Current affairs Telangana | తెలంగాణ
గ్రీన్ యాపిల్ అవార్డు
తెలంగాణలో నిర్మించిన, పునరుద్ధరించిన 5 నిర్మాణాలకు గ్రీన్ యాపిల్ అవార్డు లభించింది. లండన్‌కు చెందిన గ్రీన్ ఆర్గనైజేషన్ 2023కు గ్రీన్ యాపిల్ అవార్డులను జూన్ 14న ప్రకటించింది. ఈ అవార్డుకు రాష్ట్రంలోని యాదాద్రి ఆలయం (అద్భుతమైన మతపరమైన నిర్మాణాల విభాగంలో), డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం (కార్యస్థల భవనాల విభాగంలో సౌందర్యపరంగా రూపొందించిన కార్యాలయం), పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ప్రత్యేకమైన ఆఫీస్ కేటగిరీలో), దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి (వంతెనల శ్రేణిలో ప్రత్యేక డిజైన్ కోసం), మొజాంజాహీ మార్కెట్ (హెరిటేజ్ విభాగంలో అద్భుతమైన పునరుద్ధరణ, పునర్వినియోగం కోసం) ఎంపికయ్యాయి. గ్రీన్ ఆర్గనైజేషన్‌ను 1994లో ఏర్పాటు చేశారు. గ్రీన్ యాపిల్ పేరుతో అవార్డులను 2016 నుంచి ఏటా ప్రముఖ సంస్థలు, కౌన్సిళ్లు, కమ్యూనిటీలకు అందజేస్తుంది.
తెలంగాణ టాప్
ప్రజా ఫిర్యాదులు పరిష్కరించడంలో తెలంగాణ దేశంలో మొదటిస్థానంలో నిలిచింది. జాతీయస్థాయిలో సామాన్యుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించేందుకు సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ రెడ్రసల్ అండ్ మానిటరింగ్ సిస్టం (సీపీజీఆర్ఏఎంఎస్) పేరుతో ఆన్లైన్ పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఎవరైనా దీనిలో ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకు రాష్ర్టాలవారీగా గ్రీవెన్స్ రెడ్రసల్ ఆఫీసర్స్ (జీఆర్వో) ఉంటారు. వివిధ రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల జీఆర్‌వోల సమావేశాన్ని నిర్వహించి ఆ నివేదికను జూన్ 14న విడుదల చేసింది. 15 వేలలోపు ఫిర్యాదులున్న రాష్ర్టాలను గ్రూప్-డి కేటగిరీలో చేర్చారు. దీనిలో కేటాయించిన ర్యాంకింగ్‌లో తెలంగాణ నంబర్ వన్‌గా నిలువగా.. ఛత్తీస్‌గఢ్ 2వ స్థానంలో నిలిచింది. తెలంగాణ 8 రోజులతో తక్కువ సమయం తీసుకున్న రాష్ట్రంగా టాప్‌లో నిలిచింది. 12 రోజుల సగటు సమయంతో లక్షద్వీప్ రెండో స్థానంలో ఉంది.
అతి ఉత్తమ్
హైదరాబాద్‌లోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (జీఎస్ఐటీఐ)కు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌ఏబీఈటీ) ‘అతి ఉత్తమ్’ గుర్తింపును జూన్ 13న ఇచ్చింది. ఎన్‌ఏబీఈటీ, కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ (సీబీసీ) బృందం ఆన్ సైట్ అసెస్మెంట్ను నిర్వహించింది. అన్ని ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు, మెథడాలజీల తనిఖీ ఆధారంగా అంచనా వేసి ఈ గుర్తింపును ఇచ్చింది. జీఎస్ఐటీఐని 1976లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?