Current Affairs May 03 | అంతర్జాతీయం
అంతర్జాతీయం
హకుటో ఆర్
చందమామపైకి మూన్ ల్యాండర్‌ను పంపేందుకు జపాన్‌కు చెందిన ‘ఐస్పేస్’ అనే ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనల కంపెనీ చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన ‘హకుటో ఆర్’ ల్యాండర్ చంద్రుడిపై దిగడానికి కొద్ది క్షణాల ముందు దానికి భూమితో సంబంధాలు తెగిపోయాయి. ఆ ల్యాండర్ చంద్రుడిపై కూలిపోయి ఉండవచ్చని సైంటిస్టులు ఏప్రిల్ 25న వెల్లడించారు. ఈ ల్యాండర్‌ను ఎలాన్‌మస్క్‌కు చెంది స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా గత డిసెంబర్లో చంద్రుడిపైకి పంపింది. ఆరడుగుల ఎత్తు, 340 కిలోల బరువుండే హకుటో ఆర్‌లో చంద్రుడిపై పరిశోధనలు చేసే రషీద్ అనే రోవర్, బేస్ బాల్ పరిమాణంలో ఉండే ఒక రోబో ఉన్నాయి. హకుటో అంటే జపాన్ భాషలో కుందేలు అని అర్థం.
వరల్డ్ మలేరియా డే
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఏప్రిల్ 25న నిర్వహించారు. మలేరియా నివారణ, నియంత్రణపై అవగాహన పెంచడానికి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆఫ్రికా మలేరియా దినోత్సవాన్ని 2001 నుంచి ఆఫ్రికన్ దేశాలు నిర్వహిస్తున్నాయి. 2007లో ప్రపంచ హెల్త్ అసెంబ్లీ 60వ సెషన్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రతిపాదించింది. ఈ ఏడాది దీని థీమ్ ‘టైమ్ టు డెలివర్ జీరో మలేరియా: ఇన్వెస్ట్, ఇన్నోవేట్, ఇంప్లిమెంట్’.
జీటెక్స్
గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఎగ్జిబిషన్ (జీఈటీఈఎక్స్)ను దుబాయ్‌లో ఏప్రిల్ 26 నుంచి 28 వరకు నిర్వహించారు. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను 30 ఏండ్లుగా నిర్వహిస్తున్నారు. విదేశీ విద్యలో అడ్మిషన్ల కోసం ప్రముఖ విద్యాసంస్థలు ఇందులో పాల్గొంటాయి. ఈ ఎగ్జిబిషన్ ఏటా 25,000 మంది స్థానిక, ప్రవాస విద్యార్థులను ఆకర్షిస్తుంది. ఇక్కడ భారత పెవిలియన్‌ను దుబాయ్‌లోని భారత కాన్సుల్ జనరల్ అమన్ పురి ప్రారంభించారు. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహకారంతో దీన్ని ఏర్పాటు చేశారు.
వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే
వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే (ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం) ని ఏప్రిల్ 26న నిర్వహించారు. పేటెంట్లు, కాపీరైట్లు, ట్రేడ్‌మార్క్‌లు, డిజైన్లు దైనందిన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై అవగాహన పెంపొందించడానికి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దీన్ని 1988లో 33వ జనరల్ అసెంబ్లీ సెషన్లో ప్రతిపాదించారు. 1999, ఆగస్ట్ 9న ఏర్పాటు చేశారు. దీని ప్రారంభ వేడుక 2000లో నిర్వహించారు. ఈ ఏడాది దీని థీమ్ ‘ఉమెన్ అండ్ ఐపీ: యాక్సిలరేటింగ్ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ’.
అనంతారపు కృష్ణయ్య
డైరెక్టర్,
శ్రీసాయి కోచింగ్ సెంటర్
కోదాడ
9948750605
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?