Career Guidance | ఫార్మాకోవిజిలెన్స్.. ఫార్మారంగంలో ఉత్తమ ఎంపిక
మనిషి జీవిత కాలంలో నిత్యం ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నాడు. ప్రస్తుత కాలంలో అనేక రకాల వ్యాధులు ప్రబలుతున్నాయి. వాటికి అనుగుణంగానే ఔషధాలు తయారవుతున్నాయి. ఎంత భయంకరమైన వ్యాధి సంభవించినా వ్యాక్సిన్ కనుగొనే అధునాతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారికి సైతం వ్యాక్సిన్ కనుగొని వివిధ దేశాలకు సరఫరా చేసిన ఘనత మన హైదరాబాద్ దక్కించుకుంది. ఆయా వ్యాధులకు వ్యాక్సిన్లు, చికిత్సలను అందించడానికి మన దేశంలో సరిపోయినన్ని వసతులు, వనరులు ఉన్నాయి. అన్ని రకాల మందులను తయారు చేయడానికి ఫార్మా రంగం అభివృద్ధి చెందింది. ఈ క్రమంలో ఔషధాల తయారీ, ఉత్పత్తిలో నాణ్యత చాలా ముఖ్యం. వ్యాక్సిన్లు, ఔషధాల ఉత్పత్తి, తయారీలో నాణ్యతను గుర్తించడానికి ఫార్మాకోవిజలెన్స్ అనే విభాగం పనిచేస్తుంది. ఫార్మాకోవిజిలెన్స్ ఎలా పనిచేస్తుంది.. ఇందులో ఉద్యోగం సాధించాలంటే కావలసిన అర్హతలు, అవకాశాలు, కెరీర్ స్కోప్ గురించి తెలుసుకుందాం…
- ఫార్మాకోవిజిలెన్స్ రంగం గత కొద్ది సంవత్సరాల్లో ఎక్కువగా వృద్ధిలోకి వచ్చింది. ముఖ్యంగా కొవిడ్ విధ్వంసం సృష్టించినప్పటి నుంచి దీని ప్రాముఖ్యత పెరిగింది. ఫార్మా సంస్థలు వ్యాక్సిన్‌ను తయారు చేయడానికి పాటించే ప్రమాణాలు, వ్యాక్సిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, తదనంతర పరిణామాల గురించి ప్రజల్లో అవగాహన పెరిగింది. వీటన్నింటిని పర్యవేక్షించడానికి ఫార్మాకోవిజిలెన్స్ అనే విభాగం పనిచేస్తుంది
- ఏదైనా వ్యాధి సోకినప్పుడు పూర్తిగా నయం కావాలంటే వ్యాధికి సరైన చికిత్స చేయడం ప్రాథమిక అంశం. చికిత్స సరిగా జరగాలంటే ఉపయోగించే ఔషధం మంచిదై ఉండాలి. చికిత్సకు వాడిన ఔషధం వల్ల జీవిత కాలంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండేలా దాన్ని తయారు చేయాలి. వీటిని పర్యవేక్షించే శాఖనే ఫార్మాకోలాజికల్ సైన్స్ అంటారు. దీన్నే ఫార్మాకోవిజిలెన్స్ అని కూడా అంటారు.
ఫార్మా కోవిజిలెన్స్ అంటే..
- గ్రీకు భాషలో ‘ఫార్మాకోన్’ అంటే ‘ఔషధం’ అని అర్థం. లాటిన్ భాషలో ‘విజిలెన్స్’ అంటే ‘నిఘా’ అని అర్థం. ఈ రెండు పదాలను కలిపి ‘ఫార్మాకోవిజిలెన్స్’ (పీవీ) గా నామకరణం చేశారు. ఫార్మాకోవిజిలెన్స్ను ‘డ్రగ్ సేఫ్టీ’ అని కూడా పిలుస్తారు. ఆరోగ్య రంగ సంస్థలు, ఫార్మాస్యూటికల్ కంపెనీల్లోని ముఖ్యమైన విభాగాల్లో ఫార్మాకోవిజిలెన్స్ ఒకటి. ఫార్మసీ, రిసెర్చ్, ఫార్మా ప్రొడక్షన్ సంస్థలు, డ్రగ్ కంపెనీలపై ఇది నిఘా ఉంచుతుంది.
- ఫార్మాకోవిజిలెన్స్ను రోగి రక్షణకు పాటుపడే ఫార్మాస్యూటిక్ సైన్సెస్‌కు చెందిన ఒక శాఖ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈ శాఖ వ్యాక్సిన్స్, బయాలాజికల్ మెడికల్ డివైజెస్, హెర్బల్ డ్రగ్స్, వెటర్నరీ మెడిసిన్స్, రక్తం దాని సంబంధిత ఉత్పత్తుల తయారీ, వాటి వల్ల కలిగే అనర్థాలు, నష్టాలను గుర్తించడానికి పనిచేస్తుంది. నాణ్యత లేని నాసికరమైన ఔషధ ఉత్పత్తులను బహిరంగ మార్కెట్లోకి విడుదల కాకుండా ఇది అడ్డుకుంటుంది.
కోర్సులు, అర్హతలు
- బయోసైన్స్/లైఫ్ సైన్సెస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా గ్రాడ్యుయేషన్ (బాటనీ, జువాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, జెనెటిక్స్, బయోటెక్‌లో ఏదో ఒక సబ్జెక్టు ఉండవచ్చు) 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత
సాధించి ఉండాలి. - కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా పీజీ లేదా డిగ్రీ 50 శాతం ఉత్తీర్ణులై ఉండాలి.
- ఫార్మసీ లేదా ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో పీజీ లేదా డిగ్రీ చేసి ఉండాలి.
స్పెషలైజేషన్స్
- మెడిసిన్‌లో పీజీ లేదా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- ఫార్మసీలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉత్తమమైన నైపుణ్యాలున్న వారు నేరుగా ఫార్మాకోవిజిలెన్స్లో పీజీ డిప్లొమా చేయవచ్చు. వీరు ఫార్మాకోవిజిలెన్స్, ఫార్మాకోఎపిడిమియాలజీలో ప్రొఫెషనల్ డిప్లొమా చేసే అవకాశం ఉంటుంది. క్లినికల్ రీసెర్చ్ అండ్ ఫార్మాకోవిజిలెన్స్లో పీజీ డిప్లొమా, ఫార్మాకోవిజిలెన్స్ అండ్ రెగ్యులేటరీ ఎఫైర్స్, ఫార్మాకోవిజిలెన్స్ అండ్ మెడికల్ రైటింగ్‌లో పీజీ డిప్లొమా చేసుకునే అవశాలున్నాయి.
- వీటితో పాటు మరికొన్ని స్పెషలైజేషన్స్ ఫార్మాకోవిజిలెన్స్ అందిస్తుంది. అవి..
- డేటా కలెక్షన్ అండ్ ఆర్గనైజేషన్
- సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎవాల్యుషన్
- రెగ్యులేటరీ సబ్మిషన్స్
- డేటా మైనింగ్ అండ్ శాంపిల్ ఐడెంటిఫికేషన్
ఫార్మాకోవిజిలెన్స్ ఆఫీసర్ విధులు
- డ్రగ్ సేఫ్టీ ఆఫీసర్‌కు ఉండే అధికారాలతో సమానంగా ఫార్మాకోవిజిలెన్స్ ఆఫీసర్‌కు ఉంటాయి. ఔషధాల స్వచ్ఛత, నియంత్రణ విధులను వీరు నిర్వర్తిస్తారు.
- వైద్య నిపుణుల (వైద్యులు, నర్సులు, ఫార్మసిస్ట్‌లు ఇతర ఆరోగ్య కార్యకర్తలు) నుంచి, వినియోగదారుల నుంచి ఔషధాలు పనిచేసే విధానాన్ని తెలుసుకొని రికార్డు చేసుకుంటారు.
- సేకరించిన సమాచారాన్ని భద్రపరుస్తారు.
- ఔషధాల వల్ల కలిగే లాభ, నష్టాల గురించిన నివేదికను రూపొందిస్తారు.
- ఔషధాల పనితీరు, భద్రత, నివేదికలను ఎప్పుటికప్పుడు పర్యవేక్షిస్తారు.
- మందుల వల్ల కలిగే లాభాలు, నష్టాలను అంచనా వేయడం.
- వాటిపై తయారు చేసిన నివేదికలను పై అధికారులకు నివేదించడం.
- వ్యాక్సిన్లు, మెడిసిన్ క్లినికల్ ట్రయల్స్‌ను పర్యవేక్షిస్తారు.
ఫార్మాకోవిజిలెన్స్ కోర్సుతో ప్రయోజనాలు
- కొవిడ్, సీజనల్ వ్యాధులు, మధుమేహం, హైపర్‌టెన్షన్ వంటివి ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో తరచూ నూతన వ్యాక్సిన్లు కనుక్కోవాలి. అదేవిధంగా దేశంలో ఫార్మా రంగం గతం కంటే ఎక్కువగా వృద్ధి చెందుతుంది. కాబట్టి ఫార్మాకోవిజిలెన్స్ ఆఫీసర్ల అవసరం తప్పనిసరి అయ్యింది. ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి, అధిక లాభార్జన కోసం చాలా ఫార్మా కంపెనీలు నాసిరకం ఔషధాలను ఉత్పత్తి చేస్తున్నాయి. వాటిని అరికట్టడానికి, నాణ్యతను గుర్తించడానికి వీరి అవసరం ఎంతైనా ఉంది.
- ప్రపంచానికి అవసరమైన ఫార్మా ఉత్పత్తుల్లో మూడోవంతు కేవలం భారత్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయి. మందులు, వ్యాక్సిన్లలో 62 శాతం భారత్ నుంచే సరఫరా అవుతున్నాయి. భారత ఫార్మాస్యూటికల్ విపణి 2019 నాటికి 20.03 బిలియన్ డాలర్లు ఆర్జిస్తుంది. దీన్ని 2030 నాటికి 130 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యం పెట్టుకుంది. ఇండియాలో ప్రస్తుతానికి 3,000 పైగా ఫార్మా కంపెనీలున్నాయి. వీటి ఆధీనంలో 10,500 ఉత్పత్తి కేంద్రాలున్నాయి.
- క్లినికల్ ట్రయల్స్‌కు ఇండియా మంచి కేంద్రం గా మారింది. ఎందుకంటే ఇక్కడ ఫార్మా రంగానికి సంబంధించిన అన్ని వనరులు అందుబాటులో ఉన్నాయి. అత్యంత సమర్థులైన ఫార్మా నిపుణులు ఉన్నారు.
నోట్: భారత్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, యాక్సెంచర్, ఓవియా, మెడ్‌సేఫ్, విప్రో లిమిటెడ్ వంటి సంస్థలు ఫార్మాకోవిజిలెన్స్ సంబంధిత సేవలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫార్మా కంపెనీలకు విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నాయి.
ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థలు
- ఫార్మాస్యూటికల్ కంపెనీలు
- బయోటెక్ కంపెనీలు
- వైద్య పరికరాల తయారీ సంస్థలు
- రెగ్యులేటరీ ఏజెన్సీలు
- మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్‌లోని ఫార్మాకోవిజిలెన్స్ యూనిట్లు
కుమారస్వామి కాసాని
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం