Biology | శాకాహారుల్లో లోపించే విటమిన్ ఏది?
1. కింది వాటిలో సరైన జతలను ఎన్నుకోండి.
ఎ.వెలుతురు చూడలేకపోవడం- రైబోఫ్లావిన్
బి.మానసిక వ్యాకులత- పాంటోథెనిక్ ఆమ్లం
సి.ల్యూకోసైట్ల సంఖ్య తగ్గడం- ఫోలిక్ ఆమ్లం
డి. మూర్ఛ- పైరిడాక్సిన్
1) ఎ, బి, డి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి
2. కింది వాటిని జతపరచండి.
ఎ. టేబుల్ షుగర్ 1. మాల్టోజ్
బి. మిల్క్ షుగర్ 2. లాక్టోజ్
సి. మాల్ట్ షుగర్ 3. సుక్రోజ్
1) ఎ-3, బి-2, సి-1
2) ఎ-1, బి-2, సి-3
3) ఎ-2, బి-3, సి-1
4) ఎ-2, బి-1, సి-3
3. ప్రవచనం (ఎ): పోషకాహార లోపం వల్ల కలిగే వ్యాధులను న్యూనత వ్యాధులు అంటారు
ప్రవచనం (ఆర్): ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పోషకాలు లోపించిన ఆహారాన్ని తీసుకోవడాన్ని పోషకాహార లోపం అంటారు
1) ఎ కు ఆర్ సరైన వివరణ
2) ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
3) ఎ మాత్రమే సరైనది
4) ఆర్ మాత్రమే సరైనది
4. చిక్కుడు గింజలు మంచి మాంసకృత్తులకు స్థానం. వాటిలో ముఖ్యంగా ఉండేది?
1) సిట్రిక్ ఆమ్లం, మాలిక్ ఆమ్లం
2) సక్సినిక్ ఆమ్లం, సిట్రిక్ ఆమ్లం
3) సక్సినిక్ ఆమ్లం
4) మాలిక్ ఆమ్లం
5. పిండి పదార్థాల్లో C2H20 నిష్పత్తి?
1) 3:1:1 2) 1:2:1
3) 1:1:1 4) 6:4:5
6. ఒక గ్రాము పిండి పదార్థం నుంచి లభించే శక్తి?
1) 9 కిలో క్యాలరీలు 2) 8 కిలో క్యాలరీలు
3) 6 కిలో క్యాలరీలు 4) 4 కిలో క్యాలరీలు
7. కింది వాటిని జతపరచండి.
జాబితా-1 జాబితా-2
ఎ. లిపిడ్లు 1. నారింజ
బి. కార్బోహైడ్రేట్లు 2. పొద్దుతిరుగుడు
సి. ప్రొటీన్లు 3. సోయా
డి. విటమిన్లు 4. రాగి
1) ఎ-2, బి-4, సి-3, డి-1
2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-3, బి-2, సి-1, డి-4
4) ఎ-2, బి-4, సి-1, డి-3
8. కొవ్వుల్లో కరిగే విటమిన్లు?
1) బి, సి 2) ఎ, డి
3) బి, డి 4) ఎ, సి
9. నీటిలో కరిగే విటమిన్లు?
1) బి, సి 2) ఎ, డి
3) బి, డి 4) ఎ, సి
10. ఎ. ప్రొటీన్లు, క్యాలరీల లోపం వల్ల మరాస్మస్ వ్యాధి కలుగుతుంది
బి. మరాస్మస్ వల్ల శిశువు శుష్కించి ఎండిపోయినట్లు కనబడతాడు
పై వాటిలో సరైన ప్రవచనం ఏది?
1) ఎ 2) బి 3) ఎ, బి 4) పైవేవీ కాదు
11. ప్రవచనం (ఎ): చర్మం వాచి పైపొరలు పొలుసుల్లా ఊడిపోవడాన్ని పెల్లాగ్రా అంటారు
ప్రవచనం (ఆర్): పెల్లాగ్రా వ్యాధికి కారణం B5 విటమిన్ లోపం
1) ఎ కు ఆర్ సరైన వివరణ
2) ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
3) ఆర్ మాత్రమే సరైనది
4) ఎ, ఆర్ రెండూ సరికాదు
12. కింది వాటిని జతపరచండి.
