General Science Physics | మేఘాలు గాలిలో తేలుతూ ఉండటానికి కారణం?
1. హైడ్రాలిక్ బ్రేకులు, ప్రెస్‌లు, లిఫ్ట్‌లు పనిచేసే సూత్రం ఏది?
1) పాస్కల్ సూత్రం
2) ఆర్కిమెడిస్ సూత్రం
3) బెర్నౌలీ సూత్రం 4) స్టోక్స్ సూత్రం
2. ద్రవ గాలిలోని ఘటకాలను వేరుచేయడానికి ఉపయోగించే విధానాన్ని గుర్తించండి?
1) స్వేదనం
2) నీటి ఆవరి స్వేదనం
3) ఉత్పతనం 4) అంశిక స్వేదనం
3. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ. భారమితి పాదరస మట్టం ఒక ప్రదేశం లో అకస్మాత్తుగా తగ్గితే రాబోయే వర్షాన్ని సూచిస్తుంది
బి. భారమితి పాదరస మట్టం క్రమక్రమం గా తగ్గితే ఒక ప్రదేశంలో రాబోయే తుఫానులను సూచిస్తుంది
సి. భారమితిలో తగ్గిన పాదరస మట్టం క్రమంగా మారితే సాధారణ వాతావరణాన్ని సూచిస్తుంది
1) ఎ 2) బి 3) ఎ, బి 4) సి
4. కింది వాటిలో కేశనాళికీయత అనువర్తనం కానిది ఏది?
1) కిరోసిన్ స్టవ్, దీపం, మైనం క్యాండిల్ పనిచేయడం
2) ఇసుక నేలలు తేమగా ఉండటం
3) ఎడారుల్లో ఒయాసిస్‌లు ఏర్పడటం
4) మొక్కల దారువు ద్వారా పీల్చుకున్న నీరు పైకి ఎగబాకడం
5. కింది వాటిలో గరిష్ఠ స్నిగ్ధతను కలిగి ఉండే పదార్థం ఏది?
ఎ. నీరు బి. తేనె
సి. పాదరసం డి. గ్రీజ్
1) బి 2) సి
3) బి, డి 4) ఎ, సి
6. పాలనా సాంద్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది?
1) అల్టీమీటర్ 2) హైగ్రోమీటర్
3) మానోమీటర్ 4) లాక్టోమీటర్
7. కింది వాటిని జతపరచండి.
భౌతిక రాశి ప్రమాణం ఎ. తలతన్యత 1. పాయిజ్
బి. ప్రచోదనం 2. పాస్కల్
సి. స్నిగ్ధత 3. న్యూటన్/మీటర్
డి. పీడనం 4. న్యూటన్/సెకన్
1) ఎ-2, బి-3, సి-4, డి-1
2) ఎ-3, బి-2, సి-1, డి-4
3) ఎ-3, బి-4, సి-1, డి-2
4) ఎ-4, బి-1, సి-2, డి-3
8. సమాన ద్రవ్యరాశి ఉన్న ఒక ఆస్ట్రిచ్ పక్షి ఈకను, 100 గ్రాముల రాయిని భూమికి 200 మీటర్ల ఎత్తు నుంచి ఒకేసారి జారవిడిచినప్పుడు వాతావరణ పొరల్లోని స్నిగ్ధతా బలాల వల్ల అవి..?
1) రెండూ ఒకేసారి భూమిని చేరతాయి
2) రాయి ముందుగా భూమిని చేరుతుంది
3) ఈక ముందుగా భూమిని చేరుతుంది
4) రెండూ భూమిని చేరవు
9. వర్షపు నీటి బిందువుల వేగం విషయంలో సరైన ప్రవచనం ఏది?
1) కిందికి వచ్చే కొద్దీ వేగం పెరుగుతూనే ఉంటుంది
2) కొంతదూరం వరకు వేగం పెరిగితుది వేగం పొందుతాయి
3) ఒకే వేగంతో ప్రయాణిస్తాయి
4) కిందికి వచ్చే కొద్దీ వేగం తగ్గుతుంది
10. నీటికి డిటర్జెంట్లను కలిపినప్పుడు కింది వాటిలో ఏది తగ్గుతుంది?
1) తలతన్యత
2) సంసంజన బలాలు
3) స్పర్శ కోణం 4) కేశనాళికీయత
11. కింది వాటిలో పీడనానికి సంబంధించిన సరైన ప్రమాణాలు ఏవి?
ఎ. డైన్/సెంటీమీటర్2
బి. పాస్కల్
సి. బార్
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) పైవేవీ కాదు
12. కుంటలు, నీటి మడుగులపై ఉన్న దోమలను, కీటకాలను చంపడానికి కిరోసిన్ చల్లుతారు. దీనికి సరైన వివరణ ఏది?
1) కిరోసిన్ వాసనకు చనిపోతాయి
2) కిరోసిన్ తాగి చనిపోతాయి
3) తలతన్యత తగ్గడం వల్ల మునిగిపోతాయి
4) తలతన్యత పెరగడం వల్ల మునిగిపోతాయి
13. నీటిపై ఒక సెంటీమీటర్ దూరంలో రెండు అగ్గిపుల్లలను సమాంతరంగా ఉంచి వాటి మధ్యలో వేడిగా ఉన్న ఒక సూదిని పెడితే ఏమవుతుంది?
1) పుల్లలు దూరంగా జరుగుతాయి
2) పుల్లలు దగ్గరగా జరుగుతాయి
3) పుల్లలు కాలిపోతాయి
4) పుల్లలు ఒకదానికొకటి లంబంగా అవుతాయి
14. ప్రతిపాదన (ఎ): ద్రవాలను వేడి చేసినప్పుడు తలతన్యత తగ్గుతుంది
కారణం (ఆర్): ఉష్ణోగ్రతను పెంచితే ద్రవ అణువుల మధ్య గల సంసంజన బలాలు బలహీనమవుతాయి
1) ఎ కు ఆర్ సరైన వివరణ
2) ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
3) ఎ మాత్రమే సరైనది
4) ఆర్ మాత్రమే సరైనది
15. ఒక పార్సెక్ ఎన్ని కాంతి సంవత్సరాలకు సమానం?
1) 9.3 2) 3.26
3) 1.5 4) 5
16. కింది వాటిని జతపరచండి.
ఎ. పాస్కల్ నియమం 1. జలాంతర్గామి పనిచేయడం
బి. ఆర్కిమెడిస్ సూత్రం 2. వెంచురీ మీటర్ పనిచేయడం
సి. బెర్నౌలీ సూత్రం 3. పదార్థాల స్వచ్ఛత
డి. ప్లవన సూత్రం 4. ఎయిర్ బ్రేకులు పనిచేయడం
1) ఎ-1, బి-3, సి-2, డి-4 2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-2, డి-1 4) ఎ-4, బి-2, సి-1, డి-3
17. ద్రవాల సాపేక్ష సాంద్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది?
1) హైడ్రోమీటర్ 2) హైగ్రోమీటర్
3) మానోమీటర్
4) స్పిగ్మోమానో మీటర్
18. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ. నల్లరేగడి మట్టి నీటిని పీల్చుకొని తేమగా ఉండటానికి కారణం కేశనాళికీయత
బి. నీటిలో డిటర్జంట్ పౌడర్‌ను కలిపితే దాని తలతన్యత పెరుగుతుంది
1) 1 2) 2 3) 1, 2
4) ఏవీ కాదు
19. గాలిలో నీటి బిందువులు, సబ్బు నీటి బుడగలు గోళాకారంగా ఉండటానికి కారణం?
1) కేశనాళికీయత 2) స్నిగ్ధత
3) తలతన్యత 4) పైవన్నీ
20. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ. భారమితిలో వాతావరణ పీడన పాదరస మట్టం 760 మిల్లీమీటర్లు
బి. ద్రవ సాంద్రత తగ్గితే భారమితి ఎత్తు తగ్గుతుంది
సి. భారమితిని టారిసెల్లి కనుగొన్నాడు
1) ఎ, బి, సి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి
21. బట్టలను వేడి నీటితో ఉతికితే మురికి తొందరగా పోతుంది. దీనికి కారణం?
1) నీటి తలతన్యత తగ్గి తేలికగా బట్టలపైకి విస్తరిస్తుంది
2) నీటి తలతన్యత పెరిగి తేలికగా బట్టలపైకి విస్తరిస్తుంది
3) నీటి స్నిగ్ధత పెరిగి తేలికగా బట్టలపైకి విస్తరిస్తుంది
4) 1, 2
22. ఒక పాత్రలో కొంతనీరు, కొంత ఆల్కహాల్ పోసి, కొన్ని చుక్కల ఆలివ్ నూనె వేస్తే అవి ఏవిధంగా సర్దుకుంటాయి?
1) నీరు అడుగుభాగాన చేరుతుంది
2) ఆల్కహాల్ నీటిపై తేలుతుంది
3) ఆలివ్ నూనె చుక్కలు నీరు, ఆల్కహాల్‌ల మధ్యలో ఉంటాయి
4) పైవన్నీ సరైనవే
23. గాలిలో 1 కిలోగ్రామ్ ఉక్కు, 1 కిలోగ్రామ్ పక్షి రెక్కల్లో దేన్ని పైకి లేపడం తేలిక?
1) ఉక్కు
2) పక్షి రెక్కలు
3) రెండింటికీ సమానం
4) అవి ఆక్రమించే వైశాల్యంపై ఆధారపడి ఉండదు
24. జతపరచండి.
పదార్థం స్పర్శ కోణం
ఎ. పాదరసం 1. 00
బి. స్వచ్ఛమైన నీరు 2. 80-90
సి. వెండితో నీరు 3. 900
డి. సాధారణ నీరు 4.1350-1400
1) ఎ-2, బి-3, సి-4, డి-1
2) ఎ-4, బి-1, సి-3, డి-2
3) ఎ-1, బి-4, సి-2, డి-3
4) ఎ-3, బి-2, సి-1, డి-4
సమాధానాలు
1.1 2.4 3.4 4.2
5.3 6.4 7.3 8.2
9.2 10.3 11.3 12.3 13.1 14.1 15.2 16.3
17.1 18.2 19.3 20.3
21.1 22.4 23.2 24.2
25.1 26.1 27.3 28.4
25. కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
ఎ. ఒక ప్రదేశంలో భారమితిలోని పాదరస స్తంభం పొడవు అకస్మాత్తుగా తగ్గితే అది తుఫాన్ రాకను సూచిస్తుంది
బి. పాదరస మట్టం క్రమంగా తగ్గితే రాబోయే వర్ష సూచనను తెలుపుతుంది
1) రెండూ సరైనవి 2) రెండూ తప్పు
3) 1 సరైంది 2 తప్పు
4) 1 తప్పు 2 సరైంది
26. ప్రతిపాదన (ఎ): వర్షపు చినుకులు వేగం తగ్గడానికి కారణం వాతావరణం స్నిగ్ధతా బలాలు
కారణం (ఆర్): ప్రవాహిని వివిధ పొరల మధ్యలో ఉన్న నిరోధక బలాలు
1) ఎ కు ఆర్ సరైన వివరణ
2) ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
3) ఎ మాత్రమే సరైనది
4) ఆర్ మాత్రమే సరైనది
27. ప్రతిపాదన (ఎ): పాదరసాన్ని భారమితుల్లో ఉపయోగిస్తారు
కారణం (ఆర్): పాదరసం స్పర్శకోణం 900 కంటే తక్కువ
1) ఎ కు ఆర్ సరైన వివరణ
2) ఎ, ఆర్లు సరైనవి కానీ ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
3) ఎ మాత్రమే సరైనది
4) ఆర్ మాత్రమే సరైనది
28. కింది వాటిలో సరైనది ఏది?
ఎ. స్నిగ్ధత పీడనంపై ఆధారపడదు
బి. వాయువుల స్నిగ్ధత ఉష్ణోగ్రత పెరిగితే తగ్గుతుంది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) పైవేవీ కాదు
29. నీటి బాష్పీభవన రేటు దేనికి విలోమానుపాతంలో ఉంటుంది?
1) ఉపరితల వైశాల్యం 2) ఆర్ధ్రత
3) ఉష్ణోగ్రత 4) గాలి వడి
30. అంతరిక్ష యాత్రికులకు ప్రత్యేక దుస్తులు ఉండటానికి కారణం?
1) చలిని తట్టుకోవడానికి
2) కాంతిని పరావర్తనం చెందించడానికి
3) కాంతిని శోషించుకోవడానికి
4) వారి శరీరంపై వాతావరణ పీడనానికి సమానమైన పీడనాన్ని కలిగించడానికి
31. వాయువుల పీడనాన్ని కొలిచే సాధనం?
1) ఫోనోమీటర్ 2) ఫొటోమీటర్
3) ఓడోమీటర్ 4) మానోమీటర్
32. సాధారణ వ్యక్తి రక్తపీడనం?
1) వాతావరణ పీడనం కంటే కొద్దిగా అధికం
2) వాతావరణ పీడనానికి సమానం
3) వాతావరణ పీడనం కంటే తక్కువ
4) వాతావరణ పీడనం కంటే చాలా తక్కువ
33. కింది వాటిలో సరైనది ఏది?
ఎ. స్నిగ్ధతను కొలిచే పరికరం విస్కోమీటర్
బి. స్నిగ్ధత ప్రమాణం పాస్కల్ సెకండ్
సి. స్నిగ్ధతా బలం వాటి ఉపరితల వైశాల్యాల పైన ఆధారపడుతుంది
1) ఎ, సి 2) బి, సి
3) ఎ, బి 4) ఎ, బి, సి
34. గాలి దూరని పెట్టెలో ఉన్న పక్షి ఎగరడం ప్రారంభిస్తే పెట్టే భారం?
1) మారదు 2) పెరుగుతుంది
3) తగ్గుతుంది
4) మొదట పెరిగి తర్వాత తగ్గుతుంది
35. మేఘాలు గాలిలో తేలుతూ ఉండటానికి కారణం?
1) తలతన్యత 2) కేశనాళికీయత
3) గాలి స్నిగ్ధత 4) బెర్నౌలీ సిద్ధాంతం
36. నీరు, పాదరసం, ఆక్సిజన్, హైడ్రోజన్లలో దేనికి స్నిగ్ధత అధికం?
1) నీరు 2) పాదరసం
3) ఆక్సిజన్ 4) హైడ్రోజన్
37. ఫౌంటెన్ పెన్ను ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది?
1) స్నిగ్ధత (విస్కాసిటీ)
2) బాయిల్స్ లా
3) గురుత్వాకర్షణ 4) తలతన్యత
38. విమానాల్లో ప్రయాణించేటప్పుడు బాల్ పెన్లో ఇంక్ బయటకు రావడానికి కారణం?
1) వాతావరణ పీడనం పెన్నులో పీడనం సమానం
2) వాతావరణ పీడనం కన్నా పెన్నులో పీడనం తక్కువ
3) వాతావరణ పీడనం కన్నా పెన్నులో పీడనం ఎక్కువ
4) పైవేవీ కాదు
39. కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
ఎ. ద్రవాల తలతన్యత ఉష్ణోగ్రతకు విలోమానుపాతంలో ఉంటుంది
బి. సందిగ్ధ ఉష్ణోగ్రత వద్ద ప్రతి ద్రవం తలతన్యత శూన్యం
1) ఎ సరైంది, బి తప్పు
2) ఎ తప్పు, బి సరైంది
3) రెండూ తప్పు
4) రెండూ సరైనవే
40. నీటిపై తేలే బుడగలు ఒకదాని దగ్గరకు ఒకటి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది?
1) చిన్న బుడగలు పెద్ద బుడగలో కలిసిపోతాయి
2) పెద్ద బుడగలు చిన్న బుడగలో కలిసిపోతాయి
3) పెద్ద బుడగలు చిన్న బుడగలుగా విడిపోతాయి
4) 2, 3
సమాధానాలు
29.2 30.4 31.4 32.1
33.4 34.1 35.3 36.2
37.4 38.3 39.4 40.1
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు