Current Affairs | వార్తల్లో వ్యక్తులు
నిర్మలా లక్ష్మణ్
ది హిందూ గ్రూప్ పబ్లిషింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (టీహెచ్జీపీపీఎల్) చైర్‌పర్సన్‌గా నిర్మలా లక్ష్మణ్ జూన్ 5న నియమితులయ్యారు. ఆమె ఈ పదవిలో మూడేండ్లు ఉంటారు. ఆమె పోస్ట్-మోడరన్ లిటరేచర్‌లో పీహెచ్డీ చేశారు. టీహెచ్జీపీపీఎల్ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. దీన్ని 1878లో జీ సుబ్రమణ్య అయ్యర్ స్థాపించారు. ఇది మొదట వారపత్రికగా ప్రారంభమైంది. 1889లో దినపత్రికగా మారింది. ఇది 1995లో ఇంటర్నెట్ ఎడిషన్‌ను ప్రారంభించిన మొదటి భారతీయ వార్తాపత్రిక.
జోయీతా గుప్తా
భారత సంతతి సైంటిస్ట్ జోయీతా గుప్తా ప్రతిష్ఠాత్మక స్పినోజా పురస్కారానికి జూన్ 8న ఎంపికయ్యారు. డచ్ ప్రభుత్వం సైంటిస్టులకు ఇచ్చే ఈ అవార్డును ‘డచ్ నోబెల్’గా పిలుస్తారు. ‘సుస్థిర ప్రపంచం’ అంశంపై ఆమె చేసిన పరిశోధనలకు ఈ అవార్డు దక్కింది. అవార్డుతో పాటు 15 లక్షల యూరోల నగదు గుప్తాకు అందజేస్తారు. జోయీతా యూనివర్సిటీ ఆఫ్ అమ్‌స్టర్‌డామ్‌లో ‘దక్షిణార్ధగోళంలో పర్యావరణం, అభివృద్ధి’ అంశంపై ప్రొఫెసర్‌గా, ఎర్త్ కమిషన్‌కు సహ అధ్యక్షురాలిగా పని చేస్తున్నారు.
అనంతారపు కృష్ణయ్య
డైరెక్టర్,
శ్రీసాయి కోచింగ్ సెంటర్
కోదాడ
9948750605
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?