TS Constable Mains Model Paper 1 | రైతు బీమా పథకానికి ఈ వార్షిక బడ్జెట్లో ఎంత కేటాయించారు?
1. కింది వాటిలో బదిలీ చెల్లింపు కానిది?
ఎ) ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు
బి) నిరుద్యోగ బీమా సదుపాయాలు
సి) పదవీ విరమణ పెన్షన్లు
డి) ఆదాయ మద్దతు కల్పన
2. కింది వాటిలో మానవాభివృద్ధి సూచికలో అంశం కానిది ఏది?
ఎ) జనన కాలం నుంచి ఆయురార్ధం
బి) అక్షరాస్యత రేటు, పాఠశాల సగటు సంవత్సరాలు
సి) శిశుమరణాల రేటు డి) ఆదాయం
3. కింది వాటిలో సరైనవి ఏవి?
1. అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ (మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్) దినోత్సవాన్ని జూన్ 27న నిర్వహిస్తారు
2. 10 మందికి ఉపాధి కల్పించే సంస్థలను సూక్ష్మ సంస్థలుగా పిలుస్తారు
3. 300 మందికి ఉద్యోగాలను ఇచ్చే పరిశ్రమలను చిన్న, మధ్య తరహా సంస్థలుగా వర్గీకరించవచ్చు
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) 1, 2, 3
4. నీతి ఆయోగ్‌కు సంబంధించిన వాస్తవాలు ఏవి?
1. ఇది సలహా సంఘం మాత్రమే
2. దీనికి నిధులు కేటాయించే అధికారం ఉంటుంది
ఎ) ఎ వాస్తవం బి) బి వాస్తవం
సి) ఎ వాస్తవం కాదు
డి) ఎ వాస్తవం కానీ బి కాదు
5. ఎల్ఐసీని ఎప్పుడు జాతీయం చేశారు?
ఎ) 1950 బి) 1951
సి) 1956 డి) 1965
6. నిరంతర ప్రణాళికలను అమలు చేసిన తొలి దేశం?
ఎ) ఆస్ట్రేలియా బి) స్పెయిన్
సి) ఇండియా డి) ఫ్రాన్స్
7. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కొన్ని రుతువుల్లో పని దొరకని పరిస్థితిని తెలిపే నిరుద్యోగాన్ని ఏమంటారు?
ఎ) చక్రీయ నిరుద్యోగిత
బి) రుతు సంబంధిత నిరుద్యోగం
సి) సాంకేతిక నిరుద్యోగం
డి) ఘర్షణ నిరుద్యోగిత
8. మూల్యహీనీకరణ అంటే?
ఎ) ప్రభుత్వం తన కరెన్సీ విలువను ఇతర దేశాల ప్రభుత్వ కరెన్సీ విలువ దృష్ట్యా అధికారికంగా తగ్గించడం
బి) ప్రభుత్వం తన దేశ కరెన్సీ విలువను పెంచడం
సి) ప్రభుత్వం తన దేశ కరెన్సీ విలువను తగ్గించి పెంచడం
డి) ప్రభుత్వం అధికారికంగా కరెన్సీ అంతర్గత విలువను పెంచడం
9. కింది వాటిలో సరైనది?
ఎ) పీఎం ప్రణామ్: కృత్రిమ ఎరువు వాడకాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం
బి) మిష్టి పథకం: తీర ప్రాంతాల్లో మడ అడవులను పెంచడం
సి) అమృత దరోహర్: చిత్తడి నేలలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడం
డి) భారత్ శ్రీ: చిరు ధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఉద్దేశించింది
10. ప్రైవేటీకరణ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది?
ఎ) పీటర్ హెన్సెన్ బి) పీటర్ డక్కర్
సి) లూయీస్ డి) హిక్స్
11. బడ్జెట్ నుంచి ఆర్థిక సర్వేను ఏ సంవత్సరం నుంచి వేరు చేశారు?
ఎ) 1956 బి) 1964
సి) 1971 డి) 2019
12. చిన్నతరహా పరిశ్రమలు అంటే?
ఎ) రూ. 5 కోట్లలోపు పెట్టుబడి, రూ.10 కోట్లలోపు టర్నోవర్
బి) రూ. 1 కోటిలోపు పెట్టుబడి, రూ.5 కోట్లలోపు టర్నోవర్
సి) రూ.10 కోట్లలోపు పెట్టుబడి, రూ.50 కోట్లలోపు టర్నోవర్
డి) రూ.5 కోట్లలోపు పెట్టుబడి, రూ. 100 కోట్ల లోపు టర్నోవర్
13. తుర్కియే, సిరియాలో 6.2.2023న శక్తిమంతమైన భూకంపం సంభవించినప్పుడు రిక్టర్‌స్కేలుపై ఎంత నమోదైంది?
ఎ) 7.8 బి) 7.2 సి) 7.6 డి) 7.7
14. రైతు బీమా పథకానికి ఈ వార్షిక బడ్జెట్లో ఎంత కేటాయించారు?
ఎ) రూ.1354 కోట్లు
బి) రూ.1589 కోట్లు
సి) రూ.1664 కోట్లు
డి) రూ.1108 కోట్లు
15. బేటీ బచావో-బేటీ పడావో పథకాన్ని 2015 జనవరి 22న ప్రధాని ఎక్కడ ప్రారంభించారు?
ఎ) అహ్మదాబాద్-గుజరాత్
బి) వడోదర-గుజరాత్
సి) పానిపట్-హర్యానా
డి) వారణాసి-ఉత్తరప్రదేశ్
16. చైనా నూతన ప్రధాని ఎవరు?
ఎ) లీ కెకియాంగ్ బి) లీ చియాంగ్
సి) వెన్ జియాబావో డి) ఝూరోంగ్జీ
17. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) 2022 సరస్వతి సమ్మాన్ అవార్డు-సుధామూర్తి
బి) 2022 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు- మనోధర్మపరాగం నవలా రచయిత మధరాంతకం రాజారాం
సి) నోబెల్ సాహిత్య బహుమతి- అన్నీ ఎర్నాక్స్
డి) ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్-హెహన్ కరుణ తిలక
18. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంత స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకునే తాహతులేని వారి కోసం రూ.3 లక్షలు ఏ పథకం కింద ఇవ్వాలని నిర్ణయించింది?
ఎ) గృహలక్ష్మి పథకం బి) సొంతిల్లు పథకం
సి) గృహశోభ డి) కేసీఆర్ ఇల్లు
19. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) నేపాల్ అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్
బి) ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోని అల్బనీస్
సి) పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్
డి) బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా
20. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలు కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజెల్స్, డాల్ఫీ థియేటర్లో జరిగాయి
బి) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాటకు అస్కార్ అవార్డు లభించింది
సి) ఉత్తమ డాక్యుమెంటరీ లఘుచిత్రం అవార్డు ది ఎలిఫెంట్ విస్పరర్స్ అందుకున్నాయి
డి) ఆర్ఆర్ఆర్ లోని నాటునాటు పాట గాయకుడు చంద్రబోస్
21. కింది వాటిలో పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కాని వారు ఎవరు?
ఎ) జాకిర్‌హుస్సేన్ బి) ఎస్.ఎం. కృష్ణ
సి) బాలకృష్ణ దోషి డి) వాణి గణేష్
22. ఇటీవల టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన రోజర్ ఫెదరర్ అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు ఏ టోర్నీకి చెందినవి గెల్చుకున్నారు?
ఎ) వింబుల్డన్ బి) ఆస్ట్రేలియన్
సి) యూఎస్ఏ డి) ఫ్రెంచి
23. మల్లఖంబ్ అంటే?
ఎ) అమెజాన్ అడవుల్లో ఇటీవల కనిపించిన అరుదైన పక్షి
బి) ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన సిక్కిం వాసి
సి) చైనా-అరుణాచల్ ప్రదేశ్ మధ్య ఉన్న వివాదాస్పద ప్రాంతం
డి) గుజరాత్‌లోని సంప్రదాయ క్రీడ
24. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) బ్రిటిష్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు
బి) రిషి సునాక్ ప్రధానిగా చార్లెస్-3 ప్రమాణ స్వీకారం చేయించారు
సి) ప్రధానమంత్రి పదవి చేపట్టకముందు బోరిస్ జాన్సన్ కాలంలో రిషి సునాక్ విదేశాంగమంత్రిగా పనిచేసేవారు
డి) 2015లో రాజకీయాల్లోకి వచ్చి యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్స్ నుంచి చట్టసభలకు ఎన్నికయ్యారు
25. కింది వాక్యాల్లో సరికానిది ఏది?
ఎ) జీ 20 కూటమి 1999 సెప్టెంబర్ 26న ఏర్పడింది
బి) జీ 20 ప్రధాన కార్యాలయం మెక్సికోలోని కాన్‌కూన్‌లో ఉంది
సి) జీ 20 తొలి సమావేశం 2008 నవంబర్ 14-15 తేదీల్లో అమెరికా రాజధాని వాషింగ్టన్లో నిర్వహించారు
డి) జీ 18 సమావేశం 2022 నవంబర్ 15-16 తేదీల్లో ఇండోనేషియాలోని బాలిలో జరిగింది
26. మానవాభివృద్ధి సూచీ 2021లో భారత ర్యాంక్ ఎంత?
ఎ) 131 బి) 132 సి) 129 డి) 134
27. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను తొలిసారిగా 2019 ఫిబ్రవరి 15న ప్రారంభించారు
బి) వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను గతంలో ట్రైన్ 18 అనేవారు
సి) దీన్ని పంజాబ్‌లోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో డిజైన్ చేసి తయారు చేశారు
డి) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ 8వ రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య నడిచింది
28. ఇటీవల జాతీయ పార్టీ హోదా పొందిన ఆమ్ ఆద్మీ పార్టీని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 2012 బి) 2009
సి) 2011 డి) 2013
29. అంతర్జాతీయ న్యాయ స్థానం ఎక్కడ ఉంది?
ఎ) పారిస్ బి) జెనీవా
సి) ది హేగ్ డి) న్యూయార్క్
30. జాతీయ గేయాన్ని ఇంగ్లిషులోకి అనువదించిన వారెవరు?
ఎ) బంకించంద్ర చటర్జీ
బి) రవీంద్రనాథ్ ఠాగూర్
సి) అరవింద ఘోష్
డి) సురేంద్రనాథ్ బెనర్జీ
31. భారతదేశంలో తొలి రాజ్యాంగ చట్టంగా దేన్ని పేర్కొంటారు?
ఎ) ఈస్ట్ కంపెనీ చట్టం 1600 డిసెంబర్ 31
బి) భారత ప్రభుత్వ చట్టం
సి) చార్టర్ చట్టం 1813
డి) రెగ్యులేటింగ్ చట్టం 1773
32. కింది వాటిని జతపరచండి.
ఎ. వరకట్న నిషేధ చట్టం
బి. గర్భవిచ్ఛిత్తి చట్టం
సి. మహిళల, బాలల అక్రమ వ్యాపార నిరోధక చట్టం
డి. కుటుంబ కోర్టు చట్టం
1. 1971 2. 1984
3. 1961 4. 1956
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-3, బి-1, సి-4, డి-2
సి) ఎ-3, బి-2, సి-1, డి-4
డి) ఎ-3, బి-2, సి-4, డి-1
33. భారత రాజ్యాంగంలో పౌరసత్వానికి సంబంధించిన వివరణ ఎక్కడ ఉంది?
ఎ) 1వ భాగం- ఆర్టికల్స్ 4 నుంచి 11 వరకు
బి) 1వ భాగం- ఆర్టికల్స్ 2 నుంచి 10 వరకు
సి) 2వ భాగం- ఆర్టికల్స్ 3 నుంచి 10 వరకు
డి) 2వ భాగం- ఆర్టికల్స్ 5 నుంచి 11 వరకు
34. బలవంతపు మతమార్పిడులను నిషేధిస్తూ చట్టం చేసిన తొలిరాష్ట్రం?
ఎ) ఒడిశా బి) మధ్యప్రదేశ్
సి) తమిళనాడు డి) కేరళ
35. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో చెర్చని అంశం ఏది?
ఎ) ఆదేశిక సూత్రాలు
బి) ప్రాథమిక హక్కులు
సి) ప్రాథమిక విధులు
డి) అత్యవసర పరిస్థితులు
36. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకొంటారు?
ఎ) మార్చి 24 బి) ఏప్రిల్ 24
సి) ఆగస్టు 24 డి) ఫిబ్రవరి 24
37. 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు?
ఎ) విజయ్ కేల్కర్ బి) రంగరాజన్
సి) డాక్టర్ వైవీ రెడ్డి డి) ఎన్ కే సింగ్
38. భారతదేశంలో పోర్ట్‌ఫోలియో విధానాన్ని ప్రవేశపెట్టిన చట్టం ఏది?
ఎ) భారత కౌన్సిళ్ల చట్టం 1861
బి) భారత కౌన్సిళ్ల చట్టం 1892
సి) భారత కౌన్సిళ్ల చట్టం 1909
డి) భారత కౌన్సిళ్ల చట్టం 1919
39. రాజ్యాంగ సభ చివరి సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని గుర్తించండి?
ఎ) జాతీయ గీతంగా జనగణమన ఎంపిక
బి) జాతీయ గేయంగా వందేమాతరం ఎంపిక
సి) భారత తొలి రాష్ట్రపతిగా బాబూ రాజేంద్రప్రసాద్ ఎన్నిక డి) పైవన్నీ
40. అక్రమ నిర్బంధంలో ఉన్న వ్యక్తిని విడుదల చేయడానికి జారీచేసే రిట్ ఏది?
ఎ) హెబియస్ కార్పస్
బి) మాండమస్
సి) కోవారెంటో డి) సెర్షియోరరీ
41. జాతీయ న్యాయ వ్యవస్థకు సంబంధించి ప్రజాప్రయోజనాల వ్యాజ్యం ప్రవేశపెట్టినప్పుడు ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి?
ఎ) ఎం.ఎ. అహ్మది
బి) ఎం. హిదాయతుల్లా
సి) ఎస్. ఆనంద్ డి) పి.ఎన్. భగవతి
42. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) లోక్‌సభలో గరిష్ఠంగా 552 మంది సభ్యులు ఉండొచ్చు
బి) కేంద్రపాలిత ప్రాంతాల నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించే వారి సంఖ్య 20
సి) రాష్ర్టాల నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించే వారి సంఖ్య 530
డి) పైవన్నీ సరైనవే
43. పనామా కాల్వకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?
ఎ) ఇది ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలను వేరు చేస్తుంది
బి) పసిఫిక్ మహా సముద్రాన్ని, అట్లాంటిక్ మహా సముద్రాన్ని కలుపుతుంది
సి) ఆస్ట్రేలియా, ఇండోనేషియాలకు మధ్య ఉన్నది
డి) 1, 2
44. భూమధ్య రేఖకు సమీపంలో ఉన్న దీవి ఏది?
ఎ) గ్రేట్ నికోబార్ దీవి
బి) లిటిల్ అండమాన్ దీవి
సి) కార్ నికోబార్
డి) మధ్య అండమాన్
45. కింది వాక్యాల్లో సరైనవి ఏవి?
1. ఉత్తర అమెరికాలో అత్యంత పల్లపు ప్రాంతం డెత్ వ్యాలీ
2. ఉత్తర అమెరికాలో అత్యంత ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం డెత్ వ్యాలీ
3. ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు సుపీరియర్ ఉత్తర అమెరికాలో కలదు
4. ఉత్తర అమెరికాలో ఎత్తైన శిఖరం కోసియాస్కో
ఎ) 1, 2 బి) 1, 2, 3
సి) 1, 2, 3, 4 డి) 2, 3, 4
46. సెల్యూలర్ జైలు ఎక్కడ ఉంది?
ఎ) ఉత్తర అండమాన్
బి) మధ్య అండమాన్
సి) దక్షిణ అండమాన్
డి) నికోబార్ దీవులు
47. కశ్మీర్ లోయ ఎక్కడ ఉంది?
ఎ) హిమాద్రి-పీర్‌పంజల్ శ్రేణులకు మధ్య
బి) హిమాచల్ శ్రేణులకు శివాలిక్ శ్రేణులకు మధ్య
సి) మధ్య హిమాలయాలకు దిగువన
డి) శివాలిక్ శ్రేణులకు దిగువన
48. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) ఓరాలజీ- పర్వతాలు
బి) లిమ్నాలజీ- సరస్సులు
సి) శీతోష్ణస్థితి- మెటీరియాలజీ
డి) మృత్తికలు-పెడాలజీ
49. గంగా నదీ మైదానంలో కొత్త మైదానాలను ఏమంటారు?
ఎ) బంగర్ బి) బాబర్
సి) ఖాదర్ డి) టెరాయి
50. అహ్మదాబాద్ ఏ నది ఒడ్డున కలదు?
1. నర్మద 2. తపతి
3. మహీ డి. సబర్మతి
జవాబులు
1-ఎ 2-డి 3-డి 4-డి 5- సి 6-డి 7-బి 8-ఎ
9-డి 10-బి 11-బి 12-సి 13-ఎ 14-బి 15-సి 16-ఎ
17-ఎ 18-ఎ 19-డి 20-డి 21-డి 22-ఎ 23-డి 24-సి
25-డి 26-బి 27-సి 28-ఎ 29-సి 30-సి 31-డి 32-బి
33-డి 34-ఎ 35-సి 36-బి 37-డి 38-ఎ 39-డి 40-ఎ
41-డి 42-డి 43-డి 44-ఎ 45-బి 46-బి 47-ఎ 48-సి
49-సి 50-డి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?