Telangana History – Groups Special | భారతీయ సాహిత్యంలో తొలి ఉర్దూ కవయిత్రిగా ఎవరిని పరిగణిస్తారు?
గతవారం తరువాయి..
589. హైదరాబాద్‌లోని క్రైస్తవులు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండాలని కోరుతూ ‘క్రైస్తవ మిషనరీలు-రాజకీయాలు’ శీర్షికతో ‘ద పయనీర్’ పత్రికలో ఎవరు వ్యాసం రాశారు?
a) మిస్టర్ గిల్డర్ b) హైమన్ డార్ఫ్
c) సిడ్నీ కాటన్ d) డేవిడ్సన్
జవాబు: (a)
590. ఆర్య సమాజ స్థాపకుడు దయానంద సరస్వతి రచించిన ‘సత్యార్థ ప్రకాశ్’ను తెలుగులోకి ఎవరు అనువదించారు?
a) స్వామి నిత్యానంద బ్రహ్మచారి
b) పండిత్ నరేంద్రజీ
c) నారాయణరావు పవార్
d) ఆదిపూడి సోమనాథరావు
జవాబు: (d)
591. లోకమాన్య తిలక్ ప్రారంభించిన గణపతి ఉత్సవాలు హైదరాబాద్‌లో ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి?
a) 1896 b) 1897
c) 1895 d) 1893
జవాబు: (c)
592. సికింద్రాబాద్‌లో 1862లో మహబూబ్ కాలేజీని ఎవరు స్థాపించారు?
a) మీర్ మహబూబ్ అలీఖాన్
b) సాలార్ జంగ్-1
c) సోమసుందరం ముదలియార్
d) కొమర్రాజు లక్ష్మణరావు
జవాబు: (c)
వివరణ: 1872లో తెలంగాణలో మొదటి గ్రంథాలయాన్ని స్థాపించింది కూడా సోమసుందరం ముదలియార్. దీన్ని 1884లో మహబూబియా కళాశాలలో విలీనం చేశారు.
593. తెలుగు భాషా పరీక్షల నిర్వహణ కోసం ప్రైవేటుగా కొమర్రాజు లక్ష్మణరావు ప్రారంభించిన పరీక్ష కేంద్రం ఏది?
a) ఆంధ్ర సారస్వత పరిషత్తు
b) తెలుగు భాషా నిలయం
c) తెలుగు సాహితీ పరిషత్తు
d) విజ్ఞాన పరిషత్తు జవాబు: (d)
594. కింది వాటిలో సరైనవి?
1. విజ్ఞాన చంద్రికా మండలిని వట్టికోట ఆళ్వారుస్వామి స్థాపించాడు
2. ఆంధ్ర చంద్రికా గ్రంథమాలను సురవరం ప్రతాపరెడ్డి స్థాపించాడు
a) 1 b) 2
c) 1, 2 d) 1, 2 సరైనవి కాదు
జవాబు: (d)
వివరణ: విజ్ఞాన చంద్రికా మండలి తెలంగాణలో తొలి గ్రంథమాల. కొమర్రాజు లక్ష్మణరావు ఈ గ్రంథమాలను 1906లో స్థాపించాడు. ఆంధ్ర చంద్రికా గ్రంథమాలను మాడపాటి హనుమంతరావు స్థాపించాడు. ఇది ‘తెలంగాణ ఆంధ్రోద్యమ చరిత్ర’ను ప్రచురించింది.
595. వైదిక ధర్మ గ్రంథమండలిని ఎవరు స్థాపించారు?
a) మాడపాటి హనుమంతరావు
b) మంత్రిప్రగడ వేంకటేశ్వరరావు
c) మంత్రిప్రగడ భుజంగరావు
d) ఆదిపూడి సోమనాథరావు
జవాబు: (b)
596. విజ్ఞాన వర్ధినీ పరిషత్తు సభ్యులు స్థాపించిన ‘విజ్ఞాన వర్ధిని గ్రంథావళి’కి కార్యదర్శిగా ఎవరు ఉన్నారు?
a) కేశవపంతుల నరసింహశాస్త్రి
b) మాడపాటి హనుమంతరావు
c) సురవరం ప్రతాపరెడ్డి
d) కేశవరావు కోరాట్కర్ జవాబు: (a)
597. అణాగ్రంథ మాల ప్రచురించిన ‘జాగీరు ప్రజలు’ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
a) మాడపాటి హనుమంతరావు
b) మందుముల నరసింగరావు
c) కాళోజీ నారాయణరావు
d) సురవరం ప్రతాపరెడ్డి జవాబు: (d)
వివరణ: జాగీరు ప్రజలు రచనలో సురవరం ప్రతాపరెడ్డికి ఉమ్మెత్తల కేశవరావు సహరచయితగా వ్యవహరించారు.
598. చివరి నిజాం కాలంనాటి తెలంగాణ సామాజిక జీవితాన్ని చిత్రించే ప్రజల మనిషి, గంగు నవలల రచయిత ఎవరు?
a) వట్టికోట ఆళ్వారుస్వామి
b) దాశరథి రంగాచార్య
c) పైడిమర్రి వెంకట సుబ్బారావు
d) దాశరథి కృష్ణమాచార్య జవాబు: (a)
వివరణ: రామప్ప రభస, జైలులోపల కథలు ఆళ్వారుస్వామి ఇతర రచనలు.
599. ఆంధ్రకేసరి గ్రంథమాలను ఎవరు స్థాపించారు?
a) వట్టికోట ఆళ్వారుస్వామి
b) ముదిగొండ వీరభద్రయ్య
c) గుండవరం హనుమంతరావు
d) బూరుగుల రామకృష్ణారావు
జవాబు: (c)
600. యువతరంలో ఆధునిక భావాలు పాదుకొల్పడానికి ‘యంగ్ మెన్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ (వైఎంఐఎస్)’ని ఎవరు స్థాపించారు?
a) సాలార్జంగ్- 1
b) సరోజినీ నాయుడు
c) అఘోరనాథ ఛటోపాధ్యాయ
d) సోమసుందరం ముదలియార్
జవాబు: (c)
వివరణ: దీన్ని చాదర్‌ఘాట్‌లో 1886 ఆగస్ట్ 8న స్థాపించారు.
601. నిజాం రాజ్యంలో ‘హమ్దర్ద్’ పాఠశాల, ‘ప్రేమ’ పత్రిక, హేమాయతనం అనే ఆశ్రమాన్ని ఎవరు స్థాపించారు?
a) స్వామి రామానంద తీర్థ
b) బారిస్టర్ రుద్ర
c) ఆదిరాజు వీరభద్రరావు
d) తారానాథ్ జవాబు: (d)
వివరణ: తారానాథ్ ది హిందూ పత్రికలో నిజాం ఉస్మాన్ అలీఖాన్‌ను ‘ఇండియన్ డయ్యర్’ అని విమర్శించాడు.
602. జాతీయ కాంగ్రెస్ ప్రభావంతో 1918లో హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీని ఎవరు ఏర్పాటు చేశారు?
a) మాడపాటి హనుమంతరావు
b) వామనరావు నాయక్
c) పండిత్ నరేంద్రజీ
d) పండిత్ వినాయక్‌రావు విద్యాలంకార్
జవాబు: (b)
వివరణ: వామనరావు నాయక్ గుల్బర్గాలో నూతన విద్యాలయ పాఠశాలను ప్రారంభించాడు.
603. త్రిలింగ ఆయుర్వేద విద్యాపీఠం ఎక్కడ స్థాపించారు?
a) హైదరాబాద్ b) మహబూబ్‌నగర్
c) నిజామాబాద్ d) వరంగల్లు
జవాబు: (d)
వివరణ: త్రిలింగ ఆయుర్వేద విద్యాపీఠానికి మాదిరాజు రామకోటేశ్వర రావు కార్యదర్శిగా సేవలందించారు.
604. తెలంగాణలో గాంధీజీ ఎన్నిసార్లు పర్యటించారు?
a) 3 b) 2 c) 1 d) 4
జవాబు: (a)
వివరణ: 1929, 1934, 1946 సంవత్సరాల్లో గాంధీజీ తెలంగాణలో పర్యటించారు.
605. ప్రముఖ జాతీయోద్యమ నాయకురాలు అరుణా అసఫ్ అలీ హైదరాబాద్‌లో ఎప్పుడు పర్యటించారు?
a) 1945 b) 1946
c) 1947 d) 1948
జవాబు: (b)
606. తెలంగాణ సాయుధ పోరాట గీతాలు, వాటి రచయితలను జతపరచండి.
A. బండెనక బండిగట్టి 1. సుద్దాల హనుమంతు
B. పల్లెటూరి పిల్లగాడా 2. బండి యాదగిరి
C. సైసై గోపాలరెడ్డి.. 3. రావెళ్ల వెంకటరామారావు
D. కదనాన శత్రువుల 4. తిరునగరి
a) A-1, B-2, C-3, D-4
b) A-2, B-3, C-4, D-1
c) A-2, B-1, C-4, D-3
d) A-2, B-3, C-1, D-4
జవాబు: (c)
607. తెలంగాణ నుంచి వెలువడిన తొలి తెలుగు నవలగా దేన్ని పరిగణిస్తారు?
a) ప్రజల మనిషి
b) కంబుకంధర చరిత్ర
c) చిల్లరదేవుళ్లు d) మృత్యుంజయులు
జవాబు: (b)
వివరణ: కంబుకంధర చరిత్రను తడకమళ్ల
వేంకటకృష్ణారావు రచించాడు.
608. నిజాం ప్రభుత్వం మగ్గం మీద విధించిన ‘మోతుర్ఫా’ పన్నును నిరసిస్తూ ‘మోతుర్ఫా’ అనే పుస్తకం రచించింది ఎవరు?
a) మాడపాటి హనుమంతరావు
b) బొజ్జం నరసింహులు
c) మాటేటి పాపయ్య d) చిరాగు వీరన్న
జవాబు: (c)
609. భారతీయ సాహిత్యంలో తొలి ఉర్దూ కవయిత్రిగా ఎవరిని పరిగణిస్తారు?
a) జిలానీ భాను
b) ఖైరున్నీసా బేగం
c) సౌగ్ర హుమాయూన్ మీర్జా
d) మహాలఖా చందాబాయి
జవాబు: (d)
610. దేశంలో డిగ్రీ పట్టా పొందిన మొదటి ముస్లిం మహిళ ఎవరు?
a) సౌగ్ర హుమాయూన్ మీర్జా
b) తయ్యబా బేగం సాహిబా బిల్గ్రామి
c) ఖైరున్నీసా బేగం d) తయ్యబా బేగం
జవాబు: (b)
వివరణ: తయ్యబా బేగం సాహిబా బిల్గ్రామి ప్రముఖ విద్యావేత్త సయ్యద్ హసన్ బిల్గ్రామి కుమార్తె.
611. హైదరాబాద్‌లో మొదటి డొమెస్టిక్ సైన్స్ కాలేజీని ఎవరు స్థాపించారు?
a) తయ్యబా బేగం b) సరోజినీ నాయుడు
c) ఇల్లిందల సరస్వతీదేవి
d) పద్మజా నాయుడు జవాబు: (a)
వివరణ: డొమెస్టిక్ సైన్స్ కాలేజీకి ప్రిన్సిపాల్‌గా కూడా తయ్యబా వ్యవహరించారు. ఆమె ఆర్ట్స్ క్రాఫ్ట్ అధ్యాపకురాలు.
612. బాలబోధ, వెంకట రమణ శతకం, శ్రీనివాస శతకం, శివకుమార విజయం, దశావతార వర్ణన అనే రచనలు ఎవరు చేశారు?
a) రూప్ఖాన్పేట రత్నమ్మ
b) ఎల్లాప్రగడ సీతాకుమారి
c) ఇల్లందుల సరస్వతీదేవి
d) సోమరాజు ఇందిరాదేవి జవాబు: (a)
613. 1960లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి, భారతదేశంలో మంత్రి పదవి స్వీకరించిన తొలి ముస్లిం మహిళ ఎవరు?
a) తయ్యబా బేగం b) మాసుమా బేగం
c) ప్రిన్సెస్ దుర్రేషెహవర్
d) తయ్యబా బేగం సాహిబా బిల్గ్రామి
జవాబు: (b)
వివరణ: దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలో మాసుమా బేగం సాంఘిక సంక్షేమ, ముస్లిం ఎండోమెంట్స్ మంత్రిగా పనిచేశారు.
614. తిరుమల రామచంద్ర ఆత్మకథ ‘హంపీ నుంచి హరప్పా దాకా’లో కింది ఎవరి జీవిత వివరాలు ఉన్నాయి?
a) మల్లు స్వరాజ్యం
b) ఇల్లిందల సరస్వతీదేవి
c) సంగం లక్ష్మీబాయమ్మ
d) పద్మజా నాయుడు జవాబు: (c)
వివరణ: సంగం లక్ష్మీబాయమ్మ హైదరాబాద్‌లో ‘ఇందిరా సేవాసదన్ (ఐఎస్ సదన్)’ అనే అనాథాశ్రమాన్ని స్థాపించారు.
615. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో ‘వజ్రాయుధం’ అనే కవితా సంపుటిని రచించింది ఎవరు?
a) శ్రీశ్రీ
b) దాశరథి కృష్ణమాచార్యులు
c) కుందుర్తి ఆంజనేయులు
d) ఆవంత్స సోమసుందర్ జవాబు: (d)
వివరణ: కుందుర్తి ఆంజనేయులు ‘తెలంగాణ’ అనే పద్య రూపకాన్ని రచించాడు. ఇందులో తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఆధునిక వీర భారతం అని పేర్కొన్నాడు.
616. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంతో సాగే ‘మా భూమి’ నాటకాన్ని ఎవరు రచించారు?
a) సుంకర, వాసిరెడ్డి
b) వట్టికోట ఆళ్వారుస్వామి,
దాశరథి రంగాచార్య
c) ఆవంత్స సోమసుందర్, కుందుర్తి
ఆంజనేయులు
d) శ్రీశ్రీ, దాశరథి కృష్ణమాచార్యులు
జవాబు: (a)
617. తెలంగాణ సాయుధ పోరాటం మీద ‘తెలంగాణా పోరాట స్మృతులు’ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
a) రావి నారాయణ రెడ్డి
b) బద్దం ఎల్లారెడ్డి
c) పుచ్చలపల్లి సుందరయ్య
d) ఆరుట్ల రామచంద్రా రెడ్డి
జవాబు: (d)
వివరణ: ఆరుట్ల రామచంద్రా రెడ్డి 1952-62 మధ్య కాలంలో రామాయంపేట శాసనసభ్యుడిగా సేవలందించారు.
- కొల్లిపర, కురవగట్టు శాసనాలు ఎవరి గురించి తెలుపుతాయి? (టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, 2022)
1) శాతవాహనుల చరిత్ర
2) గౌతమీపుత్ర శాతకర్ణి దండయాత్రలు
3) వేములవాడ చాళుక్యుల చరిత్ర
4) కాకతీయుల చరిత్ర
జవాబు: (3)
వివరణ: మొదటి అరికేసరి కొల్లిపర రాగి శాసనం, బీరగృహుడు కురవగట్టు శిలా శాసనం వేయించారు. వీటితోపాటు కరీంనగర్ (రెండో అరికేసరి), వేములవాడ (మూడో అరికేసరి), చెన్నూరు (రెండో అరికేసరి), క్రీ.శ. 946 నాటి కరీంనగర్ శిలా శాసనం, కుర్క్యాల (జినవల్లభుడు), పర్బణి (మూడో అరికేసరి) శాసనాలు కూడా వేములవాడ చాళుక్యుల వివరాలను అందిస్తాయి. - శాతవాహనుల శాసనాలు తెలంగాణ ప్రాంతంలో అనేక మంది హస్త కళాకారుల ఉనికిని నమోదు చేశాయి. కింది హస్త కళాకారులను వారి వృత్తులతో జతపర్చండి.
- (టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, 2022) హస్తకళాకారులు వృత్తులు
A. కులరికులు 1. రాతిని పాలిష్ చేసేవారు
B. మణికారులు 2. కుమ్మరులు
C. మితికలు 3. చేనేతవారు
D. కోలికులు 4. ఇనుము పనిచేసే వారు
5. నగలు చేసేవారు
సరైన జవాబును ఎంచుకోండి?
1) A-4, B-3, C-5, D-1
2) A-3, B-2, C-5, D-4
3) A-2, B-5, C-1, D-3
4) A-5, B-2, C-4, D-3
జవాబు: (3)
- ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ భవనం ఆర్కిటెక్చరల్ డిజైనర్ ఎవరు?
(టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, 2022)
1) ఇంగ్లిష్ ఆర్కిటెక్ట్ జాన్ ఏబెల్
2) ఈజిప్టు ఆర్కిటెక్ట్ అలీ ఖాలిది ఎలేవ
3) స్పెయిన్ ఆర్కిటెక్ట్ ఆండ్రియా పల్లాడియో
4) బెల్జియన్ ఆర్కిటెక్ట్ ఎర్నెస్ట్ జాస్పర్
జవాబు: (4) - కాకతీయుల కాలం నాటి ‘ఆయగార్ల’ వ్యవస్థలో కింది కులాల్లో దేన్ని చేర్చలేదు? (టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, 2022)
1) కంసాలి 2) మంగలి
3) కుమ్మరి 4) కోమటి
జవాబు: (4)
హర్షవర్ధన్ చింతలపల్లి
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు