TET – Science | రుతువుల ఆధారంగా తమ ఆవాసాన్ని మార్చుకునే జీవులు?
1. నీటిలోనూ నేల మీద జీవించే జీవులు
1) కప్పలు 2) తాబేళ్లు
3) మొసళ్లు, ఎండ్రకాయలు
4) పైవన్నీ
2. నిల్వ నీటిలో దోమలను నివారించడానికి, నీటిలో చల్లే మందులు?
1) కిరోసిన్ 2) మలాథియాన్
3) కిరోసిన్, మలాథియాన్
4) మస్కిటోకాయిల్స్
3. భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో కట్టే ఇల్లు?
1) పడవ ఇళ్ల్లు 2) ఇగ్లూ
3) కలపతో కట్టిన ఇళ్ల్లు ్ల
4) మట్టి ఇళ్ల్లు
4. కశ్మీర్, కేరళ రాష్ర్టాల్లో ఎక్కువగా నిర్మించే ఇళ్లు?
1) పడవ ఇళ్ల్లు 2) ఇగ్లూ
3) కలపతో కట్టిన ఇళ్ల్లు 4) మట్టి ఇళ్ల్లు
5. మంచు ప్రాంతాల్లో కట్టుకునే ఇట్లు
1) పడవ ఇళ్ల్లు 2) ఇగ్లూ
3) కలపతో కట్టిన ఇళ్ల్లు 4) మట్టి ఇళ్ల్లు
6. ఇంటిలో గదులు చల్లగా ఉండటానికి పై కప్పునకు సీలింగ్ చేయడానికి వాడేవి?
1) సిమెంట్ 2) వాల్‌కేర్
3) ప్లాస్టర్ ఆఫ్ పారిస్ 4) మార్బుల్స్
7. ఇటుకల బట్టీల్లో ఇటుకలను కాల్చే సమయం?
1) 20 రోజులు 2) 30 రోజులు
3) 40 రోజులు 4) 50 రోజులు
8. ఈశాన్య రాష్ర్టాలైన అసోం, మేఘాలయ, నాగాలాండ్‌లో నిర్మించే ఇళ్లు?
1) ఇగ్లూ 2) పడవ ఇళ్లు
3) చెక్క ఇళ్లు 4) మట్టి ఇళ్లు
9. శ్రీనగర్‌లోని దాల్ సరస్సుపై నిర్మించే పడవ ఇళ్లు?
1) ఇగ్లూ 2) డోంగా
3) ప్లాట్ 4) వాడా
10. తెలంగాణ రాష్ట్రంలో రంగుబండలు చవకగా లభించే ప్రాంతం?
1) కరీంనగర్ 2) మహబూబ్‌నగర్
3) వరంగల్ 4) తాండూరు
11. కడుపులో నులి పురుగులు(నట్టలు) పోవడానికి వాడేవి?
1) మలాథియాన్
2) మెగ్నీషియం హైడ్రాక్సైడ్
3) డీవార్మింగ్ మాత్రలు
4) క్లోరిన్ మాత్రలు
12. కేంద్ర ప్రభుత్వం ద్వారా సులభ్ శానిటేషన్ అవార్డు పొందిన మహిళ?
1) మీరాబాయి 2) అనితాబాయి
3) మేరీకోమ్ 4) కోనేరు హంపి
13. కంపోస్టు తయారీకి ఉపయోగించే చెత్త?
1) పొడి చెత్త 2) తడి చెత్త
3) 1, 2 4) 1
14. చండీఘర్‌లో రాక్ గార్డెన్‌ను నిర్మించిన వ్యక్తి?
1) ప్రేమ్ చంద్ బి) మాన్ చంద్
సి) లేక్ చంద్ 4) రామ్‌నాథ్
15 పర్యావరణ పరిరక్షణ కోసం పాటించాల్సిన సూత్రాలు?
1) చెత్తను తగ్గించడం
2) చెత్తను తిరిగి వాడటం
3) రీసైక్లింగ్ 4) పైవన్నీ
16. తూనీగ, మే ఫ్లై, లకుముకి పిట్ట, నీటి కాకులు నివసించే కొలనులోని భాగం?
ఎ) నీటి ఉపరితలం 2) మధ్య నీరు
3) కొలను అంచు 4) కొలను అడుగు
17. నీటి బొద్దింకలు, జలగ, దోమ డింభకాలు ఉండే కొలనుభాగం?
1) నీటి ఉపరితలం
2) కొలను మధ్య ప్రాంతం
3) కొలను అంచు
4) కొలను అడుగు
18. హైడ్రిల్లా లాంటి మొక్కలు, ఆల్చిప్పలు, చదును పురుగులు, మెగ్గాట్లు ఉండే కొలను భాగం?
1) నీటి ఉపరితలం
2) కొలను మధ్య ప్రాంతం
3) కొలను అంచు
4) కొలను అడుగు
19. జంతువుల హక్కులు, వాటి రక్షణ గురించి పనిచేసే స్వచ్ఛంద సంస్థ?
1) రెడ్ క్రాస్ 2) బ్లూక్రాస్
3) ఎన్ఈసీసీ 4) ఎన్ఐడీఏ
20. కొల్లేరు, పులికాట్ సరస్సులకు అక్టోబర్ నుంచి మార్చి వరకు వలస వచ్చే పక్షులు?
1) బట్టమేక పిట్ట 2) పెలికాన్ పక్షులు
3) పిచ్చుకలు 4) నీటి కొంగలు
21. విశాఖ పట్టణ తీరానికి గుడ్లు పెట్టడానికి వచ్చే జీవులు?
1) పెలికాన్ పక్షులు 2) బట్టమేక పిట్ట
3) తాబేళ్లు 4) పులస చేపలు
22. కాలాన్ని బట్టి ఆవాసాన్ని మార్చే జీవులు?
1) తాబేళ్లు 2) పెలికాన్ పక్షులు
3) పులస చేపలు 4) నీటి కొంగలు
23. ఏనుగుల గుంపుకు నాయకత్వం వహించేది?
1) మగ ఏనుగు 2) ఆడ ఏనుగు
3) ఏనుగు పిల్ల
4) ఏనుగుల యాజమాని
24. భూగోళం మొత్తం మీద వ్యాపించి ఉన్న అటవీ ఆవాసాల్లో వృక్షజాల శాతం / భాగం ఎంత?
1) 2వ వంతు 2) 3వ వంతు
3) 3వ వంతు 4) 5వ వంతు
25. సజీవుల లక్షణాలను గుర్తించండి?
ఎ) చలనం, పెరుగుదల
బి) ఆహారం తీసుకొని శ్వాసించడం
సి) వ్యర్థాలను విసర్జించడం
డి) కొత్త జీవులకు జన్మనివ్వడం
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) బి, సి, డి 4) ఎ, బి, సి, డి
26. ప్రవచనం (ఎ): టచ్మీనాట్ (అత్తి పత్తి లేదా మైమోసా) మొక్కను తాకినప్పుడు, వేగంగా తన పూర్వ స్థితికి చేరుతుంది.
ప్రవచనం (బి): వానపాము కాంతికి అనుగుణంగా స్పందిస్తుంది.
1) ‘ఎ’ సత్యం, ‘బి’ అసత్యం
2) ‘ఎ’ అసత్యం, ‘బి’ సత్యం
3) ‘ఎ’, ‘బి’ సత్యం
4) ‘ఎ’, ‘బి’ అసత్యం
27. సజీవులకు, నిర్జీవులకు నడుమ ఏర్పడే మధ్యస్థ అంశాలు?
ఎ) చనిపోయిన మొక్కలు
బి) చనిపోయిన జంతువులు
సి) కుళ్లిపోయిన మొక్కలు జంతువులు
1) ఎ, బి 2) బి, సి
3) సి 4) ఎ, బి, సి
28. సూక్ష్మ దర్శినిలో అక్ష కటకం, వస్తు కటకం ఉండే భాగం?
1) నిర్మాణాత్మక భాగం
2) దృశ్య విభాగం
3) స్థూల సంవరిణి 4) సూక్ష్మ సంవరిణి
29. జీవి యొక్క అవసరాలన్నింటిని సంపూర్ణంగా తీర్చగలిగిన పరిసరం?
1) జీవ ప్రపంచం 2) నిర్ణీత ప్రపంచం
3) ఆవాసం 4) కొండ పరిసరాలు
30. ఒక ఆవాసంలో సజీవ అంశాలు?
1) మొక్కలు 2) జంతువులు
3) సూక్ష్మజీవులు
4) మొక్కలు, జంతువులు, సూక్ష్మ జీవులు
31. ఒక ఆవాసంలో నీరు, గాలి, మృత్తిక, కాంతి, ఉష్ణోగ్రత, తేమ మొదలైన అంశాలు?
1) సజీవ అంశాలు
2) నిర్జీవ అంశాలు
3) భౌమిక అంశాలు
4) జలావాసాంశాలు
32. రుతువుల ఆధారంగా తమ ఆవాసాన్ని మార్చుకునే జీవులు?
1) సముద్ర తాబేళ్లు 2) పులస చేపలు
3) పెలికాన్ పక్షులు 4) గిజిగాడు పక్షులు
33. కింది వాటిని జతపరచండి?
విభాగం-ఎ విభాగం-బి
1) కొలను ఉపరితలం ఎ) గడ్డిమొక్కలు, కప్పలు, కొంగలు, పీతలు, చేపలు
2) కొలను అంచులు బి) నీటి బొద్దింక, చేపలు దోమల డింభకాలు
3) కొలను మధ్య భాగం సి) హైడ్రిల్లా, ఆల్చిప్పలు
4) కొలను అడుగు డి) నీటిపై గుడ్రంగా తిరిగే కీటకం గుంట గురుగు
1) 1-ఎ, 2-సి, 3-డి, 4-ఎ
2) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
3) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
4) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
34. బ్యాక్టీరియా, శిలీంధ్రాలు ఉండే చెట్టు భాగం?
1) కొమ్మలు, ఆకులు
2) కాండం
3) వేర్లు
4) చెట్టు మొదలు, కాండం మధ్య
35. మన రాష్ట్రంలో కోరింగా మడ అడవులు వ్యాపించి ఉన్న ప్రాంతం?
1) విశాఖపట్నం, పశ్చిమ గోదావరి
2) విజయనగరం, తూర్పుగోదావరి
3) కృష్ణా, గుంటూరు
4) విశాఖపట్నం, తూర్పుగోదావరి
36. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్న అతి పెద్ద మంచినీటి సరస్సు?
1) పులికాట్ 2) కొల్లేరు
3) లేక్‌వ్యూ 4) కొల్లేరు, పులికాట్
37. నెల్లూరు జిల్లా వద్ద ఉన్న ఉప్పు నీటి సరస్సు?
1) కొల్లేరు 2) పులికాట్
3) లేక్ వ్యూ 4) పెలికాన్ సరస్సు
38. కొల్లేరు, పులికాట్ సరస్సులకు ప్రతి సంవత్సరం పెలికాన్ పక్షులు వలస వచ్చే సమయం?
1) ఆగస్టు- సెప్టెంబర్
2) సెప్టెంబర్-అక్టోబర్
3) అక్టోబర్-మార్చి
4) మార్చి-అక్టోబర్
సమాధానాలు
1-4 2-3 3-3 4-1 5-2 6-3 7-2 8-3 9-2 10-4 11-3 12-2 13-2 14-3 15-4 16-1 17-2 18-4 19-2 20-2
21-3 22-3 23-2 24-3 25-4 26-3 27-4 28-2 29-3 30-4 31-2 32-2 33-2 34-3 35-4 36-2 37-2 38-3
1. ఉడికించి వండే ఆహార పదార్థాలు?
1) అన్నం, పప్పు
2) బజ్జీలు, సమోసాలు
3) మొక్కజొన్న, రొట్టెలు
4) మామిడికాయ, పెరుగుపచ్చడి
2. నూనెలో వేయించి వండే ఆహార పదార్థాలు?
1) అన్నం, పప్పు
2) బజ్జీలు, సమోసాలు
3) మొక్కజొన్న, రొట్టెలు
4) మాంసం
3. నిప్పుల మీద కాల్చి వండే ఆహార పదార్థాలు?
1) మొక్కజొన్న, రొట్టెలు, మాంసం
2) అన్నం, పప్పు
3) బజ్జీలు, సమోసాలు
4) పెరుగుపచ్చడి
4. వేడి చేయకుండానే కలిపి తయారు చేసే ఆహారం?
1) మొక్కజొన్న 2) మాంసం
3) మామిడికాయ, పెరుగుపచ్చడి
4) ఇడ్లీలు
5. జొన్నలు ఎక్కువగా పండే రాష్ట్రం?
1) తెలంగాణ 2) ఆంధ్రప్రదేశ్
3) రాజస్థాన్ 4) గుజరాత్
6. చిరుధాన్యాల్లో ఎక్కువగా ఉండేవి?
1) పిండి పదార్ధాలు 2) ప్రొటీన్లు
3) విటమిన్లు 4) ఖనిజ లవణాలు
7. శరీరానికి శక్తిని ఇచ్చే పదార్థాలు?
1) కార్బోహైడ్రేట్లు 2) కొవ్వులు
3) 1, 2 4) విటమిన్లు
8. కొత్తకణాలు ఏర్పడటంతో, గాయాలు, పుండ్లను మాన్పడంలో ఉపయోగపడే పోషకాలు?
1) కార్బోహైడ్రేట్లు 2) ప్రొటీన్లు
3) విటమిన్లు 4) ఖనిజ లవణాలు
9. పులియబెట్టి తయారు చేసిన ఆహారపదార్థాల్లో ఉండే పోషకాలు?
1) కార్బోహైడ్రేట్లు 2) ప్రొటీన్లు
3) విటమిన్లు 4) ఖనిజ లవణాలు
10. శరీరానికి తక్కువ పరిమాణంలో అవసరమయ్యేవి ఏవి?
1) కార్బోహైడ్రేట్లు 2) ప్రొటీన్లు
3) విటమిన్లు, ఖనిజ లవణాలు
4) పీచు పదార్థాలు
11. టమాటాలో నుంచి లభించే శక్తి క్యాలరీల్లో?
1) 21 2) 32
3) 22 4) 56
12. పండ్లను నిల్వ చేసే పదార్థాలు?
1) చక్కెర పానకం, తేనె
2) నూనెలు 3) ఉప్పు
4) కారం
13. పండ్లు, కూరగాయలను ఉపయోగించి వివిధ ఆకారాలను తయారు చేయడం?
1) హెర్బేరియం 2) అక్వేరియం
3) వెజిటేబుల్ కార్వింగ్ 4) ఉడ్ కార్వింగ్
14. ఆహారంలో ఏ పోషకాలను గుర్తించేందుకు అయోడిన్ పరీక్ష నిర్వహిస్తాం?
1) పిండి పదార్థాలు 2) కొవ్వులు
3) ప్రొటీన్లు 4) విటమిన్లు
15. ఆహారాన్ని తెల్ల కాగితంపై రుద్దినపుడు అది పారదర్శకంగా మారితే, దానిలో ఉండే పోషకాలు?
1) కార్బోహైడ్రేట్లు 2) ప్రొటీన్లు
3) నూనెలు 4) కొవ్వులు
16. 2శాతం కాపర్ సల్ఫేట్ ద్రావణం, 10 శాతం సోడియం, హైడ్రాక్సైడ్ ద్రావణంతో నిర్థారించే పోషక పదార్థాలు?
1) కార్బోహైడ్రేట్లు 2) ప్రొటీన్లు
3) పీచు పదార్థాలు 4) ఖనిజ లవణాలు
17. మన శరీరంలో జీర్ణం కాని కార్బోహైడ్రేట్స్?
1) ప్రోటీన్లు 2) విటమిన్లు
3) పీచు పదార్థాలు 4) ఖనిజ లవణాలు
18. ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త ?
1) లెవోయిజర్ 2) గెలీలియో
3) ఇంజన్ మౌజ్ 4) ప్రీస్ట్టీలీ
19. స్కర్వీ వ్యాధి చికిత్సకు సరైన ఆహారాన్ని సూచించినది?
1) లెవోయిజర్ 2) ఇంజన్ యౌజ్
3) జేమ్స్ లిండ్స్ 4) గెలీలియో
20. దీర్ఘకాలపు పంటలకు ఉదాహరణ?
1) జొన్న, కందులు
2) పెసలు, మినుములు
3) జొన్న, పెసలు
4) కందులు, మినుములు
21. స్వల్పకాలిక పంటలకు ఉదాహరణ?
1) జొన్న, కందులు
2) పెసలు, మినుములు
3) జొన్న, పెసలు
4) కందులు, మినుములు
22. అరబిక్ భాషలో ఖరీఫ్ అంటే?
1) పొలం 2) ధాన్యం
3) వర్షం 4) పంట
23. అరబిక్ భాషలో రబీ అంటే?
1) పొలం 2) ధాన్యం
3) వర్షం 4) చలికాలం
24. దీర్ఘదీప్తి కాల మొక్క ఏది?
1) గోధుమ 2) మొక్కజొన్న
3) పత్తి 4) వరి
సమాధానాలు
1-1 2-2 3-1 4-3 5-3 6-1 7-3 8-2 9-3 10-3 11-3 12-1 13-3 14-1 15-4 16-2 17-3 18-1 19-3 20-1
21-2 22-3 23-4 24-1
టి. క్రిష్ణ
ఏకేఆర్ స్టడీసర్కిల్,
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?