SSC CHSL Preparation 2023 | ఉమ్మడిగా చదివితే.. ఉద్యోగం మీదే!
ఎస్ఎస్సీ-సీహెచ్ఎస్ఎల్ 2023 ప్రిపరేషన్ ప్లాన్
ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ 2023- స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్-2023 ప్రకటన వెలువడింది. మొత్తం 1600 పోస్టులకు 4 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. అవి..
1. లోయర్ డివిజన్ క్లర్క్
2. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
3. డేటా ఎంట్రీ ఆపరేటర్
4. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్-ఎ
- ఇంటర్ అర్హతతో వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వ శాఖల్లో ఈ పోస్టులను ఎస్ఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్లో 1600 ఖాళీలను పేర్కొన్నారు. అయితే ఈ సంఖ్య 5000 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అభ్యర్థులు ssc.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా తాజా అప్డేట్స్ తెలుసుకోవచ్చు.
- ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్-2023 నూతన సిలబస్ ప్రకారం నిర్వహించబోయే పరీక్ష కాబట్టి సిలబస్‌పై విశ్లేషణ, పరీక్ష విధానం, ప్రిపరేషన్ ప్లాన్, బుక్స్‌పై పూర్తిగా అవగాహన పెంచుకుందాం..
పరీక్ష విధానం - ఇందులో టైర్-1, టైర్-2 కంప్యూటర్ బేస్డ్ రెండంచెల పరీక్ష ఉంటుంది. రెండు పరీక్షలు వేర్వేరు సెషన్స్‌లో నిర్వహిస్తారు. ముందుగా టైర్-1 పరీక్ష ఆగస్టు 2023లో ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారిని టైర్-2కు అనుమతిస్తారు. ఇక టైర్-2 పరీక్ష నవంబర్/డిసెంబర్లో ఉంటుంది. టైర్-1, టైర్-2 పరీక్షలు తెలుగులో రాసుకోవచ్చు. తెలుగు మీడియం విద్యార్థులకు ఇది చక్కటి అవకాశం. తాజాగా తెలంగాణలో జరిగిన పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులకు ఇది ఊరటనిచ్చే అంశం.
టైర్-1 - ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ఉంటుంది. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే.
- టైర్-1లో ప్రతి ప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి అర మార్కు కోత విధిస్తారు.
టైర్-2 - ఇందులో మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్లో రెండు మాడ్యూల్స్ ఉంటాయి. అంటే 2 సబ్జెక్టులు/విభాగాలు ఉంటాయి.
- టైర్-2 పరీక్షలో కూడా టైర్-1లో ఉన్న విభాగాలే ఉంటాయి. కంప్యూటర్స్, స్కిల్ టెస్ట్/టైపింగ్‌లో కలిపి మొత్తం 6 విభాగాలుంటాయి. ఇవి ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. ఇంగ్లిష్ లేదా తెలుగులో కూడా పరీక్ష రాసుకునే వెసులుబాటు కల్పించారు.
- నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు.
- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్- ఆన్లైన్ తరహా ప్రశ్నపత్రం ఉంటుంది.
- టైర్-2లో అన్ని విభాగాలు, సెక్షన్స్‌కు ఒకేరోజు పరీక్ష నిర్వహిస్తారు.
- డీఈవో పోస్టుకు స్కిల్ టెస్ట్ తప్పనిసరి.
- కంప్యూటర్ నాలెడ్జ్‌లో 45 మార్కులు కేటాయించారు. కాని ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కులను తుది జాబితాలో పరిగణనలోకి తీసుకోరు.
- స్కిల్ టెస్ట్/టైపింగ్ టెస్ట్‌లు కంప్యూటర్‌పై నిర్వహిస్తారు.
విభాగాల వారీగా ప్రిపరేషన్ ప్లాన్
1. ఇంగ్లిష్ లాంగ్వేజ్
- ఈ విభాగం టైర్-1, టైర్-2లో ఉంటుంది. టైర్-1లో ఇంగ్లిష్ లాంగ్వేజ్, కాంప్రహెన్షన్‌తో కూడిన సిలబస్ ఉంటుంది. ఇందులో స్పాట్ ది ఎర్రర్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినానిమ్స్/ఆంటోనిమ్స్, స్పెల్లింగ్స్, ఇడియమ్స్, ప్రత్యామ్నాయ పదాలు, వాక్యాల అభివృద్ధి, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, సెంటెన్స్ అరెంజ్మెంట్స్, సెంటెన్స్ కరెక్షన్స్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, కోడ్ టెస్ట్ ఉంటాయి.
- టైర్-2లో కాంప్రహెన్షన్ ప్యాసేజ్, వొకాబులరీ, గ్రామర్‌తో పాటు పైన పేర్కొన్న అన్ని టాపిక్స్ వస్తాయి. ఈ పార్ట్‌లో అధిక శాతం ప్యాసేజ్‌లు ఉంటాయి. 5-6 ప్యాసేజ్లకు 1-2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ - ఈ విభాగం నుంచి వెర్బల్-నాన్ వెర్బల్ తరహా ప్రశ్నలు, సింబాలిక్ అనాలజీ, నంబర్ అనాలజీ, ఫిగరల్ అనాలజీ, వెన్ డయాగ్రమ్స్, మిర్రర్-వాటర్ ఇమేజెస్, ఫోల్డింగ్ ఫిగర్స్, నంబర్-లెటర్ సిరీస్, వర్డ్ బిల్డింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సోషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్-డికోడింగ్, బ్లడ్ రిలేషన్స్, సిలాజిసమ్స్, ర్యాంకింగ్, డైరెక్షన్స్, క్యాలెండర్-క్లాక్స్ వంటి చాప్టర్స్ ముఖ్యమైనవి.
- టైర్-3 కోసం పై అంశాలతో పాటు సీటింగ్ అరెంజ్మెంట్స్, పజిల్స్, స్టేట్మెంట్ ఆధారిత ప్రశ్నలు చదవాలి.
- ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్లో రీజనింగ్ విభాగం ప్రత్యేకమైంది. 60 శాతం తేలికపాటి బేసిక్స్ ప్రశ్నలే వస్తాయి. ఇవి స్కోరింగ్‌కు ఉపయోగపడుతాయి. ఇందులో మంచి మార్కులు పొందాలంటే పూర్వ ప్రశ్నపత్రాలు చదవాలి, మోడల్ ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి.
- టైర్-1, 2లకు విడివిడిగా ప్రిపేర్ కాకూడదు. కామన్ టాపిక్స్‌ను ఎంచుకొని ఉమ్మడిగా ప్రిపేర్ కావాలి.
- ఇందుకు ఏదేని కోచింగ్ మెటీరియల్‌ను అనుసరిస్తే పూర్తి అవగాహన ఏర్పడుతుంది.
కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్, మ్యాథమెటికల్ ఎబిలిటీస్ - టైర్-1లో క్వాంట్స్, టైర్-2లో మ్యాథ్స్ విభాగం నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇవి సాధారణంగా అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్‌తో కూడిన విభాగం. దీనిలో నంబర్ సిరీస్ మోడల్స్, బోడ్మాస్-సింప్లికేషన్స్, క్వాడ్రాటిక్-ఈక్వేషన్స్, డాటా ఇంటర్‌ప్రిటేషన్స్, డాటా సఫిషియన్సీ, రేషియో-ప్రిపోజిషన్స్, పర్సంటేజెస్, స్కేర్ రూట్స్, యావరేజెస్, సింపుల్-కాంపౌండ్ ఇంట్రస్ట్, లాభ నష్టాలు, టైం అండ్ వర్క్ వంటివి 15 ప్రశ్నలు వస్తాయి.
- ఆల్జీబ్రా, క్షేత్రగణితం, త్రికోణమితి, బీజగణితం వంటి అంశాలపై 10 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
- టైర్-2 కోసం అర్థమెటిక్ అంశాలతో పాటు స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ- టేబుల్స్, గ్రాఫ్స్, హిస్టోగ్రామ్, బార్ డాయాగ్రమ్, పైచార్ట్, మీన్, మీడియన్- మోడ్ వంటివి బాగా ప్రాక్టీస్ చేయాలి.
- టైర్-1లో 25 ప్రశ్నలు, టైర్-2లో 30 ప్రశ్నలు ఈ విభాగం నుంచి వస్తాయి. కాబట్టి పైన పేర్కొన్న అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టి చదవాలి.
జనరల్ అవేర్నెస్ - ఈ విభాగం నుంచి టైర్-1లో 25 ప్రశ్నలు, టైర్-2లో 20 ప్రశ్నలు వస్తాయి. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
- ఇందులో చరిత్ర (పూర్వ, మధ్య, ఆధునిక యుగాలు), భారత రాజ్యాంగం (మూలాలు, లక్షణాలు, ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలు), రాష్ట్రపతి-గవర్నర్లు, ప్రధాని-ముఖ్యమంత్రి, సుప్రీం కోర్టు-హై కోర్టు, రాజ్యాంగ బద్ధ సంస్థలు, సవరణలు వంటివి చదవాలి. ఇండియా-వరల్డ్ జాగ్రఫీ నుంచి భారతదేశ నైసర్గిక స్వరూపం, నదులు-డ్యామ్‌లు, దీవులు, నేలలు, వాతావరణం, పర్వతాలు, పచ్చిక బయళ్లు చదవాలి.
- భారత ఆర్థిక వ్యవస్థ నుంచి బ్యాంకింగ్ రంగం, ఆర్బీఐ మానిటరీ పాలసీ, బ్యాంకుల అనుసంధానాలు, 15వ ఆర్థిక సంఘం, బడ్జెట్, నీతి ఆయోగ్, జీఎస్టీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన బులెటెన్లు, కరెన్సీ – ఎక్సేంజ్, వాణిజ్యం, ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
- కరెంట్ అఫైర్స్‌లో రాష్ర్టాల ఎన్నికలు, నూతన సీఎంలు, గవర్నర్ల నియామకం, క్రీడలు, అవార్డులు, పుస్తకాలు-రచయితలు, ముఖ్యమైన తేదీలు, జాతీయ-అంతర్జాతీయ అంశాలు చదవాలి. ఇందుకు గత ఆరు నెలల మాస పత్రికలను చదవాలి.
- ఈ విభాగంలో మంచి మార్కులు సాధించాలంటే సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిందే. వార్తాపత్రికలు, 6 నెలల మ్యాగజీన్స్ వంటివి తప్పకుండా ఫాలో కావాలి. నిత్యం జనరల్ స్టడీస్ ప్రశ్నలు సాల్వ్ చేస్తే ఫలితం ఉంటుంది.
కంప్యూటర్ నాలెడ్జ్ - ఇది టైర్-2లో మాత్రమే వచ్చే విభాగం. 15 ప్రశ్నలకు 45 మార్కులు కేటాయించారు. ఇందులో కంప్యూటర్ బేసిక్స్, ఇన్పుట్, అవుట్‌పుట్, కంప్యూటర్ మెమరీ, కీ బోర్డు షార్ట్కట్లు, సాఫ్ట్వేర్లు, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్, ఇ-బ్యాంకింగ్, ఇ-గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ, వైరస్లు, స్పామ్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చైన్ మేనేజ్మెంట్ వంటి అంశాలు కీలకం. ఇందులో మంచి మార్కులు సాధించడానికి ఏదైనా కంప్యూటర్ నాలెడ్జ్ మెటీరియల్, ప్రశ్నోత్తరాలు బాగా ప్రాక్టీస్ చేయాలి.
డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ - ఇవి కంప్యూటర్‌పై టైపింగ్ టెస్ట్. 15 నిమిషాల్లో 2000 పదాలు టైపింగ్ చేయాలి. ఇందులో తప్పులు, అనువాదం, ప్రత్యామ్నాయ పదాలు, అదనపు పదాలు, పునరావృత పదాలు వంటి వాటిపై అవగాహన పొందడం వల్ల ఫలితం ఉంటుంది.
ఎస్ఎస్-సీహెచ్ఎస్ఎల్-2023 వివరాలు
- మొత్తం పోస్టులు: 1600 (పెరిగే అవకాశం ఉంది)
- చివరితేదీ: జూన్ 8
- అర్హతలు: ఇంటర్ ఉత్తీర్ణత
- వయస్సు: 18-27 మధ్య ఉండాలి (రిజర్వేషన్ కేటగిరీలకు మినహాయింపు ఉంటుంది)
- ఫీజు: రూ.100 (ఓసీ, బీసీ), ఎస్సీ, ఎస్టీలకు ఫీజు లేదు.
- పరీక్ష తేదీలు: టైర్-1 ఆగస్ట్‌లో, టైర్-2 నవంబర్-డిసెంబర్లో
- వెబ్సైట్: www.ssc.nic.in
మధు కిరణ్
డైరెక్టర్
ఫోకస్ అకాడమీ
హైదరాబాద్
9030496929
Previous article
GEOGRAPHY | పర్వతాల ఊయలగా వేటిని పేర్కొంటారు?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు