Career Guidance After 10th | ‘పది’లమైన కోర్సులు.. భవిష్యత్తుకు బాటలు!
టెన్త్ తరువాత కెరీర్
పదో తరగతి పరీక్షలు విద్యార్థుల జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయి. పది తరువాత ఏమి చదవాలని తీవ్రంగా ఆలోచించాల్సిందే. తరువాత ఏంటి అన్న జవాబును వెతికే ప్రయత్నంలో ఉన్న అన్ని అవకాశాల గురించి బాగా తెలుసుకోండి. మీరు తీసుకునే ఈ నిర్ణయం భవిష్యత్తుకు దిశ నిర్దేశిస్తుంది. పది తరువాత ఏం చదవాలో తెలుసుకుందాం..
- ఒకప్పుడు తెలిసిన వారిని అడిగి, టీచర్ల సలహాలతో నిర్ణయం తీసుకునే వారు. ఈ 5జీ జనరేషన్లో దేని గురించైనా తెలుసుకోవాలంటే గూగుల్ తల్లిని ఆశ్రయిస్తున్నారు. భవిష్యత్తులో ఎటువంటి కెరీర్ కావాలనే దాన్ని దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి. ప్రతి విద్యార్థి తనకు ఉన్న ఆసక్తిని, తన సామర్థ్యాన్ని, ఆ కెరీర్‌కు ఉన్న అవకాశాలను బట్టి సరైన నిర్ణయం తీసుకోవాలి.
- తెలుగు రాష్ర్టాల్లో అన్నిటి కంటే ఎక్కువ ఆదరణ ఉన్న కెరీర్లు ఇంజినీరింగ్, మెడిసిన్. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది విద్యార్థులు ఇంజినీరింగ్, మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలు రాస్తున్నారు. కానీ ఇవే కాదు, ఇంకా ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. టెన్త్ తర్వాత ఇంటర్, ఇంటర్ తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు. అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల గురించి తెలుసుకుని, వాటికి అనుగుణంగా ఇంటర్ బోర్డులో సబ్జెక్ట్స్‌ను ఎంచుకోవాలి.
1. లా
- లా కోర్సులో మూడు సంవత్సరాల ఎల్ఎల్బీ, ఐదు సంవత్సరాల ఎల్ఎల్బీ ప్రోగ్రాంలు ఉంటాయి. మూడు సంవత్సరాల కోర్స్ చేయాలి. అంటే బ్యాచిలర్ డిగ్రీ అవసరం ఉంటుంది. ఇంటర్ తర్వాత లా చేయాలంటే అయిదేళ్ల ప్రోగ్రాంలో చేరాలి. ఇందులో కూడా బీఏ ఎల్ఎల్బీ, బీకాం ఎల్ఎల్బీ, బీబీఏ ఎల్ఎల్బీ, బీఎస్సీ ఎల్ఎల్బీ వంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. లాయర్, అడ్వకేట్, జడ్జి లాంటి కెరీర్ పట్ల మక్కువ ఉన్న వారు దీన్ని ఎంచుకోవచ్చు. లా అంటే కోర్టులోనే పని చేయాలి అన్నది లేదు. ఇప్పుడు ఎన్నో కార్పొరేట్ లీగల్ కంపెనీల్లో వివిధ అవకాశాలు లభిస్తున్నాయి. కంపెనీలకు లీగల్ టీమ్స్, లీగల్ అడ్వైజర్లు కూడా అవసరమే. గ్రాడ్యుయేషన్ తర్వాత సివిల్ లా, క్రిమినల్ లా, కార్పొరేట్ లా, సైబర్ లా, ఇంటర్నేషనల్ లా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఇలా ఎన్నెన్నో అవకాశాలు. ఇంటర్ తర్వాత లా చేయాలనుకునేవారికి ఐదు సంవత్సరాల కోర్సు సరైనది. క్లాట్ (https://consortiumofnlus.ac.in/clat-2023/) లా ఎంట్రన్స్ కోసం రాసే పరీక్షల్లో ముఖ్యమైనది.
మేనేజ్మెంట్
- మేనేజర్ అనే ఉద్యోగ బాధ్యత చాలా వరకు ప్రతి ఆఫీసులో, ప్రతి కంపెనీలో ఉంటుంది. ఇది ఎప్పటికీ ఉండే ఉద్యోగ అవకాశం. అనుభవంతో కొందరు ఆ పదవిని పొందుతారు. కానీ మొదటి నుంచి ఇటువంటి వాటిపై మక్కువ ఉన్నవారు ఎంచుకునేది మేనేజ్మెంట్ కోర్సులు. బీబీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఎంబీఏ అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. కుటుంబ వ్యాపారం లేదా సొంత వ్యాపారంవైపు మొగ్గు చూపేవారు, మేనేజ్మెంట్ కెరీర్ పట్ల ఆసక్తి ఉన్నవారు ఇంటర్ తర్వాత బీబీఏ ప్రవేశ పరీక్షలు రాయవచ్చు. ఎంబీఏకు ’పేరున్న ఐఐఎంలు, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్మెంట్ (5 సంవత్సరాల) కోర్సులు ప్రవేశపెట్టారు.
- సేల్స్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్, బిజినెస్ అనలిస్ట్ వంటి అవకాశాల నుంచి కంపెనీలో అత్యున్నత పదవి వరకు ఎదిగే అవకాశం ఉంటుంది.
- టూరిజం, ట్రావెల్ వ్యాపారాలు, హోటళ్లు పెరగడం వల్ల హోటల్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్‌కు అవకాశాలు పెరిగాయి. ఫుడ్ అండ్ బేవరేజెస్, ఎయిర్ లైన్స్ సెక్టార్లో వీరికి అవకాశాలు ఉన్నాయి. NCHM JEE హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ కోసం రాసే పరీక్షల్లో ప్రధానమైంది. బ్యాచిలర్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్, ట్రావెల్, హాస్పిటాలిటీ, కలినరీ స్కూల్ ఇలా ఎన్నో కోర్సులు ఉన్నాయి. డిప్లొమా ప్రోగ్రామ్స్, సర్టిఫికెట్ కోర్సులు కూడా ఉన్నాయి. హాస్పిటల్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఈవెంట్ మేనేజ్మెంట్, లాజిస్టిక్ మేనేజ్మెంట్ ఇలా గ్రాడ్యుయేషన్‌లో ఎంచుకున్న కోర్సులను బట్టి ఎన్నో అవకాశాలు. గ్రాడ్యుయేషన్ తర్వాత, మేనేజ్మెంట్ కోర్స్ చేయాలనిపిస్తే ఎంబీఏ ఎంట్రన్స్ పరీక్షలైన క్యాట్ వంటి పరీక్షలు రాయవచ్చు.
కామర్స్
- కామర్స్ కోర్సుల్లో చేరే వారు సాధారణంగా కామర్స్, అకౌంట్స్, ఎకనామిక్స్, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్ వంటి సబ్జెక్ట్స్ చదువుతారు. ఇందులో ఎన్నో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. అకౌంటింగ్, ఫైనాన్స్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్లలో ఉద్యోగం చేయాలనుకునేవారికి సరైన కోర్సు. అలాగే చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటింగ్ లేదా కంపెనీ సెక్రటరీ వంటి కెరీర్‌కు కూడా బీకాం ఉపయోగపడుతుంది. దేశంలోని యూనివర్సిటీలు, కళాశాలలు బీకాంలో వివిధ రకాల కోర్సులు అందిస్తున్నాయి. బీకాం రెగ్యులర్, బీకాం ఆనర్స్, బీకాం ఇంటర్నేషనల్ బిజినెస్, బీకాం ఫైనాన్స్ ఇలా ఎన్నో కోర్సులున్నాయి. సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ పరీక్ష ద్వారా దేశంలోని అనేక సెంట్రల్, ఇతర యూనివర్సిటీల్లో కామర్స్‌తో పాటు ఇతర కోర్సుల్లో చేరే అవకాశం ఉంది. ఇంటర్ మార్కులతో లేదా అడ్మిషన్ టెస్ట్ ద్వారా ఈ కోర్సుల్లో చేరవచ్చు.
- Career Guidance After 10thసీఏ అంటే చార్టెర్డ్ అకౌంటెన్సీ. ఇది ఒక ప్రొఫెషనల్ కోర్సు. ఇందులో ఫౌండేషన్ రూట్లో వెళితే పది తర్వాత ఫౌండేషన్ కోర్సులో చేరి, పన్నెండు తర్వాత ఆ పరీక్ష రాసి, ఆ తర్వాత ఇతర కోర్సుల్లో రిజిస్టరై పరీక్షలు, ప్రాక్టీస్ పూర్తి చేయాలి. కామర్స్ గ్రాడ్యుయేట్ లేదా వేరే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్లు డైరెక్ట్‌గా ఇంటర్మీడియట్ పరీక్షకు రిజిస్టరై అక్కడి నుంచి కంటిన్యూ చేయొచ్చు. (https://resource.cdn.icai.org/19323ca_atcourse260510.pdf). సీఏ లాగానే, కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ వంటి ఆసక్తికరమైన కోర్సులు ఎన్నో ఉన్నాయి.
డిజైన్
- డ్రాయింగ్ స్కెచింగ్ పట్ల ఆసక్తి, క్రియేటివ్ టాలెంట్ ఉన్న వారు ఈ కోర్స్పై మక్కువ చూపుతున్నారు. డిజైన్ కోర్సుల్లో ఇంటర్ తర్వాత లేదా గ్రాడ్యుయేషన్ తర్వాత కూడా చేరవచ్చు. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, ఫ్యాషన్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, ఫర్నిచర్ డిజైన్, ప్రొడక్ట్ డిజైన్, కమ్యూనికేషన్ డిజైన్, టెక్స్టైల్ డిజైన్, సిరామిక్ డిజైన్, యానిమేషన్ డిజైన్, ఫిలిం అండ్ వీడియో డిజైన్ ఇలా ఎన్నో కోర్సులు ఉన్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) దేశంలో ప్రముఖ కాలేజీలు. అలాగే uceed పరీక్ష ద్వారా కొన్ని ఐఐటీలు డిజైన్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
హ్యుమానిటీస్
- హ్యుమానిటీస్ స్ట్రీమ్‌లో చేరిన వారు ఇంగ్లిష్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ, సోషియాలజీ, సైకాలజీ వంటి సబ్జెక్ట్స్ చదవాలి. ఆ తరువాత వారికి నచ్చిన బ్యాచిలర్స్ ప్రోగ్రాంలో చేరవచ్చు. ఎకనామిక్స్, ఫైన్ ఆర్ట్స్, ఫారిన్ లాంగ్వేజ్, జర్నలిజం, క్రిమినల్ లా, లైబ్రరీ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇలా ఎన్నో బీఏ కోర్సులున్నాయి. తరువాత వీరు కంటెంట్ రైటర్స్, లాంగ్వేజ్ ట్రైనర్లు, హిస్టోరియన్, సైకాలజిస్ట్ వంటి ఇతర ఉద్యోగ అవకాశాలను పొందగలుగుతారు.
- బీఎస్సీ సైన్స్ లేదా మ్యాథమెటిక్స్ వంటి వాటిలో ఆసక్తి ఉన్నవారు, ఆ సబ్జెక్ట్స్ పట్ల అవగాహన కలిగిన వారు ఇంటర్ తరువాత బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కోర్సుల్లో చేరవచ్చు. బీఎస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, జువాలజీ, బోటనీ, ఎకనామిక్స్ వంటి స్టాండర్డ్ అండ్ రెగ్యులర్ కోర్సులు, కంప్యూటర్ సైన్స్, మాస్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ మీడియా వంటి ఆధునిక కోర్సులు, ఓషనోగ్రఫీ, సెరీకల్చర్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, డెయిరీ టెక్నాలజీ, ఫోరెన్సిక్ సైన్స్ వంటి వైవిధ్య సబ్జెక్ట్స్ ఎన్నో ఉన్నాయి. డిగ్రీ చేసి వీటిలో మాస్టర్స్ చేయవచ్చు.
మెడిసిన్
- వైద్య విద్యకు ప్రపంచంలో ఎంతో గౌరవం ఉంది. దాంతో పాటు ఎంతో అవసరం కూడా ఉంది. ఇంటర్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు తీసుకున్న విద్యార్థికి మెడికల్ అడ్మిషన్ పరీక్షకు అర్హత ఉంటుంది. ఎంబీబీఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ అని. వైద్య విద్యకు సంబంధించి అలాగే ఆయుర్వేద, యునానీ, వెటర్నరీ, డెంటల్ ఇలా ఎన్నో కోర్సులున్నాయి.
నీట్ (https://ntaneet. nic.in/) పరీక్ష మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌లో దేశంలో ప్రధానమైంది.
ఇంజినీరింగ్
- ఇంటర్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వారికి ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల్లో చేరే అవకాశం ఉంటుంది. నిట్, ఐఐఐటీలో సీట్ కోసం జేఈఈ మెయిన్స్ (https: //jee main.nta.nic.in/) పరీక్ష రాయాలి. ఐఐటీ సీటు కోసం మెయిన్స్‌తో పాటు అడ్వాన్స్డ్ పరీక్షలో కూడా మంచి ర్యాంకు సాధించాలి. ఇంజినీరింగ్ చేయాలనుకునే విద్యార్థులు తెలంగాణ ఎంసెట్, ఏపీ ఎంసెట్ వంటి రాష్ట్ర స్థాయి పరీక్షలు కూడా రాస్తారు. ఇంజినీరింగ్ కళాశాలలు బీటెక్ లేదా బీఈ పట్టా ఇస్తాయి.
ఇంటిగ్రేటెడ్ కోర్సులు
- సాధారణంగా బ్యాచిలర్ కోర్స్ పూర్తి చేసి డిగ్రీ సాధించాలంటే మూడు లేదా నాలుగు సంవత్సరాలు పడుతుంది. ఆ తరువాత మాస్టర్స్ (పీజీ) విద్య సుమారు రెండు సంవత్సరాలు పడుతుంది. కానీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ తర్వాత వీటిలో అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇవి సాధారణంగా ఐదు సంవత్సరాల ప్రోగ్రామ్స్. ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ చాలా రకాల సబ్జెక్ట్స్‌లో రూపుదిద్దుకున్నాయి. బిట్స్ పిలానీ, జేఎన్టీయూ వంటి ఎన్నో కళాశాలల్లో ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వంటివి ఇంటిగ్రేటెడ్ సైన్స్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా ఎన్నో ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లు కూడా ఉన్నాయి. కొన్ని కోర్సుల్లో విద్యార్థులు ఇండియాలో కొన్ని సంవత్సరాలు, ఇతర దేశాల్లో కొన్ని సెమిస్టర్లు పూర్తి చేస్తారు.
9. ఐటీఐ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్)
- వివిధ కర్మాగారాల్లో కావలసిన స్కిల్డ్ వర్కర్స్‌ని సమకూర్చడానికి గవర్నమెంట్ ఈ కోర్సును ప్రారంభించింది. తెలంగాణలో 63 ప్రభుత్వ, 212 ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. 23 ఇంజినీరింగ్, 6 నాన్ ఇంజినీరింగ్ ట్రేడ్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఈ కోర్సులో 10వ తరగతి తరువాత చేరవచ్చు. కొన్ని కోర్సుల్లో 8వ తరగతి పాసైనా సరిపోతుంది. https:// iti.telangana.gov.in/. సుమారు 70 శాతం ప్రాక్టికల్ ట్రైనింగ్‌లోనే నడుస్తుంది.
పాలిటెక్నిక్
- 10వ తరగతి తరువాత ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో చేరాలనుకునే వారు పాలీసెట్ పరీక్ష ద్వారా ప్రవేశ అర్హత పొందుతారు. ఈ కోర్సు పూర్తయిన తర్వాత, టెక్నీషియన్‌గా లేదా టెక్నికల్ సూపర్వైజర్ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. లేదా బీటెక్, బీఎస్సీ, బీకాం వంటి కోర్స్‌లో చేరే అవకాశం సీట్లను బట్టి ఉంటుంది. https://polycet.sbtet.telangana.gov.in/
- తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డులో సైన్సెస్ అండ్ ఆర్ట్స్‌కు సంబంధించిన సబ్జెక్టులున్నాయి. ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ, ఎంఈసీ లేదా ఇతర కోర్సులోనైనా చేరవచ్చు. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్స్ లేదా ఎంసెట్ రాయాలంటే ఇంటర్లో ఎంపీసీ, నీట్ రాయాలంటే బైపీసీలో చేరాలి. కొన్ని కోర్సులకు ఇంటర్లో ఏ సబ్జెక్ట్స్ తీసుకున్నా పర్వాలేదు. ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి కావాల్సిన ప్రవేశ పరీక్ష అర్హత నిబంధనలు చూసుకొని ఇంటర్లో ఆ కోర్సులో చేరడం లేదా ఆ సబ్జెక్ట్స్ ఉన్న కోర్సులో చేరడం ఉత్తమం.
Sirisha Reddy
Director – Academics
Abhyaas Edu Technologies
+91 9849733780
Abhyaas.in
Previous article
Sports Current Affairs April 18 | క్రీడలు
RELATED ARTICLES
-
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
-
హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఏమని పిలిచేవారు?
-
సంఘ జీవనానికి సాయపడేది.. మోక్షానికి ఉపయోగపడేది
-
Career Guidance After 10th | ‘పది’లమైన కోర్సులు.. భవిష్యత్తుకు బాటలు!
-
TS Tenth Class | 10TH CLASS MODEL QUESTION PAPER
-
TS Tenth Class | X CLASS MATHEMATICS MODEL PAPER – II
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు





