UPSC NDA & NA II Recruitment | నేషనల్ డిఫెన్స్, నేవల్ అకాడమీలో 395 పోస్టులు
UPSC NDA & NA II Recruitment 2023 | నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నేవల్ అకాడమీలో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, నేవల్ అకాడమీ పోస్టుల భర్తీకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ – 2023 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆర్మీలో పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ (ఏ గ్రూప్‌లోనైనా) ఉత్తీర్ణత. నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో పోస్టులకు ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులుగా చదివి ఉండాలి. ప్రస్తుతం పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనితోపాటు అవివాహిత పురుష/మహిళ అభ్యర్థులై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
మొత్తం ఖాళీలు: 395 వీటిలో ఆర్మీ- 208 (10 మహిళలకు), నేవీ-42 (12 మహిళలకు), ఎయిర్‌ఫోర్స్ (గ్రౌండ్ డ్యూటీస్ (టెక్-18, నాన్ టెక్నికల్-10. వీటిలో 2 ఖాళీలు మహిళలకు), ఫ్లయింగ్-92 (మహిళలకు 2 ఖాళీలు)
నేవల్ అకాడమీ (10+2 క్యాడెట్ స్కీం)-25 ఖాళీలు. వీటిలో 7 మహిళలకు కేటాయించారు.
అర్హతలు: ఆర్మీలో పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ (ఏ గ్రూప్‌లోనైనా) ఉత్తీర్ణత. నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో పోస్టులకు ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులుగా చదివి ఉండాలి. ప్రస్తుతం పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.దీనితోపాటు అవివాహిత పురుష/మహిళ అభ్యర్థులై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
ఎంపిక: రెండు దశల్లో జరుగుతుంది. రాతపరీక్ష, ఇంటెలిజెన్స్, పర్సనాలిటీ టెస్ట్, ఎస్ఎస్బీ టెస్ట్/ఇంటర్వ్యూ, వైద్యపరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
రాతపరీక్ష
- దీన్ని 900 మార్కులకు నిర్వహిస్తారు
- దీనిలో మ్యాథ్స్ నుంచి 300 మార్కులు, జనరల్ ఎబిలిటీ నుంచి 600 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం మ్యాథ్స్‌కు రెండున్నర గంటలు. జనరల్ ఎబిలిటీకి రెండున్నర గంటలు.
- ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీలో ఉంటుంది.
- రాతపరీక్షలో అర్హత సాధించిన వారికి ఎస్ఎస్బీ టెస్ట్ నిర్వహిస్తారు.
- ఎస్ఎస్బీ టెస్ట్/ఇంటర్వ్యూకు 900 మార్కులు.
- ఈ టెస్ట్‌లో ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ రేటింగ్, పీపీ అండ్ డీ టెస్ట్ నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ తదితర పరీక్షలు నిర్వహిస్తారు.
- రాతపరీక్ష, ఎస్ఎస్బీలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
- శిక్షణ: ఎంపికైన దళాల్లో అభ్యర్థులకు చదువు, శిక్షణ ఇస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఆయా దళాల్లో ఉద్యోగావకాశాన్ని కల్పిస్తారు.
ముఖ్యతేదీలు
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: జూన్ 6
- వెబ్సైట్: https://upsc.gov.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?