Current Affairs May 10 | జాతీయం
జాతీయం
ఇన్నోవేషన్ సర్వేలో తెలంగాణ
నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ సర్వే- 2021-22ని ఏప్రిల్ 30న విడుదల చేశారు. నవకల్పనలు అమలు చేయడంలో కర్ణాటక తరువాత తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, హర్యానా టాప్ ప్లేస్‌లో ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాద్రా నగర్ హవేలి, డామన్ డయ్యూ మొదటి స్థానాల్లో నిలిచాయి. ఈ సర్వేలో 6 కేంద్ర పాలిత ప్రాంతాలు, 28 రాష్ర్టాల్లోని 8074 కంపెనీల అభిప్రాయాలను సేకరించారు. దేశంలోని ఎంఎస్ఎంఈల్లో నవకల్పన (ఇన్నోవేషన్) విధానాలపై సర్వే నిర్వహించారు.
సాలెపురుగులు
దేశంలో ఎగిరే జాతికి చెందిన రెండు సాలెపురుగులను కనుగొన్నట్లు జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జడ్ఎస్ఐ) మే 1న వెల్లడించింది. ఇందులో ఫింటెల్లాధ్రితియే అనే సాలెపురుగును కర్ణాటకలోని మూకాంబిక వైల్డ్ లైఫ్ శాంక్చువరీలో కనుగొన్నారు. ఫింటెల్లాప్లాట్నికి అనే సాలెపురుగును తమిళనాడులోని సేలం జిల్లాలో గుర్తించారు. జడ్ఎస్ఐకి తొలి మహిళా డైరెక్టర్‌గా పని చేసిన ధ్రితి బెనర్జీ, ప్రముఖ అరాక్నాలజిస్ట్ నార్మన్ ప్లాట్నిక్ పేర్లను ఈ కొత్త జాతులకు పెట్టారు.
అరోరా
లఢక్‌లోని పర్వత ప్రాంతంలో అరుదుగా కనిపించే అరోరాను సరస్వతి పర్వత శ్రేణుల్లోని ఖగోళ అబ్జర్వేటరీ కెమెరా మే 1న బంధించింది. భూ అయస్కాంత తుఫాన్, భూ అయస్కాంత క్షేత్రాన్ని తాకినప్పుడు అరోరా ఏర్పడుతుంది. సూర్యుడు, భూ అయస్కాంత క్షేత్రాల ప్లాస్మా కణాల మధ్య పరస్పర చర్యల వల్ల ఇవి ఆవిష్కృతమవుతాయి. సాధారణంగా ఇవి అలస్కా, నార్వే తదితర విదేశాల్లోని పర్వత ప్రాంతాల్లో కనిపిస్తాయి. భారత్‌లో అరోరా ఏర్పడటం ఇదే మొదటిసారి.
రిటర్న్ టు రూట్స్
లఢక్‌లో ఏర్పాటు చేసిన ప్రాజెక్టుకు ఆస్ట్రేలియన్ ప్రభుత్వం గ్రాంట్ మంజూరు చేసిందని భారత్‌లో ఆస్ట్రేలియన్ హై కమిషనర్ హాన్ బేరీ ఓ ఫారెల్ ప్రకటించారు. దీనికి సంబంధించిన సమావేశం శ్రీనగర్‌లో మే 2న ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ ప్రాజెక్టుకు ‘రిటర్న్ టు రూట్స్’ అని పేరు పెట్టారు. సంప్రదాయ జ్ఞానాన్ని పాఠశాల సైన్స్ పాఠ్యప్రణాళికతో అనుసంధానించాలనేది ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. దీనిద్వారా విద్యార్థులు తమ సంస్కృతి, వారసత్వం గురించి లోతైన అవగాహన పొందుతారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?