WCDSC Kamareddy Recruitment | కామారెడ్డి జిల్లా సంక్షేమ కార్యాలయంలో ఉద్యోగాలు
WCDSC Kamareddy Recruitment | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కామారెడ్డి జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్, మహిళా శిశు దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలోని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లో ఖాళీగా ఉన్న జిల్లా మిషన్ కోఆర్డినేటర్, కౌన్సిలర్, చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్వైజర్, కేస్ వర్కర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు స్థానిక జిల్లాకు చెంది ఉండి.. సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమాతోపాటు పని అనుభవం ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో జూన్ 13వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా సంబంధిత సర్టిఫికెట్లతోపాటు దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు : 08
పోస్టులు : మిషన్ కోఆర్డినేటర్, కౌన్సిలర్, చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్వైజర్, కేస్ వర్కర్ తదితరాలు
అర్హతలు : సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమాతోపాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తు విధానం : ఆఫ్‌లైన్ దరఖాస్తులను జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, రూమ్ నం.31, డబ్ల్యూడీఎస్సీడీ, ఐడీఓసీ, కలెక్టరేట్, కామారెడ్డి అడ్రస్‌కు పంపించాలి.
చివరి తేదీ: జూన్ 13
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
వయస్సు : 25 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి.
వెబ్సైట్ : https://bhoopalapally.telangana.gov.in/
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?