Telangana History | సింహగిరి నరహరి వచనాలను రాసింది ఎవరు?
గతవారం తరువాయి..
146. కింగ్ కోఠీలో 1947 డిసెంబర్ 4న నిజాం రాజుపై బాంబు విసిరిన యువకుడు ఎవరు?
a) వందేమాతరం రామచంద్రరావు
b) నారాయణరావు పవార్
c) ఎం.ఎస్. రాజలింగం
d) బద్దం ఎల్లారెడ్డి జవాబు: (b)
వివరణ: ఈ దాడిలో నిజాం ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ప్రయత్నంలో పవార్‌తోపాటు గండయ్య, జగదీశ్వర్ భాగమయ్యారు. ఇందులో కొండా లక్ష్మణ్ బాపూజీ తనవంతు సహాయం అందించారు.
147. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో హైదరాబాద్ బ్రిటిష్ రెసిడెన్సీపై కాంగ్రెస్ జెండా ఎగరవేసే ప్రయత్నం చేసి అరెస్టయిన నాయకురాలు ఎవరు?
a) సరోజినీ నాయుడు
b) జ్ఞానకుమారి హెడా
c) యల్లాప్రగడ సీతాకుమారి
d) పద్మజా నాయుడు జవాబు: (d)
148. స్టేట్ కాంగ్రెస్‌పై 1938లో విధించిన నిషేధాన్ని నిజాం ప్రభుత్వం ఎప్పుడు తొలగించింది?
a) 1946 b) 1947
c) 1948 d) 1945
జవాబు: (a)
149. నిషేధం అనంతరం స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైంది ఎవరు?
a) జనార్దనరావు దేశాయి
b) మందుముల నరసింగరావు
c) స్వామి రామానంద తీర్థ
d) కొండా వెంకటరంగారెడ్డి జవాబు: (c)
150. నిజాం ఆజాద్ హైదరాబాద్ ప్రకటనకు వ్యతిరేకంగా ఏ రోజున స్టేట్ కాంగ్రెస్ ‘జాయిన్ హైదరాబాద్ డే’ని నిర్వహించింది?
a) 1947 ఆగస్టు 15
b) 1947 ఆగస్టు 7
c) 1947 జూన్ 12
d) 1947 జూలై 7 జవాబు: (b)
వివరణ: దేశంలో బ్రిటిష్ పాలన ముగిసిపోయాక తాను భారత్, పాకిస్థాన్ దేశాల్లో దేనిలోనూ చేరనని నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1947 జూన్ 12న ప్రకటించాడు. ఆజాద్ (స్వతంత్రం) హైదరాబాద్ నినాదాన్ని లేవనెత్తాడు. దీనికి వ్యతిరేకంగా స్టేట్ కాంగ్రెస్ 1947 ఆగస్టు 7న ‘జాయిన్ ఇండియా డే’ పాటించింది.
151. తెలుగు సాహిత్యంలో తొలి తిరునామములు రచించింది ఎవరు?
a) కృష్ణమాచార్యులు
b) అన్నమాచార్యులు
c) మరింగంటి లక్ష్మణ దేశికులు
d) భక్త రామదాసు జవాబు: (c)
152. కింది వివరాలను పరిశీలించండి.
A. జినవల్లభుడు 1. శ్రావకాభరణుడు
B. పంపకవి 2. వాచకాభరణుడు
C. మల్లియ రేచన 3. కన్నడ ఆదికవి
పై కవులు, వారి బిరుదులను జతపరచండి?
a) A-1, B-2, C-3
b) A-3, B-2, C-1
c) A-2, B-3, C-1
d) A-1, B-3, C-2 జవాబు: (c)
153. మధ్యయుగాల తెలంగాణ చరిత్రకు సంబంధించి వెలిగందల నారయ, ఏల్చూరి సింగయ, బొప్పరాజు గంగయ ఎవరు?
a) కాకతీయ సేనానులు
b) భాగవతంలో కొన్ని స్కందాల రచయితలు
c) భాస్కర రామాయణం రచయితలు
d) ప్రతాపరుద్రుడి ఆస్థాన కవులు
జవాబు: (b)
వివరణ: భాగవతంలో ఎనిమిది స్కందాలు పోతన రాశారు. 5, 6, 11, 12 స్కందాలు వెలిగందల నారయ, ఏల్చూరి సింగయ, బొప్పరాజు గంగయ రచించారు.
154. ప్రసిద్ధ సంస్కృత నాటక కర్తలు కాళిదాసు, మాఘుడి రచనలకు వ్యాఖ్యానం రాసిన పండితుడు ఎవరు?
a) ఏలేశ్వరోపాధ్యాయుడు
b) అహోబల పండితుడు
c) ఎలకూచి బాలసరస్వతి
d) కోలాచలం మల్లినాథసూరి
జవాబు: (d)
155. శతక సాహిత్యానికి సంబంధించి కింది వివరాలను పరిశీలించండి.
1. వృషాధిప శతకం: పాల్కురికి సోమనాథుడు
2. నారాయణ శతకం: మడికి సింగన
3. సర్వేశ్వర శతకం: చక్రపాణి రంగన
4. నరసింహ శతకం: కాకుత్సం శేషప్ప కవి
పై వాటిలో సరైన జతలు ఏవి?
a) 1 b) 1, 4
c) 1, 2, 3 d) పైవన్నీ సరైనవే
జవాబు: (b)
వివరణ: పాల్కురికి సోమనాథుడు రాసిన ‘వృషాధిప శతకం’ తెలుగులో తొలి శతకం. ‘నారాయణ శతకం’ను పోతన రచనగా పేర్కొంటారు. ‘సర్వేశ్వర శతకం’ రచయిత యథావాక్కుల అన్నమయ్య. కాకుత్సం శేషప్ప కవి ‘భూషణ వికాస శ్రీధర్మపుర నివాస! దుష్ట సంహార నరసింహ దురితదూర!’ మకుటంతో రాసిన శతకం ‘నరసింహ శతకం’.
156. సింహగిరి నరహరి వచనాలను రాసింది ఎవరు?
a) కృష్ణమాచార్యులు
b) భక్త బుచ్చిదాసు
c) కైరం భూమదాసు
d) రాకమచర్ల వెంకటదాసు జవాబు: (a)
157. మహారాష్ట్ర చక్రి భజనను అనుసరిస్తూ జానపద శైలిలో తందనాన రామాయణాన్ని రాసింది ఎవరు?
a) రాకమచర్ల వెంకటదాసు
b) చందాల కేశవదాసు
c) రుక్మాభట్ల విధుమౌళి శాస్త్రి
d) పరశురామపంతుల లింగమూర్తి
జవాబు: (c)
వివరణ: విధుమౌళి శాస్త్రిది సిద్దిపేట జిల్లా గజవెల్లి (గజ్వేల్).
158. ‘పోతన చరిత్రము’ కావ్యం రాసి అభినవ పోతనగా పేరుగాంచిన కవి ఎవరు?
a) వానమామలై వరదాచార్య
b) దాశరథి రంగాచార్య
c) కోవెల సుప్రసన్నాచార్య
d) దాశరథి కృష్ణమాచార్య జవాబు: (a)
159. కింది రచనలు, రచయితలను పరిశీలించండి.
1. రాజనీతి రత్నాకరం – నేబతి కృష్ణయామాత్యుడు
2. శృంగార శాకుంతలం – పిల్లలమర్రి పినవీరభద్రుడు
3. రావికంటి రామచంద్ర శతకం – కైరం భూమదాసు
4. తపతీ సంవరణోపాఖ్యానం – కందుకూరి రుద్రకవి
పై వాటిలో సరికాని జతలు ఎన్ని?
a) 1 b) 1, 2
c) 1, 2, 3 d) అన్నీ సరైనవే
జవాబు: (b)
వివరణ: రావికంటి రామచంద్ర శతకాన్ని సుంకరనేని ఫణికుండలుడు రచించాడు. ‘రాజరాజేంద్ర రావికంటి రామచంద్ర’ మకుటంతో సాగుతుంది ఈ శతకం. ఇక తపతీ సంవరణోపాఖ్యానమును అద్దంకి గంగాధర కవి రచించాడు. దీన్ని కుతుబ్‌షాహీ పాలకుడు ఇబ్రహీం కుతుబ్‌షాకు అంకితం ఇచ్చాడు. ఈయన స్వస్థలం హైదరాబాద్‌లోని హైదర్షా కోఠె అని తెలుస్తున్నది.
160. నవనాథ చరిత్ర అనే కథా కావ్యాన్ని రాసిన కవి ఎవరు?
a) మారన b) మంచన
c) గౌరన d) కేతన
జవాబు: (c)
వివరణ: గౌరన 13801450 మధ్య కాలంవాడు. శ్రీనాథుడి సమకాలికుడు. సంస్కృతంలో ‘లక్షణ దీపిక’ అనే ఛందోగ్రంథాన్ని, తెలుగులో ‘హరిశ్చంద్రోపాఖ్యానం’ అనే కావ్యం గౌరన ఇతర రచనలు. సరస సాహిత్య లక్షణ చక్రవర్తి ఈయన బిరుదు.
161. తాళపత్ర గ్రంథాల్లో కాకుండా చాటువుల ద్వారా సాహిత్యంలో స్థానం సుస్థిరం చేసుకున్న కవి ఎవరు?
a) శ్రీనాథుడు
b) తెనాలి రామకృష్ణుడు
c) కృష్ణమాచార్యులు
d) వేములవాడ భీమకవి జవాబు: (d)
162. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో 1915లో కుష్ఠు నివారణ కేంద్రం స్థాపనకు కృషి చేసింది ఎవరు?
a) సాలార్ జంగ్ b) ఇసాబెల్ కేర్
c) జోసెఫ్ కార్నీలియన్ d) విలియం బర్జెస్
జవాబు: (b)
వివరణ: స్కాట్లాండ్లో జన్మించిన ఇసాబెల్ కేర్ తన భర్త రెవరెండ్ జార్జి కేర్‌తో కలిసి నిజామాబాద్ జిల్లాలో అనేక విద్య, వైద్య సంస్థల్ని ఏర్పాటు చేసింది. డిచ్పల్లి విక్టోరియా కేర్ ఇసాబెల్ సేవా తత్పరతకు నిదర్శనం.
163. హైదరాబాద్ రాజ్యంలో ‘అనల్ మాలిక్’ (నేనే రాజు) సిద్ధాంతాన్ని ప్రబోధించింది ఎవరు?
a) మీర్ ఉస్మాన్ అలీఖాన్
b) సిద్దిఖి దీన్దార్
c) నవాబ్ బహదూర్ యార్ జంగ్
d) ఖాసిం రజ్వీ జవాబు: (c)
వివరణ: 1938-39లో నవాబ్ బహదూర్ యార్ జంగ్ మజ్లిస్ ఇత్తెహాదుల్కు అధ్యక్షుడయ్యాడు.
164. హైదరాబాద్ రాజ్యంలో మున్నూరు కాపుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషిచేసి మున్నూరు కాపు ఉద్యమ పితామహుడిగా నిలిచిపోయింది ఎవరు?
a) బొజ్జం నర్సింలు b) తుంగా సత్తయ్య
c) ఎర్రం సత్యనారాయణ
d) పైవారు ఎవరూ కాదు
జవాబు: (a)
వివరణ: బొజ్జం నర్సింలు ‘మున్నూరు కాపుల అభ్యుదయం’ రచించాడు. 1935లో హైదరాబాద్‌లో మున్నూరు కాపు మహాసభ జరిగింది.
165. 1413 నాటి తెలంగాణపుర శాసనంలో ప్రస్తావనకు వచ్చిన సమకాలీన పాలకుడు ఎవరు?
a) దేవరాయ- 1
b) ఫిరోజ్‌షా బహ్మన్
c) సర్వజ్ఞ సింగభూపాలుడు
d) కాటయ వేమారెడ్డి జవాబు: (b)
వివరణ: తెలంగాణపురం అంటే హైదరాబాద్ శివార్లలో ఉన్న తెల్లాపూర్ గ్రామం. ఇక్కడి తెలంగాణపుర శాసనాన్ని విశ్వబ్రాహ్మణులు వేయించారు. ఇందులో ఫిరోజ్‌షా బహ్మన్ భార్యకు నగలు చేసిన వృత్తాంతం ఉంది. బదులుగా ఫిరోజ్‌షా మామిడితోట దానంగా ఇచ్చాడు.
166. నిజాం రాజ్య చరిత్రకు సంబంధించి కింది వివరాలను పరిశీలించండి.
A. యాదవ సంఘం 1. తిరునగరి వెంకటప్పయ్య
B. శ్రీవైష్ణవ మహాసభ 2. చింతపల్లి రాఘవాచారి
C. విశ్వబ్రాహ్మణ సభ 3. చిరాగు వీరన్న
D. గౌడ సంఘం 4. సంగం సీతారామయ్య
పై వాటిని జతపరచండి?
a) A-1, B-2, C-3, D-4
b) A-2, B-3, C-4, D-2
c) A-4, B-3, C-2, D-1
d) A-4, B-1, C-2, D-3
జవాబు: (d)
వివరణ: ముదిరాజుల అభివృద్ధికి హైదరాబాద్ నగర మాజీ మేయర్ కృష్ణస్వామి ముదిరాజ్ కృషిచేశారు. 1922లో ముదిరాజ్ మహాసభ జి.రామకృష్ణయ్య ఆధ్వర్యంలో ఏర్పాటయ్యింది. కళావంతుల సంఘాన్ని సిద్ధాబత్తుని శ్యాంసుందర్ స్థాపించారు.
167. కాకతీయుల పాలనకు సంబంధించి మంత్రిమండలిలోని శాఖలపై ఏ అధికారి పర్యవేక్షణ ఉండేది?
a) మంత్రి b) అమాత్య
c) ప్రెగ్గడ d) బాహత్తర నియోగాధిపతి
జవాబు: (d)
168. కాకతీయుల పాలనా విభాగాలకు సంబంధించిన విభజనలో ఏది సరైన అవరోహణ (Descendig order) క్రమం?
a) స్థల, గ్రామ, నాడు
b) గ్రామ, స్థల, నాడు
c) నాడు, స్థల, గ్రామ
d) నాడు, గ్రామ, స్థల జవాబు: (c)
వివరణ: కాకతీయ రాజులు తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాన్ని నాడు, స్థల, గ్రామాలుగా విభజించారు. పాకనాడు, రేనాడు, సబ్బినాడు, కమ్మనాడు అప్పటి నాడులు. ఇక స్థలం అంటే ఇప్పటి తాలూకా/ మండలంగా పరిగణించవచ్చు. ఒక్కో స్థలంలో 10 నుంచి 60 గ్రామాలు ఉండేవి.
169. కాకతీయుల పాలనకు సంబంధించి ‘ప్రాడ్వివాకుడు’ పదం దేన్ని సూచిస్తుంది?
a) పండితుడు b) న్యాయమూర్తి
c) ప్రధాన అర్చకుడు d) ప్రెగ్గడకే మరోపేరు
జవాబు: (b)
170. కాకతీయ సైనిక వ్యవస్థకు సంబంధించి ‘లెంక’ అనే పదం దేనిని సూచిస్తుంది?
a) రాజు అంగరక్షకులు
b) యుద్ధంలో మరణించిన సైనికులు
c) ఒక సైనిక పటాలం అధిపతి
d) సైన్యాధ్యక్షుడు జవాబు: (a)
వివరణ: లెంకలు అవసరమైతే రాజు కోసం ప్రాణత్యాగం కూడా చేసేవారు. ఈ విషయాన్ని వెనిస్ యాత్రికుడు మార్కోపోలో పేర్కొన్నారు.
171. కాకతీయుల గ్రామ పాలన వ్యవస్థ ఎవరి చేతుల్లో ఉండేది?
a) రెడ్డి, కరణం b) చౌధరి, ముఖద్దం
c) ఆయగార్లు d) నాయంకరులు
జవాబు: (c)
వివరణ: ఆయగార్లు మొత్తం 12 మంది. రెడ్డి, కరణం, తలారి, పురోహితుడు తదితరులు ఇందులో భాగం. ఆయగార్లకు వంశ పారంపర్యంగా వచ్చే ‘మిరాసీ’ భూములు ఉండేవి. వీటిపై పన్ను మినహాయింపు కూడా ఉండేది. ఇదే మహారాష్ట్రలో ‘బారా బలూత’గా ప్రసిద్ధి చెందింది.
172. గ్రామంలో ఆయగార్లు అందించిన సేవలకు రైతుల నుంచి వసూలు చేసుకునే ధాన్యాన్ని ఏమని పిలిచేవాళ్లు?
a) మిరాసీ b) మేర
c) సిద్ధాయం d) ఆదాయం
జవాబు: (b)
173. గణపతిదేవుడి కాలంలో కరీంనగర్ జిల్లా ధర్మారం మండలంలోని నేఢవూరు, చామనపల్లి, కటిక్యోలపల్లి, దేవనపల్లి గ్రామస్థుల మధ్య ఏ కాలువ విషయంలో వివాదం తలెత్తింది?
a) బయ్యారం చెరువు కాలువ
b) రామప్ప కాలువ
c) గోదావరి కాలువ
d) గొనుగు కాలువ జవాబు: (d)
వివరణ: వివాద పరిష్కారానికి గణపతిదేవుడు రెండుసార్లు అధికారులను పంపించారు. చివరికి ప్రాడ్వివాకుని సమక్షంలో తుది తీర్పు వెలువడింది. చామనపల్లి గ్రామ ప్రజలకు కాలువ మీద హక్కును కల్పించారు. ఈ విషయమంతా ఒక రాగి శాసనంలో చెక్కించడం విశేషం.
174. రెండో బేతరాజు హనుమకొండలో నిర్మించిన శివపురాన్ని ఎవరికి మాన్యంగా ఇచ్చాడు?
a) రామేశ్వర పండితుడు
b) ధ్రువేశ్వర పండితుడు
c) విశ్వేశ్వర శివాచార్యులు
d) శ్రీపతి పండితుడు జవాబు: (a)
వివరణ: రామేశ్వర పండితుడు శైవమతంలో కాలాముఖ శాఖకు చెందినవాడు.
హర్షవర్ధన్ చింతలపల్లి
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు