Telangana Current Affairs | షీ భరోసా సైబర్ ల్యాబ్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
గతవారం తరువాయి..
200. 2020-21 నీతి ఆయోగ్ ఎస్డీజీ-ఇండియా సూచిక రూపొందించడానికి మొత్తం 17 లక్ష్యాల్లో 15 లక్ష్యాలను పరిగణించింది. అన్ని లక్ష్యాల మొత్తం స్కోర్‌ను లెక్కించగా, దేశంలో తెలంగాణ సాధించిన ర్యాంక్ ఎంత?
1) 10 2) 11 3) 9 4) 8
201. 2020-21లో నీతి ఆయోగ్ రూపొందించిన ఎస్డీజీ-ఇండియా ఇండెక్స్‌లో ఎన్నో ఎస్డీజీ (సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు) లక్ష్యంతో తెలంగాణ దేశంలో మొదటి ర్యాంక్ సాధించి ‘అచీవర్’ స్థానాన్ని పొందింది?
1) ఎస్డీజీ-6 అందరికీ తాగునీటి వసతి కల్పించడం
2) ఎస్డీజీ-7 అందరికీ అందుబాటులో సుస్థిర శక్తి వనరులు అందించడం
3) ఎస్డీజీ-8 గౌరవప్రదమైన ఉపాధి – ఆర్థిక వృద్ధి
4) ఎస్డీజీ-4 నాణ్యమైన విద్య
202. 2020-21లో నీతి ఆయోగ్ రూపొందించిన ఎస్డీజీ-ఇండియా ఇండెక్స్‌కు సంబంధించి మొత్తం 15 లక్ష్యాల్లో (నీతి ఆయోగ్ పరిగణించిన) తెలంగాణ రాష్ట్రం ఎన్ని లక్ష్యాల్లో ‘ఫ్రంట్ రన్నర్’ విభాగంలో నిలిచింది?
1) 9 2) 8 3) 7 4) 10
203. 2020-21లో నీతి ఆయోగ్ రూపొందించిన ఎస్డీజీ-ఇండియా ఇండెక్స్‌కు సంబంధించి మొత్తం 15 ఎస్డీజీ లక్ష్యాల్లో (నీతి ఆయోగ్ పరిగణించిన) తెలంగాణ రాష్ట్రం 3 లక్ష్యాల్లో ‘పర్ఫార్మర్’ కేటగిరీలో నిలిచింది. కాగా ఆ 3 ఎస్డీజీ లక్ష్యాలను కింది వాటిలో గుర్తించండి?
ఎ. ఎస్డీజీ-2 ఆకలి బాధను నివారించి ఆహారభద్రతను కల్పించడం
బి. ఎస్డీజీ-4 నాణ్యమైన విద్య
సి. ఎస్డీజీ-9 పరిశ్రమలు, ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు
డి. ఎస్డీజీ-3 ఆరోగ్య సంరక్షణ జీవన ప్రమాణాల పెంపు
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, డి
204. 2020-21లో నీతి ఆయోగ్ రూపొందించిన ఎస్డీజీ-ఇండియా ఇండెక్స్‌కు సంబంధించి మొత్తం 15 ఎస్డీజీ లక్ష్యాల్లో ‘ఆస్పిరెంట్’ కేటగిరీ స్థానంలో నిలిచింది. కాగా ఆ 2 లక్ష్యాలను గుర్తించండి?
ఎ. ఎస్డీజీ-5 లింగ సమానత్వం సాధించి మహిళా సాధికారత
బి. ఎస్డీజీ-13 వాతావరణ పరిరక్షణ
సి. ఎస్డీజీ-10 అసమానతల తొలగింపు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, డి
205. టీఆర్ఏసీ (తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్) నిర్వహిస్తున్న కార్య కలాపాలకు సంబంధించి సరైనవి గుర్తించండి?
ఎ. రాష్ట్రంలోని అన్ని ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల కోసం జియో స్పేషియల్ డేటాబేస్ సృష్టి
బి. గ్రామ స్థాయి స్థల వైశాల్య పటాల డిజిటలైజేషన్
సి. హైదరాబాద్‌లో ఆస్తి పన్ను అంచనాకు జీఐఎస్ ఆధారిత ఆస్తి సర్వేలు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, సి
206. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) అనేది వాతావరణ పర్యవేక్షణ, వాతావరణ సూచన, రియల్ టైమ్ వాతావరణ సమాచారాన్ని ఆటోమెటిక్ వాతావరణ కేంద్రాల ద్వారా సేకరిస్తుంది. కాగా రాష్ట్రంలోని మొత్తం ఆటోమెటిక్ వాతావరణ కేంద్రాల సంఖ్య ఎంత?
1) 944 2) 1044
3) 1144 4) 844
207. మహిళలు, పిల్లలపై సైబర్ నేరాలకు సంబంధించిన కేసులను విచారించడానికి హైదరాబాద్‌లోని మహిళా భద్రతా విభాగంలో తెలంగాణ పోలీసులు షీ భరోసా సైబర్ ల్యాబ్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 2021, నవంబర్ 2
2) 2020, నవంబర్ 2
3) 2022, నవంబర్ 2 4) ఏదీకాదు
208. 2021లో హైదరాబాద్‌లోని ఏ ప్రాంతంలో జీహెచ్ఎంసీ ‘సండే ఫండే’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది?
1) ట్యాంక్‌బండ్ 2) నెక్లెస్ రోడ్
3) చార్మినార్ 4) గోల్కొండ
209. కింది ఏ సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థలు తమ బడ్జెట్లో 10 శాతం గ్రీన్ బడ్జెట్‌కు కేటాయించడం ద్వారా నగర అటవీ అభివృద్ధి, పచ్చదనం పెంచడం నర్సరీలు, తోటలు ఏర్పాటు చేస్తున్నారు?
1) 2021 2) 2022
3) 2020 4) 2019
210. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం-2023 ప్రకారం రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో అంగన్వాడీ సెంటర్లు గల మూడు జిల్లాలను గుర్తించండి?
1) నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం
2) భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ
3) నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం
4) ఖమ్మం, నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం
211. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం-2023 ప్రకారం రాష్ట్రంలో అత్యధిక సంఖ్య లో, అత్యల్పంగా చౌకధరల దుకాణాలు (ఫెయిర్ ప్రైస్ షాప్) గల జిల్లాలను గుర్తించండి?
1) నల్లగొండ, ములుగు
2) హైదరాబాద్, ములుగు
3) సంగారెడ్డి, ములుగు
4) రంగారెడ్డి, ములుగు
212. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం-2023 ప్రకారం 2020-21, 2021-22 సంవత్సరాలకు రాష్ట్రంలోని కింది ఏ రెండు ప్రధాన ఖనిజాల నుంచి అధిక ఉత్పత్తి, అధిక ఆదాయం వస్తుంది?
ఎ. కోల్ బి. లైమ్‌స్టోన్ సి. స్టోవింగ్ శాండ్
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఏదీకాదు
213. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం-2023 అనుసరించి కింది వాటిలో సరైన జతలు ఎన్ని ఉన్నాయో గుర్తించండి?
ఎ. గొర్రెలు అధికంగా గల జిల్లా- నారాయణ పేట్
బి. మేకలు అధికంగా గల జిల్లా- నల్లగొండ
సి. కోళ్లు (పౌల్ట్రీ) అధికంగా గల జిల్లా- రంగారెడ్డి
1) ఎ 2) బి 3) 0 4) అన్నీ సరైనవే
214. తెలంగాణ సామాజిక, ఆర్థిక ముఖచిత్రం-2023 ప్రకారం తెలంగాణ రాష్ట్రం 2020- 21 సంవత్సరానికి..
ఎ. వరి పండించే విస్తీర్ణంలో 5వ స్థానంలో ఉంది
బి. వరి ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉంది
సి. వరి దిగుబడి/ఉత్పాదకతలో 6వ స్థానం లో ఉంది పై వాటిలో సరైనవి?
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
215. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం-2023 ప్రకారం తెలంగాణ రాష్ట్రం 2020- 21 సంవత్సరానికి..
ఎ. ఫుడ్ గ్రెయిన్స్ (ఆహారధాన్యాలు) ఉత్పత్తిలో 10వ స్థానంలో ఉంది
బి. ఫుడ్ గ్రెయిన్స్ (ఆహారధాన్యాలు) విస్తీర్ణంలో 13వ స్థానంలో ఉంది
పై వాక్యాల్లో సరైనవి?
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
216. 2011 జనాభా లెక్కల ప్రకారం.. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం-2023ని అనుసరించి రాష్ట్రంలో అత్యధికంగా అగ్రికల్చర్ లేబర్, అత్యల్పంగా అగ్రికల్చర్ లేబర్ గల జిల్లాలు?
1) ఖమ్మం, హైదరాబాద్
2) నల్లగొండ, హైదరాబాద్
3) సూర్యాపేట, హైదరాబాద్
4) సంగారెడ్డి, హైదరాబాద్
217. కింది వాటిలో సరైనవి? (2011 జనాభా లెక్కల ప్రకారం)
ఎ. రాష్ట్రంలో అత్యధిక అక్షరాస్యత గల మొదటి రెండు జిల్లాలు- హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి
బి. మహిళా అక్షరాస్యత అధికంగా గల జిల్లా – హైదరాబాద్
సి. మహిళా అక్షరాస్యత అత్యల్పంగా గల జిల్లా- నారాయణపేట్
డి. రాష్ట్ర మొత్తం అక్షరాస్యత- 66.54 శాతం, పురుషులు- 75.04 శాతం, మహిళలు- 57.99 శాతం
1) ఎ, బి 2) సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
218. 2011 జనాభా లెక్కల ప్రకారం, తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం అనుసరించి రాష్ట్రంలో..
ఎ. అత్యధిక సెక్స్ రేషియో గల జిల్లా- కామారెడ్డి
బి. అత్యల్ప సెక్స్ రేషియో గల జిల్లా- రంగారెడ్డి
సి. రాష్ట్రం మొత్తం సెక్స్ రేషియో- 988
పై వాటిలో సరైనవి?
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, సి
219. 2011 జనాభా లెక్కల ప్రకారం, తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం-2023ను అనుసరించి రాష్ట్రంలో..
ఎ. చైల్డ్ సెక్స్ రేషియో అధికంగా గల జిల్లా- ములుగు
బి. చైల్డ్ సెక్స్ రేషియో అత్యల్పంగా గల జిల్లా- మహబూబ్‌నగర్, వనపర్తి
సి. రాష్ట్రం మొత్తం మీద చైల్డ్ సెక్స్ రేషియో- 932
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) బి, సి 4) ఎ, సి
220. 2011 జనాభా లెక్కల ప్రకారం, తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం- 2023ను అనుసరించి రాష్ట్రంలో..
ఎ. చైల్డ్ (0-6 సంవత్సరాలు) పాపులేషన్ అధికంగా గల జిల్లా- హైదరాబాద్
బి. చైల్డ్ (0-6 సంవత్సరాలు) పాపులేషన్ అల్పంగా గల జిల్లా- హైదరాబాద్
సి. మొత్తం చైల్డ్ పాపులేషన్- 38.99 లక్షలు
పై వాటిలో సరైనవి?
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) బి, సి 4) ఎ, సి
221. జనాభా లెక్కల ప్రకారం, తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రంను అనుసరించి రాష్ట్రంలో..
ఎ. మహిళల జనాభా అత్యల్పంగా గల రెండు జిల్లాలు- ములుగు, జయశంకర్ భూపాలపల్లి
బి. పురుషుల జనాభా అత్యల్పంగా గల రెండు జిల్లాలు- ములుగు, జయశంకర్ భూపాలపల్లి
పై వాటిలో సరైనవి?
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
222. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం-2023 ప్రకారం సరైన జతలను గుర్తించండి?
సంవత్సరం రాష్ట్ర అక్షరాస్యత శాతం
ఎ. 1961 17.34
బి. 1991 41.30
సి. 2001 58
డి. 2011 66.54
1) ఎ 2) బి 3) సి 4) డి
223. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం-2023 ప్రకారం కింది వాటిలో సరైన జతలు గుర్తించండి?
సంవత్సరం సెక్స్ రేషియో
ఎ. 1961 975
బి. 1981 971
సి. 2001 971
డి. 2011 988
1) ఎ 2) బి 3) సి 4) డి
224. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం-2023 ప్రకారం, జనాభాకు సంబంధించి దశాబ్ద వృద్ధి రేటు శాతం కింది ఏ దశాబ్దంలో అత్యధికంగా, అత్యల్పంగా ఉంది?
1) 1981-91, 2001-11
2) 1971-81, 2001-11
3) 1951-61, 2001-11
4) 1971-81, 1951-61
225. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం-2023 ప్రకారం రాష్ట్రం మొత్తం జనాభాలో పట్టణ జనాభా శాతం 1961 నుంచి 2011 వరకు సుమారు ఎన్ని రెట్లు అయ్యింది?
1) రెట్టింపు అయ్యింది
2) 1.5 రెట్లు అయ్యింది
3) 3 రెట్లు అయ్యింది 4) ఏదీకాదు
226. తెలంగాణ రాష్ట్ర సామాజిక ఆర్థిక ముఖచిత్రం-2023 ప్రకారం తలసరి ఆదాయం (పర్ క్యాపిటా ఇన్‌కం) అధికంగా, అత్యల్పంగా గల జిల్లాలను గుర్తించండి? (2020-21 సంవత్సరానికి స్థిర ధరల వద్ద)
1) హైదరాబాద్, ములుగు
2) రంగారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్
3) హైదరాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్
4) రంగారెడ్డి, ములుగు
227. తెలంగాణ రాష్ట్ర సామాజిక ఆర్థిక ముఖచిత్రం-2023 ప్రకారం గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అధికంగా, అత్యల్పంగా గల కింది జిల్లాలను గుర్తించండి? (2020-21 సంవత్సరానికి స్థిర ధరల వద్ద)
1) హైదరాబాద్, ములుగు
2) రంగారెడ్డి, ములుగు
3) హైదరాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్
4) రంగారెడ్డి, కుమ్రం భీం ఆసిఫాబాద్
228. తెలంగాణ రాష్ట్ర సామాజిక ఆర్థిక ముఖచిత్రం-2023 ప్రకారం..
ఎ. రాష్ట్ర తలసరి ఆదాయం 2022-23 సంవత్సరానికి ప్రస్తుత ధరల వద్ద రూ.3,17,115
బి. రాష్ట్ర తలసరి ఆదాయం 2022-23 సంవత్సరానికి స్థిర ధరల వద్ద రూ.1,69,784
పై వాక్యాల్లో సరైనవి?
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
229. తెలంగాణ రాష్ట్ర సామాజిక ఆర్థిక ముఖచిత్రం-2023 ప్రకారం..
ఎ. తెలంగాణ రాష్ట్ర జీఎస్డీపీ 2022-23 సంవత్సరానికి ప్రస్తుత ధరల వద్ద రూ.13.27 లక్షల కోట్లు
బి. తెలంగాణ రాష్ట్ర జీఎస్డీపీ 2022-23 సంవత్సరానికి స్థిర ధరల వద్ద రూ.7.26 లక్షల కోట్లు
పై వాక్యాల్లో సరైనవి?
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
230. కీ పర్ఫామెన్స్ ఇండికేటర్ (కేపీఐ) సర్వేను హెల్త్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ వంటి వాటికి సంబంధించి జిల్లా స్థాయి గణాంకాల కోసం కింది ఏ విభాగం చేపడుతుంది?
1) హెల్త్ డిపార్ట్మెంట్ 2) టీఎస్‌డీపీఎస్
3) సీజీజీ 4) ఏదీకాదు
231. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కింది ఏ సంస్థల సహకారంతో ఇ-గవర్నెన్స్, ఇతర కార్యక్రమాలను చేపడుతుంది
1) డిపార్ట్మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్
2) వరల్డ్ బ్యాంక్ 3) 1, 2 4) ఏదీకాదు
232. ది స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ విధులకు సంబంధించి సరైనవి గుర్తించండి?
ఎ. తుఫానులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను కాపాడటం
బి. మానవ నిర్మిత విపత్తులైన రైలు, రోడ్డు, విమాన ప్రమాదాల నుంచి కాపాడటం
సి. బయోలాజికల్ అణు ప్రమాదాల నుంచి కాపాడటం
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, బి, సి
సమాధానాలు
200-1, 201-2, 202-1, 203-1, 204-1, 205-3, 206-2, 207-1, 208-1, 209-3, 210-1, 211-1, 212-1, 213-4, 214-4, 215-3, 216-1, 217-4, 218-2, 219-2, 220-2, 221-3, 222-4, 223-4, 224-1, 225-1, 226-2, 227-2, 228-3, 229-3, 230-2, 231-3, 232-4.
గందె శ్రీనివాస్
విషయ నిపుణులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?