Current Affairs | జాతీయం
కేఎఫ్వోఎన్
కేరళ ప్రభుత్వం అధికారికంగా కేరళ ఫైబర్ ఆప్టికల్ నెట్వర్క్ (కేఎఫ్వోఎన్)ను జూన్ 5న ప్రారంభించింది. ఇది ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ మొదటి పర్యాయం ముఖ్యమంత్రి అయినప్పుడు పేర్కొన్న ప్రధాన ప్రాజెక్టుల్లో ఇది ఒకటి. ఇంటర్నెట్ హక్కును ప్రాథమిక హక్కుగా ప్రకటించిన మొదటి రాష్ట్రం కేరళ. ఈ రాష్ట్రంలోని అన్ని ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించనుంది. మొదటి దశలో 30 వేల ప్రభుత్వ కార్యాలయాలు, 14,000 బీపీఎల్ కుటుంబాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించాలని నిర్ణయించుకుంది. దీనిలో భాగంగా జూన్ 5 నాటికి 17,412 ప్రభుత్వ ఆఫీసులు, 2105 ఇళ్లకు కనెక్టివిటీ కల్పించింది.
వరుణాస్త్ర
దేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీ సబ్‌మెరైన్ హెవీ వెయిట్ టార్పెడో (హెచ్డబ్ల్యూయూటీ) ‘వరుణాస్త్ర’ను జూన్ 6న విజయవంతంగా పరీక్షించారు. నీటి అడుగున ఉండే లక్ష్యాలను కచ్చితంగా ఛేదించగలదని నేవీ అధికారులు వెల్లడించారు. దీన్ని డీఆర్డీవోకు చెందిన నేవల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లేబొరేటరీ (ఎన్ఎస్టీఎల్) అభివృద్ధి చేసింది. ఇది గంటకు 70 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. సుమారు 600 మీ. లోతు వరకు చొచ్చుకుపోతుంది.
ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్
వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేని పురస్కరించుకొని 5వ ఆహార భద్రతా సూచీని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ జూన్ 7న విడుదల చేశారు. 2022-23కు సంబంధించిన ఈ సూచీని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) రూపొందించింది. ఈ సూచీలో పెద్ద రాష్ర్టాల్లో కేరళ అగ్రస్థానంలో నిలువగా.. తర్వాతి స్థానాల్లో పంజాబ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నిలిచాయి. చిన్న రాష్ర్టాల్లో గోవా మొదటి స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో మణిపూర్, సిక్కిం ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాల్లో జమ్ముకశ్మీర్ మొదటి స్థానంలో నిలువగా.. తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, చండీగఢ్ నిలిచాయి.
అగ్ని ప్రైమ్
అత్యాధునిక బాలిస్టిక్ క్షిపణి ‘అగ్నిప్రైమ్’ను భారత్ తొలిసారి రాత్రివేళ జూన్ 8న విజయవంతంగా ప్రయోగించింది. డీఆర్డీవో తయారు చేసిన ఈ క్షిపణిని ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. గతంలో అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగ పరీక్ష మూడుసార్లు విజయవంతంగా నిర్వహించినప్పటికీ రాత్రివేళ ప్రయోగించడం ఇదే తొలిసారి. దీనిలో రాడార్, టెలిమెట్రీ, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్ ఉన్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?