Disaster Management | జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రచురించే ద్వైవార్షిక పత్రిక పేరు?
1. విపత్తు నిర్వహణపై కిందివాటిలో ఏది శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది?
1) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్
2) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్
3) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్
4) నేషనల్ పోలీస్ అకాడమీ
2. పాఠశాల విపత్తు నిర్వహణ ప్రణాళికలో అంతర్భాగాలు
1) ప్రమాదం గుర్తింపు, అంచనా
2) అధ్యాపకులను పాఠశాల యాజమాన్యాన్ని చైతన్యం చేయడం
3) పటాలను తయారు చేయడం
4) పైవన్నీ
3. భౌతిక శైథిల్యం ఏ మార్పుల వల్ల కలుగుతుంది?
1) వర్షాలు 2) ఉష్ణోగ్రత
3) గాలి దిశ 4) తేమ
4. జాతీయ విపత్తు విధానానికి ఏ సంవత్సరంలో మంత్రివర్గం అనుమతినిచ్చింది?
1) 2009 2) 2008
3) 2007 4) 2010
5. 2005లో ప్రపంచ విపత్తు నిర్వహణ సమావేశం ఎక్కడ జరిగింది?
1) మలేషియా 2) జపాన్
3) ఇండోనేషియా 4) థాయిలాండ్
6. 14వ ఆర్థిక సంఘం ప్రకారం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ 2015-20 కాలానికి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించారు?
1) రూ. 1,429 కోట్లు
2) రూ. 3,429 కోట్లు
3) రూ. 2, 429 కోట్లు
4) రూ. 4,000 కోట్లు
7. ఏ సంవత్సరంలో భారతదేశంలో విపత్తు నిర్వహణ చట్టం చేశారు?
1) 2004 2) 2005
3) 2006 4) 2007
8. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎక్కడ ఉంది?
1) న్యూఢిల్లీ 2) హైద్రాబాద్
3) విశాఖపట్నం 4) కొచ్చిన్
9. భారత్లో విపత్తు నష్ట నివారణకు మొదటి జాతీయ వేదిక ఇతి వృత్తం ఏది?
1) అభివృద్ధిలో ప్రధాన విపత్తు నష్ట నివారణ : నష్టం నుంచి త్వరగా కోలుకొనుట
2) తూర్పుతీరంలో విపత్తుల నివారణ
3) భారత్లో విపత్తుల సంభవం, నివారణ
4) అభివృద్ధిలో ప్రధాన విపత్తు నష్ట తీవ్రతను తగ్గించే జాతీయ దృష్టికోణ ఆవశ్యకత
10. కోస్టల్ వల్నరబిలిటీ ఇండెక్స్ (సీవీఐ) హైదరాబాద్లో విడుదల చేసినవారు ఎవరు?
1) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ
2) జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ
3) భారత వాతావరణ శాఖ
4) జాతీయ సముద్ర సమాచారం సర్వీసుల కేంద్రం
11. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం దేన్ని ఏర్పరిచింది?
1) జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ
2) విపత్తు నిర్వహణ జాతీయ సంస్థ
3) జాతీయ విపత్తు రెస్పాన్స్ ఫోర్స్ అథారిటీ 4) పైవన్నీ
12. విపత్తు నిర్వహణ టీంలో ఉండవలసింది?
1) అన్వేషణ, రక్షణ టీం
2) ప్రథమ చికిత్స టీం
3) అవగాహన పెంపుదల టీం
4) పైవన్నీ
13. విపత్తు నిర్వహణ చట్టం కింద ఏర్పడ్డ యంత్రాంగాలు?
1) జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ
2) రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ
3) జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ
4) పైవన్నీ
14. 1990 దశాబ్దాన్ని ఏ సంస్థ అంతర్జాతీయ ప్రకృతి విపత్తు తగ్గింపు దశాబ్దంగా ప్రకటించింది?
1) ఐక్యరాజ్య సమితి సాధారణ సభ
2) ఏషియన్ అభివృద్ధి బ్యాంక్
3) ప్రపంచ బ్యాంక్
4) యునెస్కో
15. దేశంలోని విపత్తు నిర్వహణ కార్యక్రమాలను సమన్వయం చేసే కేంద్ర మంత్రిత్వశాఖ?
1) గ్రామీణాభివృద్ధి శాఖ
2) రక్షణ శాఖ
3) దేశీయ వ్యవహారాల శాఖ
4) ప్రసారాల శాఖ
16. మొదటి విపత్తు నిర్వహణ మహాసభను ఎప్పుడు ప్రారంభించారు?
1) 29-11-2006
2) 26-10-2005
3) 29-11-2004
4) 29-10-2007
17. భారత్లో కరువుల వల్ల కలిగే అన్ని విపత్తుల వ్యవహారాలకు సంబంధించిన కేంద్ర మంత్రిత్వశాఖ?
1) గృహ మంత్రిత్వ శాఖ
2) వ్యవసాయ మంత్రిత్వ శాఖ
3) గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ
4) ఆర్థిక మంత్రిత్వ శాఖ
18. స్టేట్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు?
1) ముఖ్య కార్యదర్శి 2) ముఖ్యమంత్రి
3) ఆర్థిక కార్యదర్శి 4) ఆర్థిక మంత్రి
19. విపత్తు వల్ల నష్టం జరిగిన ప్రాంతాల్లో ఏ రకమైన అవస్థాపన సౌకర్యాలను కల్పించాలి?
1) రహదారులు, వంతెనల పునర్ నిర్మాణం
2) తాత్కాలిక నివాసాల స్థాయిని పెంచడం
3) తిరిగి స్థాపించిన ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పించడం
4) పైవన్నీ
20. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005 కలిగించేది?
1) డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ స్థాపించడం
2) డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ స్థాపించడం
3) ఎన్ఐడీఎం, ఎన్డీఆర్ఎఫ్ లను స్థాపించడం 4) పైవన్నీ
21. జాతీయ విపత్తు నివారణ దినం?
1) అక్టోబర్ 28 2) అక్టోబర్ 29
3) అక్టోబర్ 30 4) అక్టోబర్ 31
22. ఏ అఖిల భారత సర్వీసు సభ్యుల ప్రాథమిక శిక్షణలో విపత్తు నిర్వహణ ఒక భాగంగా చేర్చడం జరిగింది?
ఎ) ఐఏఎస్ బి) ఐపీఎస్
సి) ఐఎఫ్ఎస్ డి) పైవన్నీ
23. కేంద్రంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అధ్యక్షుడు ఎవరు?
1) ఆర్థిక మంత్రి
2) ప్రధాన మంత్రి
3) సమాచార ప్రసార శాఖ మంత్రి
4) గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
24. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ దేన్ని తయారు చేస్తుంది?
1) నేషనల్ పాలసీ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్
2) నేషనల్ పాలసీ ఆన్ నేచురల్ హజార్డ్స్
3) నేషనల్ పాలసీ ఆన్ డిజాస్టర్ మిటిగేషన్
4) నేషనల్ పాలసీ ఆన్ డిజాస్టర్ అండ్ హజార్డ్స్
25. విపత్తు నిర్వహణ కార్యకలాపాలను సమైక్యపరిచే భారత కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖ?
1) గృహ మంత్రిత్వశాఖ
2) పర్యావరణ మంత్రిత్వ శాఖ
3) వ్యాపార, వాణిజ్య మంత్రిత్వ శాఖ
4) ఆహార మంత్రిత్వశాఖ
26. వరదల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఒక నమూనా బిల్లును తయారు చేయమని ఏ కమిషన్కు సూచించింది?
1) జాతీయ వరదల కమిషన్
2) జాతీయ విపత్తుల కమిషన్
3) కేంద్ర జల కమిషన్
4) కేంద్ర విద్యుత్ కమిషన్
27. విపత్తులను తగ్గించడానికి, పునరావాస కార్యక్రమాల్లో కమ్యూనిటీ భాగస్వామ్యం వల్ల కలిగే ముఖ్యలాభాలు?
1) ధరల తగ్గింపు 2) సామర్థ్యం
3) నిలిపి ఉండటం 4) పైవన్నీ
28. విపత్తు నిర్వహణలో అవసరమైన ముఖ్యమైన అంశాలేవి?
1) పరిస్థితిని గురించి పూర్తి జ్ఞానం
2) స్పష్టత
3) సంక్షిప్తత 4) పైవన్నీ
29. జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి, దాని ప్రతి ఫలం?
1) 11వ ఆర్థిక కమిషన్
2) 12వ ఆర్థిక కమిషన్
3) 13వ ఆర్థిక కమిషన్ 4) ఏదీకాదు
30. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రచురించే ద్వైవార్షిక పత్రిక పేరు?
1) డిజాస్టర్ అండ్ డెవలప్మెంట్
2) డిజాస్టర్ ఇండియా
3) డిజాస్టర్ మిటిగేషన్
4) ఇండియన్ డిజాస్టర్
31. విపత్తు నిర్వహణ సిబ్బంది దేనిలో శిక్షణ పొందాలి?
1) ప్రాథమిక చికిత్సలో
2) పరిశుభ్రతలో
3) భయాందోళనపై సలహా ఇవ్వడంలో
4) పైవన్నీ
32. విపత్తు సంకటం తగ్గుదల కార్యక్రమంతో కూడిన నూతన కార్యక్రమం వ్యవసాయ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యక్రమం. అది ఏది?
1) రాజీవ్ ఆవాస్ యోజన
2) జాతీయ తాగునీటి మిషన్
3) రాష్ట్రీయ గ్రామ సడక్ యోజన
4) రాష్ట్రీయ కృషి వికాస యోజన
33. కుటుంబ విపత్తు నివారణ కిట్లో ఉండవలసినవి ఏవి?
1) తేమలేని ఆహార పదార్థాలు, త్రాగునీరు
2) రోగానికి మందులు
3) వేడి దుస్తులు
4) పైవన్నీ
34. భారతదేశంలో అతి పెద్ద ప్రమాదం?
1) 1977 (ఆంధ్రప్రదేశ్లోని తుఫాను)
2) 1987 (15 రాష్ర్టాల్లో కరువు పరిస్థితి)
3) 2008 (ఉత్తర బీహార్లో కోసీనది వరదలు)
4) పైవన్నీ
35. 2009లో రెండో భారత విపత్తు నిర్వహణ సభ ఎక్కడ జరిగింది?
1) హైదరాబాద్ 2) శ్రీనగర్
3) కాలికట్ 4) న్యూఢిల్లీ
36. అంతర్జాతీయ విపత్తుల ప్రతిస్పందనకు కిందివాటిలో దేన్ని ఐక్యరాజ్య సమితి జవాబుదారీ చేసింది?
1) ఐక్యరాజ్యసమితి ఆఫీస్ ఫర్ కో ఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్
2) యునెస్కో
3) ఐక్యరాజ్యసమితి ఆఫీస్ ఆఫ్ మిటిగేషన్ అండ్ డిజాస్టర్
4) ఐక్యరాజ్యసమితి విపత్తు నిర్వహణ టీం
37. ఏ విద్యా బోధనలో ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ విపత్తు నిర్వహణపై కార్యక్రమాలను ప్రారంభించింది?
1) ఇంజినీరింగ్
2) మేనేజ్మెంట్
3) ఆర్కిటెక్చర్
4) కంప్యూటర్ ఇంజినీరింగ్
38. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం సహకారంతో ‘డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం’ను ప్రారంభించింది?
1) ఒడిశా 2) తమిళనాడు
3) గుజరాత్ 4) కేరళ
39. అమెచ్యూర్ రేడియోకి మరో పేరు?
1) సునామీ రేడియో
2) విపత్తు రేడియో
3) పాకెట్ రేడియో 4) హాం రేడియో
40. విపత్తు నిర్వహణ భాషలో DRABC
1) Danger, Response, Airway, Breathing, Circulation
2) Danger, Reflection, Airway, Bed, Cold
3) Danger, Refrence, Airway, Break, Cold
4) Danger, Response, Air, Blood, Certification
41. ప్రసార ఉపగ్రహం ముఖ్యమైన లక్షణం?
1) ఆంప్లిఫైర్ 2) ట్రాన్స్ మిషన్
3) ట్రాన్స్ హాండర్ 4) రిసీవర్
42. కేంద్ర ప్రభుత్వ జాతీయ విపత్తు నిర్వహణ విభాగం అవసరమైనప్పుడు విపత్తుల వల్ల నష్టం వాటిల్లిన ప్రాంతాలకు ఏమి పంపుతుంది?
1) ఉపగ్రహ టెలిఫోన్ సౌకర్యం గల సంఘటిత సామగ్రి
2) నష్టం వాటిల్లిన ప్రజలకు మందులు అందించడం
3) సహాయ కార్యక్రమాల అమలు
4) పైవన్నీ
43. కిందివాటిలో విపత్తు సంసిద్ధత, స్పందన కార్యక్రమాల్లో సంబంధం ఉన్నాయి?
1) భారత వాతావరణ సంబంధ శాఖ
2) భారత అంతరిక్ష పరిశోధన సంస్థ
3) కేంద్ర జల కమిషన్
4) పైవన్నీ
44. అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం ఉన్న చోటు ?
1) జకార్తా 2) గోవా
3) టోక్యో 4) హొనలులు
45. భారతదేశంలో ఏ నెలల్లో వరదలు సంభవించే అవకాశం ఉంది?
1) ఏప్రిల్-జూన్ 2) మే – అక్టోబర్
3) జూన్-డిసెంబర్ 4) జూన్-సెప్టెంబర్
46. ఆంధ్రప్రదేశ్లో తరచూ వరదలకు గురయ్యే ప్రాంతాలు
1) పెన్నా డెల్టా ప్రాంతాలు
2) కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాలు
3) రాయలసీమ ప్రాంతాలు
4) ఉత్తర కోస్తా ప్రాంతాలు
47. అస్సోంలో తీవ్రంగా వరదలను కలిగించే నది?
1) గంగా 2) గోమతి
3) యమునా 4) బ్రహ్మపుత్ర
48. వరదల హెచ్చరికలు దేని ద్వారా ప్రసారమవుతాయి?
1) దూరదర్శన్
2) ఆల్ ఇండియా రేడియో
3) పత్రికా రేడియో 4) పైవన్నీ
49. వరదలు వేటివల్ల కలుగుతాయి?
1) అధిక వర్షపాతం
2) చెరువులకు గండ్లు
3) తీవ్రమైన గాలులు
4) చెరువుల నుంచి నీరు పైకి రావటం
50. భారతదేశంలో భూపాతాలు ఎక్కువ నుంచి అత్యంత ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఏవి?
1) హిమాలయాలు
2) తూర్పుకనుమలు
3) వింధ్యాచలములు
4) పశ్చిమ కనుమలు
51. ఏ రాష్ర్టాల్లో తీవ్ర హిమపాతాలు సంభవిస్తాయి?
1) జమ్ము కశ్మిర్ 2) హిమాచల్ ప్రదేశ్
3) ఉత్తరాఖంఢ్ 4) పైవన్నీ
52. సామూహిక విధ్వంసం చేసే ఆయుధాల వల్ల ఏమి సంభవిస్తుంది?
1) ప్రాణ నష్టం 2) ఆస్తినష్టం
3) వాతావరణ నష్టం 4) పైవన్నీ
సమాధానాలు
1-4 2-4 3-2 4-1
5-2 6-3 7-2 8-1
9-1 10-4 11-4 12-4
13-4 14-1 15-3 16-1
17-2 18-1 19-4 20-4
21-2 22-4 23-2 24-1
25-1 26-3 27-4 28-4
29-3 30-1 31-4 32-4
33-4 34-2 35-4 36-3
37-1 38-4 39-4 40-1
41-3 42-4 43-4 44-4
45-4 46-2 47-4 48-4
49-1 50-1 51-4 52-4
తెలుగు అకాడమీ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు