April 18 Current Affairs | వార్తల్లో వ్యక్తులు
చంద్రకళ
ఏకధాటిగా 8 గంటల పాటు ఈతకొట్టి గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చంద్రకళ ఓజా (15 ఏండ్లు) చోటు సంపాదించింది. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లా పురాయి గ్రామానికి చెందిన ఈమె గ్రామంలోని చెరువులో ఏప్రిల్ 9న ఉదయం 5:10 మధ్యాహ్నం 1:10 వరకు ఈత కొట్టింది. ఈమె ఇదివరకు నేషనల్ జూనియర్ ఓపెన్‌లో 3 స్వర్ణ, 2 రజత పతకాలు సాధించింది.
అపరేష్ కుమార్
త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అపరేష్ కుమార్ ఏప్రిల్ 11న నియమితులయ్యారు. ఈ పదవిలో ఉన్న జస్టిస్ ఇంద్రజిత్ మహంతి గతేడాది నవంబర్ 10న పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి తొడుపునూరి అమర్నాథ్ గౌడ్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. జార్ఖండ్ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఆపరేష్‌కు పదోన్నతి కల్పించారు.
జఫ్రుల్లా చౌధురి
బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రజారోగ్య కార్యకర్త డాక్టర్ జఫ్రుల్లా చౌధురి (81) ఏప్రిల్ 11న మరణించారు. ఆయన 1985లో కమ్యూనిటీ లీడర్షిప్ విభాగంలో రామన్ మెగసెసె, 1992లో ప్రజారోగ్య రంగంలో రైట్ లైవ్లీహుడ్ అవార్డులను పొందారు. ఆయన 1971లో యూకేలో వైద్యవిద్యను వదిలేసి బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పాల్గొన్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?