Sports Current Affairs | 2022 కామన్వెల్త్ క్రీడల్లో భారత్ గెలిచిన పతకాలెన్ని?
కరెంట్ అఫైర్స్, మార్చి 17 తరువాయి
35. ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2023 గురించి సరైన వాక్యం?
ఎ. ఇవి 5వ గేమ్స్
బి. ఇవి మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగాయి
సి. మొత్తం 27 క్రీడలతో వీటిని నిర్వహించారు
డి. ఈ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్‌లో 9 రికార్డ్‌లు బద్దలయ్యాయి
1. ఎ, డి 2. ఎ, బి, డి
3. బి, సి, డి 4. పైవన్నీ
36. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023లో పతకాల పట్టికలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ర్యాంకులు వరుసగా..?
1. 13, 16 2. 13, 17
3. 16, 17 4. 11, 13
37. ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2023లో పతకాల పట్టికలో అగ్రస్థానం పొందిన రాష్ర్టాలు వరుసగా?
1. హర్యానా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ
2. మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్
3. మహారాష్ట్ర, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్
4. హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ
38. 3వ ఖేలో ఇండియా శీతాకాల గేమ్స్-2023 ఎక్కడ జరిగాయి?
1. గుల్మార్గ్, జమ్ముకశ్మీర్
2. సిమ్లా, హిమాచల్ ప్రదేశ్
3. నైనిటాల్, ఉత్తరాఖండ్
4. లేహ్, లఢక్
39. 2023 మహిళల టీ20 క్రికెట్ ప్రపంచకప్ గురించి సరైన వాక్యం?
ఎ. ఇది 8వ ప్రపంచకప్
బి. ఇది 2023లో ఫిబ్రవరి 10 నుంచి 26 మధ్య జరిగింది
సి. నిర్వహించిన దేశం దక్షిణాఫ్రికా
1. ఎ, బి 2. బి, సి
3. పైవన్నీ 4. ఎ, సి
40. 2023 మహిళల టీ20 క్రికెట్ ప్రపంచకప్ గురించి సరైనది?
ఎ. ఇందులో 10 జట్లు పాల్గొనగా 24 మ్యాచ్‌లు ఆడారు
బి. ఫైనల్లో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాను ఓడించింది
సి. ఆస్ట్రేలియా ఈ ప్రపంచకప్‌ను గెలవడం ఇది ఆరోసారి
డి. భారతదేశం నుంచి ముగ్గురు మహిళా అంపైర్లు దీనికి ఎంపికయ్యారు
1. ఎ, బి 2. సి, డి
3. పైవన్నీ 4. బి, సి
41. ఐపీఎల్-2023 ఆటగాళ్ల వేలం పాట గురించి సరైన వాక్యం?
ఎ. 2023 ఐపీఎల్ 16వది
బి. ఈ వేలం పాట డిసెంబర్ 23 కొచ్చిలో జరిగింది
సి. వేలంపాటకు లిస్టయిన ఆటగాళ్ల సంఖ్య 405
డి. అమ్ముడైన ఆటగాళ్లు 80 మంది
1. ఎ, బి, డి 2. ఎ, బి, సి
3. ఎ, సి, డి 4. పైవన్నీ
42. ఐపీఎల్-2023 వేలం పాటలో అత్యధిక ధర పలికిన విదేశీ, భారతీయ క్రికెటర్లు వరుసగా?
1. సామ్ కరన్, శుభ్‌మన్‌గిల్
2. సామ్ కరన్, మయాంక్ అగర్వాల్
3. సామ్ కరన్, సూర్యకుమార్ యాదవ్
4. సామ్ కరన్, రిషభ్‌పంత్
43. 2023 మహిళల ఐపీఎల్ (WPL) వేలం పాటలో అత్యధిక ధరకు అమ్ముడైన క్రీడాకారిణి?
1. దీప్తిశర్మ 2. హర్మన్‌ప్రీత్‌కౌర్
3. స్మృతిమంధన 4. షెఫాలీవర్మ
44. డిసెంబర్ 29, 2022న మరణించిన బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే అసలు పేరు?
