Current Affairs May 24 | అంతర్జాతీయం
అంతర్జాతీయం
కేన్స్ ఫిలిం ఫెస్టివల్
76వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ మే 16న ప్రారంభమైంది. 27న ఈ ఫెస్టివల్ ముగుస్తుంది. ఫ్రాన్స్‌లోని కేన్స్లోగల ప్రఖ్యాత పలైస్ డెస్ ఫెస్టివల్స్ ఎట్ డెస్ కాంగ్రెస్‌లో జరుగుతున్న ఈ ఫెస్టివల్‌కు ప్రపంచవ్యాప్తంగా సినీ ఔత్సాహికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇండియా పెవిలియన్‌ను కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫ్రాన్స్‌లోని భారత రాయబారి జావేద్ అష్రఫ్ పాల్గొన్నారు. ఈ కేన్స్ ఫెస్టివల్‌ను 1946లో ప్రారంభించారు.
రష్యా-ఇరాన్
ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ (ఐఎన్ఎస్టీసీ)లో భాగంగా నిర్మించనున్న రైల్వే లైన్ ఒప్పందాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రష్యా, ఇరాన్ మే 17న కుదుర్చుకున్నాయి. ఈ మార్గం కాస్పియన్ సముద్రం వద్ద గల ఇరాన్‌లోని రాష్త్ నుంచి అజర్‌బైజాన్‌లోని అస్తారా వరకు విస్తరించి ఉంటుంది. ఈ రైల్వే లింక్‌లో భారతదేశం, ఇరాన్, రష్యా, అజర్బైజాన్, ఇతరదేశాల రైలు, సముద్ర మార్గాలను అనుసంధానిస్తారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ నాయకుడు ఇబ్రహీం రాయిసీ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఎల్పీ791-18డి
సౌర కుటుంబానికి వెలుపల సుమారు భూమి పరిమాణంలో ఉన్న ఆవాసయోగ్య గ్రహాన్ని గుర్తించినట్లు అమెరికా సైంటిస్టులు మే 17న వెల్లడించారు. దీనికి ‘ఎల్పీ791-18డి’ అని పేరు పెట్టారు. సుమారు 90 కాంతి సంవత్సరాల దూరంలోని క్రేటర్ అనే నక్షత్ర మండలంలో ఓ ఎర్రటి మరుగుజ్జు నక్షత్రం చుట్టూ ఇది పరిభ్రమిస్తుంది. భూమితో పోలిస్తే ఈ గ్రహ పరిమాణం స్వల్పంగా ఎక్కువుంటుంది. ద్రవ్యరాశి మాత్రం చాలా అధికంగా ఉంటుంది. ఇది ఒకవైపు మాత్రమే నక్షత్రానికి అభిముఖంగా ఉంటుంది. దీంతో వేడి ఎక్కువగా ఉండొచ్చు. రెండో వైపున జీవం మనుగడకు అనుకూలంగా ఉండే అవకాశాలున్నాయని అంచనా వేశారు.
మ్యూజియం డే
ఇంటర్నేషనల్ మ్యూజియం డేని మే 18న నిర్వహించారు. సాంస్కృతిక మార్పిడి, విభిన్న సంస్కృతులను పెంపొందించడం, వివిధ వర్గాల మధ్య పరస్పర సహకారం, శాంతిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించే మ్యూజియాల గురించి అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ దినోత్సవాన్ని 1977లో ఏర్పాటు చేశారు. ఈ ఏడాది దీని థీమ్ ‘మ్యూజియమ్స్, సస్టెయినబిలిటీ అండ్ వెల్ బీయింగ్’.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?