Current Affairs May 12 | అంతర్జాతీయం
అంతర్జాతీయం
ఏటీఎం
30వ అరేబియన్ ట్రావెల్ మార్కెట్ (ఏటీఎం)-2023ని దుబాయ్‌లో మే 1న ప్రారంభించారు. ట్రావెల్, టూరిజం పరిశ్రమలో విజిటర్స్, ఎగ్జిబిటర్లను ఆకర్షించడానికి అంతర్జాతీయంగా నిర్వహించే వేదిక ఇది. దీనిలో మిడిల్ ఈస్ట్ నార్త్ ఆఫ్రికా (ఎంఈఎన్ఏ) మార్కెట్లను ఆకర్షించడానికి భారత టూరిజం మంత్రిత్వ శాఖ పాల్గొంది. ఇన్క్రెడిబుల్ ఇండియా షోకేస్ ద్వారా విజిట్ ఇండియా 2023కు సంబంధించి ప్రచారాన్ని నిర్వహించింది.
మాల్దీవ్స్‌లో రాజ్‌నాథ్ సింగ్
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాల్దీవ్స్‌లో మూడు రోజుల పర్యటన నిమిత్తం మాలేకు మే 1న వెళ్లారు. ఇరుదేశాల దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, ప్రపంచ భద్రతా సమస్యలపై ఆ దేశ రక్షణ మంత్రి మరియా దీదీతో చర్చించారు. మాల్దీవుల నేషనల్ డిఫెన్స్ ఫోర్సెస్ కోస్ట్‌గార్డ్ ’ఏకథా హార్బర్’కు మరియ దీదీతో కలిసి రాజ్‌నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఫాస్ట్ పెట్రోలింగ్ వెజిల్ (గస్తీ నౌక), ల్యాండింగ్ క్రాఫ్ట్‌లను మాల్దీవుల నేషనల్ డిఫెన్స్ ఫోర్స్‌కు రాజ్‌నాథ్ సింగ్ బహూకరించారు. మాల్దీవుల్లో భారత రక్షణ మంత్రి పర్యటించడం 11 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి.
గిగాచాట్
చాట్‌జీపీటీకి పోటీగా రష్యాకు చెందిన స్బెర్ బ్యాంక్ ‘గిగాచాట్’ను మే 1న ప్రారంభించింది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ మోడ్‌లో అందుబాటులో ఉంది. గిగాచాట్ ఇతర విదేశీ న్యూరల్ నెట్‌వర్క్‌లతో పోలిస్తే రష్యన్లో అనర్గళంగా, తెలివిగా సంభాషించగల సామర్థ్యాన్ని కలిగి ఉందని స్బెర్ బ్యాంక్ వెల్లడించింది. రష్యన్ ప్రభుత్వ యాజమాన్యంలోని ఈ బ్యాంక్ ఆ దేశంలోని పురాతన బ్యాంకుల్లో ఒకటి. దీన్ని 1841లో స్థాపించారు.
మిల్క్ అండ్ హనీ
భారత కెనడియన్ రూపి కౌర్ రచించిన ‘మిల్క్ అండ్ హనీ’ పుస్తకాన్ని యూఎస్ పాఠశాలల్లో మే 2న నిషేధించారు. ఈ నిషేధం 2022-23 ప్రథమార్ధంలో విధించారు. యూఎస్‌లో ప్రముఖంగా నిషేధం విధించిన 11 పుస్తకాల జాబితాలో ఈ పుస్తకం చేరింది. ఆమె తొలి రచన అయిన ఈ పుస్తకం 2014లో విడుదలైంది. ది సన్ అండ్ హర్ ఫ్లవర్స్ (2017), హోమ్ బాడీ (2020), హీలింగ్ త్రో వర్డ్స్ (2022) అనే పుస్తకాలు కూడా రచించారు. న్యూ రిపబ్లిక్ ఆమెను ‘రైటర్ ఆఫ్ ది డెకేడ్ (దశాబ్దపు రచయిత)’గా గుర్తించింది. ఫోర్బ్స్ 30 అండర్ 30 లిస్ట్‌లో కూడా చోటు సంపాదించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?