General Studies | నీటి వనరుల పెంపు.. రేపటి తరానికి మలుపు
దేశంలో మొదటి నీటి వనరుల సర్వే విడుదల
- ఈ సర్వేను 2017-18 సంవత్సరం ఆధారంగా చేసుకొని కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసింది.
- ఈ సర్వేలో దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ, లక్షద్వీప్ తప్ప 33 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాల్గొన్నాయి.
- ఈ సర్వే నీటి పారుదల గణన పథకంలో భాగంగా రాష్ట్ర నోడల్ డిపార్ట్మెంట్ల పర్యవేక్షణలో జరిగింది.
- గుర్తించిన నీటి వనరులు-24,24,540
అత్యధిక నీటి వనరుల సంఖ్య ఉన్న టాప్-5 రాష్ర్టాలు
1. పశ్చిమబెంగాల్-7,47,480 (30.8%)
2. ఉత్తరప్రదేశ్ – 2,45,087 (10.1%)
3. ఏపీ- 1,90,777 (7.9%)
4. ఒడిశా- 1,81,837 (7.5%)
5. అసోం- 1,72,492 (7.1%)
మొత్తం నీటి వనరుల్లో అత్యధిక సంఖ్య కలిగి ఉన్న జిల్లాలు
దక్షిణ 24 పరగణాలు –
పశ్చిమబెంగాల్-3,55,780
అనంతపురం – ఏపీ- 50,537
హౌరా – పశ్చిమబెంగాల్-37,301
గమనిక: ఈ సర్వే ప్రకారం అత్యధిక నీటి వనరులు ఉన్న టాప్ 30 జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్క జిల్లా కూడా చోటు దక్కించుకోలేదు. - అయితే ఏపీ నుంచి ఆరు జిల్లాలు (అనంతపురం, పశ్చిమగోదావరి, కృష్ణా, తూర్పుగోదావరి, విజయనగరం, చిత్తూరు) చోటు దక్కించుకున్నాయి.
- అత్యధిక నీటి వనరులు కలిగి ఉన్న టాప్-30 జిల్లాల్లో 15 జిల్లాలు పశ్చిమబెంగాల్‌కు చెందినవే.
- మొత్తం నీటి వనరుల్లో 23,55,055 (97%) నీటి వనరులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా, 69,485 (2.9%) నీటి వనరులు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి.
- మొత్తం నీటి వనరుల్లో ఉపయోగంలో ఉన్నవి-20,30,040 (83.7%)
- మొత్తం నీటి వనరుల్లో ఉపయోగంలో లేనివి- 3,94,500 (16.3%)
- ప్రైవేట్ సంస్థల యాజమాన్యంలోని నీటి వనరులు-13,38,735 (55.2%)
- ప్రజా యాజమాన్యంలోని నీటి వనరులు-10,85,805 (44.8%)
- మొత్తం నీటి వనరుల్లో మానవ నిర్మిత నీటి వనరులు 78% ఉండగా, 22% సహజ నీటి వనరులు ఉన్నాయి.
- మొత్తం నీటి వనరుల్లో ఆక్రమించుకున్న నీటి వనరులు-38,496 (1.6%)
- ఆక్రమించుకున్న నీటి వనరుల్లో అత్యధికంగా కొలనులు ఉండగా ఆ తర్వాత స్థానంలో చెరువులు ఉన్నాయి.
కొలనులు అత్యధికంగా ఉన్న టాప్-5 రాష్ర్టాలు
1. పశ్చిమబెంగాల్ 2. ఉత్తరప్రదేశ్
3. అసోం 4. ఒడిశా 5. జార్ఖండ్
చెరువులు అత్యధికంగా ఉన్న టాప్-5 రాష్ర్టాలు
1. ఏపీ 2. ఒడిశా 3. హిమాచల్‌ప్రదేశ్
4. తమిళనాడు 5. గుజరాత్
సరస్సులు అత్యధికంగా ఉన్నవి..
1. తమిళనాడు 2. బీహార్
3. కర్ణాటక 4. పశ్చిమబెంగాల్
5. ఒడిశా
రిజర్వాయర్లు అత్యధికంగా ఉన్నవి..
1. పశ్చిమబెంగాల్ 2. జార్ఖండ్
3. బీహార్ 4. ఒడిశా 5. ఏపీ
నీటి సంరక్షణ పథకాలు/చెక్‌డ్యామ్‌లు అత్యధికంగా ఉన్న టాప్-5 రాష్ర్టాలు
1. మహారాష్ట్ర 2. ఏపీ
3. గుజరాత్ 4. తెలంగాణ 5. జార్ఖండ్ - ప్రజా యాజమాన్యంలోని మొత్తం నీటి వనరుల్లో అత్యధికం పంచాయతీ యాజమాన్యంలో ఉన్నాయి. మొత్తం పంచాయతీ యాజమాన్యంలో 6,77,003 (62.4%) ఉన్నాయి.
- ప్రైవేటు యాజమాన్యంలోని మొత్తం నీటి వనరుల్లో అత్యధికం వ్యక్తిగత యజమాని యాజమాన్యంలో ఉన్నాయి. అంటే 10,60,191 (79.2%) నీటి వనరులు ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నాయి.
- సహజసిద్ధ నీటి వనరుల్లో (5,34,077) అత్యధికం గ్రామీణ ప్రాంతాల్లో 5,15,328 (96.5%) ఉండగా, కేవలం 18,749 (3.5%) సహజనీటి వనరులు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి.
- మానవ నిర్మిత నీటి వనరుల్లో (18,90, 463) అత్యధికం గ్రామీణ ప్రాంతాల్లో 18,39,727 (97.3%) ఉండగా, కేవలం 50,736 (2.7%) మానవ నిర్మిత నీటి వనరులు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి.
- మానవ నిర్మిత నీటి వనరుల్లో సుమారు 47.9% నీటి వనరులు నిర్మాణానికి సుమారు రూ.50,000 ఖర్చు అవుతుంది.
మొత్తం ఉపయోగంలో ఉన్న నీటి వనరుల విభజన (20,30,040) - కొలనులు- 11,81,077 (58.2%)
- చెరువులు- 3,15,974 (15.6%)
- రిజర్వాయర్లు- 2,89,163 (14.2%)
- నీటి సంరక్షణ పథకాలు- 1,88,915 (9.3%)
- సరస్సులు- 9,558 (0.5%)
- ఇతరాలు- 45,353 (2.2%)
మొత్తం ఉపయోగంలో ఉన్న నీటి వనరులను ఉపయోగించే విధానం - చేపల పెంపకం – 11,26,830 (55.5%)
- సాగునీరు – 3,35,768 (16.5%)
- భూగర్భ జలాల పెంపు- 2,44,918 (12.1%)
- గృహ, తాగునీరు – 2,05,197 (10.1%)
- మిగతా నీటి వనరులు మతపరమైన, వినోదపరమైన, పారిశ్రామిక, ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నారు.
- ఉపయోగంలో ఉన్న నీటివనరుల్లో అత్యధికంగా 55.9% గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా, 41.6% పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి.
- ఉపయోగంలో ఉన్న నీటి వనరుల్లో అత్యధిక నీటి వనరులు ఉన్న జిల్లా పశ్చిమబెంగాల్లోని దక్షిణ 24 పరగణాలు (3,55,503)
నీటి వనరులను వివిధ అవసరాలకు వాడుతున్న టాప్-5 జిల్లాలు
సాగు నీరు
1. విజయనగరం (ఏపీ)
2. శ్రీకాకుళం (ఏపీ)
3. పురూలియా (పశ్చిమ బెంగాల్)
4. విశాఖపట్నం (ఏపీ)
5. బంకురా (పశ్చిమ బెంగాల్)
పారిశ్రామిక
1. ఉత్తర 24 పరగణాలు (పశ్చిమబెంగాల్)
2. పూరి (ఒడిశా)
3. హౌరా (పశ్చిమబెంగాల్)
4. బిర్భుమ్ (పశ్చిమబెంగాల్)
5. పుర్బబర్ధమాన్ (పశ్చిమబెంగాల్)
చేపల పెంపకం
1. దక్షిణ 24 పరగణాలు (పశ్చిమబెంగాల్)
2. పుర్బబర్ధమాన్ (పశ్చిమబెంగాల్)
3. పశ్చిమగోదావరి (ఏపీ)
4. ఉత్తర 24 పరగణాలు (పశ్చిమబెంగాల్
5. పశ్చిమ మేదినిపూర్ (పశ్చిమబెంగాల్)
గృహ, తాగునీరు
1. హమీర్పూర్ (హిమాచల్‌ప్రదేశ్)
2. మండి (హిమాచల్‌ప్రదేశ్)
3. సిమ్లా (హిమాచల్‌ప్రదేశ్)
4. దక్షిణ 24 పరగణాలు (పశ్చిమబెంగాల్)
5. దక్షిణ్ దినాజ్‌పూర్ (పశ్చిమబెంగాల్)
భూగర్భ జల పునరుద్ధరణ
- అనంతపురం (ఏపీ)
- ఔరంగాబాద్ (మహారాష్ట్ర)
- సీతాపూర్ (ఉత్తరప్రదేశ్)
- జాల్నా (మహారాష్ట్ర)
- నాసిక్ (మహారాష్ట్ర)
- నీటి వనరుల్లో 38,496 నీటి వనరులు ఆక్రమించుకోగా వాటిలో 95.4% గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా 4.6% పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి.
- ఆక్రమించుకున్న నీటి వనరుల్లో అత్యధికం కొలనులు 26,005 (67%).
- వ్యవసాయం కోసం ఉపయోగించే 3,35,768 నీటివనరుల్లో 2,30,921 (68.8%) నీటి వనరులు ప్రజా యాజమాన్యంలో ఉండగా 1,04,847 (31.2%) నీటివనరులు ప్రైవేటు యాజమాన్యంలో ఉన్నాయి.
- మొత్తం నీటి వనరుల్లో అత్యధికం 0.5 హెక్టార్ల కంటే తక్కువ వ్యాప్తిలో ఉన్నాయి.
- మొత్తం నీటి వనరుల్లో 50% నిల్వ సామర్థ్యం 1000 నుంచి 10,000 క్యూబిక్ మీటర్లు కలిగి ఉన్నాయి.
- మొత్తం నీటి వనరుల్లో 17,98,349 (88.6%) నీటి వనరులు ఒకే నగరం/పట్టణం/గ్రామానికి లబ్ధి చేకూరుస్తున్నాయి.
- మొత్తం నీటి వనరుల్లో 18,29,218 (90.1%) నీటి వనరులు 100 మంది నీటి అవసరాలు తీరుస్తున్నాయి. 1,66,569 (8.2) నీటివనరులు 101 నుంచి 500 మంది నీటి అవసరాలు తీరుస్తుండగా 34,253 (1.7) నీటి వనరులు 500 మంది కంటే ఎక్కువ మంది అవసరాలు తీరుస్తున్నాయి.
- ఈ సర్వేలో సముద్రాలు, లాగూన్లు, నదులు, ప్రవాహాలు, జలపాతాలు, కాలువలు, స్విమ్మింగ్‌పూల్, పరిశ్రమల కోసం వారు తయారు చేసుకొన్న నీటి వనరులు, మైనింగ్ కోసం జరిగిన తవ్వకాల్లో చేరిన నీరు, జంతువులు తాగడానికి తయారు చేసిన చిన్న కొలనులు పరిగణనలోకి తీసుకోలేదు.
తెలంగాణలో నీటివనరులు
- ఈ సర్వే ప్రకారం తెలంగాణలోని మొత్తం నీటి వనరులు-64,056
- రాష్ట్రంలో ఉన్న మొత్తం నీటి వనరుల్లో 63,064 (98.5%) నీటి వనరులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా 992 (1.5%) నీటి వనరులు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి.
- రాష్ట్రంలో అత్యధిక నీటి వనరులు కొలనులు కాగా రెండో స్థానంలో నీటి సంరక్షణ పథకాలు, మూడో స్థానంలో చెరువులు ఉన్నాయి.
కొలనులు- 27,003 (42.2%)
నీటి సంరక్షణ పథకాలు- 19,239 (30.0%)
చెరువులు – 16,292 (25.4) - రాష్ట్రంలో ప్రజా యాజమాన్యంలోని నీటి వనరులు-51,593 (80.5%)
- రాష్ట్రంలో ప్రైవేటు యాజమాన్యంలోని నీటి వనరులు-12,463 (19.5%)
- రాష్ట్రంలో ఉన్న నీటి వనరుల్లో ప్రాంతాన్ని బట్టి కింది విధంగా ఉన్నాయి.
- కరవు పీడిత ప్రాంతాల కార్యక్రమం అమలు ప్రాంతాలు:11,076 (17.3%)
- గిరిజన ప్రాంతాలు : 6781 (10.6%)
- వరద పీడిత ప్రాంతాలు, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఇతర ప్రాంతాలు: 46,199 (72.1%)
- రాష్ట్రంలోని మొత్తం నీటి వనరుల్లో ఉపయోగంలో ఉన్న నీటి వనరులు 51,733 (80.8%) కాగా ఉపయోగంలో లేని నీటి వనరులు 12,323 (19.2%) ఉన్నాయి.
- నీటి వనరులు ఉపయోగంలో లేకపోవడానికి కారణం ఎండిపోవడం, లవణీయత, మరమ్మతులు చేయలేనంతగా నాశనం కావడం, కాలుష్యం.
- రాష్ట్రంలో ఉపయోగంలో ఉన్న నీటి వనరుల్లో అత్యధిక నీటి వనరులను వ్యవసాయానికి (58.2%), తర్వాత స్థానంలో భూగర్భ జలాల పునరుద్ధరణ(37.1%) కు ఉపయోగిస్తున్నారు.
- రాష్ట్రంలో సహజసిద్ధ నీటి వనరులు-10,170 (15.88%)
- రాష్ట్రంలో మానవ నిర్మిత నీటి వనరులు-53,886 (84.12)
- సహజసిద్ధ నీటి వనరుల్లో అత్యధికంగా అంటే 9,781 (96.2%) నీటి వనరులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా మిగతా 389 (3.8%) నీటి వనరులు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి.
- మానవ నిర్మిత నీటి వనరుల్లో అత్యధికంగా అంటే 53,283 (98.9%) నీటి వనరులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా, మిగతా 603 (1.1%) నీటి వనరులు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి.
- మానవ నిర్మిత నీటి వనరుల నిర్మాణానికి అవుతున్న ఖర్చు-రూ.50,000
- రాష్ట్రంలోని మొత్తం నీటి వనరుల్లో 38,540 నీటి వనరులు జిల్లా నీటి పారుదల ప్రణాళిక/రాష్ట్ర నీటి పారుదల ప్రణాళికలో ఉన్నాయి.
- రాష్ట్రంలో ఆక్రమించుకొన్న నీటి వనరులు-3,032 (4.73%)
- ఆక్రమించుకొన్న నీటి వనరుల్లో 1540 (50.8%) నీటి వనరులు కొలనులు తర్వాత చెరువులు (38.4%) ఉన్నాయి.
- రాష్ట్రంలోని రిజర్వాయర్ల సంఖ్య-111
- రాష్ట్రంలో ప్రతి సంవత్సరం నిండే నీటి వనరులు-8862 (20.28%)
- రాష్ట్రంలో ఒక నగరం/పట్టణానికి లబ్ధి చేకూర్చే నీటి వనరులు-33,469 (64.7%)
- 0.5 హెక్టార్ల కంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న నీటి వనరులు-32,914 (51.61%)
- 0 నుంచి 100 క్యూబిక్ మీటర్ల నిల్వ సామర్థ్యం కలిగిన నీటి వనరులు-38,885 (60.70%)
తాన్న రవి
ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీసర్కిల్
వికారాబాద్
Next article
NIPER JEE 2023 | నైపర్ ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు