Disaster Management | మనదేశంలో అత్యధిక వరదలు ఏ నదుల వల్ల సంభవిస్తాయి?
విపత్తు నిర్వహణ
1. కిందివాటిలో ఏ తుఫాను భూ ఆధారితమైనది?
1) హరికేన్ 2) టైపూన్
3) విల్లీ-విల్లీ 4) టోర్నడో
2. కిందివాటిలో ఏ సంస్థ విపత్తు నిర్వహణ కోసం దేశంలోని వివిధ ప్రాంతాల్లో సంసిద్ధత అభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తుంది?
1) ఎన్డీఆర్ఎఫ్
2) విపత్తు శిక్షణ కేంద్రం
3) జిల్లా యంత్రాంగాలు
4) ఎన్డీఎంఏ
3. భారతదేశం మొదటి భూకంప ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ఎక్కడ ఏర్పాటు అయ్యింది?
1) హిమాచల్ ప్రదేశ్
2) ఉత్తరాఖండ్
3) గుజరాత్ 4) జమ్ముకశ్మీర్
4. భీకర తుఫాన్‌ను (సూపర్ సైక్లోన్) ఎదుర్కొనేందుకు సన్నద్ధతలో భాగంగా విశాఖలో జరిగిన విపత్తు నిర్వహణ అభ్యాస కార్యక్రమం పేరు ఏమిటి?
1) ప్రకంపన 2) పరాశక్తి
3) వాయుసిద్ధ 4) సమయ్
5. కిందివాటిలో ఏది వరద నిరోధక తగ్గింపు వ్యూహం కాదు?
1) ముంపు మైదానాల నుంచి జనాభాను తరలించడం
2) నదుల సమీపాన ఉన్న పరిశ్రమలను తరలించడం
3) అటవీకరణ
4) నదీప్రవాహ కాలువల పూడికతీత / అవరోధాల తొలగింపు
6. ఉత్తరార్ధగోళంలో తుఫానులో గాలి ఏ దిశలో వడివడిగా లోపలికి తిరుగుతుంది?
1) యాదృచ్ఛిక దిశ
2) సవ్య దిశ
3) అపసవ్య దిశ
4) గాలి నిశ్చలంగా ఉంటుంది
7. హిమ సంపాతం ఏ రకమైన విపత్తు?
1) భౌమ సంబంధమైన
2) జల సంబంధమైన
3) జల, భౌమ సంబంధమైన
4) భౌమ వాతావరణ సంబంధ
8. విపత్తు నిర్వహణ కోసం సంసిద్ధతలో భాగంగా మొట్టమొదటిసారిగా అడవుల్లో కార్చిచ్చులపై అభ్యాస కార్యక్రమం 2017 ఎక్కడ జరిగింది?
1) ఉత్తరాఖండ్ 2) మధ్యప్రదేశ్
3) ఛత్తీస్‌గఢ్ 4) కర్ణాటక
9. ఉత్తర భారతంలో వేడి గాల్పులు సాధారణంగా ఏ కాలంలో ఉంటాయి?
1) ఏప్రిల్ నుంచి మే
2) ఏప్రిల్ నుంచి జూన్
3) మార్చి నుంచి మే
4) మార్చి నుంచి జూన్
10. కార్గిల్ ప్రాంతంలో ఒక నదిలో మంచుకొండ చరియలు విరిగిపడి నదీ ప్రవాహాన్ని ఆపినప్పుడు, ఆకస్మిక వరదలు రాకుండా, పేలుడు పదార్థాలు ఉపయోగించి అడ్డుగా ఉన్న పదార్థాల తొలగింపు కార్యక్రమాన్ని ఏ పేరుతో పిలిచారు?
1) ఆపరేషన్ సురు 2) ఆపరేషన్ ఫుట్కల్
3) ఆపరేషన్ ద్రాస్ 4) ఆపరేషన్ సరప్
11. విపత్తు తగ్గింపు చర్యల కోసం సెండాయి వ్యవస్థ ఏ సంవత్సరం వరకు అమల్లో ఉంటుంది?
1) 2025 2) 2030
3) 2040 4) 2050
12. విపత్తు సంభవించిన తరువాతి కాలంలో ఆ ప్రాంతం కోలుకోవడం పునర్నిర్మాణంపై ఐక్యరాజ్యసమితి వ్యవస్థ ప్రస్తుత ఆలోచనా విధానం ఏమిటి?
1) కనిష్ఠ పునరుద్ధరణ
2) మునుపటి స్థితి పునరుద్ధరణ
3) మునుపటి కంటే చక్కగా నిర్మించడం
4) ఎప్పటికప్పుడు మారుతుంది
13. విపత్తు జరగడానికి అవకాశం ఉన్న హానికారకాల్లో ఒకటి కానిది?
1) పేదరికం 2) జనాభా విస్తృతి
3) ప్రదేశం 4) మతం
14. ప్రాకృతిక విపత్తు అనేది ఏదీలేదు. కేవలం ప్రాకృతిక అపాయం తప్ప’ అనే వాక్యం
1) సత్యం 2) అసత్యం
3) సత్యం లేదా అసత్యం కావచ్చు
4) అర్ధరహితం
15. కిందివాటిలో ఏది ప్రాకృతిక విపత్తుకు కారక సంఘటన (ట్రిగ్గర్) కాదు?
1) యుద్ధం
2) పర్యావరణ అధోకరణం
3) సాంకేతిక ప్రమాదం
4) ఇచ్చిన అన్ని సమాధానాలు సరైనవే
16. కింది కార్యాల్లో ఏది విపత్తు జరిగే సమయంలోను, విపత్తు తర్వాతి సమయంలోను ఉంటుంది?
1) నివారణ 2) తీవ్రత తగ్గింపు
3) ఉపశమనం 4) ప్రతిస్పందన
17. కిందివాటిలో ఏది భూకంపం నుంచి అత్యంత తీవ్రమైన ప్రమాదం ఉన్న జోన్ -5లో ఉన్నది?
1) షిల్లాంగ్ 2) ఢిల్లీ
3) ముంబై 4) చెన్నై
18. భూకంపం ప్రారంభమయ్యే చోటును ఏమంటారు?
1) అధికేంద్రం 2) కేంద్రం
3) నోడల్ కేంద్రం 4) భూ కేంద్రం
19. ఆంధ్రప్రదేశ్‌లో తీర ప్రాంతాన్ని నెలలవారీగా దాటిన తుఫానుల్లో గత 100 ఏళ్ల సమాచారం చూస్తే ఏ నెలలో ఎక్కువ ఉన్నాయి?
1) సెప్టెంబర్ 2) అక్టోబర్
3) నవంబర్ 4) డిసెంబర్
20. లాతురు భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 6.4 మాత్రమే నమోదైనా నష్టం మాత్రం తీవ్రంగా ఉండటానికి కారణం ఏమిటి?
1) లాతూరులోని భవనాలు బలహీనంగా ఉన్నాయి
2) బాధితులకు సహాయం సకాలంలో అందలేదు
3) భూకంప కేంద్రం కేవలం
10 కి.మీ. లోతులోనే ఉంది
4) భూకంప తీవ్రతను కొలిచే సాధనాలు సరిగ్గా లేవు
21. ఎన్.డి.ఎం.ఎ. లెక్కల ప్రకారం భారత్‌లోని వ్యవసాయ భూమిలో ఎంతశాతం కరువు బారినపడే ప్రమాదం ఉంది?
1) 68 శాతం 2) 58 శాతం
3) 48 శాతం 4) 38 శాతం
22. విపత్తు ఎప్పుడు సంభవిస్తుంది?
1) భగవంతుని ఇచ్ఛ ప్రకారం
2) సాధారణంగా రాత్రుల్లో
3) ప్రజలు ఒక ప్రమాద ఘటన ప్రభావాన్ని తట్టుకోలేనప్పుడు
4) ఇచ్చిన సమాధానాల్లో ఏదీ సరైంది కాదు
23. కిందివాటిలో ఎవరు విపత్తుకు ఎక్కువ గురి అవడానికి అవకాశం ఉంది?
1) మిల్లు కార్మికులు
2) దట్టమైన అడవుల్లో ఉన్న చిన్న పల్లెల్లో ఉండేవారు
3) పట్టణ శివారులోని విశాలమైన రహదారులున్న ప్రాంతంలోని ప్రజలు
4) ఇరుకైన రహదారులు ఉన్న పాతనగర ప్రజలు
24. కిందివాటిలో ఏది తీవ్రతను తగ్గించే వ్యూహం?
1) ఇళ్లను దగ్గరగా కట్టడం
2) మట్టి ఇళ్లు కట్టడం
3) భవన నిర్మాణ నిబంధనలను కచ్చితంగా అమలు చేయడం
4) పట్టణాలకు వలసపోవడం
25. నగరం ముంపునకు గురికావడం?
1) ప్రకృతి సిద్ధమైన విపత్తు
2) చాలావరకు మానవ తప్పిదమే
3) ఎప్పుడూ మానవ తప్పిదమే
4) చాలావరకు ప్రకృతి సిద్ధమైన విపత్తు
26. విమాన దుర్ఘటనలకు సంబంధించిన నోడల్ మంత్రిత్వశాఖ ఏది?
1) హోం వ్యవహారాల శాఖ
2) రవాణా మంత్రిత్వశాఖ
3) విపత్తు నిర్వహణ మంత్రిత్వశాఖ
4) పౌర విమానయాన మంత్రిత్వశాఖ
27. భూతాపం పెరుగుదలను ఇలా తగ్గించవచ్చు?
1) జ్వలించే బల్బులను ఉపయోగించడం
2) ఫ్రిజ్‌లను ఉపయోగించడం
3) గృహ వ్యర్థాలను కంపోస్ట్‌గా చేయడం
4) అనేక పెంపుడు జంతువులను పెంచడం
28. తీరప్రాంతం మొత్తంలో ప్రకృతి వైపరీత్యాల ముందస్తు హెచ్చరికల జారీ వ్యవస్థ (ఈడబ్ల్యూడీఎస్)ను ఏర్పరచిన మొదటి రాష్ట్రం?
1) ఆంధ్రప్రదేశ్ 2) పశ్చిమబెంగాల్
3) తమిళనాడు 4) ఒడిశా
29. 2001 భుజ్ (గుజరాత్)లో వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై ఎంత?
ఎ) 6.9 బి) 6.8
3) 6.5 4) 6.4
30. గత శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాన్ని తాకిన 130 తుఫాన్లలో ఎన్ని అత్యంత తీవ్రమైనవి?
1) 29 2) 26 3) 33 4) 31
31. ప్రకృతి వైపరీత్యాలు, మానవులకు సంబంధించిన ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ కేంద్ర మంత్రిత్వశాఖ విపత్తు ప్రతిస్పందన నిర్వహణకు నోడల్‌శాఖగా వ్యవహరిస్తుంది?
1) గృహ మంత్రిత్వశాఖ
2) రక్షణ మంత్రిత్వ శాఖ
3) పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ
4) వ్యవసాయ మంత్రిత్వశాఖ
32. భారతీయ ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ కార్యాచరణ నామం ఆంగ్లంలో సంక్షిప్తంగా ఏమిటి?
1) నావిక్ 2) మాజిక్
3) లాజిక్ 4) కాసిక్
సమాధానాలు
1-4 2-4 3-2 4-1
5-2 6-3 7-3 8-1
9-4 10-2 11-2 12-4
13-1 14-2 15-3 16-4
17-1 18-2 19-2 20-3
21-1 22-3 23-4 24-3
25-2 26-4 27-3 28-4
29-1 30-3 31-1 32-1
33. భారత్‌లో భూకంప ప్రమాదానికి గురికాగల భూ విస్తీర్ణం సుమారుగా ఎంత?
1) 59 శాతం 2) 79 శాతం
3) 49 శాతం 4) 69 శాతం
34. కరువు తీవ్రత దేనివల్ల పెరుగుతుంది?
1) పర్యావరణ క్షీణత
2) ప్రజల నిర్లక్ష్య ధోరణి
3) అవగాహనా రాహిత్యం
4) ప్రసార సదుపాయాలు సరిగా లేకపోవడం
35. మనదేశంలో అత్యధిక వరదలు ఈ నదుల వల్ల కలుగుతాయి?
1) గంగా, బ్రహ్మపుత్ర
2) గంగా, యమున
3) గంగా, నర్మద
4) బ్రహ్మపుత్ర, నర్మద
36. దీర్ఘకాలపు సగటు వర్షపాతంతో పోలిస్తే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షపాతంలో తగ్గుదల ఎంత శాతం కంటే ఎక్కువ ఉంటే దాన్ని వర్షభావ సంవత్సరంగా పరిగణిస్తారు?
1) 19 శాతం 2) 20 శాతం
3) 21 శాతం 4) 25 శాతం
37. కిందివాటిలో దేన్ని జీవ ఆయుధంగా పరిగణిస్తారు?
1) అంత్రాక్స్ పార్శిల్
2) దోమల బెడద
3) పేను కొరుకుడు
4) మిడతల దాడి
38. వేలాదిమంది మరణానికి కారణమైన భోపాల్ దుర్ఘటనలో వెలువడిన విషవాయువు ఏది?
1) మిథైల్ ఐసో సైనేట్
2) మిథేన్
3) కార్బైడ్ ఐసో సైనేట్
4) ఇథైల్ ఐసో సైనేట్
39. ఈశాన్య రాష్ర్టాల ప్రాంతం ఏ భూకంప పాదక్షేత్రం (జోన్)లో ఉంది?
1) 5వ క్షేత్రం (జోన్)
2) 1వ క్షేత్రం (జోన్)
3) 2వ క్షేత్రం (జోన్)
4) 4వ క్షేత్రం (జోన్)
40. 1945 హిరోషిమాపై వేసిన ఆటంబాంబు పేరేమిటి?
1. లిటిల్‌బాయ్ 2) ఫ్యాట్ మ్యాన్
3) బోల్డ్ లేడీ 4) లిటిల్ డెవిల్
41. విపత్తు వచ్చినప్పుడు మొదటిగా ఎవరు స్పందించాలి?
1) జన సముదాయం
2) కేంద్ర ప్రభుత్వం
3) రెడ్‌క్రాస్
4) రాష్ట్ర ప్రభుత్వం
42. భోపాల్ దుర్ఘటన ఏ రకమైన విపత్తుగా గుర్తించవచ్చు?
1) రసాయన 2) జీవసంబంధ
3) సహజ
4) ఏ రకమో చెప్పటం కష్టం
43. జాతీయ విపత్తు తగ్గింపు దినం ఏది?
1) అక్టోబర్ 13 2) సెప్టెంబర్ 11
3) సెప్టెంబర్ 29 4) నవంబర్ 1
44. భూకంప కేంద్రానికి సరిగ్గా పైనున్న స్థానాన్ని ఏమిని పిలుస్తారు?
1) ఎపీ సెంటర్
2) మెటా సెంటర్
3) హైపర్ సెంటర్
4) హైపోసెంటర్
45. ఢిల్లీ, ముంబైలు ఏ రకమైన భూకంప రిస్క్ జోన్లో ఉన్నాయి?
1) జోన్-4 2) జోన్-1
3) జోన్-5 4) జోన్-3
46. జాతీయ విపత్తు నిర్వహణ విధానాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించడం జరిగింది?
1) 2009 2) 2010
3) 2008 4) 2007
47. ప్రపంచం మొత్తం ఉష్ణమండల తుఫానుల్లో ఎంత శాతం భారత తీరాన్ని ప్రభావితం చేస్తాయి?
1) 10 శాతం 2) 20 శాతం
3) 15 శాతం 4) 30 శాతం
48. కిందివాటిలో ఏ విపత్తు అత్యధిక నష్టం కలిగిస్తుంది?
1) భూకంపాలు 2) హరికేన్లు
3) వరదలు 4) సైక్లోన్లు
49. విపత్తు నిర్వహణకు సంబంధించిన అన్ని విషయాల్లో సమన్వయానికి జాతీయస్థాయిలో ఏ మంత్రిత్వశాఖ నోడల్‌శాఖగా ఉంటుంది?
1) గృహమంత్రిత్వశాఖ
2) శాస్త్రసాంకేతిక శాఖ
3) రక్షణ శాఖ
4) ఆర్థిక శాఖ
50. గృహ మంత్రిత్వశాఖలోని ఎవరు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు చేపట్టే సహాయ పునరావాస కార్యక్రమాలకు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు?
1) కేంద్ర పునరావాస (రిలీఫ్) కమిషనర్
2) ప్రధాన కమిషనర్
3) పునరావాస (రిలీఫ్) కమాండర్
4) గృహమంత్రిత్వశాఖ కార్యదర్శి
51. భారతదేశంలో విపత్తులు సంభవించినప్పుడు రక్షణ, సహాయ, పునరావాస చర్యలు చేపట్టవలసిన ప్రాథమిక బాధ్యత ఈ కిందివాటిపై ఉంటుంది.
1) రాష్ట్ర ప్రభుత్వం
2) కేంద్ర ప్రభుత్వం
3) ఎంపికైన ప్రభుత్వం
4) ప్రభుత్వేతర సంస్థలు
52. ఉష్ణమండల తుఫాన్లు, అరేబియన్ సముద్రం కంటే బంగాళాఖాతంలో ఎన్ని రెట్లు ఎక్కువగా సంభవిస్తాయి?
1) 4 నుంచి 5 రెట్లు
2) 10 నుంచి 12 రెట్లు
3) 1 నుంచి 2 రెట్లు
4) 8 నుంచి 9 రెట్లు
సమాధానాలు
33-1 34-1 35-1 36-1
37-1 38-1 39-1 40-1
41-1 42-1 43-1 44-1
45-1 46-1 47-1 48-1
49-1 50-1 51-1 52-1
తెలుగు అకాడమీ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు