Telangana Current Affairs | ‘గిరి వికాసం’ పథకం పొందడానికి అర్హులు ఎవరు?
ఏప్రిల్ 5వ తేదీ తరువాయి..
113. కింది వాక్యాల్లో సరైనవి?
ఎ. 2022-23 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ను బోధనా మాధ్యమంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది
బి.1 నుంచి 7వ తరగతి చదువుతున్న పిల్లల్లో ప్రాథమిక అక్షరాస్యత సంఖ్య, నైపుణ్యాలు బలోపేతం చేయడానికి ప్రభుత్వం తొలిమెట్టు అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఎ, బి సరికావు
114. తెలంగాణ ప్రభుత్వం జనవరి 2022లో చేపట్టిన మన ఊరు-మన బడి/మన బస్తీ – మన బడి కార్యక్రమానికి ఎన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, ఎంత ఆమోదిత బడ్జెట్‌ను కేటాయించింది (తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం-2023 ప్రకారం)?
1) దాదాపు 26,000 పాఠశాలలు, రూ.7,300 కోట్లు
2) దాదాపు 27,000 పాఠశాలలు, రూ.6,300 కోట్లు
3) దాదాపు 25,000 పాఠశాలలు, రూ.8,300 కోట్లు
4) దాదాపు 24,000 పాఠశాలలు, రూ.8,000 కోట్లు
115. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్‌కి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
ఎ. విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించి ప్రపంచ నైపుణ్య ప్రమాణాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి 2014లో టీఏఎస్కే (టాస్క్) ఏర్పాటయ్యింది
బి. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, సిరిసిల్లలో ప్రాంతీయ కేంద్రాలను టాస్క్ ప్రారంభించింది
సి. యువతలో నైపుణ్యాన్ని అందించే కార్యక్రమాలను చేపట్టినందుకు 2016లో ప్రతిష్ఠాత్మక ‘స్కోచ్’ ప్లాటినం అవార్డును గెలుచుకుంది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, సి
116. యువ గ్రాడ్యుయేట్లకు కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, కంప్యూటర్ ఓరియంటెడ్ స్కిల్స్ నేర్పించడం ద్వారా వారి ఉపాధి పొందే అవకాశాలను మెరుగుపరిచే తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్ (టీఎస్కేసీ)లను నిర్వహిస్తున్న ప్రభుత్వ విభాగాన్ని గుర్తించండి.
1) డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్
2) డిపార్ట్మెంట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్
3) డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్
4) డిపార్ట్మెంట్ ఆఫ్ కాలేజీయట్ ఎడ్యుకేషన్
117. ‘దళితబంధు’ కార్యక్రమానికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి?
ఎ. షెడ్యూల్డ్ కులాల ప్రజల ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రారంభించారు
బి. ప్రతి లబ్ధిదారునికి 10 లక్షల ఆర్థిక సాయాన్ని, తగిన ఆదాయ మార్గాన్ని ఏర్పరచుకోవడానికి అందిస్తారు
సి. 2021, ఆగస్టు 4న వాసాలమర్రి గ్రామంలో ఈ పథకాన్ని ప్రారంభించారు
డి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి
రూ.4,150 కోట్లు సుమారు 38,323 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు
ఇ. 2022-23 సంవత్సరానికి నియోజకవర్గానికి 1500 మంది లబ్ధిదారులకు ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) పైవన్నీ సరైనవే
118. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి?
ఎ. తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలు, తెగల ప్రత్యేక అభివృద్ధి నిధి (ప్రణాళిక కేటాయింపు, ఆర్థిక వనరుల వినియోగం) చట్టాన్ని 2018లో ఆమోదించింది
బి. 2021-22 సంవత్సరం నాటికి దేశం మొత్తంలో దళితుల అభివృద్ధికి సంబంధించిన నిధుల ఖర్చుకు పూర్తిస్థాయిలో చట్టబద్ధత కల్పించిన నాలుగు రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి
సి. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో ప్రధానమైన కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు, ఇంటింటికి నల్లా, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో సన్నబియ్యం మొదలైన పథకాలన్నింటికి నిధులు ఈ ప్రత్యేక అభివృద్ధి కింద ఇచ్చారు
1) ఎ, బి, సి 2) ఎ, బి
3) బి, సి 4) ఎ, సి
119. ‘గిరి వికాసం’ పథకం కింద సాగు చేయలేని వ్యవసాయ భూములను సారవంతమైన నేలలుగా మార్చి వ్యవసాయం చేయడానికి అనుకూలంగా మార్చి వ్యవసాయ అభివృద్ధికి దోహదపడుతుంది. కాగా ఈ పథకం పొందడానికి అర్హులు ఎవరు?
1) ఎస్టీ రైతులు
2) చిన్న, సన్నకారు ఎస్టీ రైతులు
3) చిన్న, సన్నకారు, మధ్యతరహా ఎస్టీ రైతులు
4) ఏదీకాదు
120. కింది వాటిలో సరైనవి గుర్తించండి?
ఎ. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు డా. బీఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద స్కాలర్షిప్ అందిస్తారు
బి. బీసీ విద్యార్థులకు మహాత్మా జ్యోతిబాఫూలే ఓవర్సీస్ విద్యానిధి కింద స్కాలర్షిప్ అందిస్తారు
సి. ఈబీసీ, మైనారిటీ విద్యార్థులకు ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింది స్కాలర్షిప్ అందిస్తారు
డి. ఈ స్కాలర్షిప్లు పొందాలంటే కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల్లోపు ఉండాలి. కుటుంబంలో ఒకరికి రూ.20 లక్షల స్కాలర్షిప్ అందిస్తారు.
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) బి, సి, డి 4) పైవన్నీ
121. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పథకానికి సంబంధించి సరైనవి గుర్తించండి.
ఎ. పేదలకు సరసమైన, నాణ్యమైన గృహాలను అందించే లక్ష్యంతో ప్రభుత్వం 2015, అక్టోబర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించింది
బి. 2016-22 డిసెంబర్ మధ్యకాలంలో 1,36,039 ఇళ్ల నిర్మాణం పూర్తియ్యింది
సి. గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారుల వాటాను ఎస్సీ, ఎస్టీలు 50 శాతం, మైనారిటీలు 7 శాతం, ఇతర వర్గాలకు 43 శాతం రిజర్వ్ చేశారు
డి. పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల వాటాను ఎస్సీ 17 శాతం, ఎస్టీ 6 శాతం, మైనారిటీ 12 శాతం, ఇతర వర్గాలకు 65 శాతం ఉంది
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) ఎ, సి, డి 4) పైవన్నీ
122. కింది వాటిలో సరైనవి గుర్తించండి?
ఎ. కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ పథకం కింద అందించే ఆర్థిక సహాయం రూ.1,00, 116
బి. పెళ్లికాని వికలాంగ బాలికలకు కులం, మతంతో సంబంధం లేకుండా అందించే ఆర్థిక సాయం రూ.1,22,145
సి. ఎస్సీ, ఇతర కులాలకు చెందిన వ్యక్తుల మధ్య కులాంతర వివాహానికి ప్రోత్సాహం కింద రూ.2.5 లక్షలు ఇస్తారు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, సి
123. కింది వాటిలో సరైనవి గుర్తించండి?
ఎ. సంస్థాగత ప్రసవాలను ప్రోత్సహించడం ద్వారా ప్రసూతి, శిశు మరణాల రేటును తగ్గించే లక్ష్యంతో 2018, జూన్‌లో కేసీఆర్ కిట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు
బి. ఈ పథకం కింద ప్రసవానంతర తల్లులు 15 వినియోగ వస్తువులతో కూడిన కిట్ అందుకుంటారు
సి. ఈ పథకం కింద ప్రసవం ముందు, తర్వాత వచ్చే వేతనాల నష్టాల భర్తీకి తల్లులకు రూ.12,000 (ఆడపిల్ల పుడితే రూ.13,000) ఆర్థిక సాయం అందిస్తారు
డి. ఈ పథకం వల్ల సంస్థాగత ప్రసవాల శాతం 30.5 శాతం నుంచి 61 శాతానికి పెరిగింది
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) పైవన్నీ
124. షీ టీమ్స్‌కు సంబంధించి కింది వాటిలో సరైనవి గుర్తించండి.
ఎ. ఎస్-సెక్యూరిటీ
బి. హెచ్-హెల్త్ సి. ఈ-ఎడ్యుకేట్
1) ఎ, బి 2) ఎ, సి
3) ఎ, బి, సి 4) బి, సి
125. ఆసరా పెన్షన్‌కు సంబంధించి సరైన వాటిని గుర్తించండి.
ఎ. ఈ పథకాన్ని 2014, నవంబర్‌లో ప్రారంభించారు
బి. 2014 సంవత్సరం నాటికి మొత్తం 29.21 లక్షల మందికి రూ.861 కోట్లు ఈ పథకం కింద అందించారు
సి. 2014 నుంచి సగటున ప్రతి సంత్సరానికి దాదాపు 39 లక్షల మందికి ఈ పథకం అందిస్తున్నారు
డి. 2020, జూన్ నుంచి వికలాంగుల పెన్షన్ రూ.3016, ఇతర వర్గాలకు రూ.2016
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) బి, సి, డి 4) ఎ, బి, డి
126. రాష్ట్రంలో అమలవుతున్న బియ్యం పంపిణీ పథకాలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి.
ఎ. సంక్షేమ హాస్టళ్లలో చదివే విద్యార్థులకు ప్రీ మెట్రిక్ విద్యార్థికి ప్రతి నెలా 15 కేజీలు, పోస్ట్ మెట్రిక్ విద్యార్థికి ప్రతి నెలా 18 కేజీల చొప్పున ఉచితంగా సన్నబియ్యం అందిస్తారు
బి. మధ్యాహ్న భోజన పథకం కింద ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రైమరీ లెవల్ విద్యార్థులకు రోజుకు 100 గ్రాములు, అప్పర్ ప్రైమరీ హైస్కూల్ విద్యార్థులకు రోజుకు 150 గ్రాముల చొప్పున సన్నబియ్యం అందిస్తారు
సి. 3-6 సంవత్సరాల్లోపు పిల్లలకు రోజుకు 75 గ్రాములు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు రోజుకు 150 గ్రాముల చొప్పున అంగన్వాడీ కేంద్రాల ద్వారా బియ్యం పంపిణీ అవుతుంది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
127. ఉచిత విద్యుత్ సరఫరాకు సంబంధించి కింది వాటిలో సరైనవి గుర్తించండి.
ఎ. ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలు, తెగల కుటుంబాల గృహ అవసరాల కోసం 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుంది
బి. ప్రభుత్వం 2021-22 నుంచి లాండ్రీలు/దోబీఘాట్లు, సెలూన్ నిర్వహణకు 251 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుంది
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీ సరికాదు
128. కింది వాక్యాల్లో సరైనవి?
ఎ. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని మొత్తం జనాభాలో సీనియర్ సిటిజన్స్ జనాభా 9.34 శాతం, వికలాంగుల జనాభా 2.99 శాతం
బి. రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్ల కోసం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ హెల్ప్‌లైన్ నంబర్ 14567
సి. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ హెల్ప్‌లైన్ నంబర్ 155326
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, సి
129. మినిస్ట్రీ ఆఫ్ సెషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ‘స్మైల్ (సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిడ్యువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్)’ అనే స్కీమ్‌ను కింది ఏ వర్గాలకు అమలు చేస్తుంది?
1) వికలాంగులు 2) వయోవృద్ధులు
3) ట్రాన్స్జెండర్లు 4) ఎస్సీ, ఎస్టీ
130. కింది వాక్యాల్లో సరైనవి సూచించండి.
ఎ. తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణ శాతం 24.06 శాతం
బి. రాష్ట్రం మొత్తం అటవీ విస్తీర్ణంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దాదాపు 16 శాతం విస్తీర్ణం కలిగి ఉంది
సి. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం 2015 నుంచి 2021 మధ్య అటవీ విస్తీర్ణం 6.35 శాతం పెరిగింది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
131. కింది వాటిలో సరిగా జతపరచబడినవి? మొత్తం అటవీ విస్తీర్ణంలో వివిధ రకాల అటవీ ప్రాంతాల విస్తీర్ణ శాతం
ఎ. ఓపెన్ ఫారెస్ట్- 31.49 శాతం
బి. మోడరేట్ డెన్స్ ఫారెస్ట్- 32.07 శాతం
సి. వెరీ డెన్స్ ఫారెస్ట్- 5.75 శాతం
డి. స్క్రబ్, నాన్ ఫారెస్ట్, వాటర్ బాడీస్- 30.67 శాతం
1) ఎ 2) బి 3) సి 4) డి
132. జిల్లా మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం అధికంగా గల జిల్లాలు (మొదటి మూడు) గుర్తించండి?
1) భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు
2) కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు
3) ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రంభీం ఆసిఫాబాద్
4) భద్రాద్రి, ములుగు, కుమ్రంభీం
133. యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (యూఎస్ఏఐడీ) వారి సహకారంతో అటవీ విస్తీర్ణాన్ని పరిరక్షించడానికి, విస్తరించడానికి 2019లో రాష్ట్రంలోని కింది ఏ జిల్లాలో అడవి వెలుపలి ప్రాంతంలో ఆగ్రో ఫారెస్ట్రీ, హార్టికల్చర్ పద్ధతులను మెరుగుపరచడంలో సహాయపడటం కోసం ‘ఫారెస్ట్ ప్లస్ 2.0: ఫారెస్ట్ ఫర్ వాటర్ అండ్ ప్రాస్పరిటీ’ అనే కొత్త మేనేజ్మెంట్ టూల్‌ను పైలెట్ ప్రాతిపదికన లాంచ్ చేశారు?
1) మెదక్ 2) కరీంనగర్
3) జనగామ 4) రాజన్నసిరిసిల్ల
134. కింది వాటిలో సరైనవి?
ఎ. యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఆర్బర్ డే ఫౌండేషన్ 2020, 21 సంవత్సరాలకు హైదరాబాద్‌ను ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్’గా గుర్తించాయి
బి. 2022 సంవత్సరానికి హైదరాబాద్ నగరం అత్యున్నత ‘ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్’ అవార్డుకు ఎంపికయ్యింది
సి. ఎకనామిక్ రికవరీ, సమ్మిళిత వృద్ధి కోసం ‘లివింగ్ గ్రీన్’ కేటగిరీలో హైదరాబాద్ ‘గ్రీన్ గార్లాండ్ టు స్టేట్ ఆఫ్ తెలంగాణ’ అవార్డు కూడా అందుకుంది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, సి
135. కింది వాటిలో సరైనవి?
ఎ. టీఎస్ఎన్జీసీ- తెలంగాణ స్టేట్ నేషనల్ గ్రీన్ కార్ప్స్
బి. టీఎస్ఎఫ్ఏ- తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ
సి. ఎఫ్సీఆర్ఐ- ఫారెస్ట్ కాలేజ్ రిసర్చ్ ఇన్స్టిట్యూట్
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, బి
జవాబులు
113-1, 114-1, 115-3, 116-4, 117-4, 118-3, 119-2, 120-2, 121-4, 122-3, 123-2, 124-1, 125-1, 126-4, 127-4, 128-3, 129-3, 130-4, 131-4, 132-3, 133-1, 134-3, 135-3.
గందె శ్రీనివాస్
విషయ నిపుణులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?