Sports Current Affairs | క్రీడలు
సాత్విక్-చిరాగ్
భారత యువ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించారు. ఇండోనేషియా ఓపెన్ డబుల్స్ బ్యాడ్మింటన్ టైటిల్ గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత డబుల్స్ ప్లేయర్లుగా నిలిచారు. జూన్ 18న జకార్తాలో జరిగిన బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్-1000 టోర్నీ పురుషుల డబుల్స్ ఫైనల్లో సాత్విక్-చిరాగ్ జోడీ ఆరోన్ చియా-సో వూ యిక్ (మలేషియా) జోడీపై విజయం సాధించింది.
కార్తీక్-సిద్ధాంత్
భారత యువ టెన్నిస్ ప్లేయర్, తెలంగాణ ఆటగాడు గంటా సాయి కార్తీక్ రెడ్డి 15కే ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టోర్నీ డబుల్స్ టైటిల్‌ను గెలిచాడు. జకార్తాలో జూన్ 18న జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్ మ్యాచ్‌లో కార్తీక్-సిద్ధాంత్ జోడీ సొరా ఫుకుడా-టొమోహిరో మసబయాషి (జపాన్) జోడీపై విజయం సాధించింది.
సునీల్ ఛెత్రి
ఆసియా ఫుట్‌బాల్‌లో అత్యధిక అంతర్జాతీయ గోల్స్ సాధించిన ఆటగాళ్లలో భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి రెండో స్థానంలో నిలిచాడు. జూన్ 21న పాకిస్థాన్‌తో శాఫ్ కప్ మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించడంతో అతడి గోల్స్ సంఖ్య 90కి చేరింది. అతడికిది 138వ మ్యాచ్. ఇరాన్ ఆటగాడు అలీ దాయ్ 149 మ్యాచుల్లో 109 గోల్స్‌తో మొదటి స్థానంలో ఉన్నాడు. మలేషియా ఆటగాడు దహారి 142 మ్యాచుల్లో 89 గోల్స్‌తో మూడో స్థానంలో ఉన్నాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?