BIOLOGY | విధులకు ఆటంకం.. జీవక్రియలకు అవరోధం
వ్యాధులు
వ్యాధి: సక్రమంగా పనిచేసే శరీర విధులను తాత్కాలికంగా గాని, శాశ్వతంగా గాని కల్లోలపరిచే పరిస్థితిని వ్యాధి అంటారు. వ్యాధులు రెండు రకాలు అవి. సంక్రమణ వ్యాధులు, అసంక్రమణ వ్యాధులు.
సంక్రమణ వ్యాధులు: ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాపించే వ్యాధులను సంక్రమణ వ్యాధులు అంటారు.
ఉదా: డెంగీ, మలేరియా
అసంక్రమణ వ్యాధులు: ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాపించని వ్యాధులను అసంక్రమణ వ్యాధులు అంటారు.
ఉదా: జన్యు రుగ్మతలు, మూత్రపిండ వ్యాధులు
అంటు వ్యాధులు: వ్యాధి జనక జీవులు ఒక వ్యక్తి నుంచి ఇతర వ్యక్తులకు పలు మార్గాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఇటువంటి వ్యాధులను అంటు వ్యాధులు అంటారు.
ఉదా: కొవిడ్, జలుబు, కండ్ల కలక
వాహకాలు: అస్వస్థతకు గురైన వ్యక్తి నుంచి సూక్ష్మజీవులను అతిథేయిలోకి ప్రవేశింపజేసే జీవులను ‘వాహకాలు’ అంటారు.
ఉదా: దోమలు మలేరియాకు, ఈగలు టైఫాయిడ్కు వాహకాలుగా పనిచేస్తాయి
పరాన్నజీవనం: వేర్వేరు జాతులకు చెందిన రెండు జీవుల మధ్య సహవాసం ఏర్పడినప్పుడు అందులో ఒకజీవి రెండో జీవికి నష్టం కలిగిస్తూ తాను లాభం పొందుతూ జీవిస్తుంది. ఇటువంటి పోషణను పరాన్నజీవనం అంటారు.
- పరాన్నజీవికి ఆహారం, ఆశ్రయం కల్పించే జీవిని అతిథేయి అంటారు.
పొదిగే కాలం: వ్యాధికారక జీవులు శరీరంలో ప్రవేశించినది మొదలు వ్యాధి లక్షణాలు కనిపించేంత వరకు ఉండే కాలాన్ని పొదిగే కాలం (Incubation Period) అంటారు. - మానవుడికి వివిధ రకాల సూక్ష్మజీవుల వల్ల అనేక వ్యాధులు ముఖ్యంగా బ్యాక్టీరియాలు, వైరస్లు, వివిధ రకాల పరాన్నజీవులు అనేక వ్యాధులు కలిగిస్తాయి.
బ్యాక్టీరియాల వల్ల కలిగే వ్యాధులు
కలరా: ఇది ‘విబ్రియోకలరా’ అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది. ఈగలు, దోమలు వాహకాలుగా పనిచేస్తాయి. ఇవి ఆహారాన్ని, నీటిని కలుషితం చేయడం ద్వారా వ్యాధి సంక్రమిస్తుంది. వాంతులు, నీళ్ల విరేచనాలు, కండరాల నొప్పులు వ్యాధి లక్షణాలు.
కుష్ఠు: ఇది ‘మైకో బ్యాక్టీరియం లెప్రె’ అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది. ఈ వ్యాధిని ‘హన్సన్ వ్యాధి’ అని కూడా అంటారు. ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే అంటువ్యాధి. ప్రారంభ దశలో అలసట, తలనొప్పి, ఆకలి తగ్గడం వంటి లక్షణాలతో మొదలై క్రమంగా చర్మంపై పుండ్లు రావడం స్పర్శ లేకపోవడం ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధిని ‘ఫ్లోరోసెంట్ లెప్రసీ యాంటీబాడీ ఎబ్ జాస్టన్ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు.
క్షయ: ఇది మైకో బ్యాక్టీరియం ట్యుబర్క్యూలోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది. గాలి, ఈగలు ఈ వ్యాధికి వాహకాలుగా పనిచేస్తాయి. సాయంత్రం వేళల్లో జ్వరం, శ్లేష్మంతో కూడిన దగ్గు, అలసట, బరువు తగ్గడం, తెమడ రావడం ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి నిర్ధారణకు ‘మాంటెక్స్ పరీక్ష’ నిర్వహిస్తారు. BCG (Bacille Calmatte-Guerin) వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు.
డిప్తీరియా: ఇది కార్నీ బ్యాక్టీరియం డిప్తీరియే అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది. ఈ వ్యాధిని వంగుడు వ్యాధి అనే మరొక పేరుతో పిలుస్తారు. ప్రత్యక్ష స్పర్శ, కలుషిత ఆహారం, బ్యాక్టీరియా సోకికన శ్వాసనాళం నుంచి వచ్చే తుంపరలు ఈ వ్యాధి వాహకాలు. జ్వరం, వాంతులు, గొంతులో గాయం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఈ వ్యాధి లక్షణాలు. దీన్ని షీక్ టెస్ట్ ద్వారా నిర్ధారిస్తారు. DPT (Diphtheria Pertussis Tetanus) వ్యాక్సిన్ను తీసుకోవడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు.
కోరింత దగ్గు: ఇది ‘బొర్డిటెల్లా పెర్టుసిస్’ అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు బ్యాక్టీరియా గాలిలోకి వ్యాపిస్తుంది. దగ్గినప్పుడు చివర్లో ఉఫ్ అనే శబ్దం రావడం వల్ల దీన్ని Whooping Cough అంటారు. చలి, పొడిదగ్గు, తీవ్రమైన దగ్గు, ఎగశ్వాస ఈ వ్యాధి లక్షణాలు.
టెటానస్: ఈ వ్యాధి ‘క్లాస్ట్రీడియం టెటానై’అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. దవడలోని కండరాల నొప్పులు, మెడ కండరాల నొప్పులు, మింగడం కష్టం అవుతుంది. DPT టీకాను తీసుకోవడం వల్ల ఈ వ్యాధిని నివారించవచ్చు.
టైఫాయిడ్: ఈ వ్యాధి ‘సాల్మోనెల్లా టైఫీ’ అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. దీన్నే ‘ఎంటరిక్ జ్వరం’ అంటారు. ఈగలు, కలుషిత ఆహారం, కలుషిత నీరు వ్యాధి వాహకాలుగా పనిచేస్తాయి. విడువని జ్వరంతో ఈ వ్యాధి ప్రభావితమవుతుంది. వైడల్ టెస్ట్ ద్వారా టైఫాయిడ్ను నిర్ధారిస్తారు.
న్యుమోనియా: ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో మరణానికి అత్యంత సాధారణ కారకం న్యుమోనియా. ఇది ఊపిరితిత్తులకు సోకే ఇన్ఫెక్షన్. వాయునాళ గోణులు చీముతో నిండి ఉంటాయి. ‘స్ట్రెప్టోకోకస్ న్యుమోనియే’ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి కలుగుతుంది.
వైరస్ల వల్ల కలిగే వ్యాధులు
తట్టు: ఇది పారామిక్సో వైరస్ వల్ల సంక్రమిస్తుంది. ఈవ్యాధికి మరొక పేరు ‘రుబియోల’. దగ్గు, జ్వరం, జలుబు, కళ్లు ఎరుపెక్కి నీరు కారడం ఈ వ్యాధి లక్షణాలు.
ఆటలమ్మ: ఇది ‘వరిస్టిల్లా జోస్టర్’ అనే వైరస్ వల్ల సంక్రమిస్తుంది. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, నీరసం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి సోకిన రెండు, మూడు రోజుల్లో శరీరంపై ఎర్రటి పొక్కులు ఏర్పడతాయి. ముక్కు, నోటి నుంచి వెలువడే తుంపర్ల ద్వారా శరీరంపై ఉన్న నీటి పొక్కుల ద్వారా ఈ వ్యాధి పక్కవారికి వ్యాపిస్తుంది.
గవద బిళ్లలు: ఇది ‘మిక్సో వైరస్ పెరోటైడిస్’ అనే వైరస్ వల్ల సంక్రమిస్తుంది. చెవికి ముందు ఉండే లాలాజల గ్రంథి అయిన ‘పెరోటిడ్ గ్రంథి’ వాపునకు గురై నొప్పిగా ఉంటుంది. ఇది అంటువ్యాధి. వైరస్లు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి.
ప్రొటోజోవన్ వ్యాధులు
అమీబియాసిస్: ఇది ఎంటామీబా హిస్టోలిటికా అనే ప్రొటోజోవన్ పరాన్నజీవి వల్ల సంక్రమిస్తుంది. ఈగలు, బొద్దింకలు యాంత్రిక వాహకాలుగా పనిచేస్తాయి. కలుషిత ఆహారం, నీటి వల్ల సంక్రమిస్తుంది. అమీబిక్ విరేచనాలు కలుగుతాయి.
బోదకాలు (ఫైలేరియా)
- బోదకాలు వ్యాధిని ఫైలేరియా లేదా ఎలిఫెంటియాసిస్ అంటారు. బోదకాలు వ్యాధి ఆడ క్యులెక్స్ దోమ కుట్టడం వల్ల వస్తుంది. కొక్కెం ఆకారంలో ఉన్న ఉకరేరియా బాంక్రాప్టి అనే ప్రొటోజోవన్ వల్ల వస్తుంది. ఈ వ్యాధి సోకినవారి కాళ్లలో ఉండే శోషరస గ్రంథులు వాపునకు గురవుతాయి. ఈ వ్యాధి మొదటి దశలో ఉన్నప్పుడు ‘డై మిథైల్ కార్బోజెన్’ అనే మందును వాడతారు. క్రమం తప్పకుండా రెండేళ్లు వాడితే పూర్తిగా నయం అవుతుంది.
- ప్రొటోజోవా, హెల్మింథిస్, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్లు మొదలైన వివిధ జీవులు మానవుడికి వ్యాధులను కలిగిస్తాయి. వీటిని వ్యాధి జనకాలు అంటారు.
ఎయిడ్స్
- ఎయిడ్స్ అంటే ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిసియన్సీ సిండ్రోమ్.
- ఎయిడ్స్ వ్యాధిని కలుగజేసే వైరస్- హెచ్ఐవీ
- హెచ్ఐవీ అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిసియన్సీ వైరస్.
- మొట్టమొదటిసారి ఎయిడ్స్ వ్యాధిని ఆఫ్రికా ఖండానికి చెందిన చింపాంజీలో గుర్తించారు.
- మొట్టమొదట ఎయిడ్స్ వ్యాధిగ్రస్థున్ని 1981లో లాస్ఏంజెల్స్ నగరంలో గుర్తించారు.
- హైచ్ఐవీ వైరస్ను మాంటెగ్నర్ అనే శాస్త్రవేత్త1983లో కనుగొన్నాడు.
- భారతదేశంలో మొదటిసారి ఎయిడ్స్ వ్యాధిగ్రస్థున్ని 1986లో చెన్నైలో గుర్తించారు.
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి ఎయిడ్స్ వ్యాధిగ్రస్థున్ని 1987లో హైదరాబాద్లో గుర్తించారు.
- ప్రపంచంలోనే అత్యధికంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులను కలిగి ఉన్న దేశాలు- సౌతాఫ్రికా, నైజీరియా, భారత్
- ఇండియాలో అత్యధికంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులను కలిగి ఉన్న రాష్ర్టాలు- మణిపూర్, ఆంధ్రప్రదేశ్
- తెలంగాణలో అత్యధికంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులున్న జిల్లాలు- హైదరాబాద్, రంగారెడ్డి
- తెలంగాణలో అతితక్కువ ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులున్న జిల్లా- మహబూబ్నగర్
ఎయిడ్స్ సోకడానికి ప్రధాన కారణాలు
- ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులున్న జిల్లాలు- గుంటూరు, తూర్పుగోదావరి
- అక్రమ లైంగిక సంబంధాలు
- అరక్షిత రక్త మార్పిడి
- ఒకరికి వాడిన సిరంజీలు మరొకరికి వాడటం
- తల్లి నుంచి బిడ్డకు పాలద్వారా
- ఎయిడ్స్ ముఖ్య లక్షణాలు
- రాత్రి వేళల్లో చెమటలు రావడం
- జ్వరం
- శరీర బరువును కోల్పోవడం
- తల వెంట్రుకలు రాలిపోవడం
- వ్యాధి నిర్ధారణ పరీక్షలు
- ELISA
- Westran-blat
- PCR l Troidot
నివారణకు ప్రవేశపెట్టిన పథకాలు
NACO (National Aids Control Organisation-1992)
AASHA(AIDS Awarnes Sustainable Holistic Action-2005)
Red-Ribbon-2007 - హెచ్ఐవీ వైరస్ను గుర్తించడానికి రెండు వారాల సమయం పడుతుంది.
- హెచ్ఐవీ వైరస్ శరీరం మొత్తం వ్యాపించడానికి ఆరు నెలల నుంచి ఐదేళ్లు పడుతుంది.
- హెచ్ఐవీలో ఉండే జన్యుపదార్థం- ఆర్ఎన్ఏ
- హెచ్ఐవీలో ఉండే ఎంజైమ్- రివర్స్ ట్రాన్స్ క్రిప్టేజ్
- రివర్స్ ట్రాన్స్ క్రిప్టేజ్ ఎంజైమ్ హెచ్ఐవీ వైరస్ తన రూపాలను మార్చుకోవడానికి సహాయపడుతుంది.
- హెచ్ఐవీ వైరస్ తెల్లరక్త కణాల్లో ఉండే లింఫోసైట్స్పై దాడి చేస్తుంది. కాబట్టి ఆ వ్యక్తి వ్యాధినిరోధక శక్తి తగ్గిపోయి, శరీర బరువును కోల్పోతాడు.
- భారత ప్రభుత్వం ఎయిడ్స్ వ్యాధిగ్రస్థుల కోసం ART ద్వారా చికిత్స అందిస్తుంది.
- ART- Anti Retro Theoropy
- హెచ్ఐవీ వైరస్ మానవుడి శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత 15-30 సెకన్లు మాత్రమే బతకగలుగుతుంది. కానీ వాతావరణం చల్లగా ఉంటే 15-50 సెకన్లు బతుకుతుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు