Government Jobs 2023 | ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? రేపే చివరితేదీ
Government Jobs 2023 | ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? నేడే చివరితేదీ last date of application | నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగ ప్రకటనకు సంబంధించి పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ల గడువు రేపటితో ముగియనుంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1.UPSC Recruitment | యూపీఎస్సీలో 146 పోస్టులు
UPSC Recruitment 2023 | రిసెర్చ్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, జూనియర్ ఇంజినీర్ తదితర పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్, ఎలక్ట్రికల్, ఫొరెన్సిక్ ఆడిట్, రెగ్యులేషన్స్ ఇన్ఫర్మేషన్ తదితర విభాగాలలో ఖాళీలను యూపీఎస్సీ భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
మొత్తం పోస్టులు : 146
పోస్టులు: రిసెర్చ్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, జూనియర్ ఇంజినీర్ తదితరాలు.
విభాగాలు: ఆడిట్, రెగ్యులేషన్స్ ఇన్ఫర్మేషన్, సివిల్, ఎలక్ట్రికల్, ఫొరెన్సిక్ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు: 30 నుంచి 35 ఏండ్లు మించకుడదు (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకు వయసులో మినహాయింపు ఉంటుంది).
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
దరఖాస్తు ఫీజు: రూ.25.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: ఏప్రిల్ 27
వెబ్సైట్ : https://www.upsc.gov.in/
2.ICMR-NIMR Recruitment | ఎన్ఐఎంఆర్లో 61 పోస్టులు
ICMR-NIMR Recruitment 2023 | ప్రాజెక్ట్ టెక్నీషియన్, స్టాటిస్టికల్ అసిస్టెంట్ (Statistical Assistant), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO), ఎల్డీసీ (Lower Division Clerk) తదితర పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఐసీఎఆర్ (ICMR) ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రిసెర్చ్ (ఎన్ఐఎంఆర్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్/ 12వ తరగతి, పోస్టులను బట్టి గ్రాడ్యుయేషన్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 61
పోస్టులు : ప్రాజెక్ట్ టెక్నీషియన్, స్టాటిస్టికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎడీసీ తదితరాలు
అర్హతలు : ఇంటర్మీడియట్, 12వ తరగతి, పోస్టులను బట్టి గ్రాడ్యుయేషన్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు: 25 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.16000 నుంచి రూ.31000
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఇంటర్వ్యూ తేది: ఏప్రిల్ 10 నుంచి 12, 18, 21, 24, 27 తేదీల వరకు
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9:30 నుంచి 11 వరకు
వెబ్సైట్ : nimr.org.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?