ఎ. సుక్రోజ్ 1. గ్లూకోజ్+ ఫ్రక్టోజ్
బి. మాల్టోజ్ 2. గ్లూకోజ్+ గ్లూకోజ్
సి. లాక్టోజ్ 3. గ్లూకోజ్+ గాలక్టోజ్
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-3, బి-2, సి-1
3) ఎ-2. బి-3, సి-1
4) ఎ-1, బి-3, సి-2
13. ఎ. థైరాక్సిన్ లోపిస్తే పిల్లల్లో కలిగే బుద్ధి మాంద్యతను క్రెటినిజమ్ అంటారు
బి. పెద్దవారిలో అధిక నిద్ర కలిగే శారీరక బలహీనతను మిక్సోడిమా వ్యాధి అంటారు
పై వాటిలో సరైనది ఏది?
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏవీ కాదు
14. పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలలో గర్భస్రావం రావడానికి కారణమయ్యేది కింది వాటిలో ఏది?
1) కాల్సిఫెరాల్ 2) ఫిల్లో క్వినైన్
3) టోకోఫెరాల్ 4) రెటినాల్
15. ఎ: జన్యులోపం వల్ల రక్తం గడ్డకట్టకపోవడాన్ని హీమోఫీలియా అంటారు
ఆర్: K విటమిన్ లోపం వల్ల హీమోఫీలియా ఏర్పడుతుంది
1) ఎ కు ఆర్ సరైన వివరణ
2) ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
3) ఎ మాత్రమే సరైనది
4) ఆర్ మాత్రమే సరైనది
16. ఏ విటమిన్ లోపం వల్ల స్కర్వి వ్యాధి సంభవిస్తుంది?
1) ఎ 2) బి 3) సి 4) డి
17. కింది వాటిని జతపరచండి.
విటమిన్ శాస్త్రీయనామం
ఎ. విటమిన్-ఎ 1. రెటినాల్
బి. విటమిన్-ఈ 2. యాంటీ స్టెరిలిటీ విటమిన్
సి. విటమిన్-డి 3. యాంటీ రికెట్స్
డి. విటమిన్-కె 4. యాంటీ బ్లీడింగ్
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-2, సి-1, సి-3, డి-4
18. ఇనుము లోపం వల్ల కలిగే దుష్పరిణామం?
1) వంధ్యత్వం
2) కండరాలు కొంగర్లు పోవడం
3) రక్తహీనత 4) వాంతులు
19. అమైనో ఆమ్లాల పాలిమర్లు ఏవి?
1) పిండి పదార్థాలు 2) మాంసకృత్తులు
3) కొవ్వులు 4) లిపిడ్లు
20. ఆహారంలో మాంసకృత్తుల లోపం వల్ల కలిగే దుష్పరిణామం?
1) బెరిబెరి 2) స్కర్వి
3) పెల్లాగ్రా 4) క్వాషియార్కర్
21. ఒక గ్రాము కొవ్వుల నుంచి లభించే శక్తి ఎంత?
1) 9 కిలో క్యాలరీలు 2) 6 కిలో క్యాలరీలు
3) 4 కిలో క్యాలరీలు
4) 18 కిలో క్యాలరీలు
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-2, బి-1, సి-3, డి-4
4) ఎ-2, బి-3, సి-4, డి-1
23. కొలెస్ట్రాల్ అనేది?
1) పిండి పదార్థం 2) మాంసకృత్తులు
3) లిపిడ్ 4) విటమిన్
24. ఆరోగ్యవంతమైన దంతాలు, ఎముకలకు ఏ ఖనిజ లవణాలు అవసరం?
1) కాల్షియం, ఫాస్ఫరస్
2) సోడియం, పొటాషియం
3) మెగ్నీషియం, కాల్షియం
4) మాంగనీస్, కోబాల్ట్
25. చేప, కాలేయం, డెయిరీ ఉత్పత్తుల్లో ఉండే ముఖ్యమైన విటమిన్?
1) విటమిన్-డి 2) విటమిన్-సి
3) విటమిన్-ఎ 4) విటమిన్-కె
26. పండిన మామిడి పండ్లలో ఉండే విటమిన్?
1) విటమిన్-ఎ 2) విటమిన్-బి
3) విటమిన్-సి 4) విటమిన్-డి
27. సాధారణంగా గర్భిణుల్లో లోపించేది?
1) సోడియం, కాల్షియం
2) ఇనుము, సోడియం
3) కాల్షియం, ఇనుము
4) మెగ్నీషియం, ఇనుము
28. కింది వాటిని జతపరచండి.
జాబితా-1 జాబితా-2
ఎ. గాయిటర్ 1. విటమిన్-ఎ
బి. హీమోఫీలియా 2. కళ్లు పచ్చబడటం
సి. జాండిస్ 3. విటమిన్-కె
డి. రే చీకటి 4. అయోడిన్ లోపం
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-1, డి-2
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4) ఎ-4, బి-3, సి-2, డి-1
29. సాల్మన్ చేపలు, కాడ్ లివర్ నూనెలో పుష్కలంగా లభించే విటమిన్?
1) విటమిన్ 2) విటమిన్-డి
3) విటమిన్-కె 4) విటమిన్-బి12
30. విటమిన్-సి లోపం వల్ల కలిగే వ్యాధి కింది వాటిలో ఏది?
1) బెరిబెరి 2) గాయిటర్
3) స్కర్వి 4) ఎనిమియా
31. కింది వాటిలో ఏది పాశ్చరైజ్డ్ పాలకు చక్కగా వర్తిస్తుంది?
1) పాకెట్లలో పోసి ప్యాక్ చేయడానికి సిద్ధంగా ఉన్న తాజా, కాచని పాలు
2) సూక్ష్మ ఆర్గానిజమ్స్, ఫర్మెంటేషన్ల నుంచి రక్షితమైన పాలు
3) కొవ్వు పదార్థం నుంచి తయారు చేసిన పాలు
4) గాలి దూరని డబ్బాల్లో ప్యాక్ చేసిన పౌడర్ పాలు
32. ఆస్టియోపోరోసిస్ (ఎముక మజ్జ కోల్పోవడం) ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది?
1) విటమిన్-డి 2) విటమిన్-కె
3) విటమిన్-ఎ 4) విటమిన్-ఇ
33. క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా తోడ్పడే విటమిన్?
1) విటమిన్-కె 2) విటమిన్-ఇ
3) విటమిన్-డి 4) విటమిన్-ఎ
34. ఎన్రిచ్డ్ ఫ్లోర్లో ఏ విటమిన్ కలుపుతారు?
1) విటమిన్-ఎ 2) విటమిన్-సి
3) విటమిన్-బి 4) విటమిన్-కె
35. కింది వాటిని జతపరచండి.
విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి
ఎ. బి12 1. కీలోసిస్
బి. బి2 2. పెర్నీషియస్ ఎనిమియా
సి. బి6 3. బెరిబెరి
డి. బి1 4. ఎనిమియా
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-2, బి-1, సి-4, డి-3
36. శాకాహారుల్లో లోపించే విటమిన్ ఏది?
1) విటమిన్-బి12
2) విటమిన్-ఎ
3) విటమిన్-బి6
4) విటమిన్-డి
38. రక్తం గడ్డకట్టడంలో ఆలస్యం కింది వాటిలో దేని లోపం వల్ల జరుగుతుంది?
1) విటమిన్-కె 2) విటమిన్-డి
3) విటమిన్-బి12 4) విటమిన్-బి3
39. పుట్ట గొడుగు దేనికి మంచి వనరు?
1) మాంసకృత్తులు 2) పిండి పదార్థాలు
3) ఖనిజాలు 4) పైవేవీ కాదు
40. గర్భిణులకు ఏ విటమిన్ను ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తారు?
1) విటమిన్-సి 2) విటమిన్-బి9
3) విటమిన్-బి6 4) విటమిన్-బి12
41. పాలు పెరుగుగా దేనివల్ల మారుతుంది?
1) స్టెఫిలోకాకస్ 2) ఈస్ట్
3) మైకోబ్యాక్టీరియా 4) లాక్టోబాసిల్లస్
42. ఏ మూలకం వాయురూపంలో లభ్యమవుతుంది?
1) కాల్షియం 2) ఐరన్
3) నైట్రోజన్ 4) మెర్క్యురీ
43. కింది వాటిలో సూక్ష్మ మూలకం ఏది?
1) కాల్షియం 2) మెగ్నీషియం
3) సల్ఫర్ 4) ఐరన్
44. పాలు, ఆకుకూరలు, గుడ్లు, రాగులు, అరటిలో పుష్కలంగా లభించే మూలకం?
1) అయోడిన్ 2) కాల్షియం
3) పొటాషియం 4) జింక్
45. కింది జతలలో ఏది సరైనది కాదు?
1) విటమిన్-బి1-బెరిబెరి
2) విటమిన్-బి2-పెల్లాగ్రా
3) విటమిన్-బి6-ఆకలి మందగించడం
4) విటమిన్-బి12-పెర్నీసియస్ రక్తహీనత
46. కింది వాటిలో ఒక్కదానికి తప్ప మిగతా వేటికి కాల్షియం తోడ్పడుతుంది?
1) ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉండటానికి
2) స్త్రీలలో పాల ఉత్పత్తికి
3) శరీరంలో ఎర్రరక్త కణాల తయారీకి
4) కోళ్లకు కాల్షియంను అందించే చేపల పొడి తయారీకి
47. ఎముకలు, దంతాల్లో కాల్షియం ఏ రూపంలో ఉంటుంది?
1) కాల్షియం క్లోరైడ్
2) కాల్షియం కార్బోనేట్
3) కాల్షియం బ్రోమైడ్
4) కాల్షియం ఆక్సైడ్
48. శరీరంలో విటమిన్-డి లోపం ఉంటే చిన్నపేగు గోడలు ఏ ఖనిజ మూలకాన్ని శోషణం చేసుకోలేవు?
1) కాల్షియం 2) ఐరన్
3) మాంగనీస్ 4) క్లోరిన్
49. కింది వాటిని జతపరచండి.
విటమిన్ శాస్త్రీయనామం
ఎ. బి6 1. పాంటోథెనిక్ ఆమ్లం
బి. బి5 2. పైరిడాక్సిన్
సి. బి3 3. నియాసిన్
డి. బి1 4. థయమిన్
1) ఎ-1, బి-2,
సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-3, బి-4, సి-1, డి-2
50. గాయిటర్ ఏ ఖనిజ లోపం వల్ల కలుగుతుంది?
1) అయోడిన్ 2) ఐరన్
3) ఫ్లోరిన్ 4) కాల్షియం
22. కింది వాటిని జతపరచండి.
పట్టిక-1
ఎ. పప్పు దినుసులు, మాంసం
బి. గోధుమలు, బియ్యం
సి. ఆకుకూరలు, పండ్లు
డి. నూనె గింజలు
పట్టిక-2
1.లిపిడ్లు (కొవ్వులు)
2. ప్రొటీన్లు
3. కార్బోహైడ్రేట్లు
4. విటమిన్లు
37. కింది పట్టికను అధ్యయనం చేసి సరైన మేళవింపును గుర్తించండి.
క్ర.సం విటమిన్ లభించే ముఖ్య పదార్థాలు న్యూనత వ్యాధులు
1 ఎ క్యారెట్లు రేచీకటి
2 డి సూర్యకాంతి వంధ్యత్వం
3 ఇ గోధుమ మొలకల నూనె రికెట్స్
4 సి నిమ్మజాతి ఫలాలు స్కర్వి
1) 1, 2 2) 2, 3 3) 1, 4 4) 3, 4
సమాధానాలు
1. 3 2. 2 3. 1 4. 1 5. 2 6. 4 7. 1 8. 2 9. 1 10. 3 11. 2 12. 1 13. 3 14. 3 15. 1
16. 3 17. 3 18. 3 19. 2 20. 4
21. 1 22. 4 23. 3 24. 1 25. 3
26. 3 27. 3 28. 4 29. 2 30. 3
31. 2 32. 1 33. 3 34. 3 35. 4
36. 1 37. 3 38. 1 39. 1 40. 2
41. 4 42. 3 43. 2 44. 4 45. 2
46. 4 47. 2 48. 1 49. 2 50. 1
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు