Current Affairs April 18 | తెలంగాణ
తెలంగాణ
అంబేద్కర్ విగ్రహావిష్కరణ
దేశంలోనే అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ ఏప్రిల్ 14న ఆవిష్కరించారు. 125 అడుగుల ఎత్తయిన ఈ విగ్రహాన్ని హైదరాబాద్ నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన ఎన్టీఆర్ గార్డెన్ పక్కన ఏర్పాటు చేశారు. పార్లమెంట్ ఆకారంలో 50 అడుగుల పీఠంపై ఈ విగ్రహాన్ని ఉంచారు. దీంతో మొత్తం 175 అడుగులు ఉంటుంది. ఈ విగ్రహానికి 2016, ఏప్రిల్ 14న శంకుస్థాపన చేశారు. ఈ విగ్రహ రూపశిల్పి రామ్ వీ సుతార్.
డిస్కంలకు అవార్డులు
ప్రతిష్ఠాత్మక ఇండిపెండెంట్ పవర్ పర్చేజ్ అసోసియేషన్ (ఐపీపీఏ) అవార్డుల్లో ఆరు తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థల (డిస్కంలు)కు ఏప్రిల్ 9న లభించాయి. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్)కు 4, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్)కు 2 అవార్డులు దక్కాయి. కర్ణాటకలోని బెల్గాంలో జరిగిన విద్యుత్ రెగ్యులేటరీ, పాలసీ మేకర్స్ రిట్రీట్ కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేశారు.
న్యాక్‌కు విశ్వకర్మ
ప్రతిష్ఠాత్మక విశ్వకర్మ అవార్డు హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ఎన్ఏసీ-న్యాక్)కు లభించింది. ఢిల్లీలోని ఐకార్ కన్వెన్షన్ సెంటర్లో ఏప్రిల్ 10న జరిగిన కార్యక్రమంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రమా మేఘవాల్ ఈ అవార్డును అందజేశారు. గతేడాది న్యాక్ 21,240 మంది యువతకు నిర్మాణ సంబంధ శిక్షణ ఇచ్చి, వారికి ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించినందుకు ఈ అవార్డు లభించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?