Current Affairs May 10 | తెలంగాణ
తెలంగాణ
గ్రీన్ బిల్డింగ్ అవార్డు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి ప్రతిష్ఠాత్మక ‘ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అవార్డ్’ లభించింది. దేశంలోనే మొదటి గోల్డ్ రేటెడ్ సెక్రటేరియట్ బిల్డింగ్ కాంప్లెక్స్‌గా రికార్డుల్లోకెక్కింది. గోల్డ్ రేటింగ్ అవార్డు, సర్టిఫికెట్‌ను ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ సభ్యులు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి మే 1న అందజేశారు.
శాతవాహన కాలం కట్టడాలు
రాష్ట్రంలోని జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గజగిరిగుట్ట దిగువన మట్టి దిబ్బల కింద శాతవాహన కాలం నాటి ఇటుక గోడల నిర్మాణాలను చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి మే 3న కనుగొన్నారు. రైతులు సాగు కోసం తవ్వడంతో ఇటుక గోడల వరుసలు వెలుగు చూశాయి. ఉపరితలంలో బౌద్ధ స్థూప నిర్మాణానికి సంబంధించిన శిలలు, సున్నపురాయి, మట్టితో చేసిన టైల్స్ బయల్పడ్డాయి. రంగురంగుల రాతి, దంతపు, మట్టి పూసలు, మట్టి, రాతి గోళీలు, శివ లింగ ఆకృతిలోని పనిముట్లు లభించాయి. కొన్నె, రామచంద్రాపూర్ గ్రామాల మధ్య సుమారు 2 వేల సమాధులు ఉన్నాయి. నిలువురాళ్ల సమాధులు, గూడు సమాధులు, రంధ్రం ఉన్న సమాధులు, గుంత సమాధులు, రాక్షస గూళ్లు, డోల్మెన్ సమాధులతో పాటు కుండ సమాధులు ఉన్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?