1. కెవిన్ డగ్హెనెటెగా తమారాబి బకుమో
2. ఎడ్సన్ అరాంట్స్ డో నాసిమెంటో
3. అలోయ్సియస్ పాలస్ మరియా వాన్గాల్
4. పెడ్రీ మిగున్ కారిరో రెసెండెస్
45. క్రీడల్లో డోపింగ్ మీద జరిపే నిరంతర పోరాటంలో భాగంగా ఫిబ్రవరి 15, 2023న ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు?
1. కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ, ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ, నైపర్ అనే సంస్థ
2. కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ, నైపర్ అనే సంస్థ
3. ఆహార భద్రతా, ప్రమాణాల సంస్థ, నైపర్ అనే సంస్థ
4. కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ, డాక్టర్ రెడ్డీస్
46. రంజీ ట్రోఫీ 2022-23 విజేత జట్టు?
1. బెంగాల్ 2. సౌరాష్ట్ర
3. కర్ణాటక 4. కేరళ
47. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై కేంద్రం నియమించిన కమిటీ చైర్మన్ ఎవరు?
1. వినేశ్ ఫొగాట్ 2. సాక్షిమాలిక్
3. మీరాబాయి చాను 4. మేరీకోమ్
48. 2023, జనవరి 7న టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సానియామీర్జా మొత్తం ఎన్ని సంవత్సరాలు టెన్నిస్ ఆడారు?
1. 22 సంవత్సరాలు
2. 20 సంవత్సరాలు
3. 24 సంవత్సరాలు
4. 23 సంవత్సరాలు
49. సానియా మీర్జా ఎన్ని టెన్నిస్ గ్రాండ్‌స్లామ్‌లు గెలిచింది?
1. 6 2. 7 3. 8 4. 4
50. సానియా మీర్జా మూడు గ్రాండ్‌స్లామ్‌లను మహిళల డబుల్స్‌లో గెలిచింది. అయితే ఆ మూడు ఎవరితో జత కట్టి గెల్చింది?
1. సెరెనా విలియమ్స్
2. వీనస్ విలియమ్స్
3. మార్టినా హింగిస్
4. మరియా షరపోవా
51. సానియా మీర్జా 2023లో ఆడిన చివరి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ అయితే ఆమె ఈ టోర్నీ మిక్స్డ్ డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఆమె ఈ గ్రాండ్ స్లామ్లో ఎవరితో జత కట్టింది?
1. మహేశ్ భూపతి
2. రోహన్ బోపన్న
3. యుకీ బాంబ్రీ
4. సోమ్‌దేవ్ వర్మన్
52. 2023 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలు?
1. నొవాక్ జకోవిచ్, ఎలెనా రిబకినా
2. రఫెల్ నాదల్, అరినా సబలెంకా
3. నొవాక్ జకోవిచ్, అరినా సబలెంకా
4. రఫెల్ నాదల్, ఎలెనా రిబకినా
53. 2023, జనవరి 18న హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ చేశాడు. అయితే ఈ ఘనత ఏ జట్టుపై నమోదు చేశాడు?
1. ఆస్ట్రేలియా 2. శ్రీలంక
3. ఇంగ్లండ్ 4. న్యూజిలాండ్
54. కిందివాటిని జతపరచండి.
ఎ. 150 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన తొలి బ్యాటర్ 1) విరాట్‌కోహ్లి
బి. 843 బంతులను ఎదుర్కొని 1500 టీ20 పరుగులు చేసింది 2) హర్మన్‌ప్రీత్‌కౌర్
సి. ప్రపంచంలో క్రికెట్లో 25000 పరుగులు వేగంగా చేసింది 3) సూర్యకుమార్ యాదవ్
4) శుభ్‌మన్ గిల్
1. ఎ-2, బి-3, సి-1 2. ఎ-3, బి-1, సి-4
3. ఎ-2, బి-4, సి-1 4. ఎ-4, బి-3, సి-1
55. భారతదేశంలో చెస్‌లో గ్రాండ్‌మాస్టర్ హోదా పొందిన తొలి అన్నదమ్ములుగా చరిత్ర సృష్టించినది ఎవరు?
1. విశాఖ్, ప్రజ్ఞానంద
2. విశాఖ్, విఘ్నేష్
3. విఘ్నేష్, ప్రజ్ఞానంద
4. విఘ్నేష్, శ్యాంతన్
జవాబులు
35. 4 36. 2 37. 3 38. 1
39. 3 40. 4 41. 4 42. 2
43. 3 44. 2 45. 1 46. 2
47. 4 48. 2 49. 1 50. 3
51. 2 52. 3 53. 4 54. 1
55. 2
1. 2023లో జరిగిన 13వ హాకీ ఇండియా సీనియర్ మహిళల జాతీయ చాంపియన్‌షిప్ విజేత ఎవరు?
1) పశ్చిమబెంగాల్ 2) ఒడిశా
3) మధ్యప్రదేశ్ 4) ఉత్తరప్రదేశ్
2. 2023, ఫిబ్రవరి 19 నుంచి 23 తేదీల మధ్య ఈజిప్టులోని కైరోలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్-2023లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్లో స్వర్ణ పతకం సాధించిన భారతీయ షూటర్?
1) ఆశిష్ గౌతమ్ 2) సంజీవ్ కుమార్
3) అమిత్ కుమార్ 4) రుద్రాంక్ష్ పాటిల్
3. 2023 ఖతార్ ఓపెన్ టెన్నిస్ విజేత ఎవరు?
1) డేనియల్ మెద్వదేవ్
2) కార్లోస్ అల్కారజ్
3) నొవాక్ జకోవిచ్
4) ఆండీముర్రే
4. 2023 మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ గురించి సరైన వాక్యం?
ఎ. ఈ చాంపియన్‌షిప్ న్యూఢిల్లీలో జరిగింది
బి. భారతదేశం ఈ చాంపియన్‌షిప్‌ను నిర్వహించడం ఇదే తొలిసారి కాదు
1) ఎ 2) ఎ, బి
3) బి 4) ఎ, బి తప్పు
5. అంతర్జాతీయ క్రికెట్ మండలి 2023 ఫిబ్రవరికి ప్లేయర్ ఆఫ్ మంత్‌గా పురుష, మహిళా క్రికెట్ ప్లేయర్లుగా ఎవరిని ఎంపిక చేసింది?
1) శుభ్‌మన్‌గిల్, గ్రేస్ స్క్రివెన్స్
2) హ్యారీ బ్రూక్, అష్లీ గార్డ్నర్
3) హ్యారీ బ్రూక్, గ్రేస్ స్క్రివెన్స్
4) శుభ్‌మన్‌గిల్, అష్లీ గార్డ్నర్
6. మలేషియా ఓపెన్-2023 బ్యాడ్మింటన్ మహిళల, పురుషుల సింగిల్స్ విజేతలు ఎవరు?
1) అన్సెయంగ్, విక్టర్ అక్సెల్సన్
2) అన్ సెయంగ్, కొడాయ్ నరోకా
3) అకానా యమగుచి, విక్టర్ అక్సెల్సన్
4) అకానా యమగుచి, కొడాయ్ నరోకా
7. కింది వాక్యాలను గమనించి సరైన వాక్యాన్ని గుర్తించండి.
ఎ. పురుషుల (లేదా) మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 150 మ్యాచ్‌లు ఆడిన తొలి బ్యాటర్ హర్మన్‌ప్రీత్‌కౌర్
బి. హర్మన్‌ప్రీత్‌కౌర్ 2023, ఫిబ్రవరి 20న ఐర్లాండ్‌పై 150వ మ్యాచ్ ఆడింది
సి. ఈ ఘనత మహిళల టీ20 ప్రపంచకప్‌లో నమోదైంది
డి. ఈ మ్యాచ్‌లో తన వ్యక్తిగత స్కోరు 8 పరుగుల వద్ద 3000 పరుగులు చేసిన తొలి భారతీయ మహిళా బ్యాటర్‌గా నిలిచింది
1) ఎ, బి, డి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) పైవన్నీ
8. భారత క్రికెట్ నియంత్రణ మండలి 2022, అక్టోబర్ 27న తీసుకొచ్చిన ‘పే ఈక్విటీ పాలసీ’ ప్రకారం..?
1) మహిళా, పురుష క్రికెటర్లకు ఒకేరకమైన కాంట్రాక్ట్ దక్కుతుంది
2) మహిళా, పురుష క్రికెటర్లకు ఒకేరకమైన మ్యాచ్‌ఫీజు దక్కుతుంది
3) మహిళా, పురుష క్రికెటర్లకు ఒకేరకమైన విదేశీ షెడ్యూల్ దక్కుతుంది
4) మహిళా, పురుష క్రికెటర్లకు ఒకేరకమైన స్పాన్సర్ డబ్బు దక్కుతుంది
9. స్టోక్ మాండవిల్లే గేమ్స్ ను ప్రస్తుతం కింది విధంగా పిలుస్తున్నారు?
1) పారా ఒలింపిక్స్
2) శీతాకాల ఒలింపిక్స్
3) ఒలింపిక్స్
4) యూత్ ఒలింపిక్స్
10. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన క్రికెటర్లు 8 దేశాల నుంచి 8 జట్లుగా పాల్గొని ఒక క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీ దేనికోసం ఉద్దేశించింది?
1) బాలబాలికల విద్య
2) మహిళల భద్రత
3) రొమ్ముక్యాన్సర్ చైతన్యం
4) రహదారి భద్రత
11. అంతర్జాతీయ ఫుట్‌బాల్ గవర్నింగ్ బాడీ ఫిఫా 2022, సెప్టెంబర్‌లో కింది ఏ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ జీవిత చరిత్రను ‘కెప్టెన్ ఫెంటాస్టిక్’ పేరుతో తన అధికారిక స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం FIFA+లో మూడు భాగాలుగా ప్రసారం చేసింది?
1) క్రిస్టియానో రొనాల్డో
2) లియోనల్ మెస్సీ
3) సునీల్ ఛెత్రి 4) పీలె
12. 2023 అక్టోబర్‌లో 37వ జాతీయ క్రీడలు ఏ రాష్ట్రంలో జరగనున్నాయి?
1) గోవా 2) ఉత్తరప్రదేశ్
3) తమిళనాడు 4) తెలంగాణ
13. 2022 సెప్టెంబర్-అక్టోబర్లలో జరిగిన 36వ జాతీయ క్రీడల్లో పతకాల పట్టికలో అగ్రస్థానం పొందినవి వరుసగా..?
1) సర్వీసెస్, మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా
2) సర్వీసెస్, మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటక
3) సర్వీసెస్, మహారాష్ట్ర, హర్యానా, తమిళనాడు
4) సర్వీసెస్, మహారాష్ట్ర, తమిళనాడు, హర్యానా
14. ఒలింపిక్స్ నిర్వహణ దేశాలు/ నగరాలను జతపరచండి.
ఎ. 2021 1. పారిస్, ఫ్రాన్స్
బి. 2024 2. దోహా, ఖతార్
సి. 2028 3. టోక్యో, జపాన్
డి. 2032 4. లాస్ ఏంజెల్స్, అమెరికా
5. బ్రిస్బేన్, ఆస్ట్రేలియా
1) ఎ-3, బి-1, సి-5, డి-4
2) ఎ-3, బి-1, సి-5, డి-2
3) ఎ-3, బి-1, సి-4, డి-5
4) ఎ-3, బి-4, సి-1, డి-5
15. 2022 చెస్ ఒలింపియాడ్ గురించి సరైన వాక్యం?
ఎ. ఇది 44 వది
బి. ఇది తొలిసారి భారతదేశంలో చెన్నైలో నిర్వహించారు
సి. దీని మస్కట్‌గా తంబిని తీసుకొన్నారు
డి. అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఉపాధ్యక్షుడిగా విశ్వనాథన్ ఆనంద్ ఎంపికయ్యారు
1) పైవన్నీ 2) ఎ, బి, సి
3) బి, సి 4) బి, డి
16. 2022 కామన్వెల్త్ క్రీడలు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగాయి. అయితే ఈ క్రీడల్లో భారత్ గెల్చిన పతకాలెన్ని?
1) 66 2) 60 3) 61 4) 63
17. 73 సంవత్సరాల థామస్‌కప్ చరిత్రలో భారత్ తొలిసారి 2022లో ఇండోనేషియాను ఓడించి గెల్చుకొంది. అయితే థామస్‌కప్ ఏ ఆటకు సంబంధించినది?
1) హాకీ 2) టెన్నిస్
3) క్రికెట్ 4) బ్యాడ్మింటన్
జవాబులు
1. 3 2. 4 3. 1 4. 2
5. 2 6. 3 7. 4 8. 2
9. 1 10. 4 11. 3 12. 1
13. 2 14. 3 15. 1 16. 3
17. 4
తాన్న రవి
ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీసర్కిల్
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?