల్లో పాల్గొనడానికి అర్హులు
3) 70 సంవత్సరాలు నిండకుండా ఉంటే తప్ప భారత రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనడానికి అర్హులు
4) ఆ వ్యక్తికి అర్హత ఉన్నట్లు ముఖ్య ఎన్నికల కమిషనర్ ప్రకటిస్తే, భారత రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనడానికి అర్హులు
34. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 54లో పేర్కొన్న రాష్ట్రం అనే పదంలో ఏ కేంద్రపాలిత ప్రాంతాలు చేర్చారు?
1) అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు
2) ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం మాత్రమే
3) కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి మాత్రమే
4) దేశ రాజధాని భూభాగమైన ఢిల్లీ, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి
35. కింది ఏ విషయంలో మహాభియోగ తీర్మానం ద్వారా భారత రాష్ట్రపతిని పదవి నుంచి తొలగించవచ్చు?
1) ఏదైనా క్రిమినల్ నేరం
2) అనైతిక వ్యవహారాలు
3) మానసిక స్థితి సరిగాలేకపోవడం
4) రాజ్యాంగ అతిక్రమణ
36. కింది ఏ పరిస్థితిలో ఆర్డినెన్స్ జారీ చేయడానికి భారత రాజ్యాంగం అవకాశం కల్పిస్తుంది?
1) సభలోని పరిస్థితుల దృష్ట్యా పెండింగ్‌లోని బిల్లు మీద చర్చ సాధ్యం కాదని లోక్‌సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ భావించిన సమయంలో
2) పార్లమెంటు సమావేశాలు ముగిసే లోపల దాని ముందు పెండింగ్‌లో ఉన్న బిల్లును ఆమోదించే అవకాశం పార్లమెంటుకు లేదనే నిర్ణయానికి రాష్ట్రపతి వచ్చినప్పుడు
3) పార్లమెంటు ఉభయ సభలు సమావేశాల్లో ఉన్నప్పుడు తప్ప మిగిలిన ఏ సమయంలోనైనా తాను తక్షణ చర్య తీసుకోవలసిన పరిస్థితులు తలెత్తాయని రాష్ట్రపతి భావించినప్పుడు
4) తప్పని సరిగా తక్షణ చర్య తీసుకోవలసిన పరిస్థితి ఉందని రాష్ట్రపతి భావించినపుడు, అప్పటికి ఆరు నెలలుగా ఎటువంటి ఆర్డినెన్స్ ప్రకటించినప్పుడు
37. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 24 ప్రకారం ఎన్ని సంవత్సరాల్లోపు పిల్లలను కర్మాగారంలో, గనిలో ఉద్యోగం కోసం నియమించ కూడదు?
1) 18 సం.లు 2) 12 సం.లు
3) 15 సం.లు 4) 14 సం.లు
38. ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ని భారత పార్లమెంట్ ఏ సంవత్సరంలో చట్టంగా చేసింది?
1) 1978 2) 1989
3) 1959 4) 1967
39. భారత రాజ్యాంగంలోని పార్ట్ IV A ద్వారా ఎన్ని ప్రాథమిక విధులను చేర్చారు?
1) 8 2)19 3) 11 4) 14
40. పౌరహక్కుల పరిరక్షణ చట్టం (The Protection of Civil right) ను భారత పార్లమెంట్ ఏ సంవత్సరంలో చట్టంగా రూపొందించింది?
1) 1955 2) 1950
3) 1960 4) 1965
41. ఏ చార్టర్ చట్టం బానిసత్వాన్ని రద్దు చేయడానికి, బానిసల పరిస్థితిని మెరుగు పరచడానికి చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని ఆదేశించింది?
1) 1973 2) 1853
3) 1813 4) 1833
42. సమాన వేతన చట్టం అనేది ఉద్యోగ స్థలాల్లో లింగ ఆధారిత వివక్షను నివారించడానికి ఉద్దేశించింది?
1) 1976 2) 1986
3) 1996 4) 2006
43. …. నాటి వికలాంగుల హక్కుల చట్టం చాలా ప్రగతిశీల చట్టం. ఇది వికలాంగులపై ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎటువంటి వివక్ష ఉండరాదని నిస్సందేహంగా పేర్కొంది?
1) 2014 2) 2012
3) 2002 4) 2016
సమాధానాలు
1-1 2-4 3-2 4-2 5-4
6-1 7-2 8-2 9-4 10-4
11-4 12-2 13-2 14-1 15-2
16-2 17-3 18-2 19-4 20-2
21-3 22-3 23-3 24-3 25-2
26-3 27-1 28-2 29-1 30-2
31-4 32-2 33-1 34-4 35-4
36-3 37-4 38-2 39-3 40-1
41-4 42-1 43-4
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు