Sports Current Affairs April 18 | క్రీడలు
ప్రియాన్షు
ఓర్లీన్స్ మాస్టర్ టైటిల్ విజేతగా భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రియాన్షు రజావత్ నిలిచాడు. ఏప్రిల్ 9న ఫ్రాన్స్‌లో జరిగిన పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్‌లో మాగ్నస్ జొహాన్సెన్ (డెన్మార్క్)పై గెలిచాడు. దీంతో తొలి బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ 300 టోర్నీని సాధించాడు.
గుకేశ్
భారత చెస్ క్రీడాకారుడు గుకేశ్ ఆర్మగెడాన్ ఆసియా, ఓషియానియా టైటిల్‌ను గెలుచుకున్నాడు. బెర్లిన్‌లో ఏప్రిల్ 10న జరిగిన మ్యాచ్‌లో గుకేశ్ ఉజ్బెకిస్థాన్‌కు చెందిన నొడిర్బెక్ అబ్దుసతొరోవ్ను ఓడించాడు.
చికిత
తాష్కెంట్ (ఉజ్బెకిస్థాన్)లో ఏప్రిల్ 29 నుంచి మొదలయ్యే ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ టోర్నీకి తెలంగాణకు చెందిన ఆర్చర్ తానిపర్తి చికిత ఎంపికయ్యింది. భారత ఆర్చరీ అసోసియేషన్ (ఏఏఐ) ఏప్రిల్ 13న 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. దీనిలో పెద్దపల్లి జిల్లాలోని ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన చికిత మహిళల కాంపౌండ్ విభాగంలో బరిలోకి దిగనుంది.
అమన్ సెహ్రావత్
ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్-2023లో హరియానాకు చెందిన అమన్ సెహ్రావత్ భారత్‌కు తొలి స్వర్ణ పతకం అందించాడు. కజకిస్థాన్‌లోని ఆస్తానాలో జరుగుతున్న ఈ పోటీల్లో ఏప్రిల్ 13న 57 కేజీల విభాగంలో స్వర్ణం గెలుచుకున్నాడు. గతేడాది అండర్-23 ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తొలి భారత రెజ్లర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు సీనియర్ విభాగంలోనూ పతకం సాధించాడు.
అనంతారపు కృష్ణయ్య
డైరెక్టర్,
శ్రీసాయి కోచింగ్ సెంటర్
కోదాడ
9948750605
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?