ECONOMY | శక్తి ప్రణాళిక-ఎల్పీజీ నమూనా
7వ పంచవర్ష ప్రణాళికా కాలం 1985-90
- 7వ ప్రణాళికా కాలం 1985-90
- 7వ ప్రణాళిక రూపకర్త : వకీలు, బ్రహ్మానందం (డా. మన్మోహన్సింగ్)
- 7వ ప్రణాళిక వ్యూహం/ నమూనా : వేతన, వస్తు నమూనా (వకీలు, బ్రహ్మానందం నమూనా)
- 7వ ప్రణాళిక వ్యూహాన్ని రాజీవ్ వ్యూహం అని కూడా పిలుస్తారు.
- 7వ ప్రణాళిక ప్రాధాన్యం : ఆహారం పని ఉత్పాదకత
- 7వ ప్రణాళిక అధ్యక్షులు 1 రాజీవ్‌గాంధి,
2. వి.పి. సింగ్
ఉపాధ్యాక్షులు : డా. మన్మోహన్సింగ్ - 7వ ప్రణాళిక అంచనా వ్యయం రూ.1,80,000 కోట్లు, వాస్తవిక వ్యయం రూ. 2,18,730 కోట్లు
- 7వ ప్రణాళికలో అధిక వనరుల కేటాయింపు శక్తి 28 శాతం,సాంఘిక సేవలు 18 శాతం
- 7వ ప్రణాళికలో ఆశించిన వృద్ధిరేటు 5 శాతం, సాధించిన వృద్ధిరేటు 6 శాతం
7వ ప్రణాళిక ప్రత్యేకతలు
- 7వ ప్రణాళిక సంఘానికి రాజీవ్ గాంధీ అధ్యక్షుడిగా వ్యవహరించడం వల్ల 7వ ప్రణాళిక వ్యూహాన్ని రాజీవ్ వ్యూహం అని కూడా పిలుస్తారు.
- 7వ ప్రణాళికలో అధిక వనరులు శక్తి వనరులకు కేటాయించడం వల్ల 7వ ప్రణాళికను శక్తి ప్రణాళిక అని కూడా పిలుస్తారు.
- 7వ ప్రణాళికను దీర్ఘదర్శి ప్రణాళిక అని కూడా పిలుస్తారు.
- 7వ ప్రణాళికను దీర్ఘదర్శి ప్రణాళికగా రూపొందించారు.
- 1985లో ఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై)పథకం ప్రారంభమయ్యింది.
- గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీలకు, పేదలకు వెట్టిచాకిరీ విముక్తి దారులకు గృహనిర్మాణ సౌకర్యం కల్పించడం దీని ఉద్దేశం.
- 1985 సమగ్ర పంటల బీమా పథకం ప్రారంభమయ్యింది.
- ఖాయిలా పడ్డ పరిశ్రమల చట్టం 1985 రూపకల్పన. (తివారీ కమిటీ సూచనలతో ఏర్పాటైంది)
- దీన్ని 2002లో పోటీ చట్టం ద్వారా రీప్లేస్ చేశారు.
- 1986 రెండవ జాతీయ విద్యా విధానం ప్రకటించారు. (మొదటిసారి 1968).
- 1986లో వినియోగదారుల రక్షణ చట్టం రూపొందింది.
- 1986లో బాల కార్మికుల నిషేధ చట్టం రూపొందించారు.
- 1986లో ఇండియన్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (IWAI) ఏర్పాటు చేశారు.
- 1987- ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ (ఓబీబీ) ప్రారంభమైంది. ప్రాథమిక పాఠశాలలో కనీస వసతులు కల్పించడం దీని ఉద్దేశం
- 1987లో సింగిల్‌విండో పద్ధతి (ఏకగవాక్ష పద్ధతి ఏర్పాటు చేశారు. (మోహన్ కందా కమిటీ సూచనతో సహకార వ్యవస్థలో ఏర్పాటు).
- 1988లో జాతీయ అక్షరాస్యత మిషన్ ఏర్పాటు చేశారు. దీని లక్ష్యం వయోజన విద్యను అందించడం.
- 1988లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు
- 1988లో నేషనల్ హౌసింగ్ బ్యాంకు స్థాపన
- 1988లో మిలియన్ (10 లక్షల) బావుల పథకం ప్రారంభం.
- 1988లో సెబి(SEBI) ఏర్పాటు.
- భూ రికార్డుల కంప్యూటరీకరణ కార్యక్రమం ప్రారంభం
- 1988-89 బీపీఎల్ వారికి కుటీర జ్యోతి పథకం ప్రారంభించారు.
- 1989 ఏప్రిల్ 1న జవహర్ రోజ్‌గార్ యోజన ప్రారంభమైంది. గ్రామీణ పేదలకు వేతన ఉపాధి అవకాశాలు కల్పించడం దీని ఉద్దేశం.
- 1989లో నెహ్రూ రోజ్‌గార్ యోజన ప్రారంభమైంది. పట్టణ పేదలకు వేతన ఉపాధి అవకాశాలను కల్పించడం దీని ఉద్దేశం. (1997లో ఎన్ఆర్‌వై ని ఎస్జేఎస్ఆర్వైలో విలినం చేశారు)
- IAY – Indira Awas Yojana
- CCIS – Comprehensive Crop Insurance Scheme
- OBB – Operation Black Board
- BPL- Below Poverty Line\
- MWS – Million Wells Scheme
- JRY- Jawahar Rozgar Yojna
- NRY – Nehru Rojgar Yojana
- SEBI – Securities and Exchange Board of India
వార్షిక ప్రణాళికలు 1990-92
- 7వ ప్రణాళిక తర్వాత 8వ ప్రణాళిక ప్రారంభం కాకుండా రెండు వార్షిక ప్రణాళికలు అమలు చేశారు. దీనికి ప్రధాన కారణం రాజకీయ స్థిరత, ఆర్థిక సంక్షోభం, విదేశీ మారక నిల్వల కొరత, ద్రవ్యోల్బణం మొదలగు సమస్యల వల్ల 1990-92 మధ్య రెండు వార్షిక ప్రణాళికలను అమలు పరిచారు.
- ఈ రెండు వార్షిక ప్రణాళికల కాలంలో
1) వి.పి.సింగ్ 2) చంద్ర శేఖర్
3) పి.వి. నర్సింహారావులు ప్రధాన మంత్రులుగా ఉన్నారు - 1990-92 సంవత్సరాల కాలాన్ని అనధికార ప్రణాళిక సెలవుగా గుర్తించారు.
1990-92 వార్షిక ప్రణాళికల ప్రత్యేకతలు
- ఈ కాలంలోనే గల్ఫ్ యుద్ధం జరిగింది.
- ఈ కాలంలో భారతదేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టబడినవి.
- 1990 -ఏప్రిల్ 2 ఎస్ఐడీబీఐ ఏర్పాటు, యూబీఎస్పీ (Urban, Basic, Service for poor )ప్రారంభం
- 1991లో మన్మోహన్సింగ్, పి.వి. నర్సింహారావు ఆధ్వర్యంలో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రారంభం
- 1991 జూలై 24న నూతన పారిశ్రామిక విధాన తీర్మాన ప్రకటన
- ఆర్థిక సంస్కరణలు, నూతన ఆర్థిక సంస్కరణలు, ఎల్పీజీ విధానాలు ప్రారంభం.
- 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మాన ప్రకటనను మైనర్ రెవల్యూషన్ అంటారు.
- 1991 విత్త వ్యవస్థపై /బ్యాంకింగ్ రంగంలో సంస్కరణల కోసం నర్సింహం కమిటీ నియామకం జరిగింది.
- 1991 పన్ను సంస్కరణలకు రాజా చెల్లయ్య కమిటీని నియమించారు.
- 1990-92 కాలంలో ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వ నియంత్రణ నుంచి మార్కెట్ ఆర్థిక వ్యవస్థ వైపు వెళ్లడం జరిగింది.
- SIDBI- Small Industries Develop ment Bank of India
- NEP- New Economic Policy
ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక 1919-97
- ఎనిమిదో ప్రణాళిక కాలం -1992-97
- 8వ ప్రణాళిక రూపకర్త – పి.వి. నర్సింహారావు, మన్మోహన్సింగ్
- 8వ ప్రణాళిక నమూనా ఎల్పీజీ నమూనా
- 8వ ప్రణాళిక ప్రాధాన్యం: మానవ వనరుల అభివృద్ధి, ఉపాధి కల్పన, గ్రామీణాభివృద్ధి
- 8వ ప్రణాళిక అధ్యక్షులు పి.వి. నర్సింహారావు, దేవెగౌడ, వాజ్‌పేయి, ఐ.కె.గుజ్రాల్
- ఉపాధ్యక్షులు ప్రణబ్‌ముఖర్జీ
- 8వ ప్రణాళిక అంచనా వ్యయం రూ. 3.61,000 కోట్లు, వాస్తవిక వ్యయం రూ. 434,100 కోట్లు
- 8వ ప్రణాళికలో అధిక వనరుల కేటాయింపు శక్తికి 26.6 శాతం, రవాణా సమాచారం 18.4 శాతం, సాంఘిక సేవలు 18.2 శాతం
- 8వ ప్రణాళికలో ఆశించిన వృద్ధిరేటు 5.6 శాతం, సాధించిన వృద్ధిరేటు 6.7 శాతం
8వ ప్రణాళిక ప్రత్యేకతలు
- 8వ ప్రణాళిక నూతన ఆర్థిక సంస్కరణలు, ప్రవేశ పెట్టిన తర్వాత అమలు చేసిన మొదటి ప్రణాళిక
- ప్రభుత్వరంగం ప్రాధాన్యం తగ్గి ప్రైవేట్ రంగ ప్రాధాన్యం పెరిగింది. అంటే ప్రభుత్వ వ్యయం కంటే ప్రైవేట్ వ్యయం అధికంగా ఉన్న ప్రణాళిక ఇది.
- ఈ ప్రణాళిక వికేంద్రీకరణ నిర్వహణ సూత్రంపై ఆధారపడి ఉంది.
- హరిత విప్లవ ఫలితాలను ఈశాన్య రాష్ర్టాలకు విస్తరించాలని సూచించారు.
- ఈ ప్రణాళికలో ధనిక, పేద వర్గాల మధ్య అంతరాలు పెరిగాయి.
- 8వ ప్రణాళికలో అనేక నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడం వల్ల దీన్ని సంస్కరణల ప్రణాళిక అంటారు.
- ఈ ప్రణాళికలో అమలు చేసిన నూతన ఆర్థిక సంస్కరణలు అప్పటి ప్రధాన మంత్రి పీవీ నర్సింహారావు, అప్పటి ఆర్థిక మంత్రి డా. మన్మోహన్ సింగ్ కలిసి రూపొందించారు. కాబట్టి దీన్ని రావు -మన్మోహన్ నమూనా అని, రావు- సింగ్ నమూనా అని అంటారు.
- నూతన సంస్కరణలో భాగంగా సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాన్ని అనుసరించడం వల్ల దీన్ని ఎల్పీజీ నమూనా అని అంటారు.
- ఎల్పీజీ- లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్
- 1992- SITRA – Supply of Imp roved toolkits to Rural Artisans గ్రామీణ వృత్తుల వారికి మెరుగైన పనిముట్టు అందించడం.
- 1992 డిసెంబర్ 10 రెపోరేటు విధానం ప్రారంభం (వాఘల్ వర్గింగ్ గ్రూప్ సిఫారసులతో)
- 1992లో నేషనల్ స్టాక్ ఎక్ఛేంజీ ఏర్పాటు.
- 1992 సెబీకి చట్టబద్ధత కల్పించారు.
- 1993 ఎంపాయీస్ ఎష్యూరెన్స్ స్కీమ్ (ఏవైఎస్) ఉపాది హామీ పథకం ప్రవేశ పెట్టారు.
- 1993 అక్టోబర్ 2న మహిళ సంమృద్ధి యోజన ఏర్పాటు చేశారు. గ్రామీణ మహిళల్లో పొదుపును ప్రోత్సహించడం ప్రధాన ఉద్దేశం.
- ప్రధాన మంత్రి రోజ్‌గార్ యోజన పథకం ద్వారా నిరుద్యోగ విద్యావంతులకు స్వయం ఉపాధి కల్పించడం.
- 1993లో డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (డీఆర్డీఏ)ను ఏర్పాటు చేశారు.
- 1994లో డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం (డీపీఈపీ)ని సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యంగా ఏర్పాటుచేశారు.
- 1995లో జాతీయ సామాజిక సహాయ పథకం ప్రారంభమైంది
- 1995లో మధ్యాహ్న భోజన పథకం దేశవ్యాప్తంగా అమలు చేశారు. ( మొదట తమిళనాడులో, 1984లో ఉమ్మడి ఏపీలో అమలు జరిగింది)
- 1995-96లో ఆర్ఐడీఎఫ్ ఏర్పాటు. గ్రామీణ ప్రాంతాల్లో అవస్థాపన సౌకర్యాలను కల్పించడం దీని ఉద్దేశం.
- 1997 గంగా కళ్యాణ్ యోజన ఏర్పాటు చేశారు. (1999లో ఎస్జీఎస్వైలో దీన్ని విలీనం చేశారు)
ప్రాక్టీస్ బిట్స్
1. ఏడో ప్రణాళిక రూపకర్త ఎవరు?
ఎ) వకీలు, బ్రహ్మానందం
బి) మన్మోహన్ సింగ్
సి) నర్సింహారావు డి) ఏదీకాదు
2. ఏడో ప్రణాళిక ఉపాధ్యక్షులు ఎవరు?
ఎ) పీవీ నర్సింహారావు
బి) మన్మోహన్ సింగ్
సి) రాజీవ్ గాంధీ డి) వీపీ సింగ్
3. 7వ ప్రణాళికలో దేనికి ప్రాధాన్యం ఇచ్చారు?
ఎ) నిరుద్యోగం బి) పేదరికం
సి) ఆహారం-పని- ఉప్పాదకత
డి) స్వయం సమృద్ధి- స్వావలంబన
4. రాజీవ్ వ్యూహం అని ఏ ‘ప్రణాళిక నమూనా’ను పేర్కొంటారు?
ఎ) 6 బి) 7 సి) 8 డి) 9
5. ఏడో ప్రణాళికలో ఏ రంగానికి అధిక వనరులు కేటాయించారు?
ఎ) వ్యవసాయం బి) పరిశ్రమలు
సి) శక్తి డి) సామాజిక సేవలు
6. కింది వాటిలో వార్షిక ప్రణాళికల కాలం ఏది?
ఎ) 1985-86 బి) 1989-90
సి) 1990-92 డి) 1974-75
7. 1990-92 సంవత్సరాల మధ్య వార్షిక ప్రణాళికలు అమలు చేయడానికి కారణం?
ఎ) రాజకీయ అస్థిరత
బి) ఆర్థిక సంక్షోభం
సి) విదేశీ మారక నిల్వల కొరత
డి) పైవన్నీ
8. ఎనిమిదో ప్రణాళిక నమూనా ఏది?
ఎ) ఎల్పీజీ నమూనా
బి) రావు-మన్మోహన్ నమూనా
సి) రావు-సింగ్ నమూనా డి) పైవన్నీ
9. ఎనిమిదో ప్రణాళిక రూపకర్త ఎవరు?
ఎ) పీవీ నర్సింహారావు
బి) డా. మన్మోహన్ సింగ్
సి) వాజ్‌పేయి డి) ఎ, బి
10. ప్రభుత్వ వ్యయం కంటే ప్రైవేట్ వ్యయం అధికంగా ఉన్న ప్రణాళిక ఏది?
ఎ) 6 బి) 7 సి) 8 డి) 9
సమాధానాలు
1-ఎ 2-బి 3-సి 4-బి
5-సి 6-సి 7-డి 8-డి
9-డి 10-సి
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు