BIOLOGY | తాచుపాము సొంత గూడు నిర్మించుకోవడానికి కారణం?
36. నిమ్న జాతుల అపసరణ, బహిర్గతత్వంతో కూడిన సంఘాన్ని ఏ విధంగా చెప్తారు?
1) ఉత్పత్తి రహితం, నిశ్చలం
2) ఉత్పత్తి కారకం, నిశ్చల రహితం
3) ఉత్పత్తి కారకం, నిశ్చల రహితం కాదు
4) ఉత్పత్తి కారకం, నిశ్చలం
37. సజీవులను, నిర్జీవుల నుంచి విభేదించడానికి కింది వాటిలో రెండు అత్యుత్తమ కారణాలనను గుర్తించండి.
1) పెరుగుదల, చలనం
2) క్షోభ్యత, చలనం
3) శ్వాసక్రియ, విసర్జన క్రియ
4) ప్రత్యుత్పత్తి, చలనం
38. ఆదర్శ పరిస్థితుల్లో ఒక జాతి జనాభా పెరుగుదల అత్యధికంగా సాధ్యమయ్యే రేటు దేనిపై ఆధారపడి ఉంటుంది.
1) జీవశక్మం
2) పుట్టుక సంబంధమైన శక్తి
3) వాహక సామర్థ్యం
4) జీవద్రవ్యం
39. నిశ్చితవాక్యం (ఎ) – ప్రతి జన్యువు వివిధ రూపాల్లో ఒక్కోరకంలో ఉండటాన్ని యుగ్మ వికల్పకాలు అంటారు.
హేతువు (ఆర్) – జన్యువులో అనువంశిక మార్పుల వల్ల ఒకే జన్యువు వివిధ యుగ్మ వికల్పకాలు
ఏర్పడతాయి
1) (ఎ), (ఆర్) రెండూ నిజం. (ఆర్), (ఎ)కు సరైన వివరణ
2) (ఎ), (ఆర్) రెండూ నిజం. (ఆర్), (ఎ)కు సరైన వివరణ కాదు
3) (ఎ) నిజం. (ఆర్) సరైనది కాదు
4) (ఆర్) నిజం. (ఎ) సరైనది కాదు
40. కింది వాటిలో నక్షత్ర చేపలను గుర్తించండి.
1) పెలాజిక్ జీవులు
2) లోటిక్ జీవులు
3) అగాథ జీవులు
4) బెంథిక్ జీవులు
41. నిశ్చితవాక్యం (ఎ) – పైలా యూపైరీన్, ఒలిగోపైరిన్ అనే రెండు రకాల పురుష బీజకణాలను ఉత్పత్తి చేస్తుంది
హేతువు (ఆర్) – యూపైరీన్ పురుష బీజ కణం xx క్రోమోసోమ్లను కలిగి స్త్రీ జీవులను మాత్రమే ఉత్పత్తి చేయగా, ఒలిగోపైరిన్ పురుష బీజకణం xy క్రోమోజోమ్‌లను కలిగి పురుష జీవులను ఉత్పత్తి చేస్తుంది
1) (ఎ), (ఆర్) రెండూ నిజం. (ఆర్), (ఎ)కు సరైన వివరణ
2) (ఎ), (ఆర్) రెండూ నిజం. (ఆర్), (ఎ)కు సరైన వివరణ కాదు
3) (ఎ) నిజం. (ఆర్) సరైనది కాదు
4) (ఆర్) నిజం. (ఎ) సరైనది కాదు
42. కొన్ని మొక్కల జాతులు కీటకాహారులు. ఎందువల్ల?
1) నీడ, కాంతి లేని పరిస్థితుల్లో ఈ మొక్కలు పెరగడం వల్ల తగినంత కిరణజన్య సంయోగ క్రియ జరగకపోవటం వల్ల ఇతర కీటకాలపై పోషణ కోసం ఆధారపడతాయి
2) నత్రజని లోపించిన నేలలో పెరుగుదలకు, కీటకాలపై నత్రజని పోషణ కోసం అనుకూలనాలను చూపిస్తాయి
3) కొన్ని రకాల విటమిటన్లు సంశ్లేషణ చేసుకోలేక కీటకాలను జీర్ణం చేసుకోవడానికి ఆధారపడతాయి
4) పరిణామ క్రమంలో జీవ శిలాజంగా స్వయం పోషకాలకు, పర పోషకాలకు మధ్య ఉండిపోయాయి
43. ఒక పోషక స్థాయి జీవద్రవ్యం, మరో పోషక స్థాయి జీవ ద్రవ్యంలోకి ఒక్కటిగా చేరడాన్ని ఏమని పిలుస్తారు?
1) శక్తి ప్రవాహ సాపేక్ష నిష్పత్తి
2) శక్తి ప్రవాహ సామర్థ్యం
3) ఆవరణ సంబంధ సామర్థ్యం
4) ఆవరణ సంబంధ ప్రవణత
44. భౌమజీవుల అస్థిపంజర నిర్మాణాలు, నీటిలో నివసించే సకశేరుకాల కంటే ఎక్కువ విస్తారం కలిగి ఉంటాయి. ఇది ఎందువల్ల అంటే?
1) నీటి కంటే గాలి ఎక్కువ చలనశీలతను చూపుతుంది
2) నీరు గాలి కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది
3) నీటిలో కంటే గాలిలో ఎక్కువ వేగంగా చలించవచ్చు
4) గాలి కంటే, నీరు ఎక్కువ సాంద్రతను చూపుతుంది
45. ఒక జాతి విలుప్త స్థితికి రావడానికి కారణం కానిది?
1) ఆవాసాన్ని నాశనం చేయడం
2) వాతావరణ కాలుష్యం
3) ఆర్థిక స్వలాభాలకు నియంత్రణ లేకుండా వినియోగించడం
4) వలసపోవడం
46. సర్కేడియన్ లయలకు సహేతకంగా అర్థవంతమైన వివరణ ఇచ్చినది గుర్తించండి.
1) ఒక అవయవ ప్రవర్తన అంతర్గత జీవక్రియ సంసిద్ధత, వివిధ రకాల సామర్థ్యాలపై స్థితిగతులను కలిగినప్పటికి, బాహ్య ఉద్దీపనాలకు అనుగుణంగా అది లయబద్దంగా మార్పులను చూపదు
2) ఒక అవయవ ప్రవర్తన దాని సహజ వాతావరణంలో బాహ్య ఉద్దీపనానికి మాత్రమే అనుగుణంగా ఉండి,
లయబద్దంగా మారుతుంది
3) ఒక అవయవ ప్రవర్తన దాని సహజ వాతావరణంలో బాహ్య ఉద్దీపనానికి అనుగుణంగా ఉండి, అంతర్గత జీవక్రియ సంసిద్ధత, వివిధ రకాల సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. బాహ్య వాతావరణం, అంతర్గత సంసిద్ధత విశిష్ట వ్యవధుల్లో లయబద్ధంగా మారుతుంది
4) ఒక అవయవ ప్రవర్తన దాని సహజ వాతావరణంలో బాహ్య ఉద్దీపనానికి అనుగుణంగా ఉండి, అంతర్గత జీవక్రియ సంసిద్ధత, వివిధ రకాల సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. కానీ బాహ్య, అంతర వాతావరణం వివిధ కాలాల్లో లయబద్దంగా మారకుండా చేస్తుంది
47. నిశ్చితవాక్యం (ఎ) – ఇఖైనోడర్మేటా, హెమికార్డేటా రెండు డ్యుటిరోస్టోమ్లు హేతువు (ఆర్) – ఈ వర్గం ప్రాథమిక అభివృద్ధి దశలో బ్లాస్టోపోర్ నోటి రంధ్రంగా మారుతుంది
1) (ఎ), (ఆర్) రెండూ నిజం. (ఆర్), (ఎ)కు సరైన వివరణ
2) (ఎ), (ఆర్) రెండూ నిజం. (ఆర్), (ఎ)కు సరైన వివరణ కాదు
3) (ఎ) నిజం. (ఆర్) సరైనది కాదు
4) (ఆర్) నిజం. (ఎ) సరైనది కాదు
48. తాచుపాము మాత్రమే తన సొంత గూడులను నిర్మించుకొంటుంది. ఈ విధంగా నిర్మించుకొనుటకు కారణం?
1) ఇది ఇతర పాములను తన గూటితో ఆకర్షించి భక్షిస్తుంది
2) ఇది శిశూత్పాదం, కావున తన సంతతి జన్మించడానికి గూడు అవసరం
3) ఇది అండోత్పాదక పాము కావున గుడ్లను గూడులో పెడుతుంది. ఈ గుడ్లు పొదిగేంతవరకు ఈ గూటిని రక్షిస్తుంది
4) ఇది అతి పెద్దపాము, కావున ఈ గూడు శీతాకాలం కోసం ఉపయోగిస్తుంది
49. BOD అంటే ఆక్సిజన్ పరిమాణం దేనికోసం అవసరం?
1) కర్బన సంయోగ పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి
2) కర్బన సంయోగ పదార్థాలను సంశ్లేషణ చేయడానికి
3) నిరింద్రియ పదార్థాలను వాటి ఆక్సైడ్లుగా మార్చి అవక్షేపం ఏర్పడటానికి కారణమవుతుంది
4) శ్వాసక్రియ జరపడానికి
50. జతపరచండి.
ఎ. ప్రోటోప్టిరాస్ 1. ఆస్ట్రేలియన్
బి. అపోసమ్ 2. ఇథియోపియన్
సి. స్ఫీనోడాన్ 3. నియార్కిటిక్
డి. ప్రిహెన్పైల్ తోక ఉన్న కోతి 4. నియోట్రాపికల్
1) ఎ-2, బి-3, సి-1, డి-4
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-4, బి-1, సి-3, డి-2
4) ఎ-4, బి-3, సి-1, డి-2
51. గడ్డిభూమి ఆవరణ వ్యవస్థలోని జంతువుల లక్షణాలను గుర్తించండి.
1) మంచి దృష్టి
2) అనుకరణ సామర్థ్యం
3) చలనాన్ని మార్చుట వలన
4) శీఘ్ర ఘ్రాణశక్తి
52. నిశ్చితవాక్యం (ఎ) – పారామీషియం అరీలియా పారామిసిన్ అనే విషపదార్థం సున్నిత భాగాలను చంపుతుంది
హేతువు (ఆర్) – ఇటువంటి కిల్లర్ రకాలు కప్ప అణువులను కలిగి ఉంటుంది
1) (ఎ), (ఆర్) రెండూ నిజం. (ఆర్), (ఎ)కు సరైన వివరణ
2) (ఎ), (ఆర్) రెండూ నిజం. (ఆర్), (ఎ)కు సరైన వివరణ కాదు
3) (ఎ) నిజం. (ఆర్) సరైనది కాదు
4) (ఆర్) నిజం. (ఎ) సరైనది కాదు
53. ఇకోటోన్ను ఏ విధంగా వర్ణించవచ్చు?
1) ఆవరణ వ్యవస్థలోని వివిధ పోషక స్థాయిల మధ్య సమతాస్థితి
2) నూతన పరిస్థితులకు అలవాటు పడే సామర్థ్యం
3) రెండు (లేదా) అంతకంటే ఎక్కువ వైవిధ్య సంఘాల మధ్య మార్గం
4) ఆవరణ వ్యవస్థ అత్యధిక జీవద్రవ్యం సంఘాలకు ఆధారాన్నిస్తుంది
54. జీవ ఆవర్ధనానికి కారణం కాని రసాయన పదార్థం ?
1) క్లోరినేటెడ్ హైడ్రోజన్
2) బరువైన లోహాలు
3) ఆర్గానో పాస్ఫేట్
4) పాలిక్లోరినేటెడ్ డై ఫినైల్
55. ఏ పోషకస్థాయి వద్ద క్రిమి కీటకాలను నియంత్రించుటకు పంటలపై డీడీటీని చల్లుతారు?
1) ప్రాథమిక ఉత్పత్తిదారులు
2) ప్రాథమిక వినియోగదారులు
3) ద్వితీయ వినియోగదారులు
4) తృతీయ వినియోగదారులు
56. నిశ్చితవాక్యం (ఎ) – ప్రౌఢ ఇఖైనోడెర్మ్లు సాధారణంగా పంచభాగయుత వ్యాసార్థ సౌష్ఠవాన్ని చూపుతాయి
హేతువు (ఆర్) – ఇఖైనోడెర్మ్లలో మాత్రమే అసమానమైన సౌష్ఠవం ఉంటుంది
1) (ఎ), (ఆర్) రెండూ నిజం. (ఆర్), (ఎ)కు సరైన వివరణ
2) (ఎ), (ఆర్) రెండూ నిజం. (ఆర్), (ఎ)కు సరైన వివరణ కాదు
3) (ఎ) నిజం. (ఆర్) సరైనది కాదు
4) (ఆర్) నిజం. (ఎ) సరైనది కాదు
57. పోషకస్థాయిని అనుసరించి కింది జీవులను సరైన క్రమంలో అమర్చండి.
1. పెరిటిమా 2. కలాసస్
3. షార్క్ 4. హెర్రింగ్
1) 1, 2, 4, 3 2) 2, 1, 4, 3
3) 1, 2, 3, 4 4) 2, 1, 3, 4
58. కింది వాతావరణ సంబంధ కారకాల్లో ఏది సాంద్రత ఆధారిత కారణంగా వ్యవహరిస్తుంది.
1) ఉష్ణోగ్రత, ఆహారం, వ్యాధి, కాంతి
2) ఆహారం, పరభక్షి, వ్యాధి, జీవ ఉత్పన్నాలు సంచయనం చెందును
3) ఉష్ణోగ్రత, లవణీయత, పరభక్షి, వ్యాధి
4) ఆహారం, లవణీయత, జీవ ఉత్పన్నాల సంచయనము, కాంతి
59. నిశ్చితవాక్యం (ఎ) – బెలనోగ్లాసస్ సకశేరుకం కాదు
హేతువు (ఆర్) – బెలనోగ్లాసస్ పృష్ఠదండం ఆహారనాళం నోటి పూర్వభాగం
1) (ఎ), (ఆర్) రెండూ నిజం. (ఆర్), (ఎ)కు సరైన వివరణ
2) (ఎ), (ఆర్) రెండూ నిజం. (ఆర్), (ఎ)కు సరైన వివరణ కాదు
3) (ఎ) నిజం. (ఆర్) సరైనది కాదు
4) (ఆర్) నిజం. (ఎ) సరైనది కాదు
60. శుద్ధవంశ సంకరం అంటే?
1) విషమయుగ్మజత, సహలగ్నత
2) విషమయుగ్మజత, స్వతంత్ర వ్యూహనం
3) విషయుగ్మజత మాత్రమే
4) సమయుగ్మజత మాత్రమే
61. కింది చర్యల్లో జీవుల శరీరంలో జరిగే జీర్ణక్రియలో భాగాన్ని గుర్తించండి?
1) ప్రొటీన్లు అమైనోఆమ్లాలుగా విచ్ఛిన్నం చెందడం
2) గ్లూకోజ్ CO2, H2Oగా విచ్ఛిన్నం చెందడం
3) గ్లూకోజ్, ైగ్లెకోజన్గా మార్పు చెందడం
4) అమైనో ఆమ్లాలు, ప్రొటీన్లుగా మార్పు చెందడం
62. విటమిన్-డి సూర్యకాంతి చర్యతో చర్మం ద్వారా దేంతో సంశ్లేషణం చెందుతుంది?
1) కొలెస్ట్రాల్
2) 7-హైడ్రాక్సి కొలెస్ట్రాల్
3) స్టిరాయిడ్ 4) కేంద్రకామ్లాలు
63. DNA ఏ క్షార ప్రొటీన్లతో సంబంధం కలిగి ఉంటుంది?
1) హిస్టోన్ 2) నాన్ హిస్టోన్
3) అల్బుమిన్ 4) నాన్ అల్యూమిన్
64. నిశ్చితవాక్యం (ఎ) – పక్షుల్లో శ్రోణిమేఖల్లో అనుత్రికం సంయోగం చెందుతాయి
హేతువు (ఆర్) – అనుత్రికం ఏదైనా ఆధారాన్ని గట్టిగా పట్టుకొంటాయి
1) (ఎ), (ఆర్) రెండూ నిజం. (ఆర్), (ఎ)కు సరైన వివరణ
2) (ఎ), (ఆర్) రెండూ నిజం. (ఆర్), (ఎ)కు సరైన వివరణ కాదు
3) (ఎ) నిజం. (ఆర్) సరైనది కాదు
4) (ఆర్) నిజం. (ఎ) సరైనది కాదు
65. లాథిరస్ ఒడోరేటస్లో తెల్లని పువ్వులు ఉన్న మొక్కల మధ్య సంకరణం జరిపి ఊదారంగు సంతతి ఏర్పడటానికి కారణం?
1) సంపూరక జన్యువులు
2) సహబహిర్గతత్వం
3) అసంపూర్ణ బహిర్గతత్వం
4) వృథిక్కరణ
66. జీవ పరిణామ క్రమం దృష్ట్యా కింది వాటిలో సరైన పరిణామ క్రమం?
1) ఓట్టర్ – తాబేలు – షార్క్
2) తిమింగలం – తాబేలు – ఓట్టర్
3) తాబేలు – తిమింగలం – ఓట్టర్
4) తిమింగలం – ఓట్టర్ – తాబేలు
67. లినోలికామ్లం అసంతృప్త కొవ్వు ఆమ్లం, ఇది కింది వేటిలో ఎక్కువ మోతాదులో ఉంటుంది?
1) వేరుశనగ నూనె 2) కొబ్బరి నూనె
3) పత్తి నూనె
4) పొద్దుతిరుగుడు నూనె
జవాబులు
36.1 37.3 38.3 39.1
40.4 41.3 42.2 43.3
44.4 45.4 46.1 47.3
48.3 49.1 50.1 51.1
52.2 53.3 54.2 55.1
56.2 57.1 58.2 59.1
60.4 61.1 62.2 63.1
64.3 65.1 66.2 67.4
విన్నర్స్ పబ్లికేషన్స్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు