NIPER JEE 2023 | నైపర్ ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలు
ఎవర్గ్రీన్ కెరీర్ ఫార్మా
ఎవర్ గ్రీన్ రంగాల్లో ఫార్మా ప్రధానమైంది. ఫార్మా వైద్య రంగంలో అంతర్భాగం. ప్రపంచ ఆరోగ్య రంగం
ఎప్పటికప్పుడు సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. దీంతో ఫార్మా సంస్థల డిమాండ్ ఎప్పటికప్పుడు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. దేశంలో ఔషధాల తయారీలో నిపుణులను తయారుచేసే సంస్థల్లో
ప్రఖ్యాతిగాంచినవి నైపర్. దేశంలోని నైపర్ క్యాంపస్‌లలో పీజీ, పీహెచ్డీ కోసం నిర్వహించే నైపర్ జేఈఈ-2023 (NIPER JEE 2023) నోటిఫికేషన్ వివరాలు సంక్షిప్తంగా….
నైపర్
ఇంజినీరింగ్ విద్యకు ఐఐటీలు, మెడికల్ విద్యకు ఎయిమ్స్ పేరుగాంచినట్లే ఫార్మా విద్యకు దేశంలో నైపర్లు ప్రఖ్యాతి చెందినవి. ప్రపంచంలో భారతీయ ఫార్మా రంగసేవలు విశేషమైనవి. ఔషధ ఉత్పత్తుల పరిమాణం, విలువల పరంగా ప్రపంచంలోని టాప్ 10 దేశాల్లో భారత్ ఒకటి. కేంద్ర రసాయన, ఎరువుల మంత్రిత్వశాఖ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటుచేసిన సంస్థే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్). 1998లో మొదటి నైపర్ క్యాంపస్‌ను ఎస్ఏఎస్ నగర్ (మొహాలి)లో ప్రారంభించారు. తర్వాత 2007, 2008లో మరో ఆరు నైపర్లను ప్రారంభించారు. 2023 నైపర్ జేఈఈని గువాహటిలోని నైపర్ నిర్వహిస్తుంది.
కోర్సులు, స్పెషలైజేషన్లు
- పీజీలు: ఎంఫార్మసీ, ఎంటెక్ (ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ), ఎంఎస్ (ఫార్మసీ), ఎంబీఏ (ఫార్మాస్యూటికల్ మేనేజ్మెంట్).
- ఎంఎస్ ఫార్మసీలో బయో టెక్నాలజీ, మెడిసినల్ కెమిస్ట్రీ, మెడికల్ డివైజ్‌లు, నేచురల్ ప్రొడక్ట్స్, ఫార్మా స్యూటికల్ అనాలసిస్, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, ఫార్మాస్యూటిక్స్, ఫార్మాకో ఇన్ఫర్మాటిక్స్, ట్రెడిషనల్ మెడిసిన్, రెగ్యులేటరీ టాక్సికాలజీ, మెడికల్ డివైసెస్, రెగ్యులేటరీ అఫైర్స్, క్లినికల్ రీసెర్చ్ తదితర స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఎంఫార్మసీలో ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (ఫార్ములేషన్స్), ఫార్మసీ ప్రాక్టీస్ స్పెషలైజేషన్లను కొన్ని సంస్థలు అందిస్తున్నాయి.
ఎవరు అర్హులు ?
- కనీసం 60 శాతం మార్కులతో బీఫార్మసీ ఉత్తీర్ణత లేదా కొన్ని కోర్సులకు బీవీఎస్సీ, ఎంబీబీఎస్, నిర్దేశిత విభాగాల్లో ఎమ్మెస్సీ, బీటెక్ ఉత్తీర్ణులు. ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం, పీహెచ్‌సీలకు 50 శాతం ఉండాలి. ప్రస్తుతం పైన పేర్కొన్న కోర్సులు ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతోపాటు జీప్యాట్ /గేట్ /నెట్లో అర్హత సాధించడం తప్పనిసరి. జీప్యాట్ స్కోర్ వ్యాలిడిటీ మూడేండ్లు.
- పీహెచ్‌డీలు: బయోటెక్నాలజీ, మెడిసినల్ కెమిస్ట్రీ, మెడికల్ డివైజెస్, నేచురల్ ప్రొడక్ట్స్, ఫార్మాస్యూటికల్ అనాలసిస్, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, ఫార్మాస్యూటిక్స్, ఫార్మసీ ప్రాక్టీస్, ఫార్మాస్యూటికల్ మేనేజ్మెంట్, రెగ్యులేటరీ టాక్సికాలజీ, ఫార్మాకోఇన్ఫర్మాటిక్స్, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (ప్రాసెస్ కెమిస్ట్రీ).
- అర్హతలు: ఈ విభాగాలను మూడు రకాలుగా విభజించారు. అవి కెమికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్. సంబంధిత విభాగాల్లో ఎంఎస్, ఎంటెక్, ఎమ్మెస్సీ తదితర పీజీలు చేసిన వారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. నెట్-జేఆర్ఎఫ్ అర్హత సాధించినవారు లేదా ఆ పరీక్షలకు హాజరై ఇంటర్వ్యూ నాటికి ఫైనల్ ఫలితాలను సమర్పించాలి.
నైపర్ జేఈఈ పరీక్ష విధానం - నైపర్లోని అన్ని పీజీ కోర్సులన్నింటికి ఒకటే పరీక్ష.
- ఈ పరీక్ష కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ (ఆన్లైన్) విధానంలో నిర్వహిస్తారు.
- ఇందులో 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి.
- పరీక్ష వ్యవధి 2 గంటలు. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది.
- ప్రతి తప్పు జవాబకు 0.25 మార్కులు కోత విధిస్తారు.
- ప్రశ్నలను బీఫార్మసీ, సంబంధిత విభాగాల్లో ఎమ్మెస్సీ సబ్జెక్టుల నుంచి ఇస్తారు.
- జనరల్ ఆప్టిట్యూడ్ నుంచీ కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఇందులో ప్రతిభ చూపిన వారికి మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయిస్తారు.
- ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి మాత్రం గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ప్లేస్‌మెంట్స్
- దేశంలోని ఏడు నైపర్ క్యాంపస్‌లకు అంతర్జాతీయస్థాయిలో మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ పీజీ, పీహెచ్డీ కోర్సులను పూర్తిచేసిన వారికి దేశ, విదేశాల్లో మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఫార్మారంగాల్లో పరిశోధకులుగా, సైంటిస్టులుగా చేరవచ్చు. సన్‌ఫార్మా, బయోకాన్, అరబిందో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, జీఎస్కే, అబాట్ ఇండియా, నొవార్టీస్, జీవీకే బయో, ఐమెడ్ గ్లోబల్, ఇన్‌టాక్స్, బీవీజీ వంటి ప్రముఖ సంస్థలు మంచి ప్యాకేజీలతో ప్లేస్‌మెంట్స్ ఇస్తున్నాయి.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మే 16
పరీక్షతేదీ: జూన్ 23
ఫలితాల వెల్లడి: జూన్ 30
రాష్ట్రంలో పరీక్ష కేంద్రం: హైదరాబాద్
వెబ్సైట్: https://niperguwahati.ac.in
కేశవపంతుల వేంకటేశ్వరశర్మ
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






