TS Govt Policies and Schemes | ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రారంభించిన పథకం?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, పథకాలు
(జూన్ 1 తరువాయి)
132. ఆసరా పెన్షన్ పథకానికి అర్హులు?
1) ఎయిడ్స్ బాధితులు, చేనేత కార్మికులు
2) వృద్ధులు, వితంతువులు
3) కల్లుగీత, నేత కార్మికులు
4) పైవారందరూ
133. ఎవరి సంక్షేమం కోసం డ్రిఫ్ట్ పథకం ఏర్పాటు చేశారు?
1) చేనేత కార్మికుల సంక్షేమం
2) కల్లుగీత కార్మికుల సంక్షేమం
3) గిరిజన ప్రజల సంక్షేమం
4) మైనారిటీ ప్రజల సంక్షేమం
134. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం లక్కంపల్లిలో ప్రత్యేక ఆర్థిక మండలిలో కింది ఏ పార్కు శంకుస్థాపన చేశారు?
1) మెగా అపెరల్ పార్క్
2) మెగా ఫుడ్ పార్క్
3) మెగా ఫిషరీ పార్క్
4) మెగా ఫార్మాసిటీ పార్క్
135. కేసీఆర్ కిట్ పథకం ద్వారా ఆడ, మగ బిడ్డలకు ఎంత ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది?
1) రూ.15 వేలు, రూ.14 వేలు
2) రూ.16 వేలు, రూ.15 వేలు
3) రూ. 13 వేలు, రూ.12 వేలు
4) రూ. 14 వేలు, రూ. 13 వేలు
136. కేసీఆర్ కిట్ పథకం ముఖ్య ఉద్దేశం?
1) ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్యను పెంచడం
2) సిజేరియన్ల సంఖ్యను తగ్గించడం
3) బాలింతలు, నవజాత శిశువుల మరణాలు తగ్గించడం
4) పైవన్నీ
137. టీఎస్ కాప్ మొబైల్ యాప్‌ను 2018 జనవరి 1న ఎవరు ఆవిష్కరించారు?
1) డీజీపీ మహేందర్ రెడ్డి
2) కేటీఆర్ 3) 1, 2
4) కేసీఆర్
138. తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌లను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 2020 2) 2019
3) 2017 4) 2021
139. టీ-హబ్ నినాదం?
1) ఆలోచనలతో రండి-ఆవిష్కరణలతో వెళ్లండి
2) నూతన ఆలోచనలతో రండి
3) ఆవిష్కరణలకు తొలిమెట్టు
4) మీ ఆలోచన-మా పెట్టుబడి
140. తెలంగాణలో మొత్తం ఎన్ని మినరల్ ఇండస్ట్రీలు ఉన్నాయి?
1) 1904 2) 1966
3) 1955 4) 1911
141. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొత్తం విద్యుత్ వినియోగంలో ఎంత శాతం వ్యవసాయానికి ఉపయోగిస్తున్నారు?
1) 50 శాతం 2) 40 శాతం
3) 30 శాతం 4) 35 శాతం
142. e-Nam (ఇ-నామ్) ద్వారా చెల్లింపుల్లో కింది ఏ జిల్లా ప్రధానమంత్రి ఎక్సలెన్స్ అవార్డును పొందింది?
1) సూర్యాపేట 2) మెదక్
3) నిజామాబాద్ 4) హైదరాబాద్
143. హైదరాబాద్‌లోని బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో వ్యవసాయ మార్కెటింగ్ శిక్షణ కేంద్రాన్ని ఎవరు ప్రారంభించారు?
1) హరీశ్ రావు
2) బండారు దత్తాత్రేయ
3) 1, 2 4) కేసీఆర్
144. దేశంలో తొలిసారి ఆర్టీసీ ఎం-వ్యాలెట్ యాప్‌ను ప్రారంభించిన రాష్ట్రం?
1) ఆంధ్రప్రదేశ్ 2) తెలంగాణ
3) మహారాష్ట్ర 4) కోల్‌కతా
145. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎన్ని కుటుంబాలను గుర్తించింది?
1) 462 2) 450
3) 425 4) 473
146. షీ-క్యాబ్స్ ద్వారా తీసుకున్న ప్రతి ట్యాక్సీకి ప్రభుత్వం ఎంతశాతం సబ్సిడీ ఇస్తుంది?
1) 40 శాతం 2) 35 శాతం
3) 45 శాతం 4) 50 శాతం
147. రైతు బీమా పథకంలో పేర్కొన్న బీమా ద్వారా పరిష్కార వ్యవధి ఎంత?
1) రెండు వారాల్లో 2) నెలలోపు
3) వారం రోజుల్లో 4) 10 రోజుల్లో
148. కేంద్ర ప్రభుత్వం ఈ-పంచాయత్ ప్రోగ్రాంకు పైలెట్ పంచాయతీగా ఎంపికైన తెలంగాణలోని గ్రామం?
1) జమ్మికుంట 2) చౌటుప్పల్
3) హుజూర్నగర్ 4) ప్రగతినగర్
149. టీఎస్-బీపాస్‌ను ఎక్కడ ప్రారంభించారు?
1) మూడుచింతలపల్లి,
మేడ్చల్-మల్కాజిగిరి
2) మల్కాపూర్, మెదక్
3) వాసాలమర్రి, భువనగిరి
4) గట్టు, జోగుళాంబ గద్వాల్
150. ఏ ప్రయోజనాలను నేతన్నల అభివృద్ధికి డ్రిఫ్ట్ పథకంలో భాగంగా అందిస్తుంది?
ఎ. చేనేత కార్మికుల, వ్యక్తిగత రుణాలమాఫీ
బి. డిజైన్ల అభివృద్ధి, బ్రాండ్ ప్రమోషన్, ఉత్పత్తుల కొనుగోలు
సి. వేతన స్థిరీకరణ ప్రోత్సాహం, కార్మికుల పొదుపు పథకం
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
151. దేశ చేపల ఉత్పత్తిలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది?
1) 9 2) 8
3) 2 4) 4
152. 2023-24 బడ్జెట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని ఎన్ని లక్షల హెక్టార్లకు పెంచాలని నిర్ణయించింది?
1) 20 లక్షలు 2) 15 లక్షలు
3) 18 లక్షలు 4) 25 లక్షలు
153. ఏ ఎత్తిపోతల పథకానికి ఆర్ విద్యాసాగర్ పేరు పెట్టారు?
1) డిండి ఎత్తిపోతలకు
2) పాలమూరు-రంగారెడ్డి
3) భక్తరామదాసు సీతారామ
4) తుమ్మిళ్ల ఎత్తిపోతలకు
154. ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రారంభించిన పథకం?
1) సంచార శుద్ధి నీటి సరఫరా
2) సజల జలం 3) ఉజ్వల
4) జలహారం
155. తెలంగాణలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, తహసీల్దార్ చేయాల్సిన మ్యుటేషన్ తదితర ప్రక్రియలన్నీ సింగిల్ విండో ద్వారా చేపట్టే ధరణి వెబ్సైట్ సేవలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చాయి?
1) 2018 మే 19
2) 2018 జనవరి 1
3) 2018 జూన్ 23
4) 2018 మార్చి 8
156. రాష్ర్టాన్ని డిజిటల్ తెలంగాణగా మార్చేందుకు హైదరాబాద్‌లో 2015 ఏప్రిల్ 16న ఏ పథకాన్ని ప్రారంభించారు?
1) Life 2) Free WiFi
3) FAST 4) T-Hub
157. నల్లగొండ ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించడానికి ఏ పథకాన్ని ప్రారంభించారు?
1) డిండి ఎత్తిపోతల పథకం
2) భక్తరామదాసు సీతారామ ఎత్తిపోతల పథకం
3) నక్కల గండి
4) ఉదయ సముద్రం ప్రాజెక్టు
158. తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకు 2023-24 బడ్జెట్లో ఎన్ని రూ. కోట్లను కేటాయించింది?
1) 1000 2) 1100
3) 1500 4) 1800
159. ప్రతి నీటిపారుదల ప్రాజెక్ట్‌లోని రిజర్వాయర్లలోని నీటిని ఎంతశాతం మిషన్ భగీరథకు ఉపయోగిస్తారు?
1) 10 శాతం 2) 15 శాతం
3) 20 శాతం 4) 17 శాతం
160. మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలకు ఎన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తారు?
1) 12 2) 13
3) 14 4) 15
161. 7వ విడత హరితహారం 2021 జూలై 1న హెచ్ఎండీఏ పరిధిలో ఎక్కడ ప్రారంభించారు?
1) పెద్ద అంబర్‌పేట అర్బన్ పార్క్
2) ఇందిరా పార్క్
3) లుంబినీ పార్క్
4) రాజేంద్రనగర్
162. నీతి ఆయోగ్ విడుదల చేసిన ఆరోగ్య సూచీల్లో దేశం మొత్తం మీద తెలంగాణ 69.96 మార్కులతో ఎన్నో స్థానంలో ఉంది?
1) 2 2) 6
3) 5 4) 3
163. 2021-22లో ఎన్నికోట్ల మొక్కలను నాటాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది?
1) 25 కోట్లు 2) 19.9 కోట్లు
3) 30 కోట్లు 4) 15.6 కోట్లు
164. సద్దిమూట పథకాన్ని 2015 అక్టోబర్ 13న ఏ విధంగా మార్చారు?
1) సుభోజనం 2) లిపర భోజనం
3) సమ భోజనం 4) ఉచిత భోజనం
165. తెలంగాణలో డబుల్ బెడ్రూం ఇళ్లను ఎంత విస్తీర్ణంలో కడుతున్నారు?
1) 350 చదరపు అడుగులు
2) 230 చదరపు అడుగులు
3) 560 చదరపు అడుగులు
4) 440 చదరపు అడుగులు
166. తెలంగాణ ప్రభుత్వం 2012 ప్రకారం గుర్తించిన ఎన్ని క్రీడాంశాలకు 2 శాతం రిజర్వేషన్ కల్పిస్తుంది?
1) 29 2) 30
3) 22 4) 21
167. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఎంత ఆర్థిక సహాయం అందిస్తుంది?
1) రూ.16 లక్షలు 2) రూ.10 లక్షలు
3) రూ.5 లక్షలు 4) రూ.8.9 లక్షలు
168. ఆసరా పెన్షన్లను పొందేందుకు 65 సంవత్సరాలు ఉన్న అర్హతను తెలంగాణ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలకు తగ్గించింది?
1) 60 సంవత్సరాలు
2) 50 సంవత్సరాలు
3) 62 సంవత్సరాలు
4) 57 సంవత్సరాలు
169. తెలంగాణ ప్రభుత్వం విద్య, ఉద్యోగాల్లో క్రీడాకారులకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2018 మే 14న ఉత్తర్వులు జారీ చేసింది?
1) 5 శాతం 2) 2 శాతం
3) 1 శాతం 4) 8 శాతం
170. కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
1) 2023 జనవరి 18
2) 2023 జనవరి 26
3) 2023 ఫిబ్రవరి 18
4) 2022 మార్చి 18
171. మన ఊరు – మన బడి పథకంలో భాగంగా 2021-22 నుంచి మొదటిదశలో మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని 9,123 పాఠశాలల్లో ఎన్ని రూ. కోట్లతో కార్యకలాపాలను చేపడతారు?
1) రూ.3,680 కోట్లు
2) రూ.3,590 కోట్లు
3) రూ. 3,750 కోట్లు
4) రూ.3,497 కోట్లు
172. తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్స్‌లో మొత్తం ఎన్ని రకాల వైద్యపరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు?
1) 62 రకాలు 2) 57 రకాలు
3) 50 రకాలు 4) 52 రకాలు
173. తెలంగాణ ప్రభుత్వం నూతన క్రీడా విధానాన్ని ఎప్పుడు ప్రకటించింది?
1) 2016 జనవరి 3
2) 2017 ఫిబ్రవరి 8
3) 2017 జనవరి 20
4) 2020 జనవరి 10
174. 2023-24 తెలంగాణ బడ్జెట్లో రైతుబంధు పథకం కోసం ఎంత కేటాయించారు?
1) రూ. 14,800 కోట్లు
2) రూ. 12,700 కోట్లు
3) రూ.15,075 కోట్లు
4) రూ. 13, 076 కోట్లు
175. టీఎస్ బీ-పాస్ విధానంలో ఎన్ని గజాల లోపు స్థలాల్లో నిర్మాణాలకు ఎటువంటి అనుమతులు అవసరం లేదని తెలిపింది?
1) 75 2) 250
3) 175 4) 150
176. 2022 చివరినాటికి కేసీఆర్ కిట్ ద్వారా ఎన్ని లక్షల మంది మహిళలకు లబ్ధి జరిగింది?
1) 2.50 లక్షలు 2) 2.89 లక్షలు
3) 13.91 లక్షలు 4) 1.28 లక్షలు
177. మన ఊరు – మన బడి పథకంలో భాగంగా 2021-22 నుంచి మొదటి మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఎన్ని పాఠశాలలను అభివృద్ధి చేయనున్నారు?
1) 9,502 పాఠశాలలు
2) 9,123 పాఠశాలలు
3) 10,802 పాఠశాలలు
4) 8,750 పాఠశాలలు
178. మన ఊరు – మన చెరువు నినాదంతో తెలంగాణలోని మొత్తం ఎన్ని చెరువులను పునరుద్ధరించాలని నిర్ణయించారు?
1) 40,850 2) 45,800
3) 41,230 4) 46,531
179. మన ఊరు-మన బడి పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 26,067 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలను అధునీకరించడానికి ఎన్ని రూ. కోట్లు వ్యయం చేస్తుంది?
1) 7,289 2) 7,805
3) 7,108 4) 7,567
180. 2022-23లో ఆరోగ్యలక్ష్మి పథకం లబ్ధిదారులు ఎంతమంది?
1) 20 లక్షలు 2) 22 లక్షలు
3) 17 లక్షలు 4) 19.7 లక్షలు
181. మన ఊరు – మన బడి పథకంలో భాగంగా ఎన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలను ఆధునీకరించనున్నారు?
1) 24,200 2) 26,067
3) 23,200 4) 22,580
182. మిషన్ కాకతీయ పథకం కింద 46,531 చెరువుల పునరుద్ధరణ ఎన్ని లక్షల హెక్టార్లకు సాగునీటి వసతి కల్పిస్తారు?
1) 10.98 లక్షల హెక్టార్లు
2) 12.38 లక్షల హెక్టార్లు
3) 11.78 లక్షల హెక్టార్లు
4) 10.17 లక్షల హెక్టార్లు
183. 2022-23లో డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం కింద ఎన్ని గృహాలు నిర్మించారు?
1) 51,800 2) 24,487
3) 50,900 4) 58,200
జవాబులు
132.4 133.1 134.2 135.3
136.4 137.1 138.3 139.1
140.1 141.2 142.3 143.3
144.2 145.1 146.2 147.4
148.2 149.2 150.4 151.2
152.1 153.1 154.4 155.1
156.2 157.1 158.1 159.1
160.1 161.1 162.4 163.2
164.1 165.3 166.1 167.2
168.4 169.2 170.1 171.4
172.2 173.1 174.3 175.1
176.3 177.2 178.4 179.1
180.2 181.2 182.4 183.2
విజేత కాంపిటీషన్స్